సత్యనారాయణ రెడ్డి గారి పూరణం లో రెండవ పాదంలో చిన్నసవరణ సూచించాలనిపించింది.- దశరధుండు తాసలిపె "ను తన్వయముగ" కిబదులుగా- దశరధుండు తాసలిపె"తదనుగుణముగ" అనీ మూడవ పాదంలో- పుత్ర కామేష్టిని "తన కళత్రసహితము" కి బదులుగా- పుత్ర కామేష్టిని "సహకళత్రు డౌచు" అనీ మార్పుచేస్తే బాగుంటుందేమో.
కవిమిత్రులకు నమస్కృతులు... మొన్నటినుండి ఇంట్లో గొడవలవల్ల మనశ్శాంతి కరువైంది. మిత్రుల పూరణలపై, పద్యాలపై స్పందించలేక పోతున్నాను. ఈ పరిస్థితులు మరో రెండు రోజులదాకా ఉండవచ్చు. క్రమం తప్పకుండా సమస్యలను, పద్యరచన శీర్షికను షెడ్యూల్ చేస్తున్నాను. దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి. చిత్రాన్ని తగిన పద్యాల నందించిన కవిమిత్రులు... చంద్రమౌలి సూర్యనారాయణ గారికి, పోచిరాజు సుబ్బారావు గారికి, భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారికి, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి, కె. ఈశ్వరప్ప గారికి, కె.యస్. గురుమూర్తి ఆచారి గారికి, మిస్సన్న గారికి, గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి, రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి అభినందనలు, ధన్యవాదాలు.
వేరే పని తొందరలో హడావిడిగా పూరించాను. అందము నడక బాగుండలేదని అర్థమయింది. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారి చక్కని సవరణలకు ధన్యవాదాలు. యితరకవిమిత్రులు కూడా పరస్పర గుణదోష విచారణలో పాల్గొన వలసిందిగా మనవి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"వినుమా దశరధ! భక్తిగ
రిప్లయితొలగించండిగొనియీ పాయసపుపాత్ర కులకాంతలకి
మ్మ"ని యగ్నిదేవుడిడగా
తనసతులందరికిపంచి తనయులబడసెన్
పాయ సమ్మును గలయట్టి పాత్ర నచట
రిప్లయితొలగించండినగ్ని దేవుడు నీయగ నాదశ రధు
డంత బ్రేమతో భార్యల కంద రకును
నిచ్చి త్రాగించ దలచెను నింపు మీర
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదశరథుడు మౌని వాశిష్టు దయను బొంది
రిప్లయితొలగించండిపుత్ర కామేష్టి యజ్ఞంపు పూజ సలుప
అగ్ని దేముడు కృపజూపి యవత రిల్లె
యజ్ఞ ఫలము సతులుమువ్వు రార గింప
సుతులు నల్గురు కల్గిరి శుభము గూర్చ
పుత్రులిల లేక దక్కదు మోక్షమనుచు
రిప్లయితొలగించండిదశరథుండు తా సలిపెను తన్వయముగ
పుత్రకామేష్టిని తన కళత్రసహితము
యజ్ఞ పురుషుండు తోతెంచి యతని కిచ్చె
పాయసపుపాత్ర యాగపు ఫలము గాను
పుత్రకామేష్టియాగంబుపూర్తిజేయ?
రిప్లయితొలగించండిపసిడికళశానబుట్టినపాయసంబు
సతులకందించమనిదెల్పెహితుడునగ్ని
దాశరథినందు-గొనెనటనాశచేత
2ఉత్పలమాలనందుతేటగీత
తొందరలేకనే "దశరథుండిడుయాగంబుధర్మమైనదే|
అందరుజూడగా"ఫలమునందినయగ్నియుభాధ్యతందుతా
బృందమునందునే"నొసగెప్రీతినొనర్పగనోముపాత్రనే|
నెందరికబ్బునో"ఫలమునెంచగసంతసభాగ్యమేగదా|
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికె యెస్ గురుమూర్తి ఆచారిగారి పూరణ
రిప్లయితొలగించండిఅంబురుహ వృత్తము
పాయసపాత్రను రాజునకిచ్చెను పావకుండు ముదంబుతో
ఆయన రాణులు మువ్వురు చక్కగ నందగాసుతసంతతిన్
పాయసమున్ భుజియించిరి భక్తిని భవ్యసంఘటనంబు రా మాయణకల్పము భూతలమందున అంకురింపనొనర్చెగా
సంతు లేదటంచు చింతను వీడుమా
రిప్లయితొలగించండిదివ్య పాయసమ్ము దెచ్చినాడ
నీదు భార్యల కిడు నెమ్మిని యోగ్యులౌ
తనయు లగుదు రయ్య దశరథ!గొను.
పుత్రకామేష్టియాగంబుపూర్తిగాగ
రిప్లయితొలగించండిపసిడికళశానబుట్టినపాయసంబు
సతులకందించమనిదెల్పెహితుడుయగ్ని
దాశరథి|నందుకొనెనట-నాశచేత
పాయస పాత్రముం గలుగు పావను డ య్యెడ కోసలా ధిపున్
రిప్లయితొలగించండిడాయగ జేరియా తనిని వేయివిధంబుల గారవించుచున్
పాయస పాత్రనా తనికి నీయగ నాతడు సంతసంబుతో
నీయగ రాణు లం దరికి నిష్టము తోడన ద్రాగి రప్పుడున్
దశరధు డందగ సంతతి
రిప్లయితొలగించండివశిష్ఠముని నిర్వహించు వాజజమందున్
సుశిఖుడు ప్రసాద మీయగ
యశోన్నతులు పుత్రు లైరి యార్తిని దీర్చన్!
సత్యనారాయణ రెడ్డి గారి పూరణం లో రెండవ పాదంలో
రిప్లయితొలగించండిచిన్నసవరణ సూచించాలనిపించింది.- దశరధుండు తాసలిపె "ను తన్వయముగ" కిబదులుగా- దశరధుండు తాసలిపె"తదనుగుణముగ" అనీ మూడవ పాదంలో- పుత్ర కామేష్టిని "తన కళత్రసహితము" కి బదులుగా- పుత్ర కామేష్టిని "సహకళత్రు డౌచు" అనీ మార్పుచేస్తే బాగుంటుందేమో.
కవిమిత్రులకు నమస్కృతులు...
రిప్లయితొలగించండిమొన్నటినుండి ఇంట్లో గొడవలవల్ల మనశ్శాంతి కరువైంది. మిత్రుల పూరణలపై, పద్యాలపై స్పందించలేక పోతున్నాను. ఈ పరిస్థితులు మరో రెండు రోజులదాకా ఉండవచ్చు. క్రమం తప్పకుండా సమస్యలను, పద్యరచన శీర్షికను షెడ్యూల్ చేస్తున్నాను. దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
చిత్రాన్ని తగిన పద్యాల నందించిన కవిమిత్రులు...
చంద్రమౌలి సూర్యనారాయణ గారికి,
పోచిరాజు సుబ్బారావు గారికి,
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
కె. ఈశ్వరప్ప గారికి,
కె.యస్. గురుమూర్తి ఆచారి గారికి,
మిస్సన్న గారికి,
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
వేరే పని తొందరలో హడావిడిగా పూరించాను. అందము నడక బాగుండలేదని అర్థమయింది. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారి చక్కని సవరణలకు ధన్యవాదాలు. యితరకవిమిత్రులు కూడా పరస్పర గుణదోష విచారణలో పాల్గొన వలసిందిగా మనవి.
రిప్లయితొలగించండి