9, ఫిబ్రవరి 2015, సోమవారం

పద్యరచన - 816

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22 కామెంట్‌లు:

  1. రామచంద్ర పదార్చిత రామచంద్రు
    చరిత ద్విపద రూపంబున సారసముగ
    కావ్యమల్లి న కవయిత్రి కావ్యమల్లి!
    ఆతుకూరి మొల్ల యనగ ఆంధ్రమందు.

    రిప్లయితొలగించండి
  2. తేనె సోన లోని తియ్యందనమ్మును
    జాను తెనుగు లోన జాలు వార్చి
    రాగ బంధురముగ రామాయణము సెప్పె
    తల్లి వోలె దలతు మొల్ల నెపుడు

    రిప్లయితొలగించండి
  3. మొల్ల రచియించె గావ్యమ్ము ముఖ్యముగను
    కనగ రెండేసి పాదము ల్గలుగు నట్లు
    తనర రామాయణమ్ము ను దనివి తీర
    శ్రేయ ములకునౌ రచనలు చేతురుగద

    రిప్లయితొలగించండి
  4. అందరి కవయిత్రులలో
    ముందర యుండును తెనుగున మొల్లయె అమ్మై
    అందముగా పేర్చి పదము
    సుందర మగురా మచరిత శోభ వచించెన్

    రిప్లయితొలగించండి
  5. రాజులకు మొల్లెపుడు నీ 
    రాజనమునుబట్టలేదు రవ్వంతైనా 
    బాజా భజంత్రి వలదని 
    రాజిల్లె భువిని రసమయ రచనా కృతులన్

    రిప్లయితొలగించండి
  6. కుమ్మరి కులమేయైనను
    కమ్మగనే రామచరిత ఘన పద్యములన్
    దమ్మున్న కవుల మించుచు
    నిమ్ముగనే మొల్లమాంబ యిచ్చెను మనకే.

    రిప్లయితొలగించండి
  7. మట్టిన నమ్మిన ఇంటన 
    బుట్టిన మొల్ల రఘురామ బొగడగ వ్రాసెన్
    పుట్టుక మూలము కాదని 
    గట్టిగ తేల్చికవయిత్రి ఘనతను జాటెన్

    రిప్లయితొలగించండి
  8. చల్లని రాముని చరితము
    నుల్లములలరంగ జెప్ప యోహో యనగన్
    బల్లవములౌ పద సిరికి
    మొల్ల మహాసాధ్వికి కరమోడ్తు శిరముపై!

    రిప్లయితొలగించండి
  9. టి.బి.యస్. శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మొల్ల రామాయణం ద్విపద కాదు, గమనించండి.
    *****
    కుమార్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మొల్ల ద్విపద వ్రాయలేదు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. రాముని నిల్పి డెందమున రాముని చూచుచు దివ్యచక్షులన్
    రాముని నామ మాడుచును రాముని దివ్య కథన్ రచించె నీ
    రామ జగద్ధితమ్మగుచు రంజిలగా, మన యాడుబిడ్డ, శ్రీ
    రాముని పాదసన్నిధిని వ్రాలిన పుష్పము మొల్ల సోదరా.

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్నవర్యులకు అభినందనలతో, గురువుగార్కి నమస్సులతో తప్పును సరిదిద్దుచూ
    రామచంద్ర పదార్చిత రామచంద్రు
    చరిత సరళ రూపంబున సారసముగ
    కావ్యమల్లి న కవయిత్రి కావ్యమల్లి!
    ఆతుకూరి మొల్ల యనగ ఆంధ్రమందు.

    రిప్లయితొలగించండి
  12. కడప దగ్గరగల గ్రామమునను బుట్టి
    మొల్ల యనెడి యొక్క ముద్ద రాలు
    వ్రాసి రామచరిత రమణీయ శైలిలో
    నందుకొనెను జనుల యాదరమును

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    టి.బి.యస్. శర్మ గారూ,
    మీ సవరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. కె.ఎస్ . గురుమూర్తి గారి పూరణ
    హృదయము నందునన్ రఘు కులేశుని నమ్మిన భక్తు రాలునై
    చదువుల తల్లియైన యల శారదకున్ ప్రథమంపుపుత్రియై
    తదమల భక్తి రామ చరితమ్ము రచించెను మొల్ల మాంబ సన్
    మధుర పదాల సూనముల మాలికలల్లి మనోహరంబుగా

    రిప్లయితొలగించండి
  15. నమస్కారములు
    అవును మొల్ల రామాయణము ద్విపద కాదు " ఆంధ్రభారతి ఇతిహాసములయందు గమనించ గలరు "
    సెలవు

    రిప్లయితొలగించండి
  16. పద్యరచన:కవయిత్రి మొల్ల
    ఘనత జెందెను.రామాయణమును తెనుగున
    కావ్యముగ వ్రాసినట్టి స్త్రీ కవిగ మొల్ల
    రామచంద్రుడు దీవెనల్ లేమ కొసగ
    అమర మయ్యెను యాగ్రంద మవని లోన

    రిప్లయితొలగించండి
  17. ఉద్దండ పండితుల వలె
    కద్దని పాండిత్యము తన కవనంబున తా
    నద్దివ్య రామ చరితము
    ముద్దుగ తెనిగించి నిలచె మొల్ల చరితలో

    రిప్లయితొలగించండి
  18. మొల్ల రచియించె గావ్యమ్ము ముఖ్యముగను
    కనగ నద్భుత భావము ల్గలుగు నట్లు
    తనర రామాయణమ్ము ను దనివి తీర
    శ్రేయ ములకునౌ రచనలు చేతురుగద

    రిప్లయితొలగించండి
  19. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘ఘనత జెందె రామాయణమును తెనుగున’ అంటే సరి!
    ‘అయ్యెను + ఆగ్రంథ’ మన్నప్పుడు యడాగమం రాదు. ‘అమరమయ్యె నాగ్రంథ మీ యవనిలోన’ అనండి.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. మొల్లరామాయణంబుననెల్లరికిని
    చదివివినదగ్గకావ్యంబుపదిలబరచి
    నాటికాలానరచనలోసాటిరాని
    మేటిరత్నంబుగామెరిసెదీటుగాను

    రిప్లయితొలగించండి
  21. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ శంకరయ్యగురుదేవులకు వందనములు
    తమరి సూచనతో సవరించిన పద్యము
    ఘనత జెందె రామాయణమును తెనుగున
    కావ్యముగ వ్రాసినట్టి స్త్రీ కవిగ మొల్ల
    రామచంద్రుడు దీవెనల్ లేమ కొసగ
    అమర మయ్యెనా గ్రంద మీ యవని లోన

    రిప్లయితొలగించండి