15, మే 2015, శుక్రవారం

సమస్యా పూరణము - 1675 (గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్.

26 కామెంట్‌లు:

  1. వీడగ తారక శైలము
    బూడిద పూతలను పూసి భూమిని దిరుగన్
    చేడియను జేర దలచిన
    గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్

    రిప్లయితొలగించండి
  2. పీడల నణచగ నెల్లరు
    వేడగ కైలాస శిఖరి వీడుచు సతియున్
    పోడిమి శీతల యైజనె
    గాడిదనెక్కి, హరుడు కాశికి నేగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శీతలా దేవిి వాహనముు ఖరము. శీతలాదేవి పార్వతీదేవి అవతారము. జ్వరము,అమ్మవారు, మొదలగు పీడలు ఆమె దయవలన తగ్గుతాయి.

      తొలగించండి
  3. ఓడ్రించుచు నొక గాడిద
    వాడల, వాడల దిరుగగ, హరుడను వటుడా
    గాడిద నెక్కగ, సఖుడనె
    "గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్".

    నిన్నటి పూరణ:
    ఆకొను వేళల దొరకెడి
    కాకర శాకంబు మిగుల గమ్మదనంబా
    హా! కలిపి చారు, నంచగ
    కాకరకాయల, "రసమ్ము" గడు మధుర మగున్!

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మాజేటి సుమలత గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. లేడని తిట్టకు దేముని
    మూడును కష్టమ్ములెన్నొ పొందెదవు సుమా
    వేడెద! తిరుగకుమనుచును
    గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. పోడిమి నంది విమానము
    పాడైనది.తంతి నిచ్చిపార్వతి పిలిచెన్
    తోడన పూన్చిన కంచర
    గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్

    మే 15, 2015 10:00 [AM]

    రిప్లయితొలగించండి
  8. కూడిన పాపపు మలినము
    తోడగు గంగమ్మ యుతక దురితనివారున్
    వేడగ, కోడెను వీడుచు
    గాడిద పైనెక్కి హరుఁడు కాశికి నేగెన్!
    (పరమేశ్వరుడు భక్తపరాధీనుడు వారికోసం ఏమైనా చేయగల భోళా శంకరుడు)

    రిప్లయితొలగించండి
  9. వేడెడి భక్తుల బ్రోవగ
    తోడుగ రమ్మని బిలువగ దుర్గయె నాధున్
    జోడుగ సతి వాహనమగు
    గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్!!!

    రిప్లయితొలగించండి
  10. వేడగ చండిక భర్తను
    పోడిగ భక్తులను బ్రోచు పూనికతోడన్
    వేడుక సతివాహనమగు
    గాడిదపైనెక్కి హరుఁడు కాశికి నేఁగెన్

    రిప్లయితొలగించండి
  11. మాడుగుల రామ చంద్రుడు
    వీడక మద్యమును నెపుడువె ఱ్ఱి గ బలికెన్
    కూడలి యొద్దన జూచితి
    గాడిద పైనెక్కి హరుడు కాశికి నేగెన్

    రిప్లయితొలగించండి
  12. కె.యస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    ఆడె సభన్ నాస్తికు డిటు
    "గాడిద పైనెక్కి హరుడు కాశికి నేగెన్"
    వా-డటు కూయగ సభికులు
    తాడించిరి చెప్పుల గొని దాటు మటంచున్

    రిప్లయితొలగించండి
  13. వీడెను కైలాసమ్మును
    చేడియతో గూడి, యామె శీతల తానై
    వేడగ భక్తులు చనియెను
    గాడిద పై నెక్కి, హరుడు కాశికి నేగెన్.

    రిప్లయితొలగించండి
  14. తోడిల విశ్వేశ్వరుడని
    పాడుచు మై మరచి కలగ భక్తియు తనలో
    నీదగ జేరగ?వెంటనె
    గాడిదఫై నెక్కి హరుడు కాశికి నేగెన్

    రిప్లయితొలగించండి
  15. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘దేముని’ అనరాదు. ‘దేవుని’ సాధురూపం.
    *****
    కెంబాయి తిమ్మజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు వందనములతో...

    [వోఢ(నందీశ్వరుఁడు) వ్యాధిగ్రస్తుఁడై మార్గమధ్య మందశక్తుఁడు కాఁగా, హరుఁ డక్కడనే యున్న గాడిదపై నెక్కి కాశికిఁ జనెనని చమత్కారము]

    వేడుక తోడుత వృషభా
    రూఢుండై చనుచునుండ, రుజ బాధితుఁడై
    వోఢ చతికిలఁ బడ, నచటి
    గాడిదపై నెక్కి, హరుఁడు కాశికి నేగెన్!

    రిప్లయితొలగించండి
  18. గుండు మధుసూదన్ గారూ,
    మీ చమత్కారపూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. కూడిన బుద్ధిని హరుడును
    వేడుకగా పనులు జేయ,వేరొక యూరన్,
    పాడిని మసలగ,నేగెను
    గాడిద పైనెక్కి హరుడు కాశికి నేగెన్

    వేడుక గాగను దొంగిల
    గూడెము నుండెడి జనులల గుంపుగ కాశిన్
    చూడగ నేగగ,వెనుకగ
    గాడిద పైనెక్కి హరుడు కాశికినేగెన్

    గాడిద శ్రమకు ప్రతీకయ
    వాడగు నడకను బరువులు బాగుగమోయన్
    చూడగ దానిని గుర్తిలి
    గాడిదపైనెక్కి హరుడు కాశికి నేగెన్

    మాడల దొంగిల మానియు
    వేడుక పుణ్యంబునంద వేడినదొంగా
    నాడెపు ఖరమటు పనిగొన
    గాడిదపైనెక్కి హరుడు కాశికి నేగెన్

    హరుడు=దొంగ;కాశికి=కాశికకు,పనికి

    రిప్లయితొలగించండి
  20. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    బూడిద పూసిన గాడిద
    పై డప్పులు గొట్టు వాడు తూలుచు బలికెన్
    చూడుడు 'వృషభం' బనుచునె
    గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్

    రిప్లయితొలగించండి
  22. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. రోడులు నుత్తరఖండున
    వాడుక మీరంగ పెక్కు వానలలోనన్
    పాడవగను గతిలేకయె
    గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్

    రిప్లయితొలగించండి
  24. కూడుచు స్ట్రైకున నెద్దులు

    పాడిగ పోవంగ మేటి పద్ధతిలోనన్
    చూడగ నగవుచు నందియె
    గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్

    రిప్లయితొలగించండి