16, ఫిబ్రవరి 2015, సోమవారం

పద్యరచన - 823

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. సుందర వదనను వచ్చితి
    నందములందించి నిన్నునలరింపంగన్
    పొందుమెనలేని సుఖముల
    నెందులకీ తపము చేరుమీకౌగిలిలో

    రిప్లయితొలగించండి
  2. విశ్వా మిత్రుని దపమును
    నశ్వరముగ జేయ దలచి నటి మేనకయున్
    విశ్వా మిత్రుడు గలయా
    విశ్వమ్మున కేగు దెంచి వేడుక జేసెన్

    రిప్లయితొలగించండి
  3. వచ్చితి జిలేబి పద కేళీ ల తో
    మునివరా!కవివరా!కందివరా !
    ఈ పద కేళీ లను రసరమ్య
    పద్యగుళికలు గా మార్చు మయా !

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. జాలము వేసితి నీవిక
    బేలను సొగసరి లతయని వేలుపు పంపెన్
    లీలగ తపము నటించిన
    హేలకు నినువీడ దయ్య మేనక యనగా

    రిప్లయితొలగించండి
  5. చక్కదనా లూరించవె?
    ముక్కున గాలిని బిగించ మోదంబగునే?
    నిక్కిన యందాల సిరుల
    గ్రక్కున కౌగిట సుఖించ గాధిజ రారా!

    రిప్లయితొలగించండి
  6. మౌని కౌశికు తపమును మాన్పజేయ
    మేఘవాహను పనుపున మేనకేగి
    పూవిలుతుని బాణహతిని పొందజేయ
    పట్టికలిగెవారల ప్రేమ ఫలముగాను

    రిప్లయితొలగించండి
  7. బ్రహ్మ ఋషిమేనకను జేరి ప్రణయ మాడ
    చూలుదెచ్చె శకుంతలన్ శోభనమున
    వల్ల కాదని బిడ్డను వనము లందు
    తల్లి తండ్రులు వీడగ దయను వీడి
    కణ్వ ఋషి బెంచె బిడ్డను కరుణ తోడ
    అచ్చ భరత చరిత కిది మచ్చ కాదె!!

    రిప్లయితొలగించండి
  8. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పద్యము
    మేనకాప్సర పొంగుచుండెడి మేని సొంపుల జూపి యా
    మౌని గాధి తనూజు గూడె,కుమారి గాంచుచు ,క౦దువున్
    కాన వీడె,శకు౦తలన్ గని కణ్వు డామెను పెంచె యా
    చాన యే భరతాఖ్య మాతగ సద్యశో విభూష యౌ

    రిప్లయితొలగించండి
  9. సాలె గూడు లల్లు కొనిన సంయమీంద్రు
    తపము భంగ మొనర్చగ తరలివచ్చి
    చూపు తూపుల నేయక వీపు జూప
    పాడియా?! ఎట్టి యప్సరవె నీవు ?

    రిప్లయితొలగించండి
  10. నాటకమందుమీనటననచ్చెడిరీతిగనుండుటాయె|మీ
    చాటునహావభావములుచక్కటినాట్యములెంచిపంచగా?
    నాటియురంభలాగ|అలనాటియుసంస్కృతివేషభాషలున్
    దాటియుజూపగా?తగినదర్పమునింపగ?కౌశికుండనన్|

    రిప్లయితొలగించండి
  11. ఈనాటి శీర్శికకు చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులు....
    చందమౌళి సూర్యనారాయణ గారికి,
    సుబ్బారావు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారికి,
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    జిలేబీ గారూ,
    కలతపెట్టే పరిస్థితుల్లో ఉండి మీ భావానికి ఛందోరూపం ఇవ్వలేకపోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి