8, ఫిబ్రవరి 2015, ఆదివారం

పద్యరచన - 815

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. జిత్తులతో చిత్రములం
    దత్తగ కోడళ్ళ పెట్టునారడి యైనన్
    మెత్తని హృదయంబుగలది
    యుత్తమనటి సూర్యకాంత మొకటియెనిలలో

    రిప్లయితొలగించండి
  2. గంప గయ్యాళి వేషాన గటువు గలిగి
    యెంత మందినో బాధించు నింతి గాను
    సూర్య కాంతమ్మ ! నీవిల బేర్వ డసితి
    వి మఱి వందన ములునీకు వేయి యిడుదు

    రిప్లయితొలగించండి
  3. కళలకు కాణాచి కాకినాడ సమీప
    వేంకట కృష్ణరాయాంకితమగు
    చిఱుగ్రామ పురవాసి; చిఱుతనంబున వేసి
    నాటకములయందు నాటుకొనగ
    “నారద నారి” లో నాయిక పాత్రలో
    చిత్రసీమను జేరె చిత్ర గతిని
    “సూర్యకాంత”మనగ సూరెకారమనెడి
    నానుడి నొందిన నాతి యనగ

    అత్త రూపుకు క్రొంగొత్త హద్దులిచ్చి
    పాత్ర లందునె గయ్యాళి పరమ సాధ్వి!
    తనకు సాటిగ మునుముందు తరము లందు
    పుట్ట బోరు నటనమందు పుడమి యందు.

    రిప్లయితొలగించండి
  4. అత్త వేషమ్ముపూర్తిగ గుత్త పాడి
    తెలుగు చిత్రజగతినేలె తిరుగు లేక
    చెరుప లేనంత ముద్రతో చిరము గాను
    భేషు అన్నట్లు జీవించె వేష మందు !!

    రిప్లయితొలగించండి
  5. మరణము లేదట నీకిక
    భరణము గాయత్త నుదుట భారము పడగన్
    కొరకం చులెయుగ యుగముల
    వరమొందిరి తరుణు లంత పలువురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  6. మాట కఠి నము మెత్తని మనసు గలిగి
    సూర్య పదమది ముందునై సొబగు దోపి
    కాంతు లొలికించు నీపేరు కాంత మగుట
    సార్ధ కంబయ్యె నుగదమ్మ ! సాధ్వి నీకు

    రిప్లయితొలగించండి
  7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘ఒకటియె యిలలో’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    టి.బి.యస్. శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘భరణముగా నత్త...’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. అత్తపాత్రలందు నధికమౌ ప్రతిభతో
    తెలుగు చిత్ర సీమ వెలిగె నామె
    పిండి వంటలెన్నొ ప్రేమతోఁ బంచుచు
    తోటి నటుల మదిని దోచుకొనియె

    రిప్లయితొలగించండి
  9. గయ్యాళి అత్త వేషము
    వెయ్యాలంటే జగాన పేరొక్క రిదే
    చెయ్యెత్తి చెప్పగా నగు
    నయ్యా మన సూర్య కాంత మన్యులు గలరే?

    రిప్లయితొలగించండి
  10. తమ్ముడూ సీసాలతో త్రాగించేస్తున్నావు! భేష్.

    రిప్లయితొలగించండి
  11. అన్నా! నమస్సులు.వీలు కుదిరినప్పుడు వచ్చుచున్నాను. మీ ప్రొత్సాహానికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  12. గయ్యాలి యత్త పాత్రను
    వెయ్యాలన 'సూర్యకాంత' పేరే తోచున్!
    వియ్యము నందెడు వారలు
    సయ్యందురు యట్టి యత్త ఛాయలు దప్పన్!

    రిప్లయితొలగించండి
  13. నవరసభావనాపటిమ-నాటకమందునచిత్రసీమలో
    భవితకుబంచిపెట్టగలభాధ్యతచేతను-సూర్యకాంతమే
    వివరణనింపుపాత్రలచె|వియ్యపురాలిగ,అత్తపెత్తనాల్
    సవరణశాశ్వితంబు|మనసందుననిల్చెనుకీర్తికాంతగా
    2కాంతగసూర్యకాంతమన?గౌరవమిచ్చెడిశాంతిచిత్త|యే
    ప్రాంతమువారికైన తనపాత్రలునచ్చకపోవునెప్పుడున్
    స్వంతముజేయువంటలన?సర్వులుమెత్తురు|నందుకేగర
    వ్వంతయుగుర్తునుండుటకెవంటలపుస్తకముంచె|ఆంధ్రలో

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్ది గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ఒకటి రెండు వ్యావహారికాలు పడ్డాయి. పరవాలేదు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. కే*యస్*గురుమూర్తిగారిపూరణం
    పిడికిలిచేతమూతిఫయివేసెద,కట్నముదెమ్ములేనిచో
    కొడవలిచేతగొంతుకనుకోసెదనంచుగయాళయత్తయై
    సిడిముడివేయుకేవలముచిత్రములందున|సుర్యకాంత,తా
    నడకువగల్గుధర్మవతియౌనిజజీవితమందునారయన్



    రిప్లయితొలగించండి
  16. చలనచిత్రములను చక్కగా నటియించి
    అత్త పాత్ర నిలిపె నందలమున
    సూర్యకాంతమెపుడు శోభిల్లు నటనాన
    గీటు రాయి యౌను మేటి కతన

    రిప్లయితొలగించండి
  17. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి