ఉల్లి పాయలు జూడుము మెల్ల గాను నెంత యందము గానుండె ? నెఱు పు తోడ నెందు వాడిన నిచ్చును నందు రుచిని ను ల్లి పాయ పకోడీ ని యల్లము మఱి చేర్చి భావన ! మఱి నాకు జేసి పెట్టు
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** జిలేబీ గారూ, మీ భావానికి నా ఛందోరూపం...... చెడ్డ దీజీవిత మ్ముల్లిగడ్డ గాదె పూని యందు రాగద్వేషములను పొరల నొక్కటొకటిగఁ దొలగించ నొనరగాను దెలుయు పూర్ణమదః యను తెలివి మనకు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మల్లల వారి పూరణలు 1.ఉల్లి లేని వంట లు౦డవేయింటను ఉల్లితోడ నోరులూరు రుచికి ఉల్లి చేయు మేలు తల్లి చేయగలేదు ఉల్లి నౌషధంబు నున్సు కతన 2.ఉల్లి రేటు నేడు యూహకందక యుండ ఉల్లిఘాటు పెరిగె నెల్లరకును ఉల్లి కంట నీరు వెల్లుగా పుట్టింప ఉల్లిగొనక మానె ఊర్ల యందు
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘మేలును + ఉల్లి’ విసంధిగా వ్రాశారు. అక్కడ ‘మేలు నీ యుల్లి చేయు’ అనండి. ***** మిస్సన్న గారూ, ఉల్లి మీద మీ ఖండిక మనోహరంగా ఉంది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ****** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఉల్లి పాయలు జూడుము మెల్ల గాను
రిప్లయితొలగించండినెంత యందము గానుండె ? నెఱు పు తోడ
నెందు వాడిన నిచ్చును నందు రుచిని
ను ల్లి పాయ పకోడీ ని యల్లము మఱి
చేర్చి భావన ! మఱి నాకు జేసి పెట్టు
ఇల్లేగడువదు వాడక
రిప్లయితొలగించండినుల్లిని - వంటలకువాడ నోటికిరుచియౌ
తల్లైన చేయలేదీ
యుల్లి మనుష్యులకుచేయునుపకారములన్
ఉల్లిని పెంచెడి రైతుకు
రిప్లయితొలగించండినుల్లము రంజిల్లు రీతి నూరు నమస్సుల్
తల్లులు సైతము ముదముగ
పిల్లలు కోరిన తినదగు ప్రియమగు వంటల్
చంద్ర మౌళి గారూ ! అసలైన పాయంటు కొట్టేసారు కదా !
ఇల్లు గడవదీ పుడమిని ఉల్లి లేక
రిప్లయితొలగించండిగొల్లుమందురు పెరిగిన ఉల్లిధరలు
ఉల్లి రచ్చసర్కార్లను చెల్లు బెట్టె
లొల్లి ఏలని సన్నాసి ఉల్లి నొదులు!!
జీవితంబను ఈ పై పొరను
రిప్లయితొలగించండిఉల్లి వోలె పొరలు పొరలు గ
తెరిచి తరచి తరచి చూడవోయి
మిగిలినది పూర్ణమదః మే నోయి !!
జిలేబి
ఉల్లి పాయలు గలవట చెల్లి ! చూడు
ఎంత యందము గలవియో నంత రుచిని
నిచ్చు ననుటలో సందియ మించు కైన
లేదు నిజమిది నమ్ముము నాదు మాట
ఉల్లిని కోసిన రైతుకు
రిప్లయితొలగించండినుల్లము రంజిల్ల కొనగ నుత్సాహులకున్
ఉల్లిని కోసిన వనితకు
మెల్లగ కన్నీరు నిచ్చు మీదట ' ధర ' లో.
ఉల్లి చేసిన మేలును తల్లి చేయ
రిప్లయితొలగించండిదనుచు పెద్దలు చెప్పుదు రాదినుండి
దిల్లి యెన్నిక లందున నుల్లి లొల్లి
పతనమొనరించె ప్రభుతను గతమునందు
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
మీ భావానికి నా ఛందోరూపం......
చెడ్డ దీజీవిత మ్ముల్లిగడ్డ గాదె
పూని యందు రాగద్వేషములను పొరల
నొక్కటొకటిగఁ దొలగించ నొనరగాను
దెలుయు పూర్ణమదః యను తెలివి మనకు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయాణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పలుచని పొరలు గలిగిన వలువ గట్టి
రిప్లయితొలగించండిచలువ బెంచుచు నూరించు జాబిలమ్మ
పిల్లలకు మేలు జేయను తల్లివోలె
వంటగదినేలు మహరాణి కంట నీరు
జాలు వాఱగ నేడ్పించు జాణ యుల్లి !!!
ఇల్లాలి కింటిలో, నం
రిప్లయితొలగించండిగళ్లన్ బజ్జీల నమ్మ గాల్చెడు వేలన్
జెల్లునె? కన్నుల విందుగ
నుల్లీ ముక్కలు మసాల లూరించకనే!
తల్లి చేయని మేలును ఉల్లి చేయు
రిప్లయితొలగించండినుల్లి లేకుండగను శాక ముండబోదు
కాని, వచ్చును గొనబోతె కంటినీరు
తరుగగా వచ్చుకన్నీరు తప్పకుండ.
ఉల్లి చేయు మేలు తల్లియు జేయదు
రిప్లయితొలగించండిఉల్లి పేదవాని యుట్టి ముద్ద
గుండె బలము నిచ్చి కుదురుగ జేయును
వైద్యు లనెడి మాట వలెను తెలియ.
ఉల్లి తోడి వంట లుల్ల మలరజేయు
ఉల్లి పెసర యట్టు నుల్లి పకొడి
యుల్లి రవ్వ దోసె యుల్లి సమోసాల
నూహ జేయ నోట నూరు నీరు.
ఉల్లి దినిన మనకు నుప్పొంగు తామస
మందు చేత విడువ మంచి యగును
సృష్టి జేసె దీని ఋషి కౌశికుండని
కొంద రందు రయ్య గుణము చెప్పి.
ఉల్లి ధరల మితిగ నుంచుట ప్రభుతకు
గొప్ప చిక్కు దెచ్చు, కూల్చి వేసె
నొక్క నాడు కొంప నోటమి పాల్జేసి
రాజకీయ మందు రచ్చ జేసి.
పొరల నొక్క టొకటి బిరబిరా యొలిచిన
రమ్యమైన యుల్లి రంగు దేరు
నట్లె మానవుండు నాత్మను గప్పిన
పొరల తీసి వైచ మోక్షమగును.
కంట నీరు వచ్చు ఘాటుకు, యుల్లిని
కష్టమైన నొలువ నిష్టమైన
వంటకమ్ము దొరుకు, బ్రతుకున కష్టము
తట్టుకొన్న మనకు గట్టి మేలు.
దున్నినదుక్కిలోబెరిగిదోషములంటనిభూమిలోపలే
రిప్లయితొలగించండిమన్నికచేతరైతుధనమంతయుఖర్చిడిపంటబెంచినా?
నెన్నగరైతుకో,కొనెడినేర్పరివాడికొ,వంటయింటిలో
తిన్నగగోయ?కంటతడిదెచ్చును|మెచ్చెడినుల్లినుర్విలో|
మల్లల వారి పూరణలు
రిప్లయితొలగించండి1.ఉల్లి లేని వంట లు౦డవేయింటను
ఉల్లితోడ నోరులూరు రుచికి
ఉల్లి చేయు మేలు తల్లి చేయగలేదు
ఉల్లి నౌషధంబు నున్సు కతన
2.ఉల్లి రేటు నేడు యూహకందక యుండ
ఉల్లిఘాటు పెరిగె నెల్లరకును
ఉల్లి కంట నీరు వెల్లుగా పుట్టింప
ఉల్లిగొనక మానె ఊర్ల యందు
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిఉల్లి తల్లితో సమ మనుచుంద్రు నుర్వి జనులు
తల్లికిని మేలు చేయు నాఉల్లిపాయ
గర్భవతి దాని మెసవిన గాచు నదియె
పోషకంబుల నందించి భ్రూణమునకు
ఉల్లి రేటు పెరుగ నూడెను ప్రభుతయే
రిప్లయితొలగించండిఉల్లికున్న విలువ తల్లి కేది?
మళ్ళిమళ్ళి తినగ ఉల్లి పెసర దోశ
స్వర్గమునకు కెళవు జానె డుండు
ఉల్లిపొరలయందునుంచినరుచులన్ని
రిప్లయితొలగించండికాయగూరలందుగలసిబంచ?
పంటినాలుకెంత-పరవశమండునో|
నోటియూటనడుగ?చాటిజెప్పు
మిస్సన్న గారూ ! ఉల్లిని ఉల్లాసంగా " దంఛేశారు "
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉల్లట్టు లుప్మలందున
రిప్లయితొలగించండిఅల్లనవంకాయకూర లాలున గలుపన్
పుల్లని గోంగుర నుల్లిని
చల్లన్నములోన దినగ చాలా రుచియౌ.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘మేలును + ఉల్లి’ విసంధిగా వ్రాశారు. అక్కడ ‘మేలు నీ యుల్లి చేయు’ అనండి.
*****
మిస్సన్న గారూ,
ఉల్లి మీద మీ ఖండిక మనోహరంగా ఉంది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
******
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం నోరూరిస్తున్నది. బాగుంది. అభినందనలు.
తల్లి సమానమే యనుచు నుల్లిని నందురు గాదె పం డితు ల్
రిప్లయితొలగించండిఉల్లియ నిచ్చు గుండె బల మెల్లపు డె ట్లుగ నాహరిం చినన్
అల్లదె యాయువుం బెరుగు హర్షము నిచ్చును నెల్లవే ళలన్
కల్లయు గాదు నా పలుకు నల్లదె వైద్యుని మాటలే మఱిన్
మాస్టరుగారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురువుగారూ హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి