చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, చాలా మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు. ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘జంటల + ఎదుట’ అన్నప్పుడు సంధి లేదు. ‘జంటలకును’ అనండి. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** చంద్రశేఖర్ గారూ, ఆ ‘సిరి’ కోసం వెదుకంగా నేల యీయాయెడన్? మీ ఇంట్లోనే మీ భార్య అరచేతి ఉ‘సిరి’ కాదా? * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో గణదోషం. ‘ ...యంబుజగర్భుఁడు’ అంటే సరి. ***** మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
విశ్వపాలకుండు విష్ణువే భర్తయా
రిప్లయితొలగించండిసిరికి, మగడు చంద్రశేఖరుండు
పార్వతికిని, బ్రహ్మ భారతీ దేవికి
పతియు వారి గొలిచి ప్రణతులిడుదు
విశ్వ మంత ట గల విష్ణువే గద మఱి
రిప్లయితొలగించండిసిరికి మగడు , చంద్ర శేఖరుండు
భక్త రక్షకుండు భవనాశ నకరుడు
లోక మాతకుపతి లోక విభుడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశేష తల్ప మందు శయనించు విష్ణుండు
రిప్లయితొలగించండిసిరికి మగఁడు , చంద్ర శేఖ రుండు
వెండి కొండ పైన వేలగణ ములందు
నటన మాడు నట్టి నర్త కుండు
రిప్లయితొలగించండిభర్త భోళా శంకరుడు నైన నేమి
బికారి నైన నేమి,అర్ధనారీ నా వాడు,
దాక్షాయిణి చెప్పె తండ్రి తో, మగ
సిరికి మగడు చంద్రశేఖరుండు !!
శుభోదయం
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ మ హావిష్ణు సాక్షాత్తు సిరికి మగడు
రిప్లయితొలగించండిచంద్ర శేఖరుండు ప్రభను సతిగ నెంచె
ఆలు మగల బాంధవ్యమ్ము లలవి జూసి
జగతి ప్రణమిల్లు నీ రెండు జంట లెదుట
పూజ్య గురుదేవులకు ప్రణామములు..
రిప్లయితొలగించండిపచ్చవలువదారి పంకజ నాభుడు
సిరికి మగడు, చంద్రశేఖరుండు
గట్టు చూలిపట్టి గౌరమ్మ పెనిమిటి
యంజలింతు వారి నహరహమ్ము
మాస్టారూ, ఆ సిరి ఎక్కడున్నదో చెప్పండి సార్! నేను రెడీ :-)
రిప్లయితొలగించండిదనుజ వైరి యైన దామోదరుడు శౌరి
రిప్లయితొలగించండిసిరికి మగడు,చంద్రశేఖరుండు
హైమవతికి భర్త, యబ్జయోని
పలుకుల జవరాలు వాణి మగడు
మొరవిని కరుణించి కరినిబ్రోచిన వాడు
రిప్లయితొలగించండిసిరికిమగడు ;చంద్రశేఖరుండు
వెండికొండనుండు చండికాపతి,వీరి
పాదసేవ ముక్తిపదమునిడును!!!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
చాలా మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘జంటల + ఎదుట’ అన్నప్పుడు సంధి లేదు. ‘జంటలకును’ అనండి.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
చంద్రశేఖర్ గారూ,
ఆ ‘సిరి’ కోసం వెదుకంగా నేల యీయాయెడన్? మీ ఇంట్లోనే మీ భార్య అరచేతి ఉ‘సిరి’ కాదా?
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. ‘ ...యంబుజగర్భుఁడు’ అంటే సరి.
*****
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాస్టరు గారూ ! చంద్ర శేఖరుల వారికి " సిరి " కరతలామలకముగా చూపించారు ..బాగుంది...
రిప్లయితొలగించండిసతికిని గిరిజకును శాంభవి, గౌరికి
రిప్లయితొలగించండిభక్త జనుల బ్రోచు బాంధవికిని
పార్వతికిని గొల్చు వారల చేతియు
సిరికి మగడు చంద్రశేఖరుండు
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండి‘అరచేతి ఉసిరి’ని బాగా పట్టేశారే! మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పట్టి పుట్టినింటి భాగ్యదేవతయంచు
రిప్లయితొలగించండిపరవసాన తనిసె గిరులరేడు
కామునేసి యమరె గట్లరాయునియింటి
సిరికి మగడు చంద్రశేఖరుండు
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మల్లెలవారిపూరణలు
రిప్లయితొలగించండిసంపద౦త తనకు స్వాధీన మయ్యును
భూతి పూసి కొనుచు భూత పతియె
జనుల కిడుట సిరులు శంకరు డయ్యెగా
సిరికి మగడు చంద్రశేఖరుండు
2.శంకరుండు తాను సరిదంపు తానాల
బిల్వదళము పూజ ప్రీతి నంది
ఇంపు జనులకిడడె నేపుగా శుభముల
సిరికి మగడు చంద్రశేఖరుండు
3.చిలికి నీళ్ళు కొన్ని చేతితో ఆకులన్
విసిరినంత శివుడు ప్రీతి నంది
శర్వుడతడు యేయు సర్వులు పతులుగా
సిరికి-మగడు చంద్రశేఖరుండు
కరుండు తాను
సతికి వక్షమందు స్థానమ్ము నొసగెను
రిప్లయితొలగించండిసిరికి మగడు.ఛ౦ద్రశేఖరుండు
సిగను నొకతె నుంచి సగభాగ మిచ్చెను
తనువున౦దు; నుమకు ఘనతజూపి
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
జలధి చిలుకు వేళ శౌరి అయ్యెను గద
సిరికి మగడు; చంద్ర శేఖరుండు
విషము మ్రింగి సర్వ విశ్వములను బ్రోచె
రాగి యొకరు మరియు త్యాగి యొకరు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బ్రహ్మ శారద పతి, పంకజ నాభుడు
రిప్లయితొలగించండిసిరికి మగడు, చంద్రశేఖరుండు
అద్రి రాజు కూతు రా భద్రకాళికి
భర్త, వీరె భక్త వరుల సురలు
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగౌరి గంగ లోన గౌరవ మెవరికొ!
రిప్లయితొలగించండివిప్పి జెప్ప మనగ, విష్ణు మూర్తి
సమర మాప, సంత సంబు నందె
సిరికి మగఁడు, చంద్రశేఖరుండు.
శక్తియున్నచోట?రక్తియుగనిపించు
రిప్లయితొలగించండివనములల్లుకొనగ?ఘనతబెరిగి
తపములెంచగలుగుతత్వంబునన్గిరి
సిరికిమగడు-చంద్రశేఖరుండు
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. ‘సమర మాపె, సంతసంబును పొందిరి’ అందామా?
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అందరికీ మహాశివరాత్రి పర్వదినశుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిహరుని గొల్చి నంత హరితానె మెచ్చును
హరిని గొల్చి నంత హరుడు మెచ్చు
భక్తుల హృదయాన వైరము లెంచరు
సిరికి మగఁడు, చంద్రశేఖరుండు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ ఫూరణ బాగున్నది. అభినందనలు.