16, మే 2015, శనివారం

పద్య రచన - 907

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. తెల్లని హంసలు బాతులు
    నల్లని కాకులు నుకలసి నాట్యము జేయన్
    చల్లని సాయం సమయము
    వెల్లువగా విరిసె నంట వేడుక మీరన్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. తెల్లని హంసను జూచుచు
    నల్లని కాకమ్ము లన్ని నయముగ నడిగె
    న్నెల్లరి మనములు దోచెడు
    తెల్లని రంగెటుల వచ్చు దెల్పుమ మాకున్!!!

    రిప్లయితొలగించండి
  4. సహనమ్మున రాయంచయె
    మహితమ్మగు మాటఁ దెల్ప మారవె ఖగముల్?
    మహనీయుల వచనమ్ముల
    గ్రహియింపగ వచ్చు మహిని జ్ఞానముఁ బొందన్!

    రిప్లయితొలగించండి
  5. అగ్ర మందున గలయట్టి హంసకు నట
    పైన కాకులు దిగువన బాతు లుండి
    హంస చెప్పిన పలుకుల నాల కించు
    నటుల గలదార్య !చిత్రము నరయ నాకు

    రిప్లయితొలగించండి
  6. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో గణదోషం. ‘హాయిగ మరాళ ముండగ...’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. పద్యరచన
    మా లోకములోమేమటు
    పాలుజలము కలియ వేరు పరచ గలమనన్
    మేలైన రాజహంసను
    హేళన జేసినవి పక్షు లీ జగమందున్

    రిప్లయితొలగించండి
  8. రాయంచ జుట్టు జేరిన
    వాయసము లకారణముగ వాగుచు నుండన్
    హాయిగ మరాళ ముండగ/ నాయంచ మౌని యయ్యెను
    ఈయవె యా పరమహంస లెంచెడి గుణముల్

    రిప్లయితొలగించండి
  9. తప్పు దిద్ది నందులకు గురువుగారికిి
    కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  10. పాలునీళ్ళు వేరుబరచి వసుధ యందు కీర్తిచే
    మేలుమేము యనగ హంస?”మీరుజేయనట్టిదే
    జాలియందు కోయిలమ్మ జన్మకారణమ్ముచే
    తేలుచున్న కాకిజన్మ తేలికనుట ధర్మమా?”.
    [కాకిహంసలగొప్పతనాలవాదననాపురణ]

    రిప్లయితొలగించండి
  11. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘మేలు+అనగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మేలనంగ’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. తెల్లనగు హంసరాజము
    మెల్లగ నీరమ్మునందు మెలగుచు నుండన్
    నల్లనికాకులు ప్రోగయె
    నుల్లమునందున భయమ్ము యుదయించంగన్

    రిప్లయితొలగించండి
  13. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమోవాకములతో...

    -:అధికులతో స్పర్థఁబూనుట యనర్థదాయకము:-

    కం.
    అనఁగనఁగ నొక సరస్సునఁ
    గన నగుఁ బలు హంస లెపుడు కలకల నగుచున్
    వనరుహ కాండములఁ దినుచు
    దినమంతయుఁ గడపుచుండు దివ్యగతులతోన్!

    ఆ.వె.
    ఆ సరస్సు ప్రాంతమందలి కుజముల
    పై వసించుచుండెఁ పలు ద్వికములు!
    దినదినమ్ము నవియు దివి విహారులునైన
    హంసగమనములను నఱయుచుండు!

    తే.గీ.
    వాని తెల్లందనమ్ములు వాని పలుకు
    లెంత హృదయంగమములంచు వింతఁ గనునొ,
    దమ కురూపముల్ కూఁత లంతగను రోఁతఁ
    బుట్టఁగను జేయునని విసుగు పుట్టఁ దెగడు!

    కం.
    హంసల గర్వము నణచఁగ
    హింసనుఁ బూనియును నైన హేయమొనర్పన్
    గంసారి నలుపు గల యా
    హంసారులుఁ దలఁచుచుండె నవగుణ కుమతుల్!

    తే.గీ.
    ఒక్క దినమున నొక యంచ తెక్కరముగ
    నడచి వచ్చుట నా పిశునములు గాంచి,
    “యేమి మీగొప్ప? మావలె నెగురవలరె?
    పందెమునుఁ గాచి, గెలుపొంద వలయు”ననియె!

    తే.గీ.
    “నాకు నీతోడఁ బందెమా?” నగుచు నంచ
    యనఁగ, “భయపడుచుంటివా?” యంచుఁ గాకి
    వంకరగ, టింకరగఁ దాను పల్టికొట్టి,
    “నన్ను గెలుతువే?”యన హంస నగి యొడఁబడె!

    తే.గీ.
    కాకి ముందుగా నాకాశ గమన యయ్యు
    వెనుక వచ్చెడి యంచను వెక్కిరించె!
    హంస మేఘమండలమును నందుకొనఁగఁ
    జనుచు నుండఁగఁ గాకియుఁ జనెను పైకి!

    ఆ.వె.
    హంసవేగమపుడు నందుకొనంగను
    వాయసమ్ము విఫలమాయె, నటులె
    కనులు బైర్లు గ్రమ్మెఁ, గనుమూసితెఱచిన
    యంతలోనఁ గ్రింద నబ్ధిఁ గూలె!

    కం.
    సాగరమందునఁ గూలియు
    “వాగితి నే బుద్ధిలేక వక్రపుఁగూఁతల్,
    నా గర్వము ఖర్వమయెన్
    వేగముగా శరధినుండి విడిపింపు”మనన్.

    తే.గీ.
    జాలిపడి హంస కాకిని సంద్రము వెడ
    లింపఁ జేసి, వీపున మోసి, కొంపఁ జేర్చె!
    కాకి “గొప్పవారలతోడ కయ్యము వల
    దంచుఁ దెలిసెను! నన్నుమన్నించు”మనియె!!

    *** *** *** ***
    (ఇది ’యధికులతో స్పర్థించుట యనర్థదాయకమను కథ” సమాప్తము)
    *** *** *** ***

    రిప్లయితొలగించండి
  15. గుండు మధుసూదన్ గారూ,
    అద్భుతమైన ఖండకృతిని అందించారు. మీ కథాకథనశైలి, దానికి అనుగుణంగా ఒదిగిన గణయతిప్రాసలు ప్రశంసనీయం. సాధారణంగా ఇటువంటి కథలు చెప్తున్నప్పుడు వ్యర్థపదాలు కొన్ని వస్తూ ఉంటాయి. కానీ మీ పద్యాలలో ఎక్కడా అవి కనిపించవు. అభినందనలు.
    మూడవపద్యం చివరిపాదంలో గణదోషం. ‘బుట్టఁ జేయునని విసుగు పుట్టఁ దెగడు’ అందామా?
    ‘మావలె నెగురగలరె?’ టైపాటువల్ల ‘మావలె నెగురవలరె’ అయినట్టుంది.

    రిప్లయితొలగించండి
  16. ధన్యవాదములు శంకరయ్యగారూ! మీరు సూచించిన సవరణములు చక్కఁగా సరిపోవుచున్నవి. కృతజ్ఞతలు.

    మూఁడవపద్యము చతుర్థపాదాంతమున "యీసు" అని వ్రాసి, యెందువలననో "విసుగు" అని మార్చితిని. గణభంగముం గాననైతిని.

    నేరుగా టైపుచేయుచు నీ పద్యములను వ్రాసితిని. మఱలి చూచుకొనలేదు. టైపాటు అనుటకన్న..."నెగురువారె?" యను దానిలో "వా"ను "వ"గ మార్చి, "ల"చేర్చితిని. "వ"ను..."గ"గా మార్చనైతిని. తెలిపినందులకు కృతజ్ఞతలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి