శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ, మీ సూచన బాగుంది. ధన్యవాదాలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘భావన + ఓ = భావనయో’ అవుతుంది. అక్కడ సంధి లేదు. తృతీయపాదాద్యక్షరం ‘దా’. కాని మీరు ‘ధా’ వేసారు. మీ పద్యానికి నా సవరణ..... రామనామమెంత రసరమ్యభావమో? మలచికీర్తనలను-పలికిజెప్పె| దాసభావ మెంత దక్షత నొసగునో? సుద్దమైన మనసు సులభమనెను| ***** శ్రీవల్లి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీవల్లి గారూ, మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ ‘తేటగీతి’ పూరణ బాగున్నది. అభినందనలు. కాని.. అడిగింది ఆటవెలది కదా! మీరు గమనించలేదేమో! మీ పద్యానికి ఆటవెలదిగా నా రూపాంతరం... రామనామ మెపుడు రంజిల్ల గోపన్న మనసు గట్టె రామమందిరమును దానవారి రాము తపన దీర్చ ధనరా సుల ప్రభుత్వమునకు దెలియకుండ.
పూజ్య గురుదేవులకు నమస్సులు. నాలుగవ పాదం మార్చి నా పూరణ. రామ దాసు మించు రామభక్తుడిలను మరల పుట్ట డనుట కరము నిజము దానవకులవైరి దర్శనీయపు గుడి సుద్ది మదిని గట్టె సుందరముగ
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘వచియింతు’ టైపాటు వల్ల ‘వసియింతు’ అయింది. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామ భక్తు డైన రామదా సునిగన
రిప్లయితొలగించండిమనసు సంత సించు మమత తోడ
దాసు లందు నతడు దాసాను దాసుడు
సుమ్ము చెప్పు చుంటి నమ్మ కముగ
రామభక్తితోడ రామదాసనిపేరు
రిప్లయితొలగించండిమహిని గాంచె రామ మహిమవలన
దాష్టికముల బొందె తా గుడి కట్టించి
సురులుమెచ్చు భద్రగిరిని యిచ్చె
రామ నామ గాన రాగాను వర్తియై
మనసును గుడి జేసి మసలినాడు
దాస జనుల రామ దాసాను దాసుడు
సుజన మనవి హారి శుభచరితుడు.
రామ నన్ను బ్రోవ రామాయని వేడి
రిప్లయితొలగించండిమధుర మైన గాన మధువు చిలికి
దాసు డనుచు భక్త దాసాను దాసుడై
సురలు మెచ్చి నట్టి సూను డితడు
సూనుడు = సూర్యుడు
రామ నామ రస మరందము జుర్రియు
రిప్లయితొలగించండిమనల కందరికిని పంచి ఇచ్చె
దాచి, దోచి సొమ్ము, దశరథ రాముని
సుస్థిరముగ నిలిపె శృంగి యందు
రామ భక్తి తోడ రాజధనముబుక్కి
రిప్లయితొలగించండిమట్టు జేసి కట్టె మందిరమ్ము
దాపరికము చేసి దాసుడై కొలవగ
సుగుణ రాము డతని తగువు దీర్చె!
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రామదసును’ అనండి.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
టి.బి.యస్. శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రామా యని వేడి’ అన్నచోట గణదోషం.. కొన్ని సవరణలతో మీ పద్యం...
రామ నన్ను బ్రోవ రారా యనుచు వేడి
మధుర మైన గాన మధువు చిలికి
దాసుడ నని భక్త దాసాను దాసుడై
సురలు మెచ్చి నట్టి సుజను డితడు.
*****
మాజేటి సుమలత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో యతి తప్పింది. ‘మనకు పంచియిడిన మాన్యుడతడు’ అందామా?
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాజేశ్వరి గారి పద్యంలో మధురమైన గాన సుధను చిలికి అంటే ఇంకా బాగుణ్ణు
రిప్లయితొలగించండిరామనామమెంత రసరమ్యభావనో?
రిప్లయితొలగించండిమలచికీర్తనలను-పలికిజెప్పె|
ధార్మికత్వమెంత దక్షతనొసగునో?
సుద్దమనసునడుగ?సులభమనెను|
రామభక్తిలోన రమియించినిరతము
రిప్లయితొలగించండిమరల పుట్టనట్టి వరము పొంది
దారి తెన్ను తనకి దాశరథియనుచు
సుగతి జేరి నాడు స్పూర్తి నొసగి
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ సూచన బాగుంది. ధన్యవాదాలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘భావన + ఓ = భావనయో’ అవుతుంది. అక్కడ సంధి లేదు. తృతీయపాదాద్యక్షరం ‘దా’. కాని మీరు ‘ధా’ వేసారు. మీ పద్యానికి నా సవరణ.....
రామనామమెంత రసరమ్యభావమో?
మలచికీర్తనలను-పలికిజెప్పె|
దాసభావ మెంత దక్షత నొసగునో?
సుద్దమైన మనసు సులభమనెను|
*****
శ్రీవల్లి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామకృపను బొంది రచియించె కృతులెన్నొ
రిప్లయితొలగించండిమనకు తక్కువేమి మననమునకు
దాశరథిశతకము ధార బోసిచనెను
సుపథ మరయ మనుచు గోపరాజు
రాఘవునికి గుడిని రమ్యంబు గాగట్టి
రిప్లయితొలగించండిమహిని రామ దాసు రహిని గాంచె
దాశరధిని గొలిచి ధన్యుడయ్యెనుగద
సురుచిరమగు భద్రగిరిన మనుచు !!!
రామ నామ స్మరణతోడ రంజిలగను
రిప్లయితొలగించండిమనసు నిర్మించె గోపన్న, మందిరమును
దాన వారి శ్రీరాముని తపన దీర్చ
సుందరమ్ముగను ప్రభుత్వ సొమ్ము తోడ
శ్రీవల్లి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ ‘తేటగీతి’ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని.. అడిగింది ఆటవెలది కదా! మీరు గమనించలేదేమో! మీ పద్యానికి ఆటవెలదిగా నా రూపాంతరం...
రామనామ మెపుడు రంజిల్ల గోపన్న
మనసు గట్టె రామమందిరమును
దానవారి రాము తపన దీర్చ ధనరా
సుల ప్రభుత్వమునకు దెలియకుండ.
పూజ్య గురుదేవులకు నమస్సులు. వాకింగుకు వెళుతూ రామదాసుని స్మరించు కుంటూ వెళ్ళాను. ఆటవెలది అని చూడ లేదు. ఆటవెలదిగా మార్చిన గురువు గారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిరామ దాసు మించు రామభక్తుడిలను
రిప్లయితొలగించండిమరల పుట్ట డనుట కరము నిజము
దానవకులవైరి దర్శనీయపు గుడి
సుంకముగొని కట్టె సుందరముగ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
కాని ‘సుం’ అనడం న్యస్తాక్షరి నియమానికి వ్యతిరేకమే.
రాచకార్యమొదలి రామునిగుడిగట్టి
రిప్లయితొలగించండిమర్మకీర్తన లిడుమహిమచేత|
దాసకాడు?రామదాసుడుగామారె|
సుజన సంస్కృతందు సుప్రి యుండు
పూజ్య గురుదేవులకు నమస్సులు. నాలుగవ పాదం మార్చి నా పూరణ.
రిప్లయితొలగించండిరామ దాసు మించు రామభక్తుడిలను
మరల పుట్ట డనుట కరము నిజము
దానవకులవైరి దర్శనీయపు గుడి
సుద్ది మదిని గట్టె సుందరముగ
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఒదిలి’ అనడం గ్రామ్యం. ‘రాచకార్యము విడి...’ అనండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"రా"ము గుడిని గట్టి రాజ్యంపు సొమ్ముతో
రిప్లయితొలగించండి"మ"గ్గి యుండె తాను మహిత చెరను
"దా"శరధికి,శతక,తాదాత్మ్య కీర్తనల్
"సు"ష్టు గోపరాజు సొగసు నిడడె?
"రా"జ్య ధనము వాడి రాముని గుడికినై
"మ"ణులతోడ నగలు మహితు కిచ్చి,
"దా"రుణంపు శిక్ష తానంది గోపన్న
"సు"స్వరాల,శతక సూక్తి గూర్చె
శ్రీతిమ్మాజీరావుగారిపూరణం[కేంబాయి]
రిప్లయితొలగించండిరామనామమహిమయేమనివసియింతు
మరలమరలపలుకమధురముగద
దాసుడయ్యురామదాసుకేతెలియును
సుగమమగునుముక్తిసుజనులార|
రామకీర్తనములు రస రమ్యముగఁ బాడి
రిప్లయితొలగించండిమధుర భక్తిఁజూపె మహితముగను
దానవాంతకుఁడగు దాశరథిని గొల్చి
సుగతినందినాడు సుస్థిరముగ
నమస్కారములు
రిప్లయితొలగించండిశ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారి సూచనకు ధన్య వాదములు
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వచియింతు’ టైపాటు వల్ల ‘వసియింతు’ అయింది.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామభక్తి మహిమ రాముని చూపించి
రిప్లయితొలగించండిమహ్మదీయ రాజు మదిని దోచె
దాశరధి శతకము తానెన్నొ కీర్తనల
సుజనులంత మెచ్చ ప్రజకునిచ్చె.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురువు గారు. సవరించన పద్యం:
రిప్లయితొలగించండిరామ నామ రస మరందము జుర్రియు
మనకు పంచియిడిన మాన్యుడతడె
దాచి, దోచె సొమ్ము, దశరథ రాముని
సుస్థిరముగ నిలుప శృంగి యందు