చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** టి.బి.యస్. శర్మ గారూ (మన్నించాలి.. మీ పూర్తిపేరు మరిచిపోయాను) మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పాణి గ్రహించినాడ నవపల్లవపాణి! బిరాన రమ్ము పా- రాణిపదాల మా గృహము రంజిల నా యెద పీఠి పై మహా రాణిగ వెల్గుచున్ వలపు రాగములన్ పలికింప ప్రేమపున్ వీణియ పై సఖీ! కలసి వేడుకగా పయనింప తోడువై.
మిస్సన్న గారూ, మీ పద్యం రసమయమై అలరిస్తున్నది. అభినందనలు. ***** శ్రీవల్లి గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. కొద్దిరోజులు బ్లాగుకు అందుబాటులో లేకపోవడంతో మీ పద్యాలపై వెంటనే స్పందించలేకపోయాను. ధారాశుద్ధితో చక్కని పద్యాలు వ్రాస్తున్నారు. సంతోషం! ఈనాటి మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘ఆతని ననుసరించి’ అనండి. అక్కడ యడాగమం రాదు.
మద్దూరి రామమూర్తి గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పద్యాలు చక్కగా ఉన్నాయి. అభినందనలు. ‘జనులు + ఆశీర్వదింప’ అన్నప్పుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. అక్కడ ‘చేరవచ్చినట్టి జను లాశీర్వదింప’ అందామా?
మద్దూరి రామమూర్తి గారూ, సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
ఇంటింటనింతులీ గో
రిప్లయితొలగించండిరింటాకును పెట్టుకొని మురిసెద- రెరుపుగన్
పంట తమయదృష్టమనుచు
కంటికి ఇంపైన రీతి కరముల పెట్టున్
అర చేయి నిండ ముగ్గులు
రిప్లయితొలగించండితరతర ములనా టినుండి త లిరుల వ్రే ళ్ళు
న్విర బూయుచునే యుండును
కరమగు గోరింట యాకు కతనన పుడమిన్
ఇరు కుటుంబాల కీర్తిని యినుమడింప
రిప్లయితొలగించండికామ్య ధర్మార్థ కామమోక్షముల యందు
నాతి చరితవ్యమంచును నాతి కిచ్చి
పలుకు పాణిగ్రహణవేళ పదుగురెదుట.
పడతుక కలలీదినమున పండ గాను
రిప్లయితొలగించండిపాణి నందించె ప్రియునకు పదుగురెడుట
వేద మంత్రాల మధ్యన వేడ్క తోడ
నూరు వత్సరముల హాయి కూరుగాక
పాణి గ్రహణమ్ము వేడ్కకు ప్రథమ మిదియె
రిప్లయితొలగించండినలుగు రెదుట "నాతిచరామి" పలుక వరుడు
రెండు చేతులు కలుపునా రెండు ఇళ్ళు
ఏడు జన్మల బంధమౌ మూడు ముళ్ళు
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
టి.బి.యస్. శర్మ గారూ (మన్నించాలి.. మీ పూర్తిపేరు మరిచిపోయాను)
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పాణి గ్రహించినాడ నవపల్లవపాణి! బిరాన రమ్ము పా-
రిప్లయితొలగించండిరాణిపదాల మా గృహము రంజిల నా యెద పీఠి పై మహా
రాణిగ వెల్గుచున్ వలపు రాగములన్ పలికింప ప్రేమపున్
వీణియ పై సఖీ! కలసి వేడుకగా పయనింప తోడువై.
అందమైన అమ్మాయి చేయందుకొనుట
రిప్లయితొలగించండియతని వైభోగ మాతని యనుసరించి
చనుట యతివనోముఫలము చల్లగాను
వారి జూడవలయునమ్మ గౌరిదేవి
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం రసమయమై అలరిస్తున్నది. అభినందనలు.
*****
శ్రీవల్లి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. కొద్దిరోజులు బ్లాగుకు అందుబాటులో లేకపోవడంతో మీ పద్యాలపై వెంటనే స్పందించలేకపోయాను. ధారాశుద్ధితో చక్కని పద్యాలు వ్రాస్తున్నారు. సంతోషం!
ఈనాటి మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ఆతని ననుసరించి’ అనండి. అక్కడ యడాగమం రాదు.
గురువుగారికి ధన్యవాదములు
రిప్లయితొలగించండిపృథ్వీ సురావళి వేదమంత్రమ్ములు ప్రమద మందగ మంగళముల నొసగ ,
రిప్లయితొలగించండిహైయ్యంగవీన నవ్యాహుతి ధూమమ్ము తాపత్రయమ్ముల రూపుమాప ,
ఐదువుల్ చేతుల కలదిన గోరింట శుభయుక్త సౌశీల్య శోభ లొసగ ,
మంగళ కరములౌ మంగళ వాద్యముల్ వీనులకెంతయో విందు గూర్ప ,
వధువు సిగ్గుల మొగ్గయై వరుని చేరి చేతిపై చేయివేసి సంప్రీతి నిలువ ,
చేర వచ్చిన జనులు ఆశీర్వదింప , చిత్రమున మించె సంసార జీవనమ్ము .
మద్దూరి రామమూర్తి .
కర్నూలు.
ధన్యవాదములండి. ఆసక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నాను. నా తప్పులు సరిదిద్ది నన్ను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను.
రిప్లయితొలగించండిఇంటను సతి తన నోముల
రిప్లయితొలగించండిపంటగ మదినెంచి పతి శుభప్రదయౌ గో
రింటను కైసేసిన తా
కంటను వీక్షించె సుమ్ము కంకణ ధరుడై .
మద్దూరి రామమూర్తి .
కర్నూలు.
మద్దూరి రామమూర్తి గారూ,
రిప్లయితొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పద్యాలు చక్కగా ఉన్నాయి. అభినందనలు.
‘జనులు + ఆశీర్వదింప’ అన్నప్పుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. అక్కడ ‘చేరవచ్చినట్టి జను లాశీర్వదింప’ అందామా?
ఇంటను సతి తన నోముల
రిప్లయితొలగించండిపంటగ మదినెంచి పతి శుభప్రదయౌ గో
రింటను కైసేసిన వా
ల్గంటిని వీక్షించు చుండె కంకణ ధరుడై .
మద్దూరి రామమూర్తి .
కర్నూలు
పాణిగ్రహణము జేయుచు
రిప్లయితొలగించండిరాణిగ నిను జూచుకొనుచు రక్షకుడౌదున్
ప్రాణము లిత్తును నా యలి
వేణీ! నీకోసమనుచు ప్రియుడే దెల్పున్
గోరింటాకిడు కళలిల
రిప్లయితొలగించండిచారిత్రకకథలుగలవు చక్కగబండన్
చేరినమహిళలమనసున
ఆరాటమెకానుపించునద్భుతకళగా|
ప్రతిభనుపంచిపెట్టుటకు,భాగ్యముబండగ మంచిభర్తయే
రిప్లయితొలగించండినతివలచెంతజేరుటకు|నాయువుబెంచగసంతసంబుకున్
క్రతువులరీతినెంచుటకు|కార్యములందుననైకమత్యమున్
మితముగసాకబూనుటకు| మిక్కిలిమక్కువనాడువారికిన్
మద్దూరి రామమూర్తి గారూ,
రిప్లయితొలగించండిసవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.