టి.బి.యస్. శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ****** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ****** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** జిలేబీ గారూ, మంచి భావాన్ని అందించారు. అభినందనలు. మీ భావానికి నా ఛందోరూపం...... అదిగొ ‘ఆమ్ ఆదిమీ పార్టి’ యరుగుదెంచు దేహలీకి నాలుగడ్డల దినము వచ్చె ఆము ఆదిమీలకు చాలు నాలుగడ్డ భాజపా జిలేబీలింక వదలునంట! ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ దుంప లన్నింట బంగాళ దుంప మేలు కార్బొహైడ్రేటు లెక్కువ కలసి యుండ పూరి తో దాని పొడి కూర చేరిచి తిన స్వర్గమె దిగి వచ్చు నా సామి రంగ
మిస్సన్న గారూ, బంగాళదుంప వివిధ ప్రయోజనాలము చక్కగా వివరిస్తూ మంచి పద్యం చెప్పారు. అభినందనలు. ***** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆలు దండిగా నుండగ ఆలి కెపుడు
రిప్లయితొలగించండికూరగాయల లేవన్న కొఱత లేక
కాలమేగతి నుండ సకాలమందు
వంట చేతురు సులువుగ వనిత లంత
బంగాళాదుంపల గాం
రిప్లయితొలగించండిచంగనె వందల రకముల చక్కని వంటల్
ఠంగున మదిలో మెదలును
మ్రింగు గుటకలెవరు దీని వ్రేపుడు గనినన్
బంగాళా దుంపలుమఱి
రిప్లయితొలగించండిరంగును జూడంగ మిగుల రమ్యత నొప్పెన్
చెంగావి రంగు వేగిన
బంగాళా దుంప కూర బాగుగ నుండున్
రిప్లయితొలగించండిఅదిగో వస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీ
దేహలీ కి 'ఆలుగడ్డల కాలం'వచ్చే
ఆమ్ ఆద్మీ కి చాలు ఆలుగడ్డలు
దేశానికి వదులు భాజపా జిలేబీలు !!
జిలేబి
ఉత్త రమెరికాలో బుట్టి ఉర్ల గడ్డ
రిప్లయితొలగించండివిశ్వ మంతయు పాకెను విరివిగాను
ఆలు యున్నచాలు గృహిణి అండ గాను
కూర చేయ వచ్చు కలిపి కొదవ లేక
అతివ లందర ప్రీతిగ ఆలు గడ్డ
పిండి వస్తువులు కలగి దండి గాను
వైట మిన్లను సమకూర్చు వశము తోను
ఫేసు మాస్కులకిదినేడు ఫేవ రెట్టు
టి.బి.యస్. శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
******
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
******
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
మంచి భావాన్ని అందించారు. అభినందనలు.
మీ భావానికి నా ఛందోరూపం......
అదిగొ ‘ఆమ్ ఆదిమీ పార్టి’ యరుగుదెంచు
దేహలీకి నాలుగడ్డల దినము వచ్చె
ఆము ఆదిమీలకు చాలు నాలుగడ్డ
భాజపా జిలేబీలింక వదలునంట!
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
పాలూ పెరుగూ లేకను
రిప్లయితొలగించండితూలుచు త్రుల్లుచు నడిపెడు తొయ్యలి కైనన్
కాలానుగుణంబుగనో
యాలూ వంటింట లేక నలజడి మిగులున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పాలూ పెరుగూ’ అంటే వ్యావహారికం. ‘పాలును పెరుగును’ అనండి.
సాయంత్రపు వేల్లో
రిప్లయితొలగించండిహాయిగ నింటిల్లిపాది యాలూ తోడన్
వేయిన్నొక్క రకంబుల
తీయమ్మౌ 'ఛాటు' లెన్నొ తినగా వచ్చున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పద్యంకూడా బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో ‘వేల్లో’ అన్నచోట గణదోషం. ‘సాయంత్రపు వేళలలో’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. వ్యావహరిక మరియు టైపాటు సవరణానంతర పద్యములు:
రిప్లయితొలగించండిపాలును పెరుగును లేకను
తూలుచు త్రుల్లుచు నడిపెడు తోయలి కైనన్
కాలాను గుణంబుగ నో
యాలూ వంటింట లేక నలజడి మిగులున్!
సాయంత్రపు వేళల్లో
హాయిగ నింటిల్లిపాది యాలూ తోడన్
వేయిన్నొక్క రకంబుల
తీయమ్మౌ ' ఛాటు ' లెన్నొ తినగా వచ్చున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిశ్వమందలి యాకలి వివిధవిధుల
రిప్లయితొలగించండిఅణచ గల్గిన శక్తితో ననవరతము
మేలు చేయు మూలమిల బంగాళదుంప
మించు శాకము జగతినఁ గాంచలేము
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పూజ్య గురుదేవులకు నమస్సులు.నాలుగవ పాదంలో ప్రాస యతిని సవరించి మరల పంపుచున్నాను.
రిప్లయితొలగించండివిశ్వమందలి యాకలి వివిధవిధుల
అణచ గల్గిన శక్తితో ననవరతము
మేలు చేయు మూలమిల బంగాళదుంప
మించు శాకము జగతిలో నెంచలేము
ఆలుమగలకు-బిడ్డలానాలుగడ్డ
రిప్లయితొలగించండిఉదయఫలహరమందుననుల్లిజతగ
తగుటమోటాలకలయికదగ్గరయిన
పోపుచేతనునుడికించ?పుట్టురుచియే
2అందముగున్నవన్నియునునాకలిదీర్చగనాలుగడ్డలై
ముందునగానుపించునవెముఖ్యటమోటయునుల్లిముక్కలున్
పొందికచేతజేర్చుకొనిపోపుకళాయిననీటిమధ్యలో
కుందుచుకూర్పుగాగలయుకూటమిదోశకుకీర్తి?కుర్మయే
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిసవరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
మాపటి వేళకు వేపుడు గా జేయ
రిప్లయితొలగించండి......నుల్లిపాయల జేర్చి యుల్లమలరు
సన్నని చక్రాల చందాన తరిగిన
......బజ్జీల రుచి మహా బాగుబాగు
పల్చని పొరలుగా బయట నమ్మెడు చిప్స్
......పిల్లల నోటికి భేషుభేషు
కమ్మని పోపుతో నిమ్మ రసము జేర్చ
......కూరగా జేయ నోరూరి తీరు
తొక్క తీయక వాడిన దొరకు మనకు
వలయు పోషక ములని విజ్ఞుల యువాచ
ఆలితో బాటు నింటింట నాలుగడ్డ
గొప్ప పాత్రను పోషించు జెప్ప నిజము.
కంది వారు !
రిప్లయితొలగించండికంది పప్పు చారు + ఆలుగడ్డల కూర చేసేసారు !!
నెనర్లు !
చీర్స్
జిలేబి
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిదుంప లన్నింట బంగాళ దుంప మేలు
కార్బొహైడ్రేటు లెక్కువ కలసి యుండ
పూరి తో దాని పొడి కూర చేరిచి తిన
స్వర్గమె దిగి వచ్చు నా సామి రంగ
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిబంగాళదుంప వివిధ ప్రయోజనాలము చక్కగా వివరిస్తూ మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆలుగడ్డ,కూరలన్నింటితో కలిసి
రిప్లయితొలగించండిచవిని పెంచు రీతి, సతియు, నత్త,
మామ,యాడుబిడ్డ,మరది,బావల తోడ
కలసి మెలసి యుండ కలుగు శాంతి
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
విశ్వమెల్ల బంగాళదుంపింపు తినరె
రిప్లయితొలగించండియితర దేశాల పంటైన నిండియాను
చేరె! వేపుడు,కుర్మాకు,చెలువునౌను
దప్పళంబున రుచిగొల్పు గొప్ప దుంప
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపాల కడలి మీద పన్నగ శయమున
రిప్లయితొలగించండివిసుగు లేకను లక్ష్మితో విష్ణు వటుల
తీరిన కిటుకేమనడుంగ నారదుడనె
"నాలు చక్రాల వేపుడి యారగింపు"
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.