22, ఫిబ్రవరి 2015, ఆదివారం

పద్యరచన - 828

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. సుగమ మగు పండితులను
    తగులము గబిలిచె తండ్రి తనూ భవుకై
    నిగమము లదెలిపి ప్రహ్లాదు
    తెగటార్చ హరి భజనల దేలెడి మనమున్

    రిప్లయితొలగించండి
  2. హరినామంబు జపించుచుండె గురువర్యామీరలే వీనిచే
    హరినామస్మరణంబు మాన్పవలె మీరత్యంతయాసక్తితో
    వెరవంగావలదెట్టి శిక్షలిడ లేవేయాంక్షలాచార్య యా
    హరుడే దానవ పూజ్యుడింకెవరు కాదంచున్ సదానేర్పుడీ

    రిప్లయితొలగించండి
  3. అలహిరణ్య కశిపుడుతా నయ్యవార్ల
    పిలిచి సుతు నప్ప గించెను వివిధ విద్య
    లందు నైపుణ్య తను వారి కంద జేయ
    హరిని పూజించు కార్యము నాపు జేయ

    రిప్లయితొలగించండి
  4. ఆదిపరాత్పరున్డనుచుయాహరినామమువీడడాయె|ప్ర
    హ్లాదునికేదిదేల్పిననునప్పటికప్పుడునప్పుజెప్పు|యే
    వాదములేకనేర్చుకొనిపందితుడాయెనురాజ|కానినా
    మోదముకానివిష్టజపమొక్కటిమానడుదానవేంద్రుడై|

    రిప్లయితొలగించండి
  5. రక్కసరాజు, సూనుడు మురారిని గొల్చుట దుర్భరంబవన్
    మిక్కిలి బాధతో, భరము మీబుజపైనిడి చెప్పుచుంటి నే
    చక్కగ నాకుమారునకు శాస్త్రములన్నియు నేర్పుడయ్య వే
    పక్కిజగత్పతీ వహను ప్రార్థన మాన్పగఁ జేయ కోరెదన్

    రిప్లయితొలగించండి

  6. బాల ప్రహ్లాదునకు హరి భక్తి మాన్ప
    బోధసేయంగ తన గురు పుత్రు చండ
    మార్కులను జీరి పల్కె హేమకశిపుండు
    తనదు తమ్ముని హరి జంపి దాగె ననుచు

    రిప్లయితొలగించండి
  7. హరినామును వీడి యసుర సంసేవితాం
    ..........బుజ పాదముల భక్తిఁ మునుగ వలెను
    దనుజ రాజ్యాధిష్టతను బొంది దానవ
    .......... వంశ గౌరవము పెంపగ వలెను
    దేవాది సురగణాధికమెల్ల పరిమార్చి
    .......... దైత్యసామ్రాజ్య సంస్తవనుఁడగుచు
    సర్వదేవతలపై శాశ్వత వైరమ్ము
    .......... ఘటియ్పజేయుమెటులనైన

    దానవాహార్య శౌర్యవిధానములను
    పౌరుషోపేత సాహస భాషణములఁ
    నిత్య లక్షణయుతుఁడుగా నిలువ బంచి
    వరల జేయుఁడు మీరలు గురువులార

    రిప్లయితొలగించండి
  8. రక్కసుడు నైన యాహిర ణ్య కశి పుండు
    తనదు కొమరుని చదివించ దలచి గురున
    కొప్ప గించెను బ్రహ్లాదు నొప్పు మీర
    చిత్ర మందున జూడుము చిత్ర ! నీవు
    ----

    తనదు కొమరుడు నిత్యము దనకు దాను
    మనసు నందున మాట్లాడు మాట బట్టి
    విష్ణు నామము జపియించు విధము తోచ
    మనసు మళ్ళించు కొఱ కునై మాన నీయు
    డైన గురువును రప్పించి యప్ప గించు
    నటుల యుండెను చిత్రము హర్ష ! చూడు

    రిప్లయితొలగించండి
  9. చండా మార్కులవారూ !
    చండాలపు చదువు నేర్చె, సైపను మిమ్మున్
    చెండాడుదు, మనచదువులు
    మొండిగ నేర్పించ నాకు ముదమగు వినుడీ !

    రిప్లయితొలగించండి
  10. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజంతా ప్రయాణంలో ఉండి వెంట వెంట స్పందించలేక పోయాను. మన్నించండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యంలో భావం బాగుంది. అభినందనలు.
    అన్ని పాదాల్లోనూ గణదోషం. మీ పద్యానికి నా సవరణ.....
    సుగమజ్ఞులు పండితులను
    తగులముగా బిలిచె తండ్రి తన పుత్రునకై
    నిగమములన్ ప్రహ్లాదుని
    తెగటార్చగ హరి భజనల దేలెడి మనమున్.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ మత్తేభం బాగున్నది. అభినందనలు.
    ‘అత్యంత+ఆసక్తి=అత్యంతాసక్తి’ అవుతుంది. యడాగమం రాదు. ‘మీ రాసక్తులై శ్రద్ధతో’ అనండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    రెండవపద్యం వృత్తరచనగా మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    ‘రక్కసరాజు’ అన్నదానిని ‘రక్కసిఱేడు’ అనండి. ‘మీబుజపైనిడి’ అనడం బాగుగా లేదు. ‘మిక్కిలి క్రుంగి భారమును మీపయి నేనిడి చెప్పుచుంటి...’ అనండి. ‘పక్షిరాడ్వాహనుడు’ అనే అర్థంలో మీ ప్రయత్నం మెచ్చదగినదే. కాని ‘పక్కిలోక’మని సమాసం చేయరాదు కదా! ‘నేర్పుడయ్య నే|ఫక్కినినైన మాధవుని ప్రార్థన మాన్పగ...’ అనండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
    టైపాట్లున్నాయి. ‘నామును-నామమును’. రెండు చోట్ల గణదోషం... ‘వంశగౌరవమును పెంపగ వలయును, ఘటియింపగా జేయు డెటులనైన’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యం మొదటిపాదంలో యతి తప్పింది. ‘అసురు డైనట్టి యా హిరణ్యకశిపుండు’ అనండి.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘చదువు నేర్చె’ అన్నచోట ‘చదువు నేర్ప’ అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  11. నా నామ మంత్ర మెక్కడ?
    శ్రీనాథునె నా సుతుండు సేవించె గదే?
    యేనాడును నా ముందుకు
    రానీయక మీ తలలను రక్షించుడయా!


    రిప్లయితొలగించండి
  12. ధన్య వాదములు మాస్టారూ ..నా పద్యానికి చిన్న సవరణ :
    అరి విష్ణున్ జపియించు చుండె మన ప్రహ్లాదుండు వారించినన్
    హరినామస్మరణంబు మాన్పవలె మీరత్యంతమౌశ్రద్ధతో
    వెరవంగావలదెట్టి శిక్షలిడ లేవేయాంక్షలాచార్య యా
    హరుడే దానవ దేవుడింకెవరు కాదంచున్ సదానేర్పుడీ

    రిప్లయితొలగించండి
  13. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణలకు ధన్యవాదములు. పక్కిజగత్పతి - నేను చేసిన సమాసంకాదు. గరుత్మంతునకు మరొక పేరు. దానినే నేను ఉపయోగించాను.గమనించండి.

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి వారూ,
    పర్యాయపద నిఘంటువులో గరుత్మంతునకు ‘పక్కిజగత్పతి’ అన్న పదాన్ని ఇచ్చారు. నిజమే. కాని ఆ ప్రయోగంయొక్క సాధుత్వం విషయంలో నాకు సందేహమే. పక్కి అన్న తెలుగుపదంతో జగత్పతి అన్న సంస్కృతపదాన్ని సమాసం చేయడం జరిగింది. అది తప్పని నా అభిప్రాయం. ‘పక్షిజగత్పతి’కి అది అచ్చుతప్పు కావచ్చు.

    రిప్లయితొలగించండి
  15. ఆచార్య బి.ఎన్. రెడ్డి గారు ఇంత పెద్ద తప్పు చెయ్యరు కదా అని నిశితంగా పరిశీలించిన తర్వాత తేలిన దేమంటే అది అచ్చుతప్పే! వారు పర్యాయపదాలను అక్షరక్రమంలో అమర్చారు. మీరూ పరిశీలించండి. అది ‘పక్కిజగత్పతి’ అయి ఉంటే పర్యాయపదాల్లో ‘పక్కిదొర’కు ముందుండాలి. ‘దొ’కంటె ముందు ‘జ’ రావాలి. కాని అది అది ‘పక్షిరాజు’కు ముందున్నది. ఆ క్రమం ఇది... పక్కిదొర, పక్కిరా, పక్కిరాయడు, పక్కిసామి, పక్షిజగత్పతి, పక్షిరాజు....
    ఏతావాతా తేలిందేమంటే ‘పక్కిజగత్పతి’ పూర్తిగా తప్పు.

    రిప్లయితొలగించండి
  16. నా సందేహాన్ని తీర్చిన పూజ్య గురుదేవులకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి