8, మే 2015, శుక్రవారం

పద్య రచన - 899

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. త్రాగు నీరుకు గ్రామ మంతయు తల్లడిల్లిచునుండెనో
    కాగుబిందెలు చేతఁ బట్టిరి కష్ట కాలము వచ్చెనో
    మూగి యుండిరి నూతి చుట్టును ముంచి చేదగ నీరమున్
    ప్రేగులన్నియు నొప్పి పుట్టెనొ రిత్త యత్నమునందునన్!!

    రిప్లయితొలగించండి
  2. చెరువులన్నియు నిండి యుండిన చేటు చెంతకు వచ్చునే
    తరిమి కొట్టరె కబ్జగాళ్లను త్రాగు నీటిని పొందగా
    కరువు కాలము నేడు వచ్చునె కాచుకున్నను గట్టులన్
    పరుగులెత్తుచు రండి రండిక పార పట్టుచు మీరికన్!!

    రిప్లయితొలగించండి
  3. కుండెడు నీటిని చేదగ
    మండెడి యెండలకు తనువు మాడెడి బ్రతుకున్
    దండిగ తిండికి నోచని
    బండెడు సంసార మీద బాధల జగతిన్

    రిప్లయితొలగించండి
  4. బ్లాగు లోకమున ఫోటోను పెట్టిన
    పద్యముల ఊట వచ్చుట సులభము !
    పుడమి తల్లి కనికరము లేకున్న
    ఎంత బావి తవ్విన వచ్చునా ఊట ?

    జిలేబి
    (మేధా దేవి కనికరించు ! భూమా దేవి కనికరించు !)

    రిప్లయితొలగించండి
  5. శ్రీయుతులు శంకరయ్యగారు సాయంకాలానికి
    వైద్యుల సమక్షము నుంచీ, ఉత్సవాహ్లాదంతో
    వచ్చు వరకూ ' సర్వే జనా స్సుఖినోభవంతు'

    రిప్లయితొలగించండి
  6. చండమగు భాను ధాటికి నెండిపోవ
    భావులన్నియు, ప్రజలంత వనరు చుండ్రి
    ఊరివెలుపల నున్నకోనేరు వద్ద
    బారులను తీరిరి కొనగ నీరమచట

    రిప్లయితొలగించండి
  7. కొందరు మహిళలు గుంపుగ
    బిందెడు నీటికొరకని బోరులు వెదకన్
    మందిలొ గుక్కెడు నీళ్ళును
    పొందక తికమక బడుచును పోరిరి పడతుల్.

    రిప్లయితొలగించండి
  8. కొందరు మహిళలు గుంపుగ
    బిందెడు నీటికొరకని బోరులు వెదకన్
    మందిలొ గుక్కెడు నీళ్ళును
    పొందక తికమక బడుచును పోరిరి పడతుల్.

    రిప్లయితొలగించండి
  9. బావి యొద్దన జూడుడు భామ లచట
    బిందె లన్నియు నొకచోట బెట్టి వారు
    చేదు కొనుచును నీటిని చేద తోడ
    నింపు చుండిరి బిందెలు నిండు వరకు

    రిప్లయితొలగించండి
  10. నిజము, రాయల సీమను నిర్జలస్థ
    గ్రామ్య నేపథ్యమిది, జలగ్రాహ్య రతులు
    నూర్లకును మించి నొక్కొక నూతి కడను
    సేరుచుండుట నేడును చేదు నిజము

    రిప్లయితొలగించండి
  11. త్రాగుదమన్న నీరమెది? దాహము తీరదు! నీటికోసమై
    ప్రోగుపడంగ సర్వులకుఁ బోవునె దుఃఖము? నీరు తోడఁగా
    వేగిర మంద నీరమును బిందెయు నింపదు! మంటిలోపలన్
    బాగను నీర మెద్ది? ఘనవర్షము లొక్కట రాక ముందఱన్
    వాగులు వంకలన్ మిగుల బాగొనరించియు వేగ పూడికల్
    త్యాగయుతాత్ములై త్వరగఁ ద్రవ్వియుఁ దీసియు సాగుచేయఁగా
    వేగమె నీర మెంతొ యిడుఁ బ్రీతిగ వాపి తటాకముల్ సదా!

    రిప్లయితొలగించండి
  12. ఊటయు తగ్గ?బావికడ ఊరిజనాలట ఊరినట్లుగా|
    కోటియుకోర్కెలున్న?మనకోరిన నీటికి వేల బిందెలే
    పోటిగ నిల్వగా?ప్రజల పూర్తియుదాహముతీర్చనట్లుగా
    చాటకె చెప్పినట్లు తనచాయనుదెల్పెను బావి భాధ్యతల్.
    2.ఉన్నదినొక్కబావి గననూహలవోలెను నీటి బిందెలే
    నెన్నగ వేల సంఖ్యలు|ననేకులు జేరిన?యూటదగ్గగా?
    మన్నిక,మానవాళిపరిమాణముతగ్గుట తప్పదౌను|కా
    కున్న?వివాదముల్ బెరుగు|కోరెడినీరటు చిక్క కున్నచో

    రిప్లయితొలగించండి
  13. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ రెండు మత్తకోకిలలు బాగున్నవి. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    జిలేబీ గారూ,
    _/\_
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ ఉత్పలమాలిక బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. నీరము లేదని యందరు
    చేరగ నా బావి చుట్టు చిర్రను యెండన్
    గారిన యా ఘర్మజలమె
    భారమ్ముగ బిందె నిండ భగ్గనె నసువుల్!

    రిప్లయితొలగించండి
  15. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి