పూజ్యగురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. గరికి పాటి నరసింహా రావుగారు వివేకానందనగరు వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భాగవత ప్రవచనం చేస్తున్నారు.వారి గూర్చి మనము వ్రాసిన పద్యములను నిన్న స్వయముగా వారి ఫొటో తో సహా అందజేశాను. శంకరాభరణం గురించి తెలియజేశాను. ఈరొజు ముగింపు. వీలైతే డా. విష్ణు నందన్ గారు వ్రాసిన పద్యములను ఒక మంచి గాయకునితో పాడించాలని ప్రయత్నిస్తున్నాను.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది.అభినందనలు. ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది.అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, చాలా సంతోషకరమైన విషయం చెప్పారు. ధన్యవాదాలు. ఈ విషయం నిన్న చెప్పి ఉంటే ఆ కార్యక్రమానికి నేను తప్పక వచ్చేవాణ్ణి.
సందేహం, తెలుగు కవి మిత్రులెవరైనా క్రింది ప్రశ్నకి వారి ప్రాంతం లో వాడే మాట ఏమిటో చెప్పగలరు. మనం ఏ ప్యాంటు బట్ట కైనా షర్టు బట్ట కైనా ఉల్టా-సీదా, లోపలివైపు-బయటివైపు, అనటం కద్దు. కానీ దానికి ఒక తెలుగు పదం ఉన్నట్లు గుర్తు. కానీ అది ఏమిటో తెలియరావటం లేదు. చెప్పగలరు. ధన్యవాదాలతో, చంద్రశేఖర్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. రెండవ పద్యంలో ‘చెలగేడి’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘కస్తూరి’ అన్నచోట గణదోషం. అక్కడ ‘చెలగెడిది సారకస్తురి’ అనండి. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** వ.రా.స. గారూ, మీ పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.
ఇలలో పూవులయందు క
రిప్లయితొలగించండిమలమును మించిన కుసుమము మనకగు పడదీ
జలజపు సౌందర్యంబె య
మల మది రంజింపఁజేయు మన మనములనే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొలనున నిండిన కలువలు
రిప్లయితొలగించండినెలరాజు నుగాంచి నంత నెయ్యపు కులుకున్
చెలిమిగ తనరుచు విరియ వి
మలమది రంజింపఁ జేయు మనమనములనే
జలజల పారే నిర్మల
రిప్లయితొలగించండిసెలయేర్లకు సునిలయమది,సేదలు దీర్చే
లలిత సువర్ణ హరితకో
మలమది, రంజింపఁజేయు మన మనములనే
తెలవారగ తూర్పుదెసన్
రిప్లయితొలగించండితిలకించగ వెలుగుఱేని తెఱగున దొర్వున్
చెలువముగా విరబూయు క
మలమది రంజింపజేయు మన మనములనే !!!
పూజ్యగురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. గరికి పాటి నరసింహా రావుగారు వివేకానందనగరు వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భాగవత ప్రవచనం చేస్తున్నారు.వారి గూర్చి మనము వ్రాసిన పద్యములను నిన్న స్వయముగా వారి ఫొటో తో సహా అందజేశాను. శంకరాభరణం గురించి తెలియజేశాను. ఈరొజు ముగింపు. వీలైతే డా. విష్ణు నందన్ గారు వ్రాసిన పద్యములను ఒక మంచి గాయకునితో పాడించాలని ప్రయత్నిస్తున్నాను.
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది.అభినందనలు.
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది.అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
చాలా సంతోషకరమైన విషయం చెప్పారు. ధన్యవాదాలు. ఈ విషయం నిన్న చెప్పి ఉంటే ఆ కార్యక్రమానికి నేను తప్పక వచ్చేవాణ్ణి.
సందేహం, తెలుగు కవి మిత్రులెవరైనా క్రింది ప్రశ్నకి వారి ప్రాంతం లో వాడే మాట ఏమిటో చెప్పగలరు. మనం ఏ ప్యాంటు బట్ట కైనా షర్టు బట్ట కైనా ఉల్టా-సీదా, లోపలివైపు-బయటివైపు, అనటం కద్దు. కానీ దానికి ఒక తెలుగు పదం ఉన్నట్లు గుర్తు. కానీ అది ఏమిటో తెలియరావటం లేదు. చెప్పగలరు.
రిప్లయితొలగించండిధన్యవాదాలతో,
చంద్రశేఖర్
కలుముల జవరాలి పతిని
రిప్లయితొలగించండితలచిన ప్రతిదినమునందు తఱుగని భక్తిన్
వలరాజు తండ్రి పాద క
మలమది రంజింపజేయు మనమనములనే
మనతెలుగు గార్కి - ఇరువైపుల అంటే సరిపోదా?
రిప్లయితొలగించండివిలువగుకిరణములుంచెడి
రిప్లయితొలగించండివెలుగులరాయడి-ప్రియసఖివికసించుగదా|
అలుగునురాత్రిళ్ళందు|క
మల మదిరంజింపజేయు మన మనములనే|
అలుపెరుగకపనిజేయ?శ్ర
మల-మదిరంజింపజేయు|మనమనములనే
తెలియకసోమరితనమే
విలువలునశియింపజేయు|విజ్ఞతలుడుగున్|
నమస్కారములు
రిప్లయితొలగించండిమనతెలుగు చంద్ర శేఖర్ గారికి
ఉల్టా సీదా అన్నపదానికి మనం " తిరగా , మరగా ." అంటా మనుకుంటాను .
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండితిర్లమర్ల : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి): అవ్య. లోభాగము పైభాగముగ, పైభాగము లోపలి భాగముగ అగుట.
తిర్లమర్ల : మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) లోభాగము పై భాగముగా, పై భాగము లోభాగముగా తొడుగుట. [శ్రీకాకుళం]
అతడు చొక్కా తిర్లమర్ల తొడిగినాడు.
తిర్లమర్ల : నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి): క్రియా విశేషణం : చొక్కా లోభాగం పైభాగంగా, పైభాగం లోభాగంగా; చూ. తిరుగలమరుగల
రాజేశ్వరి అక్కయ్యగారూ - మేము తిరగ - బోర్ల అంటాము.
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కలియుగ దైవము తానటు
రిప్లయితొలగించండివెలసెను కొండల నడుమన వేంకట గిరిపై,
విలసిత కోవెల మన తిరు
మల ,మది రంజింప జేయు మన మన ములనే
కొరుప్రోలు రాధా కృష్ణ రావు 28/02/15
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచెలుఁడిడ పుక్కిన యటుకులఁ
రిప్లయితొలగించండిగలిమిని బదులుగనొసంగి కాచెడు కరుణా
నిలయుని మనోజ సుమ పరి
మల మది రంజింప జేయు మన మనములనే
అల నారు రేకులున్న క
రిప్లయితొలగించండిమలమున కర్ణిక నడుమ నమల యోనిన్ కుం
డలి యను శక్తిని గన శ్యా
మల మది రంజింపఁజేయు మన మనములనే.
చంద్రశేఖరా! అది గురువుగారన్నట్లు తిరగా మరగా కానీ తారుమారు కానీ కదా?
రిప్లయితొలగించండిమల్లెలసోమనాథశాస్ర్తిగారిపూరణం
రిప్లయితొలగించండి----------చెలగెడిసౌందర్యమదియు
పలుగతినందంబుగనుభావ్యంబగునా
అలమనమరిననుఓకో
మలమదిరంజింపజేయుమనమనములనే
వెలుగునుకస్తూరిమృగమున
పలుగతిచెమటలువిడువగపడయమెదానన్
చెలగేడిసౌరకస్తూరి
మలమదిరంజింపజేయుమనమనమనములనే|
సోదర శేఖరా ! ఉన్నట్టుండి అందరి మెదడుకు పదును పెట్టారు కదా ?
రిప్లయితొలగించండిఅవునూ ఈమధ్య మీ పద్యాలు అలుక వహించా ఎందుకు ?
జలమును కొంతగ జేరిచి
రిప్లయితొలగించండితులసీ దళములను, గొల్చి తోయజ నేత్రున్
తలచుచు త్రాగిన చో ని
ర్మల మది రంజింపఁజేయు మన మనములనే.
ఆర్యా ! దర్జీ బట్టలు కుట్టడానికి బట్టలు ఇస్తే బట్ట కొంచెం తక్కువైనా " పెద్ద పన్నా " లేక "డబల్ పన్నా " సరిపోతుంది అంటాడు...ఆ పదం అదేనంటారా.....
రిప్లయితొలగించండిపాలకడలి నుండి వెలయు
రిప్లయితొలగించండిజలజను అబ్బురమున గను జనులు పలికె హా!
కలయా నిజమా ఏమి క
మల మది రంజింపఁజేయు మన మనములనే
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పద్యంలో ‘చెలగేడి’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘కస్తూరి’ అన్నచోట గణదోషం. అక్కడ ‘చెలగెడిది సారకస్తురి’ అనండి.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వ.రా.స. గారూ,
మీ పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందరికీ ధన్యవాదాలు. మనసుకి తీరిక దొరకటం లేదు అక్కయ్య గారూ. మన నన్నయ్య తిక్కన పోతన వంటి మహాకవులు యెంత తపస్సంపన్నులో అర్థమవుతోంది. ఏకాగ్రత ధారణా రెండూ సన్నగిల్లుతున్నాయి.
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ - మీరు అడిగిన పదము 'తాఱు మాఱు' అనుకుంటాను.
రిప్లయితొలగించండికలియుగమున తిరువణ్ణా
రిప్లయితొలగించండిమల మది రంజింపఁజేయు, మన మనములనే
తలచిన చాలట ముక్తికి...
పిలచిన పలుకును రమణుడు ప్రియమగు రీతిన్
"దర్శనాత్ అభ్రసదసి
జననాత్ కమలాలయే
కాశ్యంతు మరణాన్ ముక్తిః
స్మరణాత్ అరుణాచలే"
తలలను మొలలను కలుపుచు
రిప్లయితొలగించండిబలుపుగ నార్జించి దాచు భద్రపు తెరగుల్
తెలియగ మన ధనముల శ్యా
మల మది రంజింపఁజేయు మన మనములనే