16, ఫిబ్రవరి 2015, సోమవారం

సమస్యా పూరణం - 1599 (రాముని పదదాసుఁ డయె జరాసంధుండే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముని పదదాసుఁ డయె జరాసంధుండే. 

10 కామెంట్‌లు:

 1. ఏ మహిమాన్వితు దాసుం
  డా మారుతియయ్యె? నెవ్వడంతంబయెనా
  భీమునిచే?యన వరుసగ
  రాముని పదదాసుడయె, జరాసంధుండే

  రిప్లయితొలగించండి
 2. ఆ మారుతి దన భక్తిని
  రాము ని పద దాసుడయె ,జరా సంధుండే
  భీముడు చంపిన నాతడు
  రామా ! కాపాడు సామి !రయమున మమ్మున్

  రిప్లయితొలగించండి
 3. ఏమని తెలుపగ మారుతి
  రాముని పదదాసుఁ డయె ,జరాసంధుం డే
  సోమా శరణ మటంచును
  భీముని చేమరణ మందె బెగడు వడంగా

  రిప్లయితొలగించండి
 4. నీమము దప్పక మారుతి
  రాముని పదదాసుఁడయె ,జరాసంధుండే
  యా మధురాపురిఁ బరిగొన
  భీముని పురిగొల్పి చంపె వెన్నెల దొంగే!

  రిప్లయితొలగించండి
 5. సామీరి కానలోనను
  రాముని పదదాసుఁడయె జరాసంధుండే
  భీమునిచేత హతుండయె
  దామోదరుమాయచేత తమలము నందున్
  తమలముః యుద్ధము

  రిప్లయితొలగించండి

 6. రేమగడు గాంగ మాతయు
  యా మస్తకమందు,మెడను అహి హారమ్ముల్;
  మోమున త్ర్యక్షియు తేజో
  రాముని పదదాసు డయె జరాసంధు౦డే

  రిప్లయితొలగించండి
 7. మల్లెల వారి పూరణలు
  రాముని తమ్ముడు నేయను
  భీముని తోడను మువ్వురు భీమపు ఘ౦టల్
  గోముగ భేదించె. అని,జి
  ద్రామునిపదదాసుడయె, జరాసంధుండే
  2.భీమపు రావణు డనిలో
  రాముని పదదాసుడయె, జరాసంధుండే
  భీమునితో పోరియు యదు
  రాముని పద దాసుడయ్యె రమ్యము జీల్చన్

  రిప్లయితొలగించండి
 8. కె యెస్ గురుమూర్తి ఆచారి గారిపూరణ
  నీమమున నన్నదానము
  భూమిసురు వితతికి జేయు పుణ్యాత్ముడు ని
  ష్కామ౦బున నిరత౦ బౌ
  రా! మునిపాదదాసుడయె జరా సంధు౦డే

  రిప్లయితొలగించండి
 9. ఏమోకలసారాంశము?
  ధీమానున్నట్టిచోటదిగులుంచెగదా|
  స్వామీనీవేయనినౌ
  రా?మునిపదదాసుడయె|జరాసందుండే|

  రిప్లయితొలగించండి
 10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్గ్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి