28, ఫిబ్రవరి 2015, శనివారం

పద్యరచన - 834

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. వలదు మంచ మనుచు పడుకొని నేలపై
    యిడెను తనదు శిరము యిటుక పైన
    సాయి బాబ గడిపె సామాన్య జీవిగ
    వెండి యాసనమిడ వెర్రి గాదె?

    రిప్లయితొలగించండి
  2. ఈయుగ దైవము మనకని
    సాయిని కొలువంగ జనుల సౌభాగ్య మిడన్
    చేయగ నిర్మల భక్తిని
    నేయుగ మందైన గాని నెమ్మిని గొలువన్

    రిప్లయితొలగించండి
  3. ఇలలో ముసుగుల వెనుకున
    కులుకి పురుషపుంగవులతి కోరలు ద్రిప్పన్
    పలువురి పై ప్రశ్నెలిపుడు,
    కొలచిన సూక్తులను జాలు కోవెల వలెనా?

    రిప్లయితొలగించండి
  4. చరణు వేడిన భక్తుల సంతతమ్ము
    సాకు చున్నట్టి పరమాత్మ సాయి నాధ
    కొలుచుచున్నాను నిష్టతో కూర సుఖము
    కరుణఁజూపి నను దయతో కాచుమయ్య

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది.అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది.అభినందనలు.
    టైపాట్లు ఎక్కువగా ఉన్నవి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. సాయిని గొలువ ద్వారక
    మాయిని జేరిన జనులకు మంగళకరమౌ
    బాయును దురితములెల్లన్
    ఖాయమ్ముగ షిరిడి సాయి కాంతులు నింపున్ !!!

    రిప్లయితొలగించండి
  7. ఓసాయీ శ్రీ సాయీ
    నీ సాయము కొఱకు నేను నీడగ వత్తు
    న్నీ సారికి దయ జూడుము
    ఏసాయము కోరనిన్ను నికపై సాయీ !

    రిప్లయితొలగించండి
  8. మదిగదిమందిరమందున
    కదలకకూర్చుండియున్నకరుణామయ?నే
    కదలించగకనురెప్పల
    గదివిడువకుసాయినాథ|కనికరములచే|

    రిప్లయితొలగించండి
  9. కులమతజాతిబేదములకూడికమాన్పగమానవాళిలో
    నిలచినసాయినాథ|ననునిత్యమునీదగుబోధతత్వమే
    చలనములుంచగా?మనసుచంచలమున్ననుకొంతమార్పుచే
    నిలచెనుమానవత్వమిలనిర్మలభక్తికిశక్తియుక్తికిన్|

    రిప్లయితొలగించండి
  10. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘సాయిని గొలువగ...’ అంటే సరి!
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి