23, ఫిబ్రవరి 2015, సోమవారం

పద్యరచన - 829 (చిన్ముద్ర)

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

 1. చూపుడు వ్రేలను(వేలు+అను) జీవుని
  యాపరమాత్మగతలచెడి యంగుష్ఠముతో
  మోపుచు మిగతా వ్రేళ్ళను
  జాపుట చిన్ముద్ర యోగ సాధనమందున్

  రిప్లయితొలగించండి
 2. చిన్ముద్ర యనగ దెలియుము
  చిన్ముద్రయె జీవి మఱియు చిన్మయము నుయున్
  చిన్ముద్రయె పర మాత్మయు
  చిన్ముద్రకు వంద నంబు సేతును నెపుడున్

  రిప్లయితొలగించండి
 3. ముద్రలు పరిపరి విధములు మోక్ష మిడగ
  జపసమ యమున తెలుపు చాచ రిముద్ర
  చేతి వ్రేళ్ళను గలిపిన చిన్ముద్ర యట
  శివుని ధ్యానించ జ్ఞానము సింహ క్రాంత

  రిప్లయితొలగించండి
 4. తర్జనియును నంగుష్ఠమ్ముదరినిఁ జేర్చి
  ధ్యానమును సల్పుచోనిక ధ్యానభంగ
  మేర్పడదటంచునందురోయీ! తెలిసిన
  మీదనాచరింపగదోయి! మిత్రవర్య!

  రిప్లయితొలగించండి
 5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘మఱియు చిన్మయమును నా| చిన్ముద్రయె... వందనంబు సేసెద నెపుడున్’ అనండి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  కాని మొదటి, మూడవ పాదాల్లో గణదోషం.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. ముద్రలు మనకారోగ్యము
  భద్రముగా గూర్చు యోగ పరమార్థమ్ముల్
  రుద్రాది దేవతలుఁ జి
  న్ముద్రలె దాల్తురు మనమ్ము ముక్కంటనిడన్!

  రిప్లయితొలగించండి
 7. ముద్రలు వృద్ధవయసునన్
  భద్రతకై దేవుడిడిన వరములు సుమ్మా!
  నిద్రనివీడినపిదపను
  ముద్రల ప్రతిదినపునుదయమున సలుపవలెన్

  రిప్లయితొలగించండి
 8. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. మనసుకునిత్చలత్వమును మంత్రపుతంత్రపుసాధనంబుకున్
  ఘనతనుబెంచబూనుటకు గర్వముమాన్పెడిమంచిమార్గమై
  తనువుకుహాయినింపుటకు తాత్వికచింతనగూర్చుముద్రగా
  మనుజులయోగభావమునమర్మమె| చిన్మయముద్రనెంచగా

  రిప్లయితొలగించండి
 10. ఆనాటియోగులెంచిరి
  ఈనాటికిముద్రలందుచిన్మయముద్రే
  జ్నానామృతసారమ్మని
  ఏనాటికితరుగబోకనెంచెడినిధియే|

  రిప్లయితొలగించండి
 11. కె.ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. మల్లెల వారి పద్యము
  చిత్తమందున తానంది చేతనమ్ము
  ఆత్మ గతిని తా గుర్తించి అందరకును
  జ్ఞాన మది తాను వెలిగించి సాధువగుచు
  మార్గమే జూపు మనుజుడే మాధవుండు

  రిప్లయితొలగించండి
 13. చిన్ముద్రను గొనినిరతము
  చిన్మయుని గొలువగ మనసు సిద్ధిని బొందున్
  తన్మయమునశక్తి బెరిగి
  జన్మము సాఫల్యమగును జనులకు భువిలో!!!

  రిప్లయితొలగించండి
 14. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. మూడు గుణము లాని ముడుచుక నుండక
  భవుని వైపు సాగ భద్రమగును
  ఆత్మ తర్జనియగు నంగుష్టమే దైవ
  మగుననుచును జెప్పు మనకు ముద్ర

  రిప్లయితొలగించండి
 16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి