9, మే 2015, శనివారం

పద్య రచన - 900

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

30 కామెంట్‌లు:

  1. ఉ. అంచిత మైననీదుపద యంబుజ మంటకతుచ్చులైనరుల్
    వంచిత మైయిహంతిరుగ వందన చేసెదకావుమా యిటన్
    కుంచిత మైయ్యెజీవనము,కృంగగచేయుముకిల్బిషంబులన్
    సంచిత పాపహార హరశంకర శ్రీకర సుందరేస్వరా.

    రిప్లయితొలగించండి
  2. బహు ముఖ ప్రజ్ఞను బయట పెట్టుచునుండె
    ***బహుముఖముల పాత్ర భళిర భళిర
    నాదెగ్గరేముంది నాజూకు బూడిద
    ***అనిజెప్పదగినట్టి అభవు పాత్ర
    తారక మంత్రము తలపోసి తలపోసి
    ***పార్వతిని వలచు ప్రణయ పాత్ర
    కనులు మూసుకొనుచు కళకంకితమగుచు
    ***మరి వెన్ను సంగతి మరచు పాత్ర!!

    పాత్ర పాత్రలో మునిగి తా ప్రాణమయ్యె
    పాత్రలెన్నిటికో తాను సూత్రమయ్యె
    పాత్రయొకటి తుదకు తన నేత్రమయ్యె
    వరస మారి కడకు ప్రాత పాత్ర యయ్యె!!

    రిప్లయితొలగించండి
  3. శంకరుని దర్శనమ్ముకై సన్నుతించ
    రావణాసురుడు కరము రక్తి తోడ
    తపములోనున్న శంభుడు దర్శనమ్ము
    నిడక యున్న నద్రి నెత్తెనా యెఱచిదిండి
    ఎఱచిదిండిః రాక్షసుడు

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    సీతారామకల్యాణం సినిమాలో దశకంఠుడు రావణుడైన వేళ :

    01)
    _________________________________

    ద్వారపాలకుడై నంది - దారి నడ్డ
    చండుడై కొండ తలనిడి - మొండిగాను !
    పాద దీధితి ద్రొక్కగా - పరమశివుడు
    నేలబడెనంత గర్వంబు - నెట్టు జెంద !
    కరుణ జూడగ ప్రార్థించె - కనులు దెరచి
    కాలకాలుని, జలధార - కనుల గార !
    ప్రేవులను దీసి వినిపించి - వీణ స్వనము
    పంచవక్త్రుని కరుణకు - పాత్రుడౌట
    భూరి వరముల బొందెను - భూరి వద్ద !
    _________________________________

    రిప్లయితొలగించండి
  5. పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘పద+అంబుజ’ మన్నప్పుడు సవర్ణదీర్ఘసంధి అవుతుంది. యడాగమం రాదు. ‘అంచితమైన నీదగు పదాంబుజ మంటక’ అందామా?
    *****
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘దర్శనమ్ముకు’ అనడం దోషం. ‘దర్శనమ్మునకు’ అనాలి. అక్కడ ‘శంకరుని దర్శనమునకు...’ అనండి.
    *****
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. వెండి కొండను పెకలించ మొండి గాను
    రావ ణాసురు బలిమిని రవము జేయ
    తపము వీడిన శంకరు నెపము నెంచి
    బొటన వ్రేలిని యదిమెను భూమి పైన

    రిప్లయితొలగించండి
  7. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వ్రేలిని+అదిమెను’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘బొటనవ్రేలితో నదిమెను...’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. వెండికొండ కడకు వేగాన తానొచ్చె
    తల్లి కోర్కె దీర్చ తనయు డపుడు
    తాపసి వలె శివుడు తపమొనర్ఛగ గని
    యాగ్రహమ్మునందె నసురవరుడ

    రిప్లయితొలగించండి
  9. వెండికొండ కడకు వేగాన తానొచ్చె
    తల్లి కోర్కె దీర్చ తనయు డపుడు
    తాపసి వలె శివుడు తపమొనర్ఛగ గని
    యాగ్రహమ్మునందె నసురవరుడ

    రిప్లయితొలగించండి
  10. దశ శిరోపరిస్థితుడుగ దనరు భవుని
    దనను తనలోనె గాంచుచు దాఁ రమించు
    సత్య సుందర విగ్రహుఁ సత్వగుణుని
    అద్వయానంద మందగ నాత్మ గొలుతు

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  12. రామరావుయే శివుడు చిత్రమ్ము నందు
    యాతడే తాను రావణుండయ్యె జూడు
    పదితలలనెత్తె పరమేశు పర్వతమును
    సాటి లేదిక.నటనలో మేటి గాదె

    రిప్లయితొలగించండి
  13. అంచిత మైననీదుపదమంటకమెల్గుచుతుచ్చులైనరుల్
    వంచిత మైయిహంతిరుగు వారిని బ్రోవగ రావుమాయిటన్
    కుంచిత మైయ్యెజీవనము,కూలగచేయుముకిల్బిషంబులన్
    సంచిత పాపహార హరశంకర శ్రీకర సుందరేస్వరా

    రిప్లయితొలగించండి
  14. పదితలలరావణుండట
    కదిలించియుశివుని కొండ కైలాసంబే
    మదమునతలఫై నుంచగ?
    కదలాడిన లోకులెల్ల?కదలదు శివుడే

    రిప్లయితొలగించండి
  15. తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదములు -^-

    రిప్లయితొలగించండి
  16. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వచ్చె’ను ‘ఒచ్చె’ అన్నారు. ‘వేగ తా నరుదెంచె’ అనండి. టైపు దోషలున్నాయి.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘రావు+ఏ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘రామరావె తా శివుడు...’ అనండి.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘భువిం దిరుగు’ లేదా ‘ఇహం దిరుగు’ అనండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. యిహం అని అన్నాను గురువుగాలు ఇహం అంటే మళ్ళి ఇ అచ్చు మధ్యలో వస్తుందని యి వ్రాసాను.

    రిప్లయితొలగించండి
  18. పిరాట్ల ప్రసాద్ గారూ,
    విడిగా చెప్పాను కనుక ఇహం అన్నాను. అక్కడ యడాగమం తప్పక రావలసిందే.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. చ.సకల చరాచరమ్మును సజావుగపాలనజేసిమమ్ముమా
    యకుబడవేసిచూసెదవటందురదేల మహేశపాపనా
    శకుడనిజంబు తెల్పగవశంబెమహోన్నత నీదుతత్వమున్
    త్రికరణశుద్ధివేడెదనుదీనదయాళుడసత్యమేదిలన్.

    రిప్లయితొలగించండి
  20. పిరాట్ల ప్రసాద్ గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    ‘ఏది+ఇలన్’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అందుకని అక్కడ ‘సత్య మేదియో’ అనండి.

    రిప్లయితొలగించండి
  21. శ్రీ శంకరయ్య గురువు గారూ
    నా పద్యాన్ని సమీక్షించ లేదు, దయచేసి చేయగలరు

    రిప్లయితొలగించండి
  22. ఆశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మన్నించండి. మౌస్‍తో స్క్రోలింగ్ చేస్తుండగా మీ పద్యం తప్పిపోయినట్లుంది.
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    పద్యంలో అవసరం లేని రెండుచోట్ల అరసున్నా లిచ్చారు.

    రిప్లయితొలగించండి
  23. భక్తుడు, పరమాత్ముఁ డొక్కరే!

    శుక్తిఁ బడ నీరు ముత్యము!
    ముక్తిని బొందగ మనమ్ము పూనికఁ బట్టన్
    భక్త, పరమాత్మ బేధము
    భక్తి పరాకాష్టఁ జెంద పరుగునఁ దొలగున్!

    రిప్లయితొలగించండి
  24. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. గురువుగారు
    ఈ అర గుళ్ళ తో నాకు ఎప్పుడూ సమస్యేనండీ.
    తాన్ రమించు, విగ్రహున్ లలో ' న్' బదులుగా ఁ వస్తుంది అనుకున్నాను. మనసులో మమీరు చెప్పిన దషాన్ని పరిహరించుకున్నాను. కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  26. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    అరసున్నాల ప్రయోగం, యడాగమ, నుగాగమాలను గురించి నా ఆరోగ్యం కుదుట పడగానే పాఠాలు పెడతాను.
    ఎంతోకాలంగా వాయిదా పడుతున్న కార్యక్రమం ఇది!

    రిప్లయితొలగించండి