కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజంతా ప్రయాణంలో ఉండి వెంట వెంట స్పందించలేక పోయాను. మన్నించండి. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. తప్పని పరిస్థితిలో అన్యభాషాపదప్రయోగం తప్పుకాదులెండి.. పాలవ్యాను దుష్టసమాసం కాదు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణలో ‘దున్నపోతు వలన’ అన్నది అర్థం కాలేదు. ‘దుగ్ధధారఁ గురిసె దున్నపోతుల యజ|మానురాలు కుండలోనఁ దెచ్చి’ అందామా? ***** జిలేబీ గారూ, _/\_ ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. క్రమాలంకార పూరణలో ‘భోజరాజీయం’లో ‘జీ’ని హ్రస్వం చేశారు. ‘పులికిఁ జిక్కి యావు భోజరాజీయాన...’ అనండి. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘కోవెల + అందు = కోవెలయందు’ అవుతుంది. సంధి లేదు. ‘అమ్మవారి దేవళమ్ములోన’ అనండి ***** గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘సాజమగును + ఇల’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సాజమైన దిల...’ అనండి. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, ఉత్సాహంగా మీరు వ్రాసిన పూరణ బాగున్నది. అభినందనలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాలవ్యానుకడ్డుపడె దున్నపోతులు
రిప్లయితొలగించండివానిగ్రుద్ది తిరుగబడెను వ్యాను
దుగ్ధధార గురిసె దున్నపోతులపైన
పాలు మొత్తమయ్యె నేలపాలు
(వ్యాను కి తెలుగుపదం తట్టలేదు ... తపనిసరియై ఆంగ్లపదం వాడాను ...ఫాలవ్యాను దుష్టసమాసం అవుతుందేమొ)
ఆవు పచ్చ గడ్డి నాహరించు కతన
రిప్లయితొలగించండిదుగ్ధ ధార కురిసె, దున్న పోతు
ఆల మంద దరిమి పార జేసెను చేన
మేయ సాగె దాను మెతక పరక
పరమ శివుని కంత పాలాభి షేకంబు
రిప్లయితొలగించండిభక్తి మీర గొలిచి ముక్తి నొంద
దుగ్ధ ధార గురిసె దున్నపోతు వలన
ముగ్ధ చేతి నున్న ముంత పాలు
పాలు తెలుగు పదము, వ్యాను ఆంగ్ల పదము - దుష్ట సమాసం కాదులెండి సూర్యనారాయణ గారూ.
రిప్లయితొలగించండిసత్యనారాయణ రెడ్డి గారు,
రిప్లయితొలగించండితెలుగు కి సంస్కృతం మాత్రమె 'దుష్టుడు' !!
పాలవ్యాను మ్లేష్ట సమాసమను కుంటా !
జేకే !
జిలేబి
రిప్లయితొలగించండియాదవుల తిలక సమోల్లాసమునకు
ద్వారక నించి ఏగు దెంచె సముడు
యాదవుల మధ్య నరేంద్రుని గాంచి
సంతసమున దుగ్ధధార గురిసె దున్నపోతు !!
జిలేబి
బర్రె నెక్కి యొకడు మర్రె కొమ్మ నరక
రిప్లయితొలగించండిదుగ్ధధారఁ గురిసె, దున్నపోతు
తోక పట్టి ఈత రాక భయము తోను
ఏరు దాటి యొకడు చేరె నొడ్డు
పోతులూరి బ్రహ్మ పుణ్య వాక్కు వలన
రిప్లయితొలగించండివేపచెట్టు కార్చె వింత పాలు,
తెల్లకాకి గుంపు లెల్లెడ గనుపించె,
దుగ్ధధార గురిసె దున్నపోతు!
గమిడి గేదె ఈని కాపు గృహములోన
రిప్లయితొలగించండిదుగ్ధ దారఁ గురిసె, దున్నపోతు
పుట్ట విడిచి నారు పూజించి గుడిలోన
నమ్మ వారి కోవెలందు తిరుగ
పిసినిగొట్టు బట్టి బెట్టుగా బెదిరించి
రిప్లయితొలగించండికుందనమ్ము దొంగ కొల్లగొట్టి
సంభ్రమించి పలికె సాటివారల తోడ
"దుగ్ధధార గురిసె దున్నపోతు ! "
మల్లెలవారి పూరణలు
రిప్లయితొలగించండిదూడ పుట్టకున్న దుగ్ధమే పుట్టదు
దున్నపోతు లేక దూడ లేదు
ఇదియె సాజమగును యిల, కారణ౦ బౌట
దుగ్ధధార గురిసె దున్నపోతు
2.పెయ్య తాను డాణ పెంపారగా తిని
దుగ్ధధార గురిసె- దున్నపోతు
తాను దున్నభూమి ధాటిగా పంటలన్
కలుగ కారణమ్ము కలిమి కలిగె
అర్జునునకు స్పర్ధ యగు కర్ణు గని కుంతి
రిప్లయితొలగించండిస్తన యుగమ్ము దుగ్ధ ధార గురిసె,
దున్నపోతు వోలె తొగదాయ తనుగూడు
చిన్ననాటి ఘటన చెలగ మదిని
క్రమాలంకారం లో
రిప్లయితొలగించండి1భోజరాజియమున పులికి చిక్కిన యావు
చేసెనేమి?దూడ చెంత జేరి,
2తరుమ రాళ్ళ వాన,తలపని దెవ్వరో?
1దుగ్ధ ధార కురిసె;2దున్నపోతు
1భోజరాజీయం లోని ఆవు-పులి,కధ.
2దున్నపోతు మీద రాళ్ళ వాన సామెత.
ఉత్సాహవృత్తము
రిప్లయితొలగించండి----------
నీడకంపు-ఆవుఈనె|నిత్యమట్లుజేయకే
కోడెదూడబుట్టెగాన| గొప్పదగునుజూడగా
దూడ| దుగ్ధధారగురిసె|"దున్నపోతులుండగా?
కాడిగట్టకావు,నిపుడెకాస్తదయనుజూడుమా."
ఆవుఈనినదిపాలుధారవస్తూవున్నదిఅన్నదినాపూరణ
పండుకొనగ శ్రీనివాసుండు పుట్టలో
రిప్లయితొలగించండినిలువ యావు పైననేమి జరిగె
తెలియదనెద వేమి తెలుసుకో గాడిద !
దుగ్ధధారఁ గురిసె, దున్నపోతు !
తాజా పూరణ మరియొకటి;
రిప్లయితొలగించండి"దుగ్ధధార గురిసె దున్నపో"తని జెప్ప
చెంబు తేగ పనిచె చెనటి యొకడు
ముందు వెనుక గనని మూర్ఖుల తమిదీర్ప
నింక నెవరి తరము శంక రార్య!
దున్న పోతు నీనె నిన్ననే మాబర్రె
రిప్లయితొలగించండిచూడ బోతి నేను దూడ కడకు
పొదుగు నొదిగిన దల కదిలించ నానోట
దుగ్ధ ధారఁ గురిసె దున్నపోతు
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈరోజంతా ప్రయాణంలో ఉండి వెంట వెంట స్పందించలేక పోయాను. మన్నించండి.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తప్పని పరిస్థితిలో అన్యభాషాపదప్రయోగం తప్పుకాదులెండి.. పాలవ్యాను దుష్టసమాసం కాదు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణలో ‘దున్నపోతు వలన’ అన్నది అర్థం కాలేదు. ‘దుగ్ధధారఁ గురిసె దున్నపోతుల యజ|మానురాలు కుండలోనఁ దెచ్చి’ అందామా?
*****
జిలేబీ గారూ,
_/\_
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
క్రమాలంకార పూరణలో ‘భోజరాజీయం’లో ‘జీ’ని హ్రస్వం చేశారు. ‘పులికిఁ జిక్కి యావు భోజరాజీయాన...’ అనండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కోవెల + అందు = కోవెలయందు’ అవుతుంది. సంధి లేదు. ‘అమ్మవారి దేవళమ్ములోన’ అనండి
*****
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘సాజమగును + ఇల’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సాజమైన దిల...’ అనండి.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
ఉత్సాహంగా మీరు వ్రాసిన పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.