14, మే 2015, గురువారం

సమస్యా పూరణము - 1674 (కాకరకాయల రసమ్ము గడు మధుర మగున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కాకరకాయల రసమ్ము గడు మధుర మగున్.

36 కామెంట్‌లు:

  1. నాకమృతసమానమగును
    భీకరమగు చేదుకూడ ప్రియతమ వినుమా
    నీకరములతోనిచ్చిన
    కాకర కాయల రసమ్ము కడుమధురమగున్

    రిప్లయితొలగించండి
  2. శాకము లందున శ్రేష్టము
    కాకర కాయల రసమ్ము, గడు మధుర మగున్
    పాకమున కూర వండిన
    నాకము గనుపించు నంట నళిన దళేక్ష

    రిప్లయితొలగించండి
  3. కం.సోకెనుమధుమేహమనుచు
    తాకనుమధుపానియమని తావ్యధచెందెన్
    నాకీజన్మకు పోయుడు
    కాకర కాయల రసమ్ము కడుమధురమగున్.

    రిప్లయితొలగించండి
  4. కం. నాకిన తీపులు షుగరయె
    నాకోద్దికచాలునాకునరములుపీకేన్
    మీకిదె చెబుదును నిజముగ
    కాకర కాయల రసమ్ము కడుమధురమగున్.

    రిప్లయితొలగించండి
  5. ఆ కవి వేమన చెప్పెను
    గా కోరి తినఁ దిన వేము గడుఁ దియ్యన నౌఁ
    గా కడు నభ్యాసమ్మున
    కాకరకాయల రసమ్ము గడు మధుర మగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాకర రసాన్ని నిజంగానే మధురంగా మార్చే ప్రక్రియ తెలియ జేసిన మీకు
      నమోన్నమః

      తొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    టైపాటు వల్ల నళినదళేక్షా... హ్రస్వమయింది.
    *****
    పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘పానీయము’ను ‘పానియము’ అన్నారు. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    టైపాటు వల్ల నళినదళేక్షా... హ్రస్వమయింది.
    *****
    పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘పానీయము’ను ‘పానియము’ అన్నారు.

    రిప్లయితొలగించండి
  7. ఏకారణముల్ లేకనె,
    రాకా చంద్రునకు మించు రమణిముఖముపై
    రాకాసి రసము కంటెన్
    కాకర కాయల రసమ్ము గడు మధురమగున్

    రిప్లయితొలగించండి
  8. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    భీకర మధు మేహులకిల
    కాకరయే మేలుగూర్చు ఘనయౌషధ మౌ
    శోకము గూర్చెడిదైనను
    కాకరకాయల రసమ్ము గడు మధుర మగున్.

    రిప్లయితొలగించండి
  9. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు ప్రణామములతో...

    కంది శంకరయ్యగారూ,
    మీ పూరణ మందఱకును మార్గదర్శకమై యొప్పారుచున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    కృత్రిమమైన ఫేస్‍క్రీమ్‍ల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. భీకర తిక్తాన్వితమౌ
    కాకరకాయల రసమ్ము;కడు మధురమగున్
    చేకొన చెరుకు రసమ్మది
    కాకను తగ్గించి యిచ్చు కడు మోదంబున్

    రిప్లయితొలగించండి
  12. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. ఏకరువేలర? కష్టము
    సాకారముఁ జేయు కలల సంతసమందన్!
    చేకూరు మేలుఁ దలచిన
    కాకర కాయల రసమ్ము గడు మధురమగున్!

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. భీకరమేహపు రోగికి
    కాకరకాయల రసమ్ము కడుమధురమగున్
    చేకురు స్వస్థత రయమున
    కైకొనుడారసమునెపుడు కరమగు తుష్టిన్

    రిప్లయితొలగించండి

  17. 1.సోకగ మధుమేహపు రుజ
    కాకరకాయల రసమ్ముకడు మధురమగున్
    ప్రాకటన మాధురి కలుగు
    మాకందపు పండ్ల రసము మరి విషమవదే
    2.తేకువ యధిపతి నుడివెను
    కాకరకాయల రసమ్ముకడు మధురమగున్
    కా,కా,పట్టెడు మూకలు
    కూ,కూ,యని,వంత పాడు కోపునుగనరే

    రిప్లయితొలగించండి
  18. గుర్వుగారు మీ సూచన తొ మార్చిన పిదప
    -------------------------------

    సోకెనుమధుమేహమనుచు
    తాకనుమధుపానకములు తావ్యధచెందెన్
    నాకీజన్మకు పోయుడు
    కాకర కాయల రసమ్ము కడుమధురమగున్

    రిప్లయితొలగించండి
  19. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్కృతులతో...

    కాకర రసమది కొంచెము
    నేకముగనుఁ జక్కెర మఱి యెక్కువ యిడియున్
    బాకమునుఁ జేసి త్రాగఁగఁ
    గాకరకాయల రసమ్ము కడు మధుర మగున్!!

    రిప్లయితొలగించండి
  20. కవిశ్రీ సత్తిబాబు గారి పూరణ....

    శాకపు వైద్యుడు కాకర
    కాకరతో తొలగు పెక్కు కలుషము లెన్నో
    కాకర తినవలె నెప్పుడు
    కాకర కాయల రసమ్ము కడుమధురమగున్.

    రిప్లయితొలగించండి
  21. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    *****
    కవిశ్రీ సత్తిబాబు గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
    అందరికీ అభివందనములు ...గురువు గారి మరియు పెద్దల పూరణలు అలరించుచున్నవి...
    ==============*================
    కాకర కాయల దిను నా
    శాకాహారి యగు జీవి స్వస్థత జెందన్,
    ఈ కలియుగ రోగుల కున్
    కాకర కాయల రసమ్ము కడుమధురమగున్..!

    రిప్లయితొలగించండి
  23. భీక రమౌ చే దుగలుగు
    కాకర కాయల రసమ్ము, గడు మధుర మగున్
    వ్యాకరణం బె ఱి గినచో
    నేకావ్యపు సారమైన నింపుగ మదికిన్

    రిప్లయితొలగించండి
  24. కాకర కాయలను గనిన
    భీకర రోగమ్ములు మరి భీతిని జెందన్,
    సోకిన మధు మేహము, ఆ
    కాకర కాయల రసమ్ము కడుమధురమగున్

    రిప్లయితొలగించండి
  25. భీకర రోగమ్ములు మరి
    సోకిన జనులెల్ల జేరి సొక్కగ స్వామిన్
    శ్రీకరు డగు హరి యిచ్చిన
    కాకర కాయల రసమ్ము కడుమధురమగున్..!3!

    రిప్లయితొలగించండి
  26. శ్రీకరుని భక్త తతికిన్
    కాకర కాయల రసమ్ము కడుమధురమగున్
    భీకర రాక్షస తతికిన్
    చేకూరదు స్వస్థత మరి సిరులు గలిగినన్..!4!

    రిప్లయితొలగించండి
  27. కందుల వరప్రసాద్ గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. భీకర రోగము లెన్నియొ
    కాకర పోగొట్టు ననరె కల్పచికిత్సన్
    చేకురు నారోగ్యమెపుడు
    కాకర కాయల రసమ్ము కడుమధురమగున్

    కాకర వండిన బెల్లపు
    పాకమ్మున పులుసుగాను,వదలరు దానిన్
    లోకము నెవరును తినకను
    కాకరకాయల రసమ్ము కడుమధురమగున్

    వే కన రుచులారును నవి
    చేకూర్చు సమముగ దేహ సేమము ననరే
    కాకర చేదును వండిన
    కాకరకాయల రసమ్ము కడుమధురమగున్

    వేకువ కాకర రసమది
    చేకొన మధుమేహమిడెడి చేటులు తొలగున్
    రాకయు నుందగ జేయును
    కాకరకాయల రసమ్ము కడుమధురమగున్

    రిప్లయితొలగించండి
  29. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. భీకర మధుమేహమ్మే
    తాకిన జనులికను తీపి తాగరు మదిలో
    త్రాగుట కొరకై దల్తురు
    " కాకర కాయల రసమ్ము కడుమధురమగున్ "

    రిప్లయితొలగించండి
  31. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. ఆకలితో తినగ తినగ
    భీకరమౌ రసమలైలు బెంగాలందున్
    శ్రీకరముగ వైద్యుడొసగు
    కాకరకాయల రసమ్ము గడు మధుర మగున్!

    రిప్లయితొలగించండి
  33. పోకిరి పందెము లోనన్
    తేకువ మీరంగ బుధుడు తినగ జిలేబీల్
    భీకరముగ వందలహహ!
    కాకరకాయల రసమ్ము గడు మధుర మగున్

    రిప్లయితొలగించండి