రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ, వృత్తరచన రెండూ బాగున్నవి. అభినందనలు. ‘ఆనతి+ఇడంగ’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘వరదుం డానతి యిచ్చినంత...’ అనండి. ‘సౌఖ్యం’ టైపాటువల్ల ‘శౌఖ్యం’ అయింది. ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, ఇది మొదటి ప్రయతంలా లేదు. చక్కగా ధారాశుద్ధితో సాగింది. బాగుంది మీ పూరణ. అభినందనలు. ***** లక్ష్మీదేవి గారూ, మీకు వృత్తరచన కొట్టినపిండే కదా! చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
కురు సామ్రాజ్యపు రాజరాజు తన ఆక్రోశంబు జాటంగ, ధీ వరుడౌ కృష్ణుడు పాండుమధ్య ముని నేపధ్యంబు యొప్పంగ, తా నర నారాయణ మూర్తిగా నిలచి పన్నాగమ్ము లన్ ద్రుంచగన్ హరి యించున్ ఘన పాతకమ్ములను హత్యా ద్యూత చౌర్యమ్ములే కొరుప్రోలు రాధాకృష్ణ రావు
పరమేశున్ భజియించగా మనసు భావా వేశముల్ వీడుచో
రిప్లయితొలగించండిహరియించున్ ఘన పాతకమ్ములను , హత్యాద్యూత చౌర్యమ్ములే
పరిమార్చున్ కడదేరు నంత వరకున్ బాధించగా నుండవే
వరదుం డానతి డంగనెంత తడవున్ భాసించి శౌఖ్యం బిడన్
అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యభావం బాగుంది.
అవునా నేనింకా చాలా తప్పులు వస్తాయేమో అని భయపడుతున్నాను సోదరికి ధన్య వాదములు
రిప్లయితొలగించండిహరి పాదమ్ముల జేరు భక్తునకు స్నేహమ్మున్ నతండే సదా
రిప్లయితొలగించండిహరియించున్ ఘనపాతకమ్ములను,హత్యాద్యూతచౌర్యమ్ములే
ధరిలో కొల్లలు జేయదప్పుకొన నేదారుల్ వశంబౌ?సురా
సురులైనన్ దమ పాపకార్యములకో సుంకమ్ముజెల్లింపరే!!
పరమాత్ముండగు వాని నమ్మి గతిగా భావించుచో లీలగా
రిప్లయితొలగించండిహరియించున్ ఘనపాతకమ్ములను, హత్యాద్యూతచౌర్యమ్ములే
దరి రాకుండగ మానసమ్ములను భద్రమ్మౌ గతిన్ గాచు, శ్రీ
హరియే దక్క మరెవ్వరోయి భువిలోనైనన్ మరెచ్చోటనున్?
తొలిసారి ఈ ఛందస్సు లో పద్య ప్రయత్నం. తప్పులు మన్నించ ప్రార్ధన.
రిప్లయితొలగించండిరాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ, వృత్తరచన రెండూ బాగున్నవి. అభినందనలు.
‘ఆనతి+ఇడంగ’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘వరదుం డానతి యిచ్చినంత...’ అనండి. ‘సౌఖ్యం’ టైపాటువల్ల ‘శౌఖ్యం’ అయింది.
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
ఇది మొదటి ప్రయతంలా లేదు. చక్కగా ధారాశుద్ధితో సాగింది. బాగుంది మీ పూరణ. అభినందనలు.
*****
లక్ష్మీదేవి గారూ,
మీకు వృత్తరచన కొట్టినపిండే కదా! చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
గురువర్యులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండిగురువుగారు,
రిప్లయితొలగించండిధన్యురాలను.
హరిపూజల్ కడు నిష్టతో సతము శ్రద్ధాసక్తితో చేయగన్
రిప్లయితొలగించండిహరియించున్ ఘనపాతకమ్ములను, హత్యాద్యూత చౌర్యమ్ములే
చెఱుపుం దెచ్చును తప్పకుండ నిలలో చేకూఱు పాపమ్ములున్
ధరలో మంచిగ జీవితమ్ముగడపన్ తాపమ్ము తీరున్ సుమా!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ మత్తేభవృత్తం చేయితిరిగిన కవి రచనలా చాలా బాగున్నది. మంచి పూరణ. అభినందనలు.
పూజ్య గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండికరుణా సాగరు డార్త రక్షకుడు శ్రీ కాంతుండు సద్బుద్ధితో
రిప్లయితొలగించండిపరమారాదన భక్తి తత్పరతతో పాపాత్ములున్ గొల్చినన్
హరియించున్ ఘనపాతకమ్ములను, హత్యాద్యూతచౌర్యమ్ములే
ధరలో మూలము పాతకమ్ములకు గాదా మానవా తెల్సుకో.
కరి సంరక్షకుఁడార్త రక్షణ కళాకాంతుండు, సంసార సా
రిప్లయితొలగించండిగర దీనప్రజ నౌక, భక్తులకు తాఁ గల్పద్రుమంబౌట వేఁ
హరియించున్ ఘనపాతకమ్ములను, హత్యాద్యూతచౌర్యమ్ములే
మరకన్ జేయక నిత్యభక్తియుతుఁడై మంత్రార్చనల్ జేసినన్.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు
దొరలాజూతురు దొంగనైన జనులెంతోగౌరవంబిచ్చుచున్
రిప్లయితొలగించండిధరలో నన్నిటికన్న గొప్పదగునీ యర్ధంబునేగల్గినన్
హరియించున్ ఘన పాతకమ్ములను - హత్యాద్యూతచౌర్యంబులే
మురిపెంబౌగద తప్పులెన్నరిక నేమోసంబునేజేసినన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండివృత్తరచనలో మీరుకూడా చక్కని ప్రావీణ్యాన్ని సాధించారు. సంతోషం! మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘దొరలా’ అనడం వ్యావహారికం. ‘దొరగా’ అనండి.
ధన్యావాదములు మష్టారు ... అంతా మీచలువే
రిప్లయితొలగించండికురు సామ్రాజ్యపు రాజరాజు తన ఆక్రోశంబు జాటంగ, ధీ
రిప్లయితొలగించండివరుడౌ కృష్ణుడు పాండుమధ్య ముని నేపధ్యంబు యొప్పంగ, తా
నర నారాయణ మూర్తిగా నిలచి పన్నాగమ్ము లన్ ద్రుంచగన్
హరి యించున్ ఘన పాతకమ్ములను హత్యా ద్యూత చౌర్యమ్ములే
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
కొరుప్రోలు రాధాకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వితండవాదం చేస్తున్నట్టున్నానండీ;
రిప్లయితొలగించండివరరామాయణకావ్యకారణము గువ్వన్జంపుటౌనందురే
ధరణిన్ బాండవపత్నిబాధకు నిమిత్తమ్మౌనుగా జూదమే
అరవిందాక్షుని లీల చౌర్యమగుచో నాలింప నాగాధలన్
హరియించున్ ఘన పాతకమ్ములను హత్యాద్యూత చౌర్యమ్ములే
[నిన్న రాత్రి మొదలు పెడితే ఇప్పుడు పూర్తయింది]
ఊకదంపుడు రామకృష్ణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
ఈ అర్థాన్నే తెలిపే ఒక చాటుశ్లోకం ఉండాలి. ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రావడం లేదు.
‘ఊకదంపుడు’ రామకృష్ణ గారికి ధన్యవాదాలతో....
రిప్లయితొలగించండిసురవైరిన్ దశకంఠుఁ జంపెనఁట సుశ్లోకుండు రాముండు, చి
చ్చు రగిల్చెన్ గద ద్యూత మా భరతవంశ్యుల్ పోరు సేయంగ, మో
హ రహస్యమ్ములఁ దెల్పె గోపికల దేహభ్రాంతిఁ బోఁద్రోచి శ్రీ
హరియే చీరల దొంగిలించె, కథ లత్యంతమ్ము శ్రావ్యంబులై
హరియించున్ ఘనపాతకమ్ములను హత్యాద్యూతచౌర్యమ్ములే.
(రావణహత్యను వర్ణించిన రామాయణం, దుష్టసంహార సంగ్రామ కారణమైన ద్యూతాన్ని తెలిపిన భారతం, గోపికా వస్త్రాపహరణాన్ని తెలిపిన భాగవతం.. ఈ మూడు గ్రంథాల పఠనం పాపహరమని భావం.)
మాస్టరు గారూ! రామకృష్ణ గారూ ! మీరు చేసిన నిగూడార్థ పూరణ అమోఘము..
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
ప్రాతర్ద్యూత ప్రసంగేన
రిప్లయితొలగించండిమధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః
రాత్రౌ చోర ప్రసంగేన
కాలో గచ్ఛతి ధీమతామ్ ॥
మధ్యాహ్నం స్త్రీ - సీతాయాః చరితం మహత్ - రామాయణ ప్రసంగం
అందమైన పూరణలు చేసిన రామకృష్ణ గారికి , కంది శంకరయ్య గారికి అభినందనలు
డా. విష్ణునందన్ గారూ,
రిప్లయితొలగించండిమీ సౌహార్దానికి ధన్యవాదాలు.
ధరణీ సూన మహా పవిత్ర కథ మధ్యాహ్నంబునన్ మేలగున్
రిప్లయితొలగించండిధరణిన్ పాండవ దివ్యగాథ లనఘా తల్పం దగున్ వేకువన్
ధరణీనాథుని లీలలన్ నిశను సంధానింప సౌభాగ్యమౌ
‘హరియించున్ ఘనపాతకమ్ములను హత్యాద్యూతచౌర్యమ్ములే’
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహరినామమ్మును గ్రోలుచున్ పొలుపులన్ హత్యన్ సదా జేయుచున్
రిప్లయితొలగించండిదురితమ్మౌ ఘనరాజకీయనటనన్ ద్యూతమ్ములాడించుచున్
సరికానట్టివి రీతులన్ ప్రభుతలన్ చౌర్యమ్ము గావించగా...
హరియించున్ ఘన పాతకమ్ములను హత్యాద్యూతచౌర్యమ్ములే
పరులే మెచ్చిన ప్రీతివాక్యములనున్ వందించి వంచించుచున్
రిప్లయితొలగించండిసరియౌ రీతిని వక్రబుద్ధి గొనుచున్ సాధించి రాజ్యమ్మునున్
చరియించంగను రాజకీయ కలినిన్ చక్రమ్ము శంఖమ్ముతో
హరియించున్ ఘనపాతకమ్ములను హత్యాద్యూతచౌర్యమ్ములే
పరికించంగను రామగాథ వరమౌ ప్రత్యూష కాలమ్మునన్
రిప్లయితొలగించండిమరియున్ భారత పద్యముల్ మురియుచున్ మధ్యాహ్నమౌ వేళనున్
సరిగా మిత్రుడ! కృష్ణలీలలనహో సాయమ్మునన్ పాడగా
హరియించున్ ఘనపాతకమ్ములను హత్యాద్యూతచౌర్యమ్ములే