21, ఫిబ్రవరి 2015, శనివారం

సమస్యా పూరణం - 1603 (దుర్గను బెండ్లాడెను హరి దుష్టాత్ముండై)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దుర్గను బెండ్లాడెను హరి దుష్టాత్ముండై.
(గరికిపాటి వారు పూరించిన ఒక సమస్య ఆధారంగా)

25 కామెంట్‌లు:

 1. దుర్గకు నచ్చుట వలనన
  దుర్గను బెండ్లా డెను హరి, దుష్టా త్ముండై
  దుర్గను గెలువక నరకుడు
  దుర్గమ మగు చావు చచ్చె దురమున నందున్

  రిప్లయితొలగించండి
 2. సొర్గము నందున దివిజుడు
  దుర్గను బెండ్లాడెను హరి , దుష్టాత్ముండై
  దుర్గమ మనియెంచి యసురుడు
  భర్గుని సతినే తమిగొని బడయగ నెంచెన్

  రిప్లయితొలగించండి
 3. స్వర్గపు వ్రాతలవేమో
  దుర్గారావ్ పుత్రుడాస్తి దోచుట కొరకై
  మార్గము నెంచుక " లవ్వని "
  దుర్గను బెండ్లాడెను హరి దుష్టాత్ముండై.

  రిప్లయితొలగించండి
 4. వర్గమొకటి కాని విజయ
  దుర్గను బెండ్లాడెను హరి; దుష్టాత్ముండై
  దుర్గుణముల కలవడి కడు
  దుర్గతుడగు దండ్రి యొప్ప దుర్లభమనుచున్

  రిప్లయితొలగించండి
 5. పోచిరాజు సుబ్బారావు గారూ,
  దుర్గ అనే అమ్మాయిని హరి అనే అబ్బాయి పెళ్ళిచేసుకున్నాడనుకుంటే బాగుంటుంది. కాని నరకుని ప్రస్తావనతో ఆ హరి కృష్ణుడే అనుకోవలసి ఉంటుంది. కృష్ణుడైనా నరకుడైనా దుర్గను కోరలేదు కదా! మరో ప్రయత్నం చేయండి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. కానీ పూర్వార్ధంలో హరి అనే దివిజుడు దుర్గను పెళ్ళాడడం ఏమిటి? ఉత్తరార్థంలో మీరు ప్రస్తావించిన అసురుడు ‘భూకైలాస్’ రావణుడే కదా! ‘సొర్గము’ అనడం దోషమే. మూడవ పాదంలో గణదోషం.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మాజేటి సుమలత గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి


 6. కని, నిటలాక్షుడు మదనుని
  తునుమాడిన పిదప తాను దుర్గను పెండ్లా
  డెను.హరి దుష్టాత్ము౦డై
  న నరకు ననిలోన సంహనము నొనరించెన్

  రిప్లయితొలగించండి
 7. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ చాలా బాగున్నది. దుష్కరప్రాసను, భావక్లిష్టతను పరిహరించిన తీరు ప్రశంసనీయం. అభినందనలు.
  ‘సంహననము’ ఉంది కాని ‘సంహనము’ లేదు. ‘సంహనన మొనరించెన్’ అనండి.

  రిప్లయితొలగించండి
 8. స్వర్గ సుఖమ్మాసించియు
  మార్గము కనిపెట్టి వివిధ మహితార్థ సఖిన్
  దుర్గుణ కర్మవిహీనుడు
  దుర్గను బెండ్లాడెను హరి దుష్టాత్ముండై.

  రిప్లయితొలగించండి
 9. మల్లెలవారి పూరణలు
  వర్గమున౦దున వే శ్రీ
  దుర్గను పెండ్లాడెను హరి -దుష్టాథ్ము౦డై
  పర్గగ హాలాహలమును
  నిర్గుణుడై తాను మింగె నిబ్బర హరుడే
  2.భర్గు౦ డెవ్వరి చేగొనె?
  నిర్గుణుడై బలిని నొంచె నియతిని నెవడో?
  దుర్గతి నెటు గొనె కంసుడు?
  దుర్గను బెండ్లాడెను- హరి- దుష్టాత్ముండై


  రిప్లయితొలగించండి
 10. గురుదేవుల సూచనమేరకుపద్యమును సవరించితిని
  కని, నిటలాక్షుడు మదనుని
  తునుమాడిన పిదప తాను దుర్గను పెండ్లా
  డెను.హరి దుష్టాత్ము౦డై
  న నరకు ననిలోన సంహనన మొనరించెన్
  ఫిబ్రవరి 21, 2015 11:53 [AM]

  రిప్లయితొలగించండి

 11. వర్గముగూర్చి తలంచక
  దుర్గను బెండ్లాడెను హరి,దుష్టాత్ముండై
  దుర్గసహోదరుడు కసిన్
  మార్గమునందునను కాసి మడయించె హరిన్

  రిప్లయితొలగించండి

 12. భర్గుడెవరిని వరించె? త్రి
  వర్గాతీతుడదెవండు? భస్మాసురుడే
  మార్గము భక్తిని మరచెను?
  "దుర్గను బెండ్లాడెను" " హరి" "దుష్టాత్ముండై"

  రిప్లయితొలగించండి
 13. దుర్గ తన నొప్ప దనుచున్
  మార్గాంతరమున వరించ మాటున దానే
  నిర్గాంత పోవునటులన్
  దుర్గను బెండ్లాడెను హరి దుష్టాత్ముండై!

  రిప్లయితొలగించండి
 14. దుర్గను-హరి| ప్రేమించగ
  వర్గ-మసమ్మతిదెలుపగ?పట్టునువిడకన్
  దుర్గమమైననుమరదలు
  దుర్గనుపెండ్లాడెనుహరి-దుష్టాత్ముండై

  రిప్లయితొలగించండి
 15. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణలోని భావం అర్థం కాలేదు. దయచేసి వివరించండి.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ మొదటి పూరణలో హరి శ్రీదుర్గను పెళ్ళాడడం అర్థం కాలేదు. ఉత్తరార్ధం బాగుంది.
  క్రమాలంకారవిధానంలో మీ రెండవ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కానీ ప్రేమించిన అమ్మాయిని పెళ్ళిచేసుకున్నవాడు దుష్టాత్ముడెలా అవుతాడు?

  రిప్లయితొలగించండి
 16. గురుదేవులకు వందనములు. నా పద్యం మీ దృష్టిలో పడక తప్పింది.

  రిప్లయితొలగించండి
 17. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  నిజమే... ఎందుకో తప్పింది. మన్నించండి.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘నిర్ఘాంత’మును ‘నిర్గాంత’ మన్నారు. ‘మాటున దా దు|ర్మార్గుడయి యపహరించియు| దుర్గను బెండ్లాడె...’ అనండి.

  రిప్లయితొలగించండి
 18. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
  దుర్గ తన నొప్ప దనుచున్
  మార్గాంతరమున వరించ మాటున దా దు
  ర్మార్గుడయి యపహరించియు
  దుర్గను బెండ్లాడెను హరి దుష్టాత్ముండై!

  రిప్లయితొలగించండి
 19. తనుగాసిన పందెంబం
  దునెగ్గ బలవంతముగను దుర్గను బెండ్లా
  డెనుహరి దుష్టాత్ముండై
  తన స్నేహితులందు గొప్పదసమును చాటన్

  రిప్లయితొలగించండి
 20. దుర్గకు నచ్చుట వలనన
  దుర్గను బెండ్లా డెను హరి, దుష్టా త్ముండై
  దుర్గకు చెడ నా రోగ్యము
  దుర్గతులకు బాలుజే సి దురితుడు నయ్యెన్

  రిప్లయితొలగించండి
 21. భర్గుడు వృష వాహను డా
  దుర్గను పెండ్లాడెను;హరి దుష్టాత్ముండై
  సర్గము మరచుచు గిబ్బల
  వర్గము నెదిరించె జాతి వైరము చేతన్
  హరి=సింహము [దుర్గాదేవి వాహనము]

  రిప్లయితొలగించండి
 22. కె యెస్ గురుమూర్తి ఆచారి గారిపూరణ
  భార్గవ రావు చేసుకొనెను
  దుర్గను పెండ్లాడెను;హరి దుష్టాత్ముండై
  దుర్గుణ వతి దుర్గ యనుచు
  స్వర్గము దుర్గమమగుననొకొ ప్రాపతి౦చినచో  రిప్లయితొలగించండి
 23. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి