ఈనాటి పద్యరచన శీర్షికకు చక్కని పద్యాల నందించిన కవిమిత్రులు.. పోచిరాజు సుబ్బారావు గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, టి.బి.యస్. శర్మ గారికి, భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, కె. ఈశ్వరప్ప గారికి, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి, గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి, చంద్రమౌళి సూర్యనారాయణ గారికి, కెంబాయి తిమ్మాజీ రావు గారికి, అభినందనలు, ధన్యవాదాలు. ఒక ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్తున్న కారణంగా విడివిడిగా సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.
బొప్పాయి పండు చెక్కల
రిప్లయితొలగించండిచొప్పును జూడంగ మిగుల సుందర మయ్యె
న్నప్పండు జూచు వారికి
దప్పక నోరూరు నిజము దరమే వదలన్ ?
గుండె నొప్పిని తగ్గించు గుణము కలది
రిప్లయితొలగించండికిడ్ని లందున గలరాల కీడు తొలగు
ఔషధీ గుణము నిండె నాయు ర్వేద
మందు వివరించ బొప్పాయి మనకు తరమె
ఎబిసిడి విటమిన్లు హెచ్చుగ నుండగ
రిప్లయితొలగించండితరచుగ తినుచుండ తనివి దీర
యాకలి పుట్టించు, నందము పెంచును
మోమున గుజ్జును మెత్తు చుండ,
పత్రముల్ పనిచేయు పదునుగ డెంగ్యూ జ్వ
రంబున జనులకు, రక్త వర్ణ
ము రుధిర మందున పొదలు కొనును,
రక్తపోటుకు పచ్చి యుక్త మగును,
జలుబు, చెవిపోటు, తామర, మొలల, కీళ్ళ
నొప్పు లందు ఫ్లూ జ్వరమున నొప్పు నోయి
కామ భావనోత్ప్రేరక కారకంబు
కనగ కల్పవృక్ష మనగ కనుల ముందు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅన్ని ఋతువు లందు యగ్గువై యంగళ్ళ
రిప్లయితొలగించండినేటి దినము దొరకు మేటి ఫలము
కాయ, గింజ లణుచు కాలేయ దోషమ్ము
గర్భ వతికి కీడు కసురు కాయ !!
రిప్లయితొలగించండిగొప్పగ నుండును రుచియే
చప్పున పండిన ఫలమును చక్కెర తోడన్
కప్పున కలిసిన ముక్కల
బొప్పాయిని తినగ మిగుల పొట్టకు హాయౌ.
ఆటవెలదులకిదిమంచినౌషదంబు|
రిప్లయితొలగించండితేటగీతియునున్నట్లుతియ్యదనము|
కందమూలాలవిటమిన్లుకలసియుండు|
సీసమట్లుగబొప్పాయిజేర్చుబలము|
పచ్చిబొప్పాయిని కలిపి వండినపుడు
రిప్లయితొలగించండిచికెను మటనులుడుకు కడు శీఘ్రముగను
బాగుగా పండినట్టి బొప్పాయి పండ
జీర్ణ భాధలన్నియుఁ బాపి చేయు మేలు
చెప్పనలవి గానంతటి
రిప్లయితొలగించండిగొప్పగు నౌషధ విలువలఁ గూడిన ఫలమున్,
బొప్పాయిఁ దిన్న సుఖమౌ!
నొప్పదు గర్భిణులకనఁగ నోర్చిన మేలౌ!
దండిగ విటమినులుండిన
రిప్లయితొలగించండిపండిన బొప్పాయితినిన బహు మధురమ్మై
యుండును-చర్మము పాడవ
కుండగ గాయును ప్రశస్త గుణవంతంబై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపద్యరచన:బొప్పాయి ఫలము
తినగ బొప్పాయి ఫలమును దేహముపయి
చర్మమున కాంతి హెచ్చును .సత్వరముగ
క్రొవ్వు తగ్గును. రక్తంపు ద్రుతము పెంచ
యౌవనమ్మున భాసి౦త్రు యవని జనులు
పండది జూడగా మిగుల పక్వము నొందుచు నెఱ్ఱ గా నునై
రిప్లయితొలగించండిఅండము లెన్నియో కలిగి హర్షము నీయుచు నందమై మఱిన్
మెండుగ నిచ్చుగా నిలను గుండెకు బాగుగ శక్తి పుంజమున్
బొండము వోలెయా ఫలము బొప్పయి నామము పేర నుండెగా
ఈనాటి పద్యరచన శీర్షికకు చక్కని పద్యాల నందించిన కవిమిత్రులు..
రిప్లయితొలగించండిపోచిరాజు సుబ్బారావు గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
టి.బి.యస్. శర్మ గారికి,
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
కె. ఈశ్వరప్ప గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
ఒక ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్తున్న కారణంగా విడివిడిగా సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.