11, ఫిబ్రవరి 2015, బుధవారం

పద్యరచన - 818

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

 1. దివ్యంబై లోకములకు
  భవ్యంబౌ వేంకటేశు పాదము గన్నన్
  ద్రవ్యంబేమున్నది భవి
  తవ్యము భాసిల్లు మ్రొక్క తత్ చరణములన్

  రిప్లయితొలగించండి
 2. వేంకటేశ్వరు పాదాలు బేల ! యవియ
  చూడ హుండీల బోలుచు చూపరులకు
  నంద మొలికించు చుండెను డెం దములకు
  జూడ రావమ్మ ! నీవును సుబ్బలక్ష్మి !

  రిప్లయితొలగించండి
 3. వేంకటేశ్వరు పాదాలు వినయముగను
  బట్టుకొనుదును గట్టిగా భయము లేక
  స్వామి యిచ్చును దర్శన భాగ్య ముమఱి
  నాదు భాగ్యము నెన్నగ నలువ దరమె ?

  రిప్లయితొలగించండి
 4. వెంకన్న పదము గొలుతును
  లెంకగ మఱి యుండి యతని లీలలు గనుచు
  న్టం కము లిచ్చును విరివిగ
  పంకజముల బూ జజేయ బ్రహ్మాండ ముగన్

  రిప్లయితొలగించండి
 5. పద్మనాభుని దివ్యమౌ పాదములవి
  జాహ్ను పుత్రికకయ్యది జన్మ స్థలము
  బ్రహ్మ కడిగిన పదముల భక్తిఁ గొల్వ
  మోదము మరియు తప్పక మోక్షమొదవు

  రిప్లయితొలగించండి
 6. తిరుమలేశ పాదమ్ముల దరిని జేరి
  మోక రిల్లి మనసు తోడ మొక్కి నంత
  సకల పాపమ్ముల భయము సడలు నీకు
  బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మమె సుమ!!

  రిప్లయితొలగించండి
 7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ******
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. పసిడికికంకణాల్దొడిగిపాదములందునగూర్చ?లక్ష్మి|తా
  విసురుచుగాలి,పాదములువిజ్ఞతచేతనునొత్తబూనగా?
  విసమగుమానసంబునకు|వేంకటనాథుడ-గుర్తెరింగియే
  దిసదశమార్చుదేవ||వినుతింతునుభక్తులకొక్కటుంచుమా
  2పాదాభివందనంబే
  సాధారణభక్తిమనకుసంపదగాదా?
  ఆధారమైనవేంకట
  నాధా| నినుగొలువనెంచునమ్మకమిడుమా|

  రిప్లయితొలగించండి
 9. దివి నుండి భువికి వచ్చిన
  దివిజుడు నారాయణ గిరి దివ్య నగమునన్
  దివిషదు పాదము మోపిన
  దివపు తొలుత వేంకటేశ దీప్తపు పదముల్

  రిప్లయితొలగించండి
 10. తాతయె కడిగిన పదమే!
  పాతకనాశిని జనించు పావన పదమే!
  వాతంధయమున్ ద్రొక్కిన
  పాతాళంబునకు బలిని పంపిన పదమే!

  రిప్లయితొలగించండి
 11. స్వామి పాదాల తొడుగులు స్వర్ణరత్న
  ఖచిత కంకణి యుతములై గ్రాలుచుండి
  కెంపు రంగున నఖములు సొ౦పొసంగ
  బరగె బాలాజి యన శ్రీనివాసు డవని

  రిప్లయితొలగించండి
 12. బ్రహ్మ కడిగిన పాదమ్ము బ్రహ్మ తానె
  యగుచు బరగిన పాదమ్ము నఘము లెల్ల
  బాపు గంగకు పుట్టిల్లు పాద మిద్ది
  పృథ్వి కొలచిన పాదమ్ము వేడ్క గనుడు.

  రిప్లయితొలగించండి