గుండు మధుసూదన్ గారూ, బహుకాల దర్శనం. చాలా సంతోషం. బ్లాగు మిత్రులు మీ పూరణలకోసం, సూచనలకోసం ఎదురుచూస్తున్నారన్న విషయం సూర్యనారాయణ గారి పరామర్శతో మీకు అర్త్థమయిందనుకుంటాను. బ్లాగులో మీ లోటు స్పష్టంగా తెలుస్తున్నది. ఇక మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
ఏదది యనేది వారి వారి యిష్టం మరి.... వదలవు దాని రుచి మరిగి న దిన దినము గోరెదవిక తరగని నిధి రా యది, గ్రోలగ శుద్దియగు నీ మది, రా! "పానమ్ము ముక్తిమార్గమ్ము గదా!"
వదలుము నీవెటులైనను
రిప్లయితొలగించండిమదిరాపానమ్ము - ముక్తి మార్గమ్ముగదా
హృదిలో భగవంతు నిలుప?
తదేక దీక్షన్ గొలువుము దైవంబునికన్
ఎదమండెడి యడియాశల
రిప్లయితొలగించండిమదిరా పానమ్ము , ముక్తి మార్గమ్ము కదా !
వదలక శివపా దమ్ముల
సుధనే గ్రోలంగ మిగులు సోముని కృపయే
మది నింజె ఱచును గద యీ
రిప్లయితొలగించండిమదిరా పానమ్ము, ముక్తి మార్గమ్ము గదా
హృదినిం శంక రు నిలుపుచు
నెదపొంగగ భజన జేయ నెప్పుడు భువిలోన్
అది దయ సేయును శాంతిని
రిప్లయితొలగించండిపదవులు సిరులును ధనమ్ము పస లేనివి శ్రీ
పదు దివ్య నామ మధు రస
మది రాపానమ్ము ముక్తిమార్గమ్ము గదా!
usha&camp;sarma అని పోస్ట్ అయిన పూరణ మిస్సన్నది గా చదువుకోమని మనవి
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివదలనిజాడ్యంబదియే
రిప్లయితొలగించండిమదిరాపానమ్ము|"ముక్తిమార్గమ్ముగదా
చదువును,సంస్కారమ్మును
పదిలముగాబంచుగురువు?పరమాత్ముండే|"
అది రామ నామమే యగు
రిప్లయితొలగించండినది మధుర మధుర ముగదర యమృతముకంటెన్
మదిలోన కోరి నిలుపు
మదిరా ! పానమ్ము ముక్తిమార్గమ్ము గదా !
మాదిలోమమతలుదృంచును
రిప్లయితొలగించండిమదిరాపానమ్ము|"ముక్తిమార్గమ్ముగదా
వదలకపీడితజనులకు
అదనపుసేవలనుబంచ?నదియెకవరమే|"
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మదినిం శంకరు’ అన్నారు. ఆదేశసరళానికి ముందున్న ద్రుతానికి బిందురూపం వస్తుంది. శ ఆదేశసరళం కాదు. అందువల్ల ‘మదినిన్’ అనే ఉండాలి.
****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
‘అదిరా పూరణకు మార్గ మందును సుకవీ’.. బాగుంది మీ పూరణ. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ద్రుంచును-దృంచును, యొక వరమే- యెక వరమే’ ...టైపాట్లు.
మదమెక్కించును సుమ్మా
రిప్లయితొలగించండిమదిరా పానమ్ము ముక్తి మార్గమ్ము గదా!
మదను పితురుని స్మరించుట
మదిని హరి భజించుడయ్య మానవులారా!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నుదుటన్ రాముని నామము
రిప్లయితొలగించండిమదిలో నా యయ్య నామ మంత్రమ్మిడగన్
వదలగలేని యతి రస
మ్మదిరా! పానమ్ము ముక్తి మార్గమ్ము గదా!
పదిలము నీయదు జనులకు
రిప్లయితొలగించండిమదిరా పానమ్ము , ముక్తి మార్గమ్ము గదా!
మదిలో రామస్మరణము
వదలక మరి జేయవలెను వందన మనుచున్!!!
సదమల మతితో సతతము
మృదుమార్గములను వదలక హృదయము నందున్
మధుసూదన నామామృత
మదిరా పానమ్ము ముక్తి మార్గమ్ము గదా!!!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వదలక హరి నామంబును
రిప్లయితొలగించండిమదిలో స్మరియించ దొలగు మలినమ్ము హృదిన్
పద ! సేవింతము శ్రీహరి
మదిరా పానమ్ము ముక్తి మార్గమ్ము గదా!
కే*యస్*గురుమూర్తిగారిపూరణం
రిప్లయితొలగించండిమదిగలచింతలకెల్లను
మదిరాపానమ్ము-ముక్తిమార్గమ్ముగదా
మదిమదిగ్రోలుమటంచును
ముదిరునకందించెయొక్కముదిర|ముదమునన్
ముక్తి=విముక్తి
ముదిర=వేశ్య
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
హృదినే రాముని తలచుచు
రిప్లయితొలగించండివదలక నామము పలికెడు వాడై హనుమే
పొదలెను భక్తిని,నామపు
మదిరా పానమ్ము ముక్తి మార్గమ్ము గదా!
ఎద తలతురు కొందరిలను
మదిరను సేవింప నిడుము మాయంబగునం
చెదగన నిండగు భక్తను
మదిరా పానమ్ము ముక్తిమార్గమ్ము గదా!
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘హనుమ+ఏ, భక్తి+అను’ అన్నచోట్ల యడాగమం వస్తుంది. ‘వాడు హనుమయే, ఎద గన సద్భక్తి యనెడు| మదిరా...’ అనండి.
వదలక చేయుచు నుండిన
రిప్లయితొలగించండిమదిరా పానమ్ము ముక్తిమార్గమ్ము గదా!
యదియే పరువును దీయును
నదియే పరువునకు గుర్తునై విలసిల్లెన్!
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రులందఱకు నమస్కారములు!
రిప్లయితొలగించండిమదిలోన నెపుడు నిలిపియుఁ
బదిలముగా స్మరణఁ జేయ భద్రత నిడురా!
"యిది శ్రీరామ రస మనెడి
మదిరా పానమ్ము" ముక్తిమార్గమ్ము గదా!!
గురువులు గుండు మధుసూదన్ గారు చాలారోజులతరువాత బ్లాగు లొ కనిపిస్తున్నారు ...ఆరోగ్యం బాగుందా సార్
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణగారూ, నేను అనారోగ్యకారణములవలననే బ్లాగునకు దూరముగా ఉండవలసివచ్చినది. ప్రస్తుతము నా ఆరోగ్యము కుదుటపడినది. పరామర్శించినందులకు సంతోషము కలిగినది. ధన్యవాదములు. స్వస్తి.
రిప్లయితొలగించండిగుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిబహుకాల దర్శనం. చాలా సంతోషం. బ్లాగు మిత్రులు మీ పూరణలకోసం, సూచనలకోసం ఎదురుచూస్తున్నారన్న విషయం సూర్యనారాయణ గారి పరామర్శతో మీకు అర్త్థమయిందనుకుంటాను.
బ్లాగులో మీ లోటు స్పష్టంగా తెలుస్తున్నది.
ఇక మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
ఏదది యనేది వారి వారి యిష్టం మరి....
రిప్లయితొలగించండివదలవు దాని రుచి మరిగి
న దిన దినము గోరెదవిక తరగని నిధి రా
యది, గ్రోలగ శుద్దియగు నీ
మది, రా! "పానమ్ము ముక్తిమార్గమ్ము గదా!"
పదుగురు పిల్లల తోడుగ
రిప్లయితొలగించండిగదిలో జీవించి మురుగు కాల్వల మధ్యన్
నిదురయె పట్టని రాత్రిన్
మదిరాపానమ్ము ముక్తిమార్గమ్ము గదా!
సదమల చంద్రుడ వినుమా!
రిప్లయితొలగించండికదలకయే సీటు నుండి కమ్మగ మనకున్
పది కోటుల పన్ను లిడెడి
మదిరాపానమ్ము ముక్తిమార్గమ్ము గదా!