1, ఫిబ్రవరి 2015, ఆదివారం

నిషిద్ధాక్షరి - 31

కవిమిత్రులారా,
అంశం- శిశుపాలవధ.
నిషిద్ధాక్షరము - శ.
ఛందస్సు - తేటగీతి.

30 కామెంట్‌లు:

  1. రాజసూయమునందెల్ల రాజులుగన
    చేదిరాజు కృష్ణుని దూఱి జేసె తప్పు
    నూరు తప్పుల నారాజు మీరినంత
    యతని తలతెగెనాచక్రి యరినివదల

    రిప్లయితొలగించండి
  2. శ్రీ శంకరయ్యగార్కి, అన్న శ్రీ మిస్సన్న గార్కి నమస్సులతో చిన్నప్రయత్నము

    రాజసూయ యాగ సభా విరాజమాన
    సకల భువనైక మోహను చక్రి(జూచి
    చులక జేయుచు సాత్వతీ సుతుడు దూఱ
    వరము చెల్లగ ఖండించె వాని సిరము

    రిప్లయితొలగించండి
  3. రాజ సూయయా గంబున రాజు లెదుట
    చేది రాజట కృష్ణుని వేదనలకు
    భూరి గురి జేయు కతనన నూఱునైన
    తప్పులకును ఖం డించె న తని త లనట



    రిప్లయితొలగించండి
  4. అత్త కోరిక దీర్చుట నుత్తమ మని
    నూరు తప్పులు కాసితి నోర్పు తోడ
    పరుష వాఖ్యము లాడగ పలికె చక్రి
    తలను ఖండించ సాత్వతి తనయు నిపుడు

    రిప్లయితొలగించండి
  5. అత్త కోరిక దీర్చుట నుత్తమ మని
    నూరు తప్పులు కాసితి నోర్పు తోడ
    పరుష వాఖ్యము వినినంత పలికె చక్రి
    తలను ఖండించ సాత్వతి తనయు నిపుడు

    రిప్లయితొలగించండి
  6. పెద్దలున్న యెడ తనదు పేర్మిఁ జూప
    నెంచి మూర్ఖుడొక్క పరియనంగ కాదు
    నూరు తప్పులఁ జేసె; కృష్ణుండు తనదు
    చక్రమునుఁ బంపె నాతని చంపెనపుడు.

    రిప్లయితొలగించండి

  7. చైద్యు తనువు వక్రతలు బాపే జననమందు
    బుద్ధి వక్రింప నూరు తప్పులను దాటి
    వైరభక్తిని నిందించు వాని,చక్రి,
    సిరసు ఖండించి తనలోన జేర్చు కొనియె

    రిప్లయితొలగించండి
  8. నూరు తప్పుల వరకు నేనూరుకొందు
    ప్రతిఘటించిన తీతు నీ ప్రాణమనుచు
    మున్ను నుడివిన వాక్యమ్ము పొల్లుబోక
    చేదిరాజేంద్రు నంత నిర్జించె హరియె.

    రిప్లయితొలగించండి
  9. అత్త కిచ్చిన మాటకు ఆన తిచ్చి
    నిండు సభలోన నిందింప నిప్పు జిమ్మి
    నూరు తప్పులు సహియించి యూరకుండి
    చేది వర్యుని బల్కులామోద మవక
    చక్రముదరలించి వధించె చక్రధారి

    రిప్లయితొలగించండి
  10. మల్లెలవారి పూరణలు
    చైద్యుడట్టెతాను నృపుల సభను వదరి
    కృష్ణు దిట్టి తా ఘనుడంచు కితవుడగుచు
    నూరు దోసాల హద్దు నే మీర వాని
    తలను తెగ గొట్టి కృష్ణుండు దర్ప మడచె
    2.రాజసూయమ్ము నందున రవ్వజేయ
    భీష్ముడె౦తయు చెప్పిన వినని చైద్యు
    వామ పాదాన తన్నంగ పాండు చిన్న
    వాడు ననెనుగా, కృష్ణుడు వాని జంపె

    రిప్లయితొలగించండి
  11. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    ఇందిరయగు రుక్మిణిని ప్రేమించనేల?,
    వారిరుహనాభు యడుపాలు దూఱ నేల?,
    చక్రధాటికి చైద్యుడు చావ నేల?,
    అంత మయ్యెదరు గద పాపాత్ములిటులె

    రిప్లయితొలగించండి
  12. అగ్ర పూజకు వృష్ణి యనర్హుడనుచు
    చీద రించగ కృష్ణుని చేదిరాజు
    నూఱు తప్పులు నేటితో తీరె ననుచు
    బిల్లవాలు వదలి గూల్చె నల్లనయ్య !!!

    రిప్లయితొలగించండి
  13. నిండుసభలోనతిట్లచేబండబారి
    నూరుతప్పులుఫైజేర?నోర్చుకొనుచు
    చేదిరాజునుచేదించెవాదుమాని
    చక్రమేసియుకృష్ణుడుచంపె|నాడు

    రిప్లయితొలగించండి
  14. చిన్న తప్పుతో విష్ణువు చెలిమి బాసి
    మూడు జన్మల వైరము మోసి మోసి
    వంద తప్పులు యీనాడు వరుస జేసి
    చేరె వైకుంఠ పురమును ఛేదిరాజు

    రిప్లయితొలగించండి
  15. అత్తకిచ్చినట్టి వరము నాదరించి
    కాచె నూరు తప్పుల తుష్టి కంస వైరి
    నూరుతప్పుల పిదపను నోరు జార
    సంహరించె ఛేది విభుని చక్ర హతిని

    రిప్లయితొలగించండి
  16. Tbs Sarma గారూ - మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీవల్లి గారూ చక్కని పూరణ చేశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. తరుణి రుక్మిణి కోరెడి తప్పు జేసి
    తప్పు కొన్నాడు సాత్వతి తనయుడపుడు
    నేర్చు కొనలేదు పాఠము నేటికైన
    కోరి కృష్ణుని చేతిలో కూలినాడు

    రిప్లయితొలగించండి
  19. శ్రీవల్లి గారూ - మీ రెండవ పూరణ గూడా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. పెద్దలనియెడిభావనపెంచుకోక
    రాజులందరినెదుటన-రాక్షసాన
    తెగడ?కృష్ణుడు నోర్పుతో-తేరుకొనుచు
    చేదిరాజునుతెగటార్చె|వాదు లెక

    రిప్లయితొలగించండి
  21. తమ్ముడూ శంకరాభరణానికి మీ పునరాగమనం మహదానంద దాయకం. పద్యం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  22. ఏది గర్వమ్ము కూలగ చేదిరాజు
    వాని పృథు దేహమును వీడి వచ్చె నొక్క
    తేజ మంబరము వెలుగ దివ్య మైన
    లీల నా రమాపతి లోన లీన మయ్యె.

    రిప్లయితొలగించండి
  23. లక్ష్మీదేవి గారు,
    రెండవ పాదం లో యతి నాకు బోధపడలేదండి.

    రిప్లయితొలగించండి
  24. రామకృష్ణ గారు,
    ధన్యవాదాలండి. కొన్ని పదాలు మార్చినాక యతి మార్చాలన్న యోచన రాలేదు.

    పెద్దలున్న యెడ తనదు పేర్మిఁ జూప
    నెంచి యొకటి రెండనియెంచి యెంచి చూడ
    నూరు తప్పులఁ జేసె; కృష్ణుండు తనదు
    చక్రమునుఁ బంపె నాతని చంపెనపుడు

    రిప్లయితొలగించండి
  25. పెద్దలున్న యెడ నొకడు పేర్మిఁ జూప
    నెంచె; యొకటి రెండనియెంచి యెంచి చూడ
    నూరు తప్పులఁ జేసె; కృష్ణుండు తనదు
    చక్రమునుఁ బంపె నాతని చంపెనపుడు

    రిప్లయితొలగించండి