20, మే 2015, బుధవారం

సమస్యా పూరణము - 1680 (కుంభకర్ణ దశాననుల్ కుంతి సుతులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కుంభకర్ణ దశాననుల్ కుంతి సుతులు.

42 కామెంట్‌లు:


  1. అయ్య వారి క్లాసు నందు
    అరమోడ్పుల తో జోగిన జిలేబి
    నిదుర లేచి అయ్యవారి కి జవాబిచ్చే -
    కుంభకర్ణ దశాననుల్ కుంతి సుతులు !!

    రిప్లయితొలగించండి
  2. భీమసేనయ్య మరి పార్థ నామ మున్న
    అన్నదమ్ములు నటనమ్మునెన్న ఘనులు
    వారిపాత్రల గని యను నూరివారు.
    " కుంభకర్ణ దశాననుల్ కుంతి సుతులు. "

    రిప్లయితొలగించండి
  3. జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం....

    అయ్యవారు తరగతిలో నడిగె ప్రశ్న
    నిటుల కుంతికి సత్పుత్రు లెవ్వ రనుచు;
    నిదురమత్తులోన జిలేబి నిలిచి చెప్పె
    కుంభకర్ణ దశాననుల్ కుంతి సుతులు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నటనలో నెన్న ఘనులు’ అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  4. మాస్టరుగారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు...
    జిలేబి గారి భావానికి మధురమైన పద్యరూపమునిచ్చారు...

    సవరణతో...

    భీమసేనయ్య మరి పార్థ నామ మున్న
    అన్నదమ్ములు నటనలో నెన్న ఘనులు
    వారిపాత్రల గని యను నూరివారు.
    " కుంభకర్ణ దశాననుల్ కుంతి సుతులు. "

    రిప్లయితొలగించండి
  5. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, గోలివారికి నమస్సులు...

    గోలివారూ,

    మీ పూరణమున మూఁడవపాదమందు..."ఊరివారు" బహువచనము. "అనును" అను క్రియ ఏకవచనము. కావున...దీనిని...

    "వారి పాత్రలఁ గని యందు రూరివారు" అనిన బాగుండునేమో యోచింపుఁడు. స్వస్తి.


    రిప్లయితొలగించండి
  6. కుంభకర్ణ దశాననుల్ కుంతి సుతుల
    టంచుఁ బలుకుట సరిగాదు! మంచివార
    లయ్య పాండవుల్! తద్దుష్టుల నిట నుచ్చ
    రించుటే తప్పటంచు నెఱిఁగి మసలుఁడు!!


    రిప్లయితొలగించండి
  7. భీకరాకార యుతుఁడగు భీమసేను
    కర్ణ భుజములు యుండెడి కరణి గన్న
    నర్జునుని దశ నామములరసి చూడ
    కుంభపు కర్ణ దశాననుల్ కుంతి సుతులు.

    భీకరాకారుడైన భీముని చెవులు పెద్దవిగాను, పది పేర్లు గల అర్జునునికి పదిరూపములు ( తలలు ) అనే భావన.

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘భుజములు+ఉండెడి’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘భుజము లున్నట్టి యా కరణి గన్న’ అందామా?

    రిప్లయితొలగించండి
  9. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారము
    సమయాభావముచే నిన్నటి సమస్య పూరించబడలేదు
    నేడు పూరించాను.
    స్మృతులు మరచిరి శూద్రులు మతులు చెడిరి
    మాంసభక్షణచే, ద్విజుల్ మాన్యులైరి
    మధ్య మాంసములను వీడి మహిత ధర్మ
    శాస్త్రములు పెక్కు చదివియు సంస్కృతమున

    కైకసికి పుట్టి దుష్కర్మ కారణమున
    రాముతో పోరి మడసిరి రణమునందు
    కుంభకర్ణ దశాననుల్, కుంతి సుతులు
    కౌరవులతోడ పోరాడి కదనమందు
    జయము బొందిరి సద్ధర్మ చరిత చేత.

    రిప్లయితొలగించండి
  10. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ రెండు పూరణలు (నిన్నటిది, నేటిది) బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. కశ్యపు మహాముని సుతులు కమల ! వినుము
    కుంభ కర్ణ దశాననుల్ ,కుంతి సుతులు
    ధర్మ జుం డును బార్ధుడు కర్ణుడు భీమ
    సేను డు గదార్య !పాత్రులు శివుని కృపకు

    రిప్లయితొలగించండి
  12. లలి వివాహమ్ము నాడెఁ బులస్త్య బ్రహ్మ
    కనఁగఁ దృణబిందుఁ బుత్రుఁడొక్కఁడు జనించె
    వాడె విశ్ర వసుఁడు మరి వానికరయఁ
    గుంభకర్ణ దశాననుల్ కుంతి ! సుతులు .

    రిప్లయితొలగించండి
  13. జిలేబి గారు మీ పద్యం లో మొదటి మూడు పాదాలు గణభంగం అయినట్టుంది గమనింపుడు. అచ్చు ఉపయోగం కుడా ఎక్కువ వుంది. దయచేసి సవరించగలరు.

    రిప్లయితొలగించండి
  14. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కశ్యప మహాముని’ అనండి.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. విష్ణునందన్ గారూ,
    కుంతి శబ్దాన్ని సంబోధనగా చేసిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    ******
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    జిలేబీ గారు ఎప్పుడూ ఛందోబద్ధంగా వ్రాయరు. ఈ బ్లాగులో అలా వ్రాసే స్వాతంత్ర్యం వారి కొక్కరికే ఇచ్చాను. నేనివ్వడం ఏమిటి? వారే లాక్కున్నారు. వారి భావాలకు ఛందోరూపం ఇవ్వడం నా పని, మిత్రుల పని!

    రిప్లయితొలగించండి
  15. విష్ణు గారు లలి వివాహమ్మునాడే అంటే ? మరి వాని కరయ ? కుంతి సుతులు అనే పదాన్ని ఎలా అన్వయించారు వివరించగలరు.?

    రిప్లయితొలగించండి
  16. యుద్ధ మందున బోర సన్నద్ధు లగుచు
    నైక మత్యమె బలమనె డంశమెంచి
    యన్న దమ్ముల బంధము నెన్నినారు
    కుంభకర్ణ దశాననుల్,కుంతి సుతులు!

    రిప్లయితొలగించండి
  17. గురువుగారు మీరు ఏమి అనుకోనంటే ఒక మనవి. మనం ఇక్కడ సమస్యపూరణ, చేస్తున్నాము ఎవరైనా వారి ఇష్టానుసారం వ్రాస్తే ఇక సమస్య ఏమున్నది.?

    రిప్లయితొలగించండి
  18. సభ్యులకు మనవి ,

    క్షమించండి ఈ సమస్యని పూరించడం లో చాలామంది ఏదో విధిగా యదావిదిన పూరించడం జరిగినది.కాని ఎందుకో అక్కడక్కడ అన్వయలోపం నాకు అనిపించినది.మనం సమస్యని కేవలం పూరించడమే పరమావధి గా పెట్టుకుంటే అది పొరపాటే అవుతుంది.సమస్యని చక్కని సమయస్పూర్తి తొ మంచి విషయ సమన్వయము తొ పూరించినపుడే అది రాణించగలదని తద్వారా మన ప్రతిభకు కుడా కొంత మెరుగుదిద్దినది అవగలదని నా అభిప్రాయం. ఇది ఒక సోషల్ web బ్లాగ్ కావున నా అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా వ్యక్తపరచాను అన్యధా భావించకండి.ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమె.

    ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  19. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు చాల బాగుగా చేసారు పూరణం!

    రిప్లయితొలగించండి
  20. పిరాట్ల ప్రసాద్ గారూ,
    ‘లలి’ శబ్దానికి ‘ప్రేమ, వికాసం, ఉత్సాహం, ఒప్పిదం, క్రమం’ మొదలైన అర్థాలున్నాయి. సాధారణంగా ఇలాంటి శబ్దాలను పాదపూరణకోసం వినియోగించడం మామూలే. ఇక్కడ ఉత్సాహంగా, ఒప్పిదంగా వివాహమాడాడని అర్థం చెప్పుకోవచ్చు. వాని కరయ = ఆ పులస్త్యబ్రహ్మకు (మనం) తెలిసికొనగా. ఇక కుంతి శబ్దాన్ని సంబోధనగా మార్చి సమస్యను సమర్థంగా ఉత్తమంగా పూరించారు. ఎవరో “కుంతీ! రావణ, కుంభకర్ణులు పులస్త్యబ్రహ్మ కుమారులు” అని చెపుతున్నారు.
    సందేహం కలిగినప్పుడు, దోషం అని తోచినప్పుడు నిస్సందేహంగా తెలిపి సమాధానం కోరవచ్చు. అనుమానించకండి!
    కొందరి పూరణలు అన్వయలోపంతోను, పేలవంగానూ ఉండవచ్చు. ఈ బ్లాగులో పద్యాలు వ్రాసేవారిలో కొందరు ఔత్సాహికులు ఉన్నారు. సమగ్ర పరిశీలన చేసి దోషాలన్నీ పేర్కొంటే వారికి నిరుత్సాహం కలుగవచ్చు. అందువల్ల కొన్ని లోపాలను చూసీ చూడనట్లు వదలివేస్తూ ఉంటాను. మన పరిశీలన కేవలం రంధ్రాన్వేషణకే పరిమితం కారాదు. స్వస్తి!

    రిప్లయితొలగించండి
  21. రాముచంద్రునితో పోరి రణమునందు
    ముక్తినొందిన వారలు; శక్తిమంతు
    లున్న కురుసైన్యమును కోసి రూచకోత;
    కుంభకర్ణ దశాననుల్- కుంతి సుతులు.

    రిప్లయితొలగించండి
  22. బొడ్డు శంకరయ్య గారూ,
    క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. సరస కవివర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి - మత్పద్య సవివర బోధార్థం - ధన్యవాద సాహస్రి !
    శ్రీ పిరాట్ల ప్రసాద్ గారూ , నేను వ్రాసే పద్యాలలో అనన్వయ దురన్వయములుండవు. పద్య నిర్మాణ శైలీ శిల్ప సౌష్ఠవాదులకు అనుగుణంగానే ఉంటాయి . కనుక మీకు ఆ విషయం లో సందేహాలు అక్కర లేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. గురువుగారు కుంతి శబ్దం సంబోధనగా ఉండాలంటే కుంతి లో తి కి దీర్ఘం అక్కరలేదా ? ఇది నా ప్రశ్న. వివరించగలరు.

    ఇకపోతే విష్ణునందన్ గారు మీ పద్యంలో లోపం నేను ఎత్తిచూపలేదు నాకు కలిగిన అనుమానం నివృత్తి చేసుకునే క్రమం లో మీనుంచి వివరణ అడిగాను.నేను మిమ్మలను సందేహం అడిగాను అంటే మీ పాన్దిత్యప్రకర్ష నాకంటే ఎక్కువనే విషయం తెలుపకనే తెలుపుతున్నది.కావున నన్ను కేవలం ఒక పామరుడు గానే తీసుకొని నా సందేహాలను ఎత్తిచూపుడుగా అభివర్ణించకుండా సందేహాలుగానే నివృత్తిచేయండి. సందేహం వచ్చినపుడు అడగవచ్చునని గురువుగారి ఆజ్ఞ ను పాటించే అడిగాను.ఒకవేళ మీ పూరణల మీద ఎటువంటి comment ఉండకూడదని మీరు విశ్వసిస్తే నా సందేహాలను నావరకే పరిమితం చేస్తాను.

    మరొకసారి మీ యందు అన్వయ ,సమన్వయ లోపాలు వున్నాయని నేను వ్యక్తిగతంగా మిమ్మలినే కాదు ఎవ్వరినీ అనలేదని గ్రహించగలరు.మీ పద్యాలలో అటువంటివి ఏమి వుండవు అని మీరే నిర్దారిస్తున్నారంటే ఖచ్చితంగా మీరు మహాపండితులనే భావిస్తున్నాను.మీముందు నాబోటి వారిని సూర్యుని ముందు దివిటీలుగా పరిగణించి మన్నించ ప్రార్థన. అనితర సాధ్యమైన మీ పాండిత్యానికి శతకోటి వందనాలు --^--. మీ లో లోపాలు ఎత్తి చూపే అంతటి వాడిని కాదు ముందు చెప్పినట్టుగా కేవలం సామాన్యుడను

    ధన్యోస్మి

    రిప్లయితొలగించండి
  25. భక్తి సౌగంధ వ్యాప్తికి వాయుసుతుడు
    కరుణ కు తథాగతుండును క్రౌర్యమునకు
    కుంభకర్ణ దశాననులు, కుంతిసుతులు
    భ్రాతృ సౌజన్యమునకును పాత్రులైరి

    రిప్లయితొలగించండి
  26. బుర్ర పదును దేల పూరించగ సమస్య
    పోస్టు జేయ దండి మొండి నెట్టు!
    పోస్టు జేసినదని మురిసి చూడ సమీక్ష
    గురువు గారి మౌసు మరచి జారు !

    రిప్లయితొలగించండి
  27. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    నిజంగా మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    మీ పూరణ ఎందుకో నా దృష్టికి రాలేదు. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  28. శంకరయ్య. గారూ నా పద్యం evaluate చెయలేదు.
    గురువుగారూ,
    మీచర్చ చాలాబాగుంది. చర్చ జరిగితేనే సారం బయటపడుతుంది. మీరన్నట్లు మాలాటి వారిమీద రంధ్రాస్త్రం
    ప్రయోగిస్తే మేము తట్టుకోలేము. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లా ఉంటుంది.మీ రక్షణకు మా కృతజ్ఞతలు. శ్రీ విష్ణువర్ధన్ లాంటి మహాకవుల తో పాటు మాలాంటి అనామకుల కవితలను చూసుకోవడం మా అదృష్టం.
    కవిత్వం అంతశ్చైతన్య ప్రసారం. భావ వ్యక్తీకరణమాధ్యమం.
    ఏమీ తెలియని గ్రామీణుల పల్లె పదాల్లో అది ఎంత రక్తి కడుతూ
    బయటికురుకుతూ ఉంటుందో మనం చూస్తుంటాం.
    అందుకే భావానికి పట్టం కడుతూ మమ్మల్ని చూసీచూడకుండా
    వదిలేస్తే మేమూ నిలబడ్డానికి ప్రయత్నిస్తాము.
    నా subject Maths, నా profession చూస్తే banking. మన భాష మీద మక్కువ తో వ్యాకరణం తెలుసుకొని వ్రాస్తున్నాను.
    మీ encouragement కు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  29. చింత వలదు మూర్తి గారూ, ఇక్కడ చాలా మటుకు పద్యాలను వ్రాసే వాళ్ల వృత్త వేరేనండి .తెలిసిన మాటలతో ముందుకు వెళితే గురువుగారు ఎలాగూ నడిపిస్తారు.

    రిప్లయితొలగించండి
  30. శ్రీ పిరాట్ల ప్రసాద్ గారు
    పద్య కవిత్వ సంబోధనలో కుంతి అని నిరభ్యంతరంగా అనవచ్చు. సందేహం అక్కర లేదు .
    కుంతి ! - ఓ కుంతీ !
    కనగ - చూడగా
    లలిన్ - ప్రేమ తో
    పులస్త్య బ్రహ్మ - పులస్త్య ప్రజాపతి
    తృణబిందున్ - తృణబిందు అను స్త్రీ ని
    వివాహమ్మున్ + ఆడెన్ - పెండ్లి చేసుకొనెను
    పుత్రుడు + ఒక్కడు - (అందువలన) ఒక కొడుకు
    జనించెన్ - పుట్టెను
    వాడె - ఆ కొడుకే
    విశ్ర వసుఁడు - విశ్ర వసుడనే పేరు గల వాడు
    మరి - మరి
    అరయన్ - సమీక్షించగా
    వానికి - ఆ విశ్రవసునికి
    కుంభకర్ణ దశాననుల్ - రావణ కుంభకర్ణులు
    సుతులు - కొడుకులు

    ఇదీ ప్రతి పదార్థం. ప్రతి సారీ ఇంత వివరంగా విస్తారంగా వ్రాయలేక పోవచ్చు .
    నా పద్యాలలో అన్వయ క్లేశాలు లోపాలు ఉండవంటే అది భారతీ సత్కృప . స్వస్తి.

    రిప్లయితొలగించండి
  31. చదువు”కొన్నట్టి”గురువట| పదవిజేరి
    తెలుగు బోధించు సమయాన?”తెలియదనుచు
    ప్రశ్న వేయగ విద్యార్థి?పలికె గురువు
    కుంభ కర్ణ దశాననుల్ కుంతిసుతులు”.

    రిప్లయితొలగించండి
  32. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    పట్టు వస్త్రాలు కండువాల్ పలు ధరించి
    కుండలమ్ములు ,నుదుట కుంకుమ, ధరించి
    తెలుగు పండితులనువారు పలుకుచుంద్రు
    కుంభకర్ణ దశాననుల్ కుంతి సుతులు

    అతివ పుష్పోత్కటకు పుత్రు లైరి భువిని
    కుంభకర్ణ దశాననుల్; కుంతి సుతులు.
    ధర్మజుడు భీము దర్జున ధర్మవిదులు
    పాండవా న్వయులను పేర బరగినారు

    రిప్లయితొలగించండి
  33. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  34. దోషమును, చక్కని సవరణను సూచించిన మధుసూదన్ గారికి ధన్యవాదములు...


    భీమసేనయ్య మరి పార్థ నామ మున్న
    అన్నదమ్ములు నటనలో నెన్న ఘనులు
    వారిపాత్రల గని యందు రూరివారు.
    " కుంభకర్ణ దశాననుల్ కుంతి సుతులు. "

    రిప్లయితొలగించండి
  35. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    స్పందించడంలో జరిగిన ఆలస్యానికి మన్నించండి.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    సంబోధన దీర్థాంతమే అయి ఉండాలన్న నియమం లేదు.
    ‘ధర్మదండం’ వంటి ఉత్తమకావ్యాలను రచించి, పండిత ప్రశంస లందుకొన్న డా. విష్ణునందన్ గారు మధ్యందిన మార్తాండులైతే, మనం కనీసం దివిటీలం కాదు- కేవలం మిణుగురు పురుగులం. వారి పద్యాల్లో తప్పులు వెదకడానికి మన పాండిత్య మెంత? అనుభవ మెంత?
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  36. కంది వారు,

    మీ పదాల పట్టు, పలుకుల సౌలభ్యం గగన కుసుమం !

    నెనరస్య నెనరః !

    అవే పదాలు, చిన్ని చిన్ని మార్పుల తో మీరు వః అనిపించే "స్టారు" మాష్టారు !

    జిలేబి

    రిప్లయితొలగించండి