19, ఫిబ్రవరి 2015, గురువారం

దత్తపది - 68 (మబ్బు-వాన-నది-వరద)

కవిమిత్రులారా!
మబ్బు - వాన - నది - వరద
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. రమ్యముగ జెప్పు చుంటిని రాజరాజ !
    రావ లసినట్టి భాగము న్నీవ యీయ
    కుండు నెడలన పాండవ కోప ము లవి
    మబ్బు లగుచును వానగా మారి యవియ
    వరద లైపొంగి బొరలుచు పారు నదికి
    నిన్ను ముంతురా నదిలోన నిజము సుమ్ము

    రిప్లయితొలగించండి
  2. మబ్బు లేనివాన మయసభన్ గురిసెనో
    నదిగ మారి రాజు మదిన నిలిచె
    వలువలొలచునాడు వరదలై పారగా
    సిద్ధమయ్యె విత్తు యుద్ధమునకు !!!

    రిప్లయితొలగించండి
  3. గీత వింటివా? నననమ్మి భీతి వీడ
    సర్వ మబ్బురమ్ముగ నీకు సంతపడును
    విజయ మనునది నిను గూడు ,వేగిరమ్మె
    కురువర! దగరు జేగొని కెరలు మయ్య!

    రిప్లయితొలగించండి
  4. మల్లెలవారి పూరణలు
    ఖా౦డవమ్మును నగ్నియే కాల్చుచు౦డ
    వానకురిపించె ని౦ద్రు౦దు వరదలగుచు
    వారి పారంగ నది గాను పార్ధు డపుడు
    బాణతతి నెల్ల మబ్బుగా పరచె నింగి
    2.బాణతతి వాన కురిపింప పార్ధ సుతుడు
    వరద లగుచును రుదిరము పారె నదిగ
    మబ్బు వచ్చెను కౌరవ నిబ్బరముకు
    కూడ గట్టుచు మోసాన గూల్చి రతని

    రిప్లయితొలగించండి
  5. మబ్బులున్న?వాన,వరదమాయమౌన?దిగులుచేన్
    గబ్బుగాద?దార్థరాష్ట్రగర్యమున్నమబ్బునన్
    నిబ్బరానపాండుసుతులనిందవరదలుంచుటా?
    అబ్బ|కృష్ణరాయభారమనగవింతచుల్కనా?

    రిప్లయితొలగించండి
  6. వికర్ణుడు సుయోధనునితో:-
    కురు"వర ద"నుజులైనను కోరుకొనరు
    వదినను వివస్త్ర జేయుట - వలదు - నీకు
    పాప"మబ్బు" - దా"వాన"లంబై దహించు
    నింకనై"న ది"ద్దుకొనుమీ బింకమేల

    రిప్లయితొలగించండి
  7. యదువర దయ తోపాండవ
    ముదితకు పరువాన మానమును గాచితి వా
    నదిసుతుని పైన దుమికిన
    విధ మబ్బుర పరచ నతులు భీష్ముడు జేసెన్

    రిప్లయితొలగించండి
  8. ఎటులొ సుగుణమబ్బుననుచునూరకుంటి
    పాండవానలమును మ్రింగ పాడికాద
    నంగ నదియునుఁ వినవైతి వకట! నేటి
    కే వరద హస్తమేరీతి నేగుదెంచు?

    రిప్లయితొలగించండి
  9. ధృతరాష్ట్రుఁడు యుద్ధసన్నాహాలలో ఉన్న పుత్రునిఁ దలచి వగచుట..

    రిప్లయితొలగించండి
  10. చివరి ఘడియలో కురురాజు చేరి కృష్ణు
    వరద ! దరిజేర్చు మమ్ముల పాండ వాన
    లమ్ము బారి నుం డియుమఱి యిమ్ము గాను
    బుణ్య మబ్బును నీకుగా బుణ్య పురుష !
    వేరు మార్గమే యనునది వెదుక లేము

    రిప్లయితొలగించండి
  11. గురుదేవులకు వందనములు.
    మొదటి పాదంలోని టైపాటు సవరణతో :
    గీత వింటివా? ననునమ్మి భీతి వీడ
    సర్వ మబ్బురమ్ముగ నీకు సంతపడును
    విజయ మనునది నిను గూడు ,వేగిరమ్మె
    కురువర! దగరు జేగొని కెరలు మయ్య!

    రిప్లయితొలగించండి
  12. గురువుగారు వ్యక్తిగత పనులవల్ల అందుబాటులో ఉండనని పరస్పర దోషవిశ్లేషన జేసికొనమని తెలియజేశారు.

    రిప్లయితొలగించండి
  13. నిలువగలవా నరునిముందు కలహమునను
    విజయమబ్బుట తధ్యము విజయునకని
    కాన దిక్కులేని మృతిని కాంచకయ్య
    భూవర దహించకు కులము మూర్ఖతవిడు

    రిప్లయితొలగించండి
  14. రూడిగ పాం డవానలము బూడిద జేయక నుండున ట్లుగా
    చూడుము సూనులన్ వరద ! వేడుచు నుంటిని బుణ్య మబ్బుతన్
    వేడగ నోపవే ? మనది వీడగ రానటు వంటిబం ధమౌ
    వేడుదు నింతగా మఱి ని గోడును నాయది యాలకిం చుమా !

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న రోజంతా ప్రయాణంలో ఉండి మీ పూరణలను సమీక్షించే అవకాశం దొరకలేదు. మన్నించండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీ పూరణ చదువుతుంటే "చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పొంగె నీ ప్రేమ" అన్న పాట గుర్తుకు వస్తున్నది.
    మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు. కాని అటువంటి సన్నివేశం భారతంలో ఉన్నట్టు లేదు. మానధనుడైన దుర్యోధనుడు అలా అంటాడా?
    మూడవ పూరణగా వౄత్తరచన బాగున్నది.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    దత్తపదాలను అన్యార్థంలో (మొదటగా) ప్రయోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    "నను నమ్మి"... టైపాటు వల్ల "నననమ్మి" అయినట్టుంది.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ విశేష పద్యం బాగున్నది. అభినందనలు.
    టైపాట్లు ఎక్కువగా ఉన్నవి.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణను ఏదైనా దోషముంటే తొలగించారా? సరిచేసి మళ్ళీ ప్రకటించలే దెందుకు?
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. గురువుగారు,
    వాక్యనిర్మాణం సరిగ్గా లేదనిపించి తిరుగవ్రాసినాను.
    ఎనిమిదవపూరణ నాదే. గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  17. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటిపాదంలో యతి తప్పింది. ‘ఎటులొ సుగుణ మబ్బు ననుచు నెంచి యుంటి’ అనండి (డా. విష్ణునందన్ గారికి ధన్యవాదాలతో...)
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీరు వ్రాసిన ఉత్పలమాల మూడు పాదాల్లో ప్రాసయతి వేశారు. వృత్తాలలో ప్రాసయతి నియమం లేదు. మీ పద్యానికి నా సవరణ...
    పోడిమి పాండవానలము బూడిద జేయక నుండున ట్లుగా
    చూడుము సూనులన్ వరద ! చొక్కుచు నుంటిని బుణ్య మబ్బుతన్
    వేడగ నోపవే ? మనది వీడగ రానటు వంటి బంధమౌ
    వేడుదు నింతగా సుతుల పేర్మిని గోరితి నాలకించుమా!
    (డా.విష్ణునందన్ గారికి ధన్యవాదాలతో...)

    రిప్లయితొలగించండి