పలుకు విదేశభాషలను పామరులైనను ప్రీతితోసుమా చులకనజేసి తెల్గునిట జూతురు - పిల్లలు మాటలాడుచో వలదని వేయుచుండిరట వారికి శిక్షలు పాఠశాలలో తెలుగన చిన్నచూపు మరి దీనికి కారణ మేమిటో గదా
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూద్యం బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. మొదటి పద్యం రెండవ పాదంలో గణదోషం. ‘కైమోడ్పు లనన్’ అనండి. రెండవ పద్యం మూడవ పాదంలో గణదోషం. ‘కలుగును గద యాంగ్లమ్మున’ అనండి. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వ.రా.స. గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. పద్యరచనపట్ల మీకు ఆసక్తి కలిగినందుకు సంతోషం. ఆ ప్రయత్నంలో ఈ బ్లాగు మీకు అన్నివిధాల సహకరిస్తుంది. ఇక మీ మొదటి ప్రయత్నం ప్రశంసనీయం. నేను ప్రస్తుతం పద్యభావం జోలికి పోవడం లేదు. మొదటి పాదాన్ని ‘నెరుగ’ అని ప్రారంభించారు.అటువంటి పద్యం లేదు. ‘ఎరుగ’ అన్నా యతి సరిపోతుంది. రెండవ పాదంలో ‘వాఙ్మ్ యములు’ అన్నారు. ‘వాఙ్మయములు’ అనాలి. అంటే గణదోషం. ‘వాఙ్మయము’ అంటే సరి! మిగతా పద్యం బాగుంది. అభినందనలు, స్వస్తి! ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
పలుకు విదేశభాషలను పామరులైనను ప్రీతితోసుమా
రిప్లయితొలగించండిచులకనజేసి తెల్గునిట జూతురు - పిల్లలు మాటలాడుచో
వలదని వేయుచుండిరట వారికి శిక్షలు పాఠశాలలో
తెలుగన చిన్నచూపు మరి దీనికి కారణ మేమిటో గదా
తొలిపలు కులుసభ యందున
రిప్లయితొలగించండికలవర పడిమాతృ భాష కైమోడ్పు లటంచున్
తెలుగును వీడకు మెన్నడు
వెలిగించు నుబ్రతుకు బాట వేలుపు లెపుడున్
తెలుగును పలుకుట కటకట
రిప్లయితొలగించండివెలుగును విరజిమ్ము భాష వేయి విధమ్ముల్
కలుగు నాంగ్లము నందున
మెలగిన మెండైన కొలువు మేలగు మీకున్
తెలుగు మహాసభ లందున
రిప్లయితొలగించండివెలిగెడు మన " టెలుగు " జూడ వెగటనిపించున్
తెలివియె లేకను " యెంగ్లీస్ "
తెలివినొకడు జూపబోవ తిక్కగ నుండున్.
విశ్వ తెలుగు సభలటంచు వేదినెక్కి
రిప్లయితొలగించండితెలుగు పండితులనెవరి పిలువ కుండ
నాంగ్ల భాషలో మాట్లాడి యగ్గలముగ
జరుపు సభల భాషకు మేలు జరుగుటెట్లు?
తెలుగు మహాసభలందున
రిప్లయితొలగించండిదెలుగును విడనాడుచున్న తేజమ్మెపుడో ?
పలుకుము తీయని తెనుగున
వెలిగించుము మానసములు విశ్వము నంతన్!!!
ఆంగ్ల భాషను జనులెల్ల యనుసరించ
రిప్లయితొలగించండితల్లి భాషను మరచిరి తాము యెపుడొ!
తెలుగు పోవగ పుట్టేను తెగులు మనకు
భాష సంకర మయ్యేను భావి నందు!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యం రెండవ పాదంలో గణదోషం. ‘కైమోడ్పు లనన్’ అనండి.
రెండవ పద్యం మూడవ పాదంలో గణదోషం. ‘కలుగును గద యాంగ్లమ్మున’ అనండి.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నేతి బీర లోన నేతిని గననట్లు
రిప్లయితొలగించండితెలుగు సభల లోన తెలుగు సున్న
చిత్త శుద్ధి లేక జేసిన యత్నముల్
ఫలము నిచ్చు టన్న వలను గాదు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినెరుగ మాతృభాష చదువ నేమధుకవి
రిప్లయితొలగించండితా రసమయ వాఙ్మ్ యములు మాతాపితలను
మరచిమార్గముదప్పి కామవశుడైతి
మాతృభాష నేర్చుకొనర మానవునిగ
నా మొదటి ప్రయత్నం.తప్పులను సుహృదయంతో మన్నింప ప్రార్ధన.
తల్లు లింట తెలుగు వల్ల కాదన నాడె
రిప్లయితొలగించండితెలుగు భాష కాంగ్ల తెగులు బట్టె
తెలుగు నేత జబ్బు తెలిసె మనకు నేడు
తేట జేసె వీడు గోటు గాను
వ.రా.స. గారూ,
రిప్లయితొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. పద్యరచనపట్ల మీకు ఆసక్తి కలిగినందుకు సంతోషం. ఆ ప్రయత్నంలో ఈ బ్లాగు మీకు అన్నివిధాల సహకరిస్తుంది.
ఇక మీ మొదటి ప్రయత్నం ప్రశంసనీయం. నేను ప్రస్తుతం పద్యభావం జోలికి పోవడం లేదు. మొదటి పాదాన్ని ‘నెరుగ’ అని ప్రారంభించారు.అటువంటి పద్యం లేదు. ‘ఎరుగ’ అన్నా యతి సరిపోతుంది. రెండవ పాదంలో ‘వాఙ్మ్ యములు’ అన్నారు. ‘వాఙ్మయములు’ అనాలి. అంటే గణదోషం. ‘వాఙ్మయము’ అంటే సరి! మిగతా పద్యం బాగుంది. అభినందనలు, స్వస్తి!
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
గురువుగారికి నమస్కారాలు! మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు. వీటిని బట్టి తదుపరి ప్రయత్నం మరింత జాగ్రత్త్తగా వహిస్తాను. స్వస్తి.
రిప్లయితొలగించండి