6, ఫిబ్రవరి 2015, శుక్రవారం

పద్యరచన - 813

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

 1. ఆయురారోగ్య ము లకు నై చేయుదు రిల
  సూర్యు నకునమ స్కారము నార్య !మఱియు
  దినము దప్పక జేయగ మనకు గలుగు
  శాంతి సౌఖ్యములును గూడ సరగు నిజము

  రిప్లయితొలగించండి
 2. భూమండలావృత భువనము నెల్లను
  జలదంబుగ జేసి జలము నీయ
  సప్తాశ్వ రథమున సప్త వర్ణాల తో
  జగతినందలి జీవజాలమెల్ల
  జాగృతి నొందగ చండప్రచండతన్
  రవి కిరణాలతోడ రణము జేసి
  షట్చక్రముల నుండి శ్వాస కుంభింపగ
  కుండలినీ శక్తి కొలుపు పొంద

  అమృత బిందువుల్ వర్షించు నంత లోన
  చేరగను సహ స్రారము చిన్మయముగ
  కాన సూర్యనమస్కార కార్యమనిన
  ఇహసుఖాల, జీవన్ముక్తి నిచ్చు నయ్య.

  రిప్లయితొలగించండి
 3. ద్వాదశ భంగి మలతోన యెదను నిలిపి
  భానుని కొలిచిన చాలు నెనిమి దనిన
  నాలు గుమూడొ కటిరెండు మేలు మరలి
  వెలుగు రేడును ప్రార్ధించ జిలుగు చెలువు

  రిప్లయితొలగించండి
 4. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  టి.బి.యస్. శర్మ గారూ,
  మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
  ‘జలదంబుగ’ అన్నచోట గణదోషం. ‘జలదంబుగను’ అంటే సరి.
  ‘రవికిరణాలతోడ’ అన్నచోట గణదోషం. ‘రవికిరణాలతో’ అంటే సరి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
  మూడు పాదాలలో గణదోషం.. మీ పద్యానికి నా సవరణ....
  పదియు రెండు భంగిమలతో నెదను నిలిపి
  యినుని కొలిచినచో చాలు నెనిమి దనిన
  నాలుగును మూ డొకటి రెండు మేలు మరలి
  వెలుగు రేడును ప్రార్ధించ జిలుగు చెలువు.

  రిప్లయితొలగించండి
 5. ఇలను ప్రత్యక్ష దైవమై వెలుగునినుడు
  తిండి నిచ్చును జనులకు దృష్టి నిచ్చు
  ననుదినము నమస్కారము లాచరించ
  సకల శుభము లనిచ్చును సంతసించి

  రిప్లయితొలగించండి
 6. శ్రీవల్లి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. ద్వాదశ భంగిమల జనులు
  దీధితిమంతుని గొలువగ తెలవారగనే
  మోదము మరి శక్తి గలుగు
  సాదరముగ జేయునెడల స్వస్థత గూరున్ !!!

  రిప్లయితొలగించండి
 8. శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. ద్వాదశ విధముల నమించి తపను గొల్వ
  పెరుగు డీ విటమిను కడు పెల్లు గాను
  కాయమందున కలుగును కరము శక్తి
  సూర్యు ప్రతిరోజు గొల్వుడు సొంపుగాను

  రిప్లయితొలగించండి
 10. ఉదయసంధ్యలందు-నుత్శాహమునునింపు
  సూర్యవందనాలు|సూక్ష్మమైన
  మంచినొసగగలుగు-మంగళప్రదమగు
  పూర్వ-సంస్కృతిట్లుబుట్టుటాయె|

  రిప్లయితొలగించండి
 11. కాలు చేయి ఒడలు క్రమముతో నాడించి
  తీరు తెన్ను తోడ దేహ శ్రమలు
  శ్రద్ధ బూని జేయ సానుకూలమ్ముతో
  సూర్య శరణు నీకు సుఖము నిచ్చు

  రిప్లయితొలగించండి
 12. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. భానుడుదయించు వేళలో ప్రతిదినంబు
  బద్ర భంగిమల మనసు పదిల పరచి
  చలుప సూర్యనమస్కారములను మీరు
  రోజు మొత్తము నూతనోత్తేజ మమరు
  (బద్ర=పండ్రెండు)

  రిప్లయితొలగించండి
 14. సూర్యనమస్కారమ్ములు
  వీర్యమ్మును బెంచు మనకు , వెచ్చని వేళన్
  సూర్యుని కెదురుగ జేసిన
  నార్యా ! మరి బొందు దేహ మారోగ్యమ్మున్.

  రిప్లయితొలగించండి
 15. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి