20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

పద్యరచన - 826

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22 కామెంట్‌లు:

  1. వసుదేవుండు నిశీధమందు పయనంబై కారు చీకట్లలో
    పసికందున్ తన చేతులందుగొని యావర్షంబులోసాగగా
    పసిగోపాలుకు సర్పరాజము ఫణంబడ్డుంచె, చేర్చంగ తా
    నొసగెన్ వారికి దారినాయమున లోకోద్ధారుఁ వ్రేపల్లెకున్

    రిప్లయితొలగించండి
  2. బాల కృష్ణుని జేతుల బట్టు కొనుచు
    నాది శేషుడు వెంటరా యతని గూడ
    దారి నీయగ యమున యా నీర మందు
    పయన మయ్యెను వ్రేపల్లె పట్టణమున
    కుమఱి వసుదేవు డప్పుడు కోర బావ

    రిప్లయితొలగించండి
  3. శ్రీకృష్ణోద్భవ పుణ్యకాలమిది విశ్లేషించి చూడంగ మా
    యా కృత్యంబులకాలవాలముగ భక్తాభీష్ట సిద్ధంబుకై
    వైకుంఠుండిదె వాసుదేవునిగదీవ్యత్భాసితో తేజుఁడై
    శ్రీకల్యాణమొనర్చె ధర్మమునకున్ రేపల్లె యావాసుఁడై.

    రిప్లయితొలగించండి
  4. రాతిరి వేళ నా యమున రమ్యముగా తెరువీయ జన్మదుం-
    డాతుర మొప్ప బాలకుని హస్తములన్ గొని దాటె వానలో
    ప్రీతిని నిల్చె చత్రముగ బిడ్డకు శేషుడు నవ్వె కృష్ణుడున్
    భీత మనస్కుడై కునుకు బెట్టక దొర్లెను కంసు డత్తరిన్.

    రిప్లయితొలగించండి
  5. బాలకృష్ణుని చేగొని వడివడిగను
    యమున దాటుచునున్నట్టి సమయమందు
    తటిని వసుదేవునకు వెస దారినిచ్చె
    నెండ తగులనీయక శేషుడండనిచ్చె

    రిప్లయితొలగించండి
  6. మల్లెలవారిపూరణ
    అర్ధరాత్రివేళను తండ్రి యమునదారి
    యిడగ నంద వ్రజము జేర్చ నింపు నయ్యె
    దేవతాళి యెల్లరు బాలు దీవె నిచ్చి
    రవని యాతడిచ్చు శుభము లందరకును

    రిప్లయితొలగించండి
  7. కె యెస్ గురుముర్త్యాచారి గారి పూరణ
    సకల భువనభా౦డంబుల సంతతంబు
    మూయు విష్ణు స్వరూపుని మోయుచున్న
    దేవ!వసుదేవ! ఘనుడవు నీవె నయ్య!
    అందుకొను మింక యస్మ్సత్కృతా౦జలివియె

    రిప్లయితొలగించండి
  8. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ వౄత్తరచన బాగుంది. అభినందనల్లు.
    "గోపాలుకు" అనకూడదు. గోపాలునకు అనాలు. అక్కడ "పసిగోపాలున కాధిజిహ్వము ఫణం బడ్డుంచె..." అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    "వెంటరా నతని" అనండి.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ శార్ధూలం చాలా బాగున్నది. అభినందనలు.
    "సిద్ధంబునకై" అనాలి. అక్కడ "భక్తాభీష్ట సిద్ధుండునై" అందాం.
    *****
    మిస్సన్న గారూ,
    మీ ఉత్పలమాల చాలా బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. కంసు జంపంగ దేవకీ గర్భమందు
    పుట్టు బాలు, వ్రేపల్లె గొ౦పోవు వేళ
    యమున దారి నిచ్చెను గాచె యాదిశేషు
    డెల్ల సురలు హర్షించిరి,యిలను జనులు

    రిప్లయితొలగించండి
  10. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. పుట్టినబాలకృష్ణునకుపుట్టెడికష్టములెంచ?వింతయే|
    కట్టడులందుబుట్టితివి|కంసునిగానకతండ్రిచేతితో
    బట్టియు వెళ్ళగా యమునపాయలయందునదారిజూపగా
    చుట్టునునాగరాజుతగుచూపులరక్షణగూర్చె|దైవమా|

    రిప్లయితొలగించండి
  12. దారి నిచ్చి యేరు లేచె తాక నెంచ పాదముల్
    జోరు వాన హోరు బెంచ సోక నీడె శేషుడున్
    చేరె శౌరి యా యశోద చిన్న బాలకుండుగా
    పార వశ్య మంద జేయు బాలకృష్ణు లీలలున్!

    రిప్లయితొలగించండి
  13. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. పలుకనిబాలుడే|పడగబట్టినపామిడునీడజాడలో
    తొలకరిజల్లులాయమునతొందరలేకనుజిల్కరించగా|
    కలుషితభావబంధమునకంసుడుగూర్చగ?నాన్నచేతిలో
    నిలచినచిన్నికృష్ణ|ననునిత్యముభక్తికిచిన్నియత్నమా|

    రిప్లయితొలగించండి
  15. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. యమునకు వెరవని హరిగని
    యమునయె తా దారినిచ్చె నటగనుమా సా
    యమునకు వసుదేవుండు ర
    యమునను మ్రొక్కుచును సాగె నా నిశిలోనన్.

    రిప్లయితొలగించండి
  17. కంసుని నాజ్ఞ మేరకు ను గం టికి నింపుగ నుండు వానినిన్
    కం సుని జావుకే మిగుల కారకు డయ్యెడు బాల కృష్ణు నిన్
    అం శము విష్ణువుం డయిన నావసు దేవుడు బేర్మితో మఱి న్
    సం శయ మేమియుం బడక కంసుని యొద్దకు వెళ్ళె నప్పుడున్

    రిప్లయితొలగించండి
  18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    ‘కంసుని యాజ్ఞ, కంసుని చావుకే’ అనండి. కొన్ని సవరణలకు లొంగని దోషాలున్నాయి. మరో సఫలప్రయత్నం చేయండి. స్వస్తి!

    రిప్లయితొలగించండి