కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని కొత్తకొండ శ్రీవీరభద్రేశ్వర దేవాలయానికి వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. అందువల్ల మిత్రుల పూరణలను, పద్యాలను వెంట వెంట సమీక్షించలేకపోయాను. మన్నించండి. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** టి.బి.యస్. శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ ప్రయత్నం ప్రశంసనీయం. ‘దనుజుడు’ శబ్దానికి ‘తొలివేల్పు = రాక్షసుడు’ అనే అర్థం తప్ప పూజితుడు అన్న అర్థం లేదు. మొదటి పాదంలో గణదోషం. ‘నా ప్రార్థన నిటు...’ అంటే సరి! ***** ఏల్చూరి మురళీధర రావు గారూ, మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు. ***** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘దినదిన గండము ధృతి లే|దనుజా...’ అంటే బాగుంటుందేమో? ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, దకారాన్ని ఆదేశ సరళంగా మార్చి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీరు ‘దనుజా’ అని ఏ అర్థంలో ప్రయోగించారో అర్థం కాలేదు. అది భగవంతునికి విన్నపమైతే ‘తనయుడవు పితవు నిర్జిత| దనుజా..’ అంటే బాగుంటుందని నా సలహా. ***** కందుల వరప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘జగమొండివి జిత| దనుజా...’ అంటే బాగుంటుందనుకుంటాను. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, సందేహించవలసిన పని లేదు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, రామదాసు ప్రస్తావనతో మీ పూరణ సార్థకమయింది. ఇటువంటి పూరణకొరకే ఎదురుచూస్తున్నా. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గండూరి లక్ష్మినారాయణ గారూ, ‘నీవే + తనుజా’ అన్నప్పుడు ద్రుతకార్యం కాని, సరళాదేశం కాని జరగదు. అక్కడ ‘నీవే తనుజా’ అని ఉంటుంది. కాని సమస్య ‘దనుజా’ అని కదా ఉన్నది. అందువల్ల సందేహం వచ్చి సవరణను సూచించాను.
మనగా కోరిక గలదా ?
రిప్లయితొలగించండిదనుజా ! యే తీరుగ నను దయ జూచెదవో ?
యనుచును రాముని వేడిన
న నయము రక్షించు నిన్ను హర్షము తోడన్
కనుమా! చేసిన యప్పులు
రిప్లయితొలగించండినిను పోషింపగ చదువులు నేర్పింపగ నీ
అనివార్యపుటిక్కట్లం
దనుజా! యేతీరుగ నను దయఁ జూచెదవో?
వినుమా! నాప్రార్ధన లనిటు
రిప్లయితొలగించండికనులా ! పఠియించగ నిను కనుపించవుగా
మనసే నిలువదు నినుగన
దనుజా! యేతీరుగ ననుదయ జూచెదవో
ఇక్కడ దనుజ = తొలి వేల్పు , పూజితుడు
మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
రిప్లయితొలగించండినమస్కారములతో,
వనజాతనయన! రక్షిత
మునిజాతచయన! విదేహభూభృత్తనుజా
వనజాగరితపురస్సర
దనుజా! యే తీరుగ నను దయజూచెదవో?
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
అనువైన పెండ్లిలగ్నము
రిప్లయితొలగించండికనరావెట చూతమన్న కన్నుల యెదుటన్
గొనవలె మాయింటను విం
దనుజా!యే తీరుగ నను దయజూచెదవో!
అనుదినమడుగునుకట్నము
రిప్లయితొలగించండిమనుగడలోమగని-ప్రేమమసిబారంగా
దినదినగండంబాయెను
దనుజా|యేతీరుగననుదయజూచెదవో
ఘనమగు విద్యను గరపగ
రిప్లయితొలగించండిదినకూలిగ పనులఁ జేసి తిని మరచితివా!
మనుగడయును కష్టంబయెఁ
దనుజా! యేతీరుగ నను దయఁజూచెదవో!
మనలేను జీవితాంతము
రిప్లయితొలగించండివినుమొంటిగ ముసలివాన్ని విన కన నెరుగన్
తనయుడు తనయవు నీవే
దనుజా!యే తీరుగ నను దయజూచెదవో!
శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో....ధన్యవాదములతో...
రిప్లయితొలగించండికవి పండితు లందరికి వందనములు..
నేడు నీటి కొరకు రైతు
===============*=================
దినదిన గండంబగు పుడ
మిని వ్యవసాయమును నమ్మి మిణుగుఱు నైతిన్ !
ఘనుడవు, జగ మొండివి యగు
దనుజా!యే తీరుగ నను దయజూచెదవో!
(మిణుగుఱు=మిణుగుఱుపురుగు )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసునయనముఁ గోరె జనకి
రిప్లయితొలగించండివనమున పరికించి దెత్తు, వదినను కాపా
డననయమెటకున్ పోవల
దనుజా! యే తీరుగ నను దయ జూచెదవో?
(శ్రీరామచంద్రుడు తమ్ముడు లక్ష్మణుని యిలా కోరతాడా? అనే సంశయముతో ప్రచురించడమైనది.బుధజనుల అభిప్రాయం తెలియజేయ ప్రార్థన.)
మల్లెల వారిపూరణలు
రిప్లయితొలగించండివనమాలివౌచు వెలుగుచు
నిను నమ్మినవారి కిడవె నిఖిలార్ధమ్ముల్
వినుతం బయ్యెడి శిక్షిత
దనుజా! యే తీరుగ నను దయ జూచెదవో?
2.తను ప్రహ్లాదుడు వీడడు
అనయంబునువిష్ణు పదము నాపద గొన్నన్
తను తండ్రికి తెలిపియు నను
దనుజా! యే తీరుగ నను దయ జూచెదవో?
రిప్లయితొలగించండికెఎస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
వినయజనావన!! శాసిత
దనుజా! యే తీరుగ నను దయ జూచెదవో?
యినవంశోత్తమ రామా
యని భక్తిన్ రామదాసు ప్రార్థించె గదా
"మననిమ్ము దైత్యకులమును
రిప్లయితొలగించండిదనుజా!యేతీరుగ,నను దయ జూచెదవో,
కినుక గనుచు శిక్షి౦తువొ,"
యనుచు విభీషణుడు పల్కె నగ్రజు తోడన్
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈరోజు కరీంనగర్ జిల్లాలోని కొత్తకొండ శ్రీవీరభద్రేశ్వర దేవాలయానికి వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. అందువల్ల మిత్రుల పూరణలను, పద్యాలను వెంట వెంట సమీక్షించలేకపోయాను. మన్నించండి.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
టి.బి.యస్. శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
‘దనుజుడు’ శబ్దానికి ‘తొలివేల్పు = రాక్షసుడు’ అనే అర్థం తప్ప పూజితుడు అన్న అర్థం లేదు.
మొదటి పాదంలో గణదోషం. ‘నా ప్రార్థన నిటు...’ అంటే సరి!
*****
ఏల్చూరి మురళీధర రావు గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘దినదిన గండము ధృతి లే|దనుజా...’ అంటే బాగుంటుందేమో?
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
దకారాన్ని ఆదేశ సరళంగా మార్చి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీరు ‘దనుజా’ అని ఏ అర్థంలో ప్రయోగించారో అర్థం కాలేదు. అది భగవంతునికి విన్నపమైతే ‘తనయుడవు పితవు నిర్జిత| దనుజా..’ అంటే బాగుంటుందని నా సలహా.
*****
కందుల వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘జగమొండివి జిత| దనుజా...’ అంటే బాగుంటుందనుకుంటాను.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
సందేహించవలసిన పని లేదు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
రామదాసు ప్రస్తావనతో మీ పూరణ సార్థకమయింది. ఇటువంటి పూరణకొరకే ఎదురుచూస్తున్నా. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ కంది శంకరయ్య గురువులకు నమస్కారములు
రిప్లయితొలగించండితండ్రి తనకూతురును వేడుకున్నటుల వ్రాసినాను
తనుజా అర్థము కూతురని ఆంధ్రభారతి నిఘంటువులో ఉన్నది
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండి‘నీవే + తనుజా’ అన్నప్పుడు ద్రుతకార్యం కాని, సరళాదేశం కాని జరగదు. అక్కడ ‘నీవే తనుజా’ అని ఉంటుంది. కాని సమస్య ‘దనుజా’ అని కదా ఉన్నది. అందువల్ల సందేహం వచ్చి సవరణను సూచించాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివినగా ఆజా భయ్యా
రిప్లయితొలగించండిసునియే రాందాసు పాట సోంచో బాద్ మే
ఘనముగ గాతా హూ , బా
దను, జా ! " యే తీరుగ నను దయ జూచెదవో ? "
వినగా ఆజా భయ్యా
రిప్లయితొలగించండిసునియే రాందాసు పాట సోంచో బాద్ మే
ఘనముగ గాతా హూ , మీ
దను, జా ! " యే తీరుగ నను దయ జూచెదవో ? "
కనివిని యెరుగని రాబడి
రిప్లయితొలగించండిమునుపటి సమయమున నేను మూతన్ బెడితిన్
వినుమా! ప్రార్థన! పన్నుల
దనుజా! యేతీరుగ నను దయఁ జూచెదవో?
అనువుగ చదివెడు వేళన్
రిప్లయితొలగించండికనుగొని నా నెత్తినెక్కు గాడిదవీవే!
కనగను తల్లిని వోలెడు
దనుజా! యేతీరుగ నను దయఁ జూచెదవో?