18, ఫిబ్రవరి 2015, బుధవారం

సమస్యా పూరణం - 1601 (భానుం డస్తాద్రిఁ గ్రుంకెఁ బద్మము విరిసెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భానుం డస్తాద్రిఁ గ్రుంకెఁ బద్మము విరిసెన్

26 కామెంట్‌లు:

  1. తానుగ నెఱ్ఱ గ మారుచు
    భానుం డ స్తం గతు డయె , బద్మము విరిసె
    న్గానగ చంద్రుని రాకను
    భానుడ ! మఱి చం ద్ర ! మీకు వందన శతముల్

    రిప్లయితొలగించండి
  2. కానగ చంద్రుని రాకను
    భానుం డస్తంగతుఁ డయెఁ,బద్మము విరిసెన్
    సూనుని కిరణము సోకగ
    మేనులు పులకించి మురుసి మేలని ముదమున్

    రిప్లయితొలగించండి
  3. ఏణాంకుని దిలకించగ
    భానుండస్తంగతుడయె , బద్మము విరిసెన్
    జానుగ కాసారమునన్
    స్యోనము నొందుచు చదలున సూనుని గనుచున్!!!

    రిప్లయితొలగించండి
  4. ఏనుగువలె నభిమన్యుడు
    సైనికులను వ్యూహమందు చంపుచునుండన్
    హీనులు గూల్చగ మాటుగ
    భానుం డస్తంగతుఁ డయెఁ " బద్మము " విరిసెన్.

    పద్మము = పద్మవ్యూహము.

    రిప్లయితొలగించండి
  5. భానుని వలె నభిమన్యుడు
    సైనికులను " వ్యూహ "మందు చంపుచునుండన్
    హీనులు గూల్చగ మాటుగ
    భానుం డస్తంగతుఁ డయెఁ " బద్మము " విరిసెన్.

    పద్మము = పద్మవ్యూహము.

    రిప్లయితొలగించండి
  6. కానగ సూర్యగ్రహణము
    భానుండస్తంగతుడయె,పద్మము విరిసె,
    న్నానక గ్రహణము వీడగ
    పూనిక దినమణిని గాంచి పొందెను ప్రేమన్

    రిప్లయితొలగించండి
  7. ధ్యానమునకు గుడికేగితి
    భానుండస్తంగతుఁడయెఁ, బద్మము విరిసెన్
    దానవవైరి చరణముల
    గానము వినిపించె నచట కమనీయముగన్

    రిప్లయితొలగించండి
  8. పోచిరాజు సుబ్బారావు గారూ,
    పద్యం వఱకు బాగున్నది. కాని పూరణ సందిగ్ధంగా ఉంది. చంద్రుని గని పద్మం వికసించడం విరుద్ధం కదా!
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్మవ్యూహ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. ఆనాడు కుంతి వలపుల
    గానమ్మునుజేసినంత కమలాప్తునికై
    సూనుండుదయించ హృదయ
    భానుండస్తంగతుఁడయెఁ,బద్మము విరిసెన్!!!

    రిప్లయితొలగించండి
  11. మేనెలనెన్నిక ఫలితము
    గానగ మరి యద్భుతముగ గనుపించె కదా!
    యౌనఁట సాయంకాలము
    భానుండస్తంగతుఁడయె పద్మము విరిసెన్.

    మేనెల 16 వ తేదీ సాయంకాల సమయములో ( సూర్యాస్తమయ వేళ)ఫలితాలు వెలువడి పద్మము ( బీజేపీ) వికసించిందని.

    రిప్లయితొలగించండి
  12. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. చేతుల్లో సూర్యుని బంధించినట్లుగా ఛాయచిత్రములను చూసిన స్ఫూర్తితో:

    తానొక చిత్రము జూపుదు
    గానగ రండనుచు హస్త గహ్వర మందున్
    భానుని మూయ నుదయమే
    భానుండస్తగతుఁడయెఁ బద్మము విరిసెన్!

    రిప్లయితొలగించండి
  14. అయ్యెన్, ఆయెన్ తప్ప అయె, అయెన్ పదాలు లేవని ఒకసారి చర్చజరిగి నిర్ణయమైనట్టు గుర్తుంది.

    రిప్లయితొలగించండి
  15. మల్లెలవారిపూరణలు
    మానిత యుద్యానమ్మున
    కానగ పద్మము వలె నగు కమ్రపు ఫౌంటెన్
    వే నుతులిడరే జనులిటు
    భానుం డస్తంగతుఁ డయెఁ,బద్మము విరిసెన్
    2.మానిని యౌ పద్మాక్షిని
    తానటు పెండ్లాడె రాత్రి తన్వియు వెలుగున్
    కానగ వేదిక పైనను
    భానుం డస్తంగతుఁ డయెఁ,బద్మము విరిసెన్

    రిప్లయితొలగించండి
  16. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    కానబడక పశ్చిమమున
    భానుం డస్తంగతుఁ డయెఁ,బద్మము విరిసెన్
    తానింక కాంతి. యనగా
    పోనాడెను తాను కాంతి పుంజము లెల్లన్

    రిప్లయితొలగించండి

  17. మానిత దానవ వంశపు
    భానుం డస్తంగతుఁ డయెఁ,బద్మము విరిసెన్
    వానరసైన్య తటాకము
    లోన దళములన్ని విడెను లోకులు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  18. శ్రీ శంకరయ్య గారికి సాదర సాధువాదములతో -
    ఈ నాటి సమస్యకు- భానుడు మారుగా స్వర్భానుడు ( అంటే రాహువు ) అని చేర్చి పూరణ చేసే అవకాశముండేది కానీ , సమస్యాగతమైన ' అయెన్ ' వలన ఆ ప్రయత్నం చేయలేదు.
    శ్రీమతి లక్ష్మీ దేవి గారు చెప్పింది వాస్తవం. ' లాక్షణికమైన ' పద్యం వ్రాయాలంటే నిర్ద్వంద్వం గా ' అయెన్ ' శబ్దం పరిహరింపక తప్పదు. అయ్యెన్ ఆయెన్ రూపాలను గుర్తెరగడం భాష మీద పట్టు సాధించదలచిన విషయఙ్ఞులకు అత్యావశ్యకం కనుక మీరు కూడా యీ విషయాన్ని ఔత్సాహిక కవి బృందంలో విరివిగా ప్రచారం చేసి యీ వేదికకు ' వీలయినంత ' నిర్దోషోపపత్తి కలిగింతురని ఆశంస !

    రిప్లయితొలగించండి
  19. తానుగ నెఱ్ఱ గ మారుచు
    భానుం డ స్తం గతు డయె , బద్మము విరిసె
    న్గానగ సూర్యుని రాకను
    భానుడ ! మఱియందు కొనుము వందన శతముల్

    రిప్లయితొలగించండి
  20. జ్ఞానమువిరియని బాల్యము
    భానుడు,పద్మలకుజరిగెబాల్యవివాహం
    మానకబడియందుండగ?
    భానుండస్తంగతుడయె|బద్మమువిరిసెన్

    రిప్లయితొలగించండి
  21. లక్ష్మీదేవి గారూ,
    డా. విష్ణునందన్ గారూ,
    మీరు చెప్పిందే సరి! గతంలో ఈవిషయమై పండిత నేమాని వారు వివరంగా తెలిపారు కూడా! మందబుద్ధిని. మరచిపోయాను. తెలియజేసినందుకు ధన్యవాదాలు. మిత్రుల పూరణలనన్నీ సవరించలేను కాని సమస్యను క్రిందివిధంగా సవరిస్తున్నాను.
    “భానుం డస్తాద్రిఁ గ్రుంకెఁ బద్మము విరిసెన్”
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు

    రిప్లయితొలగించండి
  22. ఆనందముగా సంధ్యా
    గానంబు సలుపగనెంచి కాంతుడు రాగా
    దీనంబు విడె సతి ముఖము;
    భానుం డస్తాద్రిఁ గ్రుంకెఁ బద్మము విరిసెన్

    రిప్లయితొలగించండి
  23. సమస్యను సవరించిన తర్వాతి పూరణ;
    పూనిక సాయం వేళల
    భానుండస్తాద్రి గ్రుంకె,పద్మము విరిసెన్
    మానక తూరుపుదిక్కున
    తానై యెదురేగి నిలిచె ధన్యత కొరకై

    రిప్లయితొలగించండి
  24. మే నెలలో బోస్టనులో
    భానుం డస్తాద్రిఁ గ్రుంకెఁ ; బద్మము విరిసెన్
    భానుండుదయించ మురిసి
    మే నెలలో కొలనునందు మిర్జాపూర్లో

    రిప్లయితొలగించండి
  25. సోనియ! సాయంసమయము
    జాణలు కూడుచు తెలుపగ జగడపు ఫలముల్,
    వీనుల విందుగ వినుచును
    భానుం డస్తాద్రిఁ గ్రుంకెఁ, బద్మము విరిసెన్

    రిప్లయితొలగించండి