7, ఫిబ్రవరి 2015, శనివారం

నిషిద్ధాక్షరి - 32

కవిమిత్రులారా,
అంశం- వాస్తుదోషము.
నిషిద్ధాక్షరములు - శ-ష-స.
ఛందస్సు - ఆటవెలఁది.

19 కామెంట్‌లు:

 1. ప్రజల ధనము తోడ భవనాలు కట్టించి
  కట్టడమున లుక్కు కాంచి పిదప
  మూఢనమ్మకముల మూర్ఖత్వ ములతోడ
  ప్రజల డబ్బు బుగ్గి పాలుచేయు

  రిప్లయితొలగించండి
 2. భవన కట్ట డమున భవ్యమ గువిధము
  నమలు జేయు నెడల యరమ రికలు
  లేక జీవ నమ్ము బాగుగ గడచును
  గట్టి మేలు కూడ కట్ట డమున

  రిప్లయితొలగించండి
 3. రమ్య హర్మ్య మందు రారాజు వలెనుండ
  కోరు కొనుచు నొకడు భూరి గీము
  పండి తుండు పలికె పదిలమ్ము గాలేదు
  నమ్మి యుంటి వేని వమ్ము గాదు

  రిప్లయితొలగించండి
 4. ఇల్లు కట్ట వలయు ఇంగితమ్ము గలిగి
  కాంతి గాలి జొచ్చు పొంత లుంచి
  ఇంటి మురికి దార్ల ఇబ్బంది యుండక
  పొంక తోడ నితర వంక లేల

  రిప్లయితొలగించండి
 5. కట్టడముల లోన కలవులోపములంచు
  మార్పు చేర్పులంచు మదిని చెఱుచు
  క్రొత్త నిపుణు లిపుడు కూడినా రిలలోన
  నమ్మి నట్టివారి నగదు గుల్ల

  రిప్లయితొలగించండి
 6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 7. నరుని బ్రదుకు గడచు నలువ రాతను బట్టి
  యింటి తీరు పాల దెన్న కొద్దె
  యనెడు పెద్ద వారి యింపగు వాక్కుల
  విని గ్రహించి పోవ తనరు మేలు.

  రిప్లయితొలగించండి
 8. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. పెరగ రాని వైపు పెంచినారు గృహము
  నియమమేది లెక్క చేయమనుచు
  మరల దాని నిపుడు మార్చదలచినారు
  కలతలేవొ తమకు కలిగెననుచు

  రిప్లయితొలగించండి
 10. పరులుజెప్పుమాట ప్రామాణ్యమనియెంచి
  ఖర్చుబెట్టిమిద్దెకట్టగానె
  తోచినట్లుదెలిపిదుడ్డునుతినువారు
  ఎక్కువైరి-నేటిమక్కువట్లు
  2బాధలున్నమంచిభవనాన్నిగట్టించ?
  తరలివచ్చిజనులు-తప్పుబట్టి
  సరిగలేనిదిల్లు-సరిజేయమనిజెప్ప?
  కట్టుబట్టమిగులుకలతలందు

  రిప్లయితొలగించండి
 11. గదులమరిక కుదురు చెదరగ,వదలక
  మదిమెదలెడు బెదరు ముదిరి, యదరి
  పదుగురెదుట బదులు వెదకగ, నదియిది
  కొదవ యను విధముగ వదరెద రట!

  రిప్లయితొలగించండి
 12. శ్రీవల్లి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  వృత్యనుప్రాసాలంకారంతో మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. ఇంటికన్నివైపు లెన్నగా ద్వారాలు,
  యింటి చుట్టు తిరుగ నిరవులేని
  యింటనుండ రాదు నింపుగా నందురు
  మనకు తెలియదందు మర్మమేమొ

  తూర్పు ముఖము ననుచు తొందరపడియును
  పడమటిదియ మనకు పనికి రాదు
  ననుచు,తెలియకుండ ననగ రాదెన్నగా
  మనము తప్పు చేయ మహిత మగునె?

  రిప్లయితొలగించండి
 14. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. అన్ని దిక్కు లందు నెన్న దేవతలుండి
  కాచుచుంద్రు జనుల కరుణతోడ
  కాన వారి కొరకు కమ్రంపు రీతితో
  నియమములను గాచి నిలువ వలయు

  రిప్లయితొలగించండి
 16. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. మూల లెక్కువైన మూలన బడవేయు
  దారి తప్పు నిచట ద్వారమున్న
  నిల్లు జరిపి కట్ట " నిల్లగు " వెతలన్ని
  నాదు మాట వినిన నాదు కొనును.

  రిప్లయితొలగించండి
 18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి