టి.బి.యస్. శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘సరిపోవు నందగత్తె| దగ్గ రయ్యెను..’ అనండి. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం మంచి భావంతో అలరారుతున్నది. అభినందనలు.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంద్రికల వెలయించుచు చల్లబరచు
రిప్లయితొలగించండిదగ దహించెడి ప్రేమసంధాయకుండు
మామ యంచును నినుజూపి మభ్య పెట్టి
మహిని పాపకు పెట్టు నేమమును తల్లి.
(దగ=తాపము; నేమము=అన్నము)
చందమామను జూడుము శర్మ ! నీవు
రిప్లయితొలగించండిదనరె బింబము చక్కని దళుకు తోడ
మాయ నటువంటి నల్లని మచ్చ తోడ
మధురముగ దోచె జూడగ మరల మరల
చందురుని వెన్నె లందున చల్ల గాను
రిప్లయితొలగించండిదరిని జేరిన యెదపొంగు దయిత చెంత
మాల దొంతర లందున మదిని నిలిపి
మధువు నింపెడి మాటల మదను డనుచు
చంద్ర బాబు మాట వినగ ఆంధ్ర నాట
రిప్లయితొలగించండిదగడు మిగిలెను, రోజులు దాటవేయ
మాఫి యవ్వక ఋణములు సాఫి గాను
మతులు బోయెను రైతుకు గతుల నెరిగి
చంటి పిల్లల కిడునెంతొ సంతసమ్ము
రిప్లయితొలగించండిదగను దీర్చును వెన్నెల ధగలు జల్లి
మాత లక్ష్మికి తమ్ముడై మాన్యుడగుచు
మనుజులందరి కీతండు మామయయ్యె.
టి.బి.యస్. శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంద మామకు సరిపోలు యంద గత్తె
రిప్లయితొలగించండిదగ్గరయ్యను ప్రేమతో దైవికముగ
మామనసులు కలువగను మందిరమున
మదన భాణపు హతి కడు మరులు గొలుప
చందురుని వెన్నెల కురియు సవుర దేల?
రిప్లయితొలగించండిదక్షునల్లుడు శిగపైనదాల్చగాను!
మామ మోమున కంటిన మచ్చ దేల?
మహిత గురుపత్నిఁ గోరిన మలిన మంట!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సరిపోవు నందగత్తె| దగ్గ రయ్యెను..’ అనండి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం మంచి భావంతో అలరారుతున్నది. అభినందనలు.
చంచలాక్షుల ముఖముల స౦జ్ఞ వీవు
రిప్లయితొలగించండిదక్షిణామూర్తి సిగలో లతాంత మీవు
మాత తన బిడ్డ కుడువగ మామ!రావె!
మల్లెపూలను తెచ్చి యిమ్మనును నిన్ను
చంకలో బాబు మురిసె నీ చందము గని
రిప్లయితొలగించండిదరికి చేరుదమనిరి శాస్త్రజ్ఞులిచట
మాకు సోదరుఁడగుచు మా మామవీవు
మధుర చంద్రోదయమ్ము సమ్మతము మాకు.
"చం"గుడాతడు మరునికి సాయపడగ
రిప్లయితొలగించండి"ద"యను చల్లని కాంతుల తాప మదియ
"మా"య,నుత్పల వికసన మహిమ నంది
"మ"నసు కధినాధ గ్రహమునై మహిని వెలుగు
"చం"చలంబైన కళలను సంచరించు
"ద"యను కలువల సఖుడునై తాను సుధను,
"మా"న్ప జేయును తాపంబు మహితు డగుచు
"మ"నసు రాజయి శోభిల్లు మహిని నతడె
ఒంటరి ప్రేమికుడు చంద్రుడిని ఉద్దేశించి:
రిప్లయితొలగించండిచంపబోకు నీ వెన్నెల చాలునింక
దయను చూపించు విరహంబు తాళలేని
మా మనముల నీవెన్నెల మంట పెంచు
మమ్ము జంటగ మురిపించ మరల రమ్ము
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చందమామజతకుభామచక్కదనము
రిప్లయితొలగించండిదగ్గరవ్వగతనకున్నసిగ్గుచేత
మాఘమేఘాలమాటునమాయమాయె
మామభామలకలయిక?ప్రేమబెరుగ
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది.అభినందనలు.