పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు. ‘తోటి’ అనడం వ్యావహారికం. ‘రంభతోడ’ అనండి. ***** శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ, ‘రంభ’ శబ్దానికి ఉన్న అన్యార్థంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది.అభినందనలు. ***** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘ఏకపత్నీవ్రతుడు’ అని సమాసం చేయాలి కదా!
సి. రామమోహన్ గారూ, ఆలస్యంగా స్పందించినందుకు మన్నించండి. మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో యతి తప్పింది. ‘దేవతలను గూడి దేవేంద్రుడు మునులు’ అంటే సరి. పద్యం చివర ‘మిడిసిపడిరి’ అని ఉండాలనుకుంటాను. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాధ్వి సీత రాగ సంతోష ముగదాను
రిప్లయితొలగించండిరాము డ డవి కేగె , రంభ తోడ
మేనకాదులు మఱి మేళ మా దుడురట
చూర గొనుట కొరకు సురల మెప్పు
తండ్రి వరము లివ్వ తలవంచి సతి తోడ
రిప్లయితొలగించండిరాము దడవి కేగె , రంభ తోడ
విసిగి శాప మిచ్చె వేయేళ్ళు పడియుండ
కాచకమ్ము గాను గాధి జుండు
రాజమౌళ తీయ రంజైన చిత్రంబు
రిప్లయితొలగించండిరంభ తోటి యెన్టి రాము నుంచి
చిందు లేయు పాట చిత్రించగా నెంచ
రాముఁ డడవి కేఁగె రంభ తోటి!
ఈశు గొల్చినంత నింద్రలోకము దక్కు
రిప్లయితొలగించండిననెడు తలపుతోడ నడవికేగి
తపము సేయునట్టి దైత్యు వంచింప సు
త్రాముడడవికేగె రంభతోడ
అఱటి తోట లేయ యడవిన జనులెల్ల
రిప్లయితొలగించండిరైతు రాము ఎడద రగిలి పోగ
పట్టణానికేగి పట్టెతా పిలకలు
రాము డడవి కేగె రంభ తోడ!
ఆదిభట్ల వారల పూరణ బాగుంది.అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యోహం సహదేవుడుగారూ
రిప్లయితొలగించండిపోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
‘తోటి’ అనడం వ్యావహారికం. ‘రంభతోడ’ అనండి.
*****
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
‘రంభ’ శబ్దానికి ఉన్న అన్యార్థంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :రాజమౌళ తీయ రంజైన చిత్రంబు
రిప్లయితొలగించండిరంభ తోడ యెన్టి రాము నుంచి
చిందు లేయు పాట చిత్రించగా నెంచ
రాముఁ డడవి కేఁగె రంభ తోటి!
రామరావు తోడ రంభను జతజేసి
రిప్లయితొలగించండిచిత్రమొకటితీయు చింత తోడ
చిత్రయూనిటచట చేరితెలుప,ఎన్టి
రాము డడవి కేగె రంభతోడ
రమణి సీతను తన రంభగ భావించి
రిప్లయితొలగించండివలదు తనకునితర వెలదు లనెను
వెతల నందునైన విడువ తనననుచు
రాముఁ డడవి కేఁగె రంభతోడ
రిప్లయితొలగించండిరాము డడవి కేగె “రంభ తోడ”టంచు
వార్త తెచ్చె వేగు ప్రభువు కడకు
“రంభకాదు మూర్ఖ!రంభను మించిన
అందగత్తెసీత యనెను యసుర”
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిస్వర్గసీమ వీడి క్ష్మాస్థలి జేరి సు
త్రాముడడవి కేగె రంభతోడ
నామె చేత నాట్యమాడి౦చి దైత్యుని
తపము భంగ పరచు తలపు తోడ
మల్లెలవారి పూరణలు
రిప్లయితొలగించండికైక కోర్కె వలన కానల కేగగా
రాముతోడ వెడలె రమణి సీత
అందమందు నామె అలరును రంభయై
రాముడడవి కేగె రంభ తోడ
2.రంభ దేవవేశ్య;రాజిల్లు రాముడే
ఏక పత్ని వ్రతుడు ఏగె సీత
ధర్మపత్ని గాన;ధర్మంబు వీడి యే
రాముడడవి కేగె రంభ తోడ?
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది.అభినందనలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘ఏకపత్నీవ్రతుడు’ అని సమాసం చేయాలి కదా!
తండ్రిమాటగ పినతల్లికోర్కెయనుచు
రిప్లయితొలగించండిసీత లక్ష్మణునకుదూతదెలుప
రాముడడవికేగె|"రంభతోడ
ఇంద్రసభకుజేరెనిష్టసఖుడు"|
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇంద్ర పదవి గోరి యెక్కుడు దీక్షతో
రిప్లయితొలగించండితపము జేయుచుండె తపసి, రమ్ము
భంగ పరుప వలెను పద యని రయమె సు-
త్రాముఁ డడవి కేఁగె రంభతోడ
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"భీముడడవికేగి భీభత్సమును జేసె"
రిప్లయితొలగించండి"రాముడడవి కేగె,రంభ తోడ"
నిట్టి పలుకు లెల్ల వట్టి వౌననుచును
యూరి వార లెల్ల తేరు కొనిరి.
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామ చేత నోడ రయమున భార్గవ
రిప్లయితొలగించండిరాము డడవి కేగె రంభ తోడ
దేవతలను గూడి ఇంద్రుడు, మునులంత
మిగుల సంతసిల్లి మిగిసి పడిరి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిజనము రాముతోడ జానకినే జూచి
రంభయనుచు మెచ్చె, రామ రామ !
దిష్టి దగిలి నాడు కష్టమ్ములే రాగ
రాముఁ డడవి కేఁగె ' రంభ ' తోడ.
సి. రామమోహన్ గారూ,
రిప్లయితొలగించండిఆలస్యంగా స్పందించినందుకు మన్నించండి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో యతి తప్పింది. ‘దేవతలను గూడి దేవేంద్రుడు మునులు’ అంటే సరి.
పద్యం చివర ‘మిడిసిపడిరి’ అని ఉండాలనుకుంటాను.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.