5, ఫిబ్రవరి 2015, గురువారం

దత్తపది - 67 (హరి-మాధవ-చక్రి-శ్యామ)

కవిమిత్రులారా!
హరి - మాధవ - చక్రి - శ్యామ
పైపదాలను ఉపయోగిస్తూ
శివుని స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. శ్యామ లాం గుడ ! శ్రీహరి సఖుడ ! కావు
    మమ్ము ,నీ పూజ జేతు ను మాధవుండ !
    చక్రి యనగను నీవెగా శంభు డనగ
    నాది దేవుడ వీవెగా యజ్ఞ పురుష !

    రిప్లయితొలగించండి
  2. హరిహరు లకబేధ మనుచు
    శరణము మాధవ మేఘ శ్యామ యటంచున్
    సురలను కొలువగ చక్రిని
    పరమేశుడు పరవశించి భక్తిని మెచ్చన్

    రిప్లయితొలగించండి
  3. అంగజాంతక! దేవ! దక్షాధ్వరహరి!
    మందరమణి! ముక్కంటి! యుమాధవ! హర!
    చక్రిసన్నుత! పింగాక్ష! శ్యామకంఠ!
    శంకరా! నీ పదంబులె శరణు నాకు.

    రిప్లయితొలగించండి
  4. నమస్కారములు
    గురువు గారి పద్యం అద్భుతంగా ఉంది

    రిప్లయితొలగించండి
  5. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘శ్యామలాంగుడు’ అంటే విష్ణువే. ‘శ్యామలాంగుడౌ శ్రీహరి సఖుడ!...’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. అన్వయలోపమూ ఉన్నది. మీ పద్యానికి నా సవరణ....
    హరిహరు లకబేధ మనుచు
    శరణము మాధవ ముకుంద శ్యామ యటంచున్
    సురనరులు కొలువ చక్రిని
    పరమేశుడు పరవశించి పాలించు దయన్.

    రిప్లయితొలగించండి
  6. నార సింహ రూపుడు హరి విర్ర వీగ
    శరభ వేషమ్ము తోవచ్చి చక్రి నణిచె
    ఆది అంతమ్ములనుజూప ఆన తిచ్చి
    పితువు మాధవులకునాడు హితవు జెప్పె
    బ్రహ్మ హత్యకు శ్యాముడే భవుని కొలిచె
    అట్టి శివునికి నే తొల్లి అర్ఘ్య మిడుదు

    రిప్లయితొలగించండి
  7. మాస్టరు గారూ ..చక్కని స్తుతినందించారు......

    చక్రి హృదయమ్మునన్ వెలుగు శంభు దేవ
    మాధవుని చెల్లి యుమాధవ మన్మధారి
    శరవణ భవ గణపతి పిత శ్యామ కంఠ
    జేలు పురహరి నీకింక జేలు జేలు.

    రిప్లయితొలగించండి
  8. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మాధవుని చెల్లి యుమాధవ’ అనడం పొసగడం లేదు. ‘మన్మథారి! యుమాధవ!...’ అనండి.

    రిప్లయితొలగించండి
  9. మాస్టరు గారూ ! ధన్యవాదములు...చిన్న సవరణ చేయుచున్నాను..


    చక్రి హృదయమ్మునన్ వెలుగు శంభు దేవ !
    మహిత తేజా ! యుమాధవ ! మన్మధారి
    శరవణ భవ గణపతి పిత ! శ్యామ కంఠ !
    జేలు పురహరి ! నీకింక జేలు జేలు .

    రిప్లయితొలగించండి
  10. పిలువ నేనామముననైన పలికెదవట
    చక్రి నీల మేఘశ్యామ శర్వ
    మాధవహరి హరుడ శౌరి మదిన నిలచి
    శంభు భక్తవశంకర శాంతి నిమ్ము

    రిప్లయితొలగించండి
  11. శివుని శ్యామలాపతిని పూజించుమాధ
    వళశరీరున్ హరిసఖుని భవుని విశ్వ
    గురుని పంచక్రియా కారకుని పినాక
    పాణిని శశిధరుని సర్వ పాపహరుని

    రిప్లయితొలగించండి
  12. హరికి వల్లభుడౌచు నయ్యప్ప స్వామికి
    ......జన్మ నిచ్చిన తండ్రి చంద్రమౌళి
    పతిగ జేకొనుమంచు పార్వతి తపియింప
    ......మాల్మిని గొనిన యుమాధవుండు
    యాగనాశన వేళ నర్థించ చక్రికి
    ...... చక్రమ్ము నిచ్చిన సదయశీలి
    శ్యామలాంగిని తన భామగా జేకొని
    .......వామభాగ మిడిన ప్రేమమూర్తి

    భవుడు భవహారి శ్రీహరి బంధు వితడు
    మాధవప్రాణసఖుడును మంగళదుడు
    చక్రిచెలికాడు స్మరవైరి శాశ్వతుడును
    శ్యామలాంగుని మిత్రుడు శ్యామలపతి.

    రిప్లయితొలగించండి
  13. హరియె సిగలోన మెరియగ
    హరువుగ నాచక్రి మెడకు హారంబవగా
    మరిమాధవచెలికాడగు
    హరుడా శ్యామల ధవునికి యంజలి నిడుదున్ !!!

    రిప్లయితొలగించండి
  14. శ్యామకంఠ! మృత్యుంజయ! శంభు! శూలి
    హరి ధరుడ! హృత్వ! సూక్షాత్మ! నాది భిక్షు
    చక్రి వల్లభ! గోపతి !జంగమయ్య
    మాధవ సుహృత్తు !దయతోడ మమ్ము గనుమ!!!

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ సవరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ద్వితీయావిభక్తిలో ఇకారాంతపదాలకు ‘ని/నిన్’ వస్తుంది. ‘మదిన’ అనికాక ‘మదిని’ అనాలి.
    *****
    శ్రీవల్లి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
    సీసంలో దత్తపదాలను సమర్థంగా ప్రయోగించారు. కాని ఎత్తుగీతిలో ‘శ్రీహరిబంధువు, మాధవప్రాణసఖుడు,చక్రిచెలికాడు, శ్యామలాంగుని మిత్రుడు..’ అన్నప్పుడు అర్థపునరుక్తి అయినట్టుంది.
    *****
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శ్యామలాదేవి పతిదేవ చక్రిసఖుడ
    నీనివాసమాధవళాద్రి నీవువదలి
    హరినిధరియించి శిగలోన ధరణిపైకి
    మమ్ము గావంగ వేగమ్ము రమ్ము దేవ

    రిప్లయితొలగించండి
  17. మాస్టారి పద్యం హృద్యంగా ఉంది...మిస్సన్నగారు శంకరాభరణం బ్లాగ్ శ్రీనాధుడు

    రిప్లయితొలగించండి
  18. ధన్యవాదాలు గురువుగారూ. అవునండీ. కావాలనే పునరుక్తి ప్రయోగాలను చేశాను. ఎందుకో అలా చెప్పాలనిపించింది హరిహర మైత్రిని నొక్కి చెపుతూ.

    రిప్లయితొలగించండి
  19. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ. కొన్నివేల జన్మలెత్తినా శ్రీనాథుని కాలి గోటికి కూడా పోలనండీ. మీ అభిమానానికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. KS గురుమూర్తి ఆచారి గారి పూరణ .
    హరిత గాత్ర త్రినేత్ర సంహరిత దుష్ట
    మాధవ సమానతేజ ఉమాధవ హర
    చక్రినుత గుణ జాలనీ చక్రి యఘ్న
    శ్యామగళ శశ్యలంకృత శ్యామ ఝూట

    రిప్లయితొలగించండి
  21. హరుడు"హరి"యంచు నఘముల
    వరలును"మాధవు"డగుచును,పశుపతి తానై
    పరగెడు"శ్యామ"పు కంఠము
    హరియగు"చక్రి"కి హితుడగు నా శివుడౌ గా!

    "హరి"కిని మిత్రుడు తానై
    హరియించును పాతకముల నా గళ "శ్యాముం"
    డొరయునట"చక్రి"యగుచున్
    వరలును"మాధవు"డగుచును,పన్నగ ధరుడే

    రిప్లయితొలగించండి
  22. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నీనివాసమాధవళాద్రి’ అనడం ప్రశస్తంగా ఉంది.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘గళశ్యాము’ డన్నప్పుడు ‘ళ’ గురువై గణదోషం. ‘...నా శ్యామగళుం| డొరయునట...’ అనండి.

    రిప్లయితొలగించండి