16, మే 2015, శనివారం

సమస్యా పూరణము - 1676 (మఠమున సన్యాసి యొకఁడు మానినిఁ గూడెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
మఠమున సన్యాసి యొకఁడు మానినిఁ గూడెన్.

28 కామెంట్‌లు:

  1. కఠినంబగు వేదమ్ముల
    పఠనము చేయంగలేను వలదిక యనుచున్
    శఠియించి పెండ్లియాడిన
    మఠమున సన్యాసి యొకఁడు మానినిఁ గూడెన్

    రిప్లయితొలగించండి
  2. శఠారి దీవించె ననుచు
    మఠమున సన్యాసి యొకఁడు మానినిఁ గూడెన్
    పిఠరము తోబాది తలను
    కఠినముగా జూచి కలికి గలగల మవ్వెన్
    ----------------------------

    శఠారి = శఠగోపము ,నమ్మాళ్వార్
    పిఠరము = కవ్వపు కోల

    రిప్లయితొలగించండి
  3. క్షమించాలి మొదటి పాదము
    " శఠగోపము దీవెనలిడ " అని ఉంటే కుదురు తుందేమో అని

    రిప్లయితొలగించండి
  4. హఠయోగము నేర్చుకొనుచు
    కఠినత్వము వీడనెంచి జ్ఞానము పొందన్
    పఠియించగ, వద్దన్నను
    మఠమున సన్యాసి, యొకఁడు మానిని గూడెన్

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    విప్రనారాయణ సినిమాలో విప్రనారాయణుడు :

    01)
    _______________________________

    కఠినమగు బ్రహ్మచర్యము,
    కఠమున నదె రంగ రంగ - కలకాలంబున్,
    హఠమును, శఠమును, వీడుట
    మఠమున సన్యాసి యొకఁడు - మానినిఁ గూడెన్ !
    _______________________________
    కఠము = కంఠస్వరము
    హఠము = యోగవిశేషము
    సన్యాసి = విప్రనారాయణుడు
    శఠము = కోపము

    రిప్లయితొలగించండి
  6. తటినీ తీరమునందున
    చటులమ్మైన మదినొక్క శర్వరి దోచన్
    కఠినపునియమముల విడచి
    మఠమున సన్యాసి యెకడు మానిని గూడెన్

    రిప్లయితొలగించండి
  7. గాడేపల్లి వీరరాఘవ శాస్త్ర్రి గారి పూరణ.....

    పఠనాభ్యాసాదులలో
    శఠుఁ డయ్యును సన్యసించి స్మరశరబాణో
    ల్లుఠితాంతరాత్ముఁ డగుచున్
    మఠమున సన్యాసి యొకఁడు మానినిఁ గూడెన్.

    రాళ్ళబండి నృసింహ శాస్త్రి గారి పూరణ....

    కఠినములగు పూముల్కులు
    శఠుఁడై మదనుండు వేయ శమదమములు వీ
    డి ఠవరతనమున కొడఁబడి
    మఠమున సన్యాసి యొకఁడు మానినిఁ గూడెన్.

    (‘గాడేపల్లి వీరరాఘవ శాస్త్ర్రి గారి చమత్కార పద్యములు’ గ్రంథమునుండి)

    రిప్లయితొలగించండి
  8. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది (సవరణతో). అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మంచి ప్రయత్నం చేశారు. కాని మొదటి రెండు పాదాలలో ప్రాస తప్పింది. సవరించండి.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. హఠమతులైన సతులకున్
    మఠమున సన్యాసులైన, మంచిగ వారిన్
    మఠపతి యెరుక సలుప యా
    మఠమున సన్యాసి యొకడు మానిని గూడెన్

    రిప్లయితొలగించండి
  10. శఠుడొగడు కావి గట్టుకు
    శఠగోపము పెట్టనెంచి సర్వుల కిలలో
    హఠయోగిగ నటియించుచు
    మఠమున సన్యాసి యొకఁడు మానినిఁ గూడెన్!!!

    రిప్లయితొలగించండి

  11. పఠియించి వలపు పాఠము
    హఠాత్తుగను దేవదేవి అతనుని శరమై
    హఠమగు కౌగిలి గ్రుచ్చిన
    మఠమున సన్యాసి యొకఁడు మానినిఁ గూడెన్!!!

    రిప్లయితొలగించండి

  12. కె.యస్.గురుమూర్తిఆచారి గారి పూరణ
    కఠినపు బ్రతుకెందులకు,క
    మఠమెందులకని తలంచి మన్మథ గురువాం
    ఛ ఠకాయించగ మదిలో
    మఠమున సన్యాసి యొకఁడు మానినిఁ గూడెన్!!!

    రిప్లయితొలగించండి
  13. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...


    జఠరభరనిర్వహణక
    ర్మఠజీవనయౌవనభరమదనార్తనుఁ దా
    హఠకామోత్కంఠతచే
    మఠమున సన్యాసి యొకఁడు మానినిఁ గూడెన్!

    రిప్లయితొలగించండి
  14. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సలుప నా...’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. మఠ మున నుందురు భిక్షులు
    కఠి నంబగు నియమ నిష్ఠ గలుగుచు నెపుడున్
    శ ఠ గోప మిత్తు నేనని
    మ ఠ మున సన్యాసి యొకడు మానిని గూ డెన్

    రిప్లయితొలగించండి
  16. మల్లెలవారి పూరణలు
    1.'కఠినపు సమస్యలెన్నియొ
    హఠయోగమ్మున తొలగగ హాయిని గను డీ
    మఠమున' ననియెడి కుహనా
    మఠమున సన్యాసి యొకడు మానిని గూడెన్
    2.మఠముల నెన్నియొ దిరిగియు
    శఠమున యోగిగ నెరుగుచు సాధగు పార్థున్
    హఠమున సుభద్ర యెరిగెను
    మఠమున సన్యాసి యొకడు మానిని గూడెన్
    3.మఠములుపెక్కురు లేచెను
    శఠమున పదవులు కొనగను సాధులు యుక్తిన్
    హఠమున నేతలు నగుచును
    మఠమున సన్యాసి యొకడు మానిని గూడెన్
    4.కఠినపు నియమాల విడిచి
    హఠయోగమ్మున జనులకు నార్తిని దీర్చే
    మఠములు ఘనమౌ మోసపు
    మఠమున సన్యాసి యొకడు మానిని గూడెన్

    రిప్లయితొలగించండి
  17. పఠియించి సకలవిద్యలు
    శఠునిగమారిసిరిపట్టి సాయకములతో
    కఠినపునియమముల విడచి
    మఠమున సన్యాసి యెకడు మానిని గూడెన్

    రిప్లయితొలగించండి
  18. హఠముగ తపమును జేసిన?
    కఠినంబగు మానసంబు కల్మషమవగా?
    ఘఠమున సాగే వ్యసనమె
    మఠమున సన్యాసియొకడు మానిని గూడెన్

    రిప్లయితొలగించండి
  19. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    హఠయోగి ననుచు నొక్కడు
    మఠమున గౌరవము పొంది మంత్రము లనుచున్
    పఠియించి కామ శాస్త్రము
    మఠమున సన్యాసి యొకఁడు మానినిఁ గూడెన్.

    రిప్లయితొలగించండి

  21. హఠమున నచ్చరలేమ క
    మఠాసనము నందునున్నమౌని తపము తా
    ను ఠివణిని భంగపరుపగ
    మఠమున సన్యాసి యొకడు మానిని గూడెన్

    రిప్లయితొలగించండి
  22. కఠినము సన్యాస మకట :
    జఠిలపు భవబందనాల జపమును కరవై,
    హఠ యోగము గాడి సడలి;
    మఠమున సన్యాసి యొకడు మానిని గూడెన్

    రిప్లయితొలగించండి
  23. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కవిశ్రీ సత్తిబాబు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. కఠినము వనితల హృదయము
    పఠనము జేయంగలేము వారలమదినే
    ఛీ ! ఠట్ ! చేరకు మనినన్
    మఠమున సన్యాసి - యొకఁడు మానిని గూడెన్

    రిప్లయితొలగించండి
  25. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వైవిద్యమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. నిన్నటి కోటా...


    భీకర మధుమేహమ్మే
    తాకిన జనులికను తీపి తాగరు, మదిలో
    క్యాకని త్రాగగ దల్తురు
    " కాకర కాయల రసమ్ము కడుమధురమగున్ "

    రిప్లయితొలగించండి
  27. శఠియించుచు ముక్తి కొఱకు
    కఠమును చదువగ చదువగ కన్నీరొలుకన్
    కఠినమ్మా మార్గమనుచు
    మఠమున సన్యాసి యొకఁడు మానినిఁ గూడెన్

    రిప్లయితొలగించండి