15, ఫిబ్రవరి 2015, ఆదివారం

సమస్యా పూరణం - 1598 (పదిమందిన్ హతమార్చకున్న నగునా వైద్యుండు క్రూరాత్ముఁడై)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పదిమందిన్ హతమార్చకున్న నగునా వైద్యుండు క్రూరాత్ముఁడై.

16 కామెంట్‌లు:

 1. ఎదనిండన్ చదువంగనెంచి ముదము న్నేడేడు వత్సంబులన్
  పదిలం గాతను రేబవల్ చదివి వైద్యవృత్తి చేబట్ట గా
  నిదురే లేకను విత్తమున్ దలచి నేనేతీరు నున్మత్తి నౌ
  పదిమందిన్ హతమార్చ కున్ననగునా వైద్యుండు క్రూరాత్ముఁ డై

  రిప్లయితొలగించండి
 2. నిన్నటి సమస్యకు నా పూరణ....

  వినగా ఆజా భయ్యా
  సునియే రాందాసు పాట సోంచో బాద్ మే
  ఘనముగ గాతా హూ , మీ
  దను, జా ! " యే తీరుగ నను దయ జూచెదవో ? "

  రిప్లయితొలగించండి
 3. పదిలమ్మైనది వైద్యు సన్నిధి గదా వ్యాధుల్ ప్రకోపింపగా
  వదలన్ జాలడు మధ్యలోన నికపై వైద్యమ్ము, హెల్ప్ లెస్సనిన్
  మదిలో దల్చక చేయు యత్నము సదా, మాన్పించు టన్ మానుచున్
  పదిమందిన్ హతమార్చకున్న, నగునా వైద్యుండు క్రూరాత్ముఁడై.

  నగునా = నవ్వునా

  రిప్లయితొలగించండి
 4. పదిలంబౌనటు మానవాళి యిల,నా వ్యాధుల్ తగన్వైద్యుడే
  హృదితా బూనును యత్నమెంతయును తా హృద్యంబుగా కావగా
  మదిలో నేడిటు వైద్యులెల్లరును తామాశించియున్ సొమ్ములన్
  పదిమందిన్ హతమార్చకున్న నగునా వైద్యుండు,క్రూరాత్ముడై

  విదుడై వైద్యపు శాస్త్రమంతటిని,తా పెంపొందకన్ నైపుణిన్
  పదిమందిన్ హతమార్చకున్న నగునా వైద్యుండు,క్రూరాత్ముడై
  విదితంబౌగతి చంపరెవ్వరటు తా వేయౌను భావౌచునే
  కుదురున్ వైద్యుగ వానినేయనరె లోకుల్ వైద్యులన్ శ్రేష్టుగా

  రిప్లయితొలగించండి
 5. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
  మొదటన్ దుష్ఫల యత్నముల్ సలిపియే ముఖ్యుండగున్ తద్విదిన్
  పదిమందిన్ హతమార్చకున్ననగునా వైద్యుండుక్రూరాత్ముడై?
  అది యట్లుండ మనుష్య జాడ్యములు వైద్యజ్ఞుల్ విచారింపన౦
  త దరిద్రంబుగ పుట్టి రోగుల నికన్ నాశంబు జేయున్ గదా

  రిప్లయితొలగించండి

 6. పదిమందిన్ హతమార్చకున్ననగునా వైద్యుండు,క్రూరాత్ముడై
  పదికొంగల్ గురిచూసి యేయకగునా వ్యాధు౦డుమార్గమ్ములో
  పది దోపిళ్ళ నొనర్పకున్ననగునా ప్రఖ్యాతుడౌదొంగ యిం
  కెదియో మాయల పన్నకున్నమనునా ఈరాజకీయ మ్మిలన్

  రిప్లయితొలగించండి
 7. పదిమందిన్ హతమార్చకున్ననగునా వైద్యుండు క్రూరాత్ముడై!
  యదిఖాయంబగు నెట్టులన్?కరము దుష్టాలోచనంబే సుమా!
  సదయుండైన చికిత్సకుండుగల వాసంబందుతధ్యంబుగా
  పదిలంబౌనుగ రోగికిన్ సతము దుర్బాధల్ హరంబవ్వగన్

  రిప్లయితొలగించండి
 8. మాదిలోవేదనమాన్పబూనుటకెమామధ్యున్నవైద్యుండనన్
  కదిలేవిష్ణువునాటికాలమున,సంకల్పంబువేరవ్వగా
  తుదకీరాక్షసనిత్యకృత్యముగసంతోషించుదుర్నీతిచే
  పదిమందిన్ హ తమార్చకున్ననగునావైద్యుండుక్రూరాత్ముడై

  రిప్లయితొలగించండి
 9. ఇదియేసంస్కృతినాశదోషమునయేనిందైనలెక్కించకన్
  చదివేసంస్కరణంబులెంచకనువిజ్ఞానంబునెంతున్న?తా
  పదవుల్నందినవైద్యదక్షులయిసంపాదించునత్యాశ|యే
  పదిమందిన్ హతమార్చకున్ననగునావైద్యుండుక్రూరాత్ముడై

  రిప్లయితొలగించండి
 10. మదిలో నాశలు మిక్కుట మ్మగుటచే మారాము నే జేసితిన్
  చదువన్ వైద్యపు విద్య, తండ్రి యెటులో సాధించె నద్దాని, నా
  పదిలోనే కడు కష్ట మాయె, రుజలన్ బాపంగ నా కౌనె యౌ
  పదిమందిన్ హతమార్చకున్న నగునా వైద్యుండు క్రూరాత్ముఁడై.

  రిప్లయితొలగించండి
 11. ''పదిమందిన్ హతమార్చకున్ననగునా వైద్యుండు'' క్రూరాత్ముడై
  మది నూహించక బల్కెమర్త్యు డొకడున్, మాలిన్య భాహ్యుండు తా
  పదిలం బెక్కుడు గొంచు రోగులను గాపాడన్ బ్రయత్నించినన్
  విధి వ్రాతన్ దొలగించ లేరుకద ఈ విశ్వంబులో నెవ్వరున్.

  రిప్లయితొలగించండి
 12. కృష్ణుడు అర్జునునితో అంటున్న మాటలుగా:-
  ఇదియే భారత యుద్ధభూమి కనుమో!యింతింత నేత్రాలతో
  విధిపై భారము వేయుమా!నరుడ నీవేమంత చింతింపకే
  పదిమందిన్ హతమార్చకున్న నగునా! వైద్యుండు క్రూరాత్ముడై
  తుదిదాకన్ తను సేవజేయకనె చేతోమోద మెట్లందునో!

  రిప్లయితొలగించండి
 13. కవిమిత్రులకు నమస్కృతులు...
  మొన్నటినుండి ఇంట్లో గొడవలవల్ల మనశ్శాంతి కరువైంది. మిత్రుల పూరణలపై, పద్యాలపై స్పందించలేక పోతున్నాను. ఈ పరిస్థితులు మరో రెండు రోజులదాకా ఉండవచ్చు. క్రమం తప్పకుండా సమస్యలను, పద్యరచన శీర్షికను షెడ్యూల్ చేస్తున్నాను. దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
  చక్కని పూరణల నందించిన కవిమిత్రులు...
  రాజేశ్వరి అక్కయ్యకు,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  కె. ఈశ్వరప్ప గారికి,
  మిస్సన్న గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 14. గదిలో నిండిన రోగులన్ వలచి సింగారమ్ముగా జూచుచున్
  పదిమందిన్; హతమార్చకున్న నగునా వైద్యుండు క్రూరాత్ముఁడై
  విధిగా వాంతులు బేదులన్ జ్వరము బీపీలన్ మలేర్యాదులన్
  నిధులన్ గూర్చెడి గుండెవ్యాధులను కిడ్నీలొందు రోగాలనున్?

  రిప్లయితొలగించండి
 15. ఇదిగో చూడుడు మిత్రులార! ఇది నే నింగ్లాండులో నేర్చితిన్
  పదిలమ్మయ్యెడి విద్య నాది యనుచున్ పండంటి పాలేరులన్
  గదిలో దూర్చుచు గ్రుచ్చి గ్రుచ్చి వరుసన్ కాలేయపింజెక్షనున్
  పదిమందిన్ హతమార్చకున్న నగునా వైద్యుండు క్రూరాత్ముఁడై...

  రిప్లయితొలగించండి