27, మే 2015, బుధవారం

పద్య రచన - 918

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. అల్లన తాడిని ఎక్కెను
    కల్లును గీయంగ తాను కష్టమ్మైనన్
    చల్లని యాకల్లమ్మక
    యిల్లైన గడువదు పస్తులే యిక గతియౌ

    రిప్లయితొలగించండి
  2. కల్లును దీయుచు తానిటు
    నుల్లము రంజిల్లు జనుల న్యూనత్వ మునన్
    గుల్లను జేయగ కొంపల
    నొల్లడు యాదేము డైన నూరు విధమ్ముల్

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘తాడిని+ఎక్కెను=తాడినెక్కెను’ అవుతుంది. అక్కడ ‘అల్లన నెక్కెను తాడిని’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. తాటికి దీసిన కల్లును
    ధాటిగ త్రాగండి యెండ దరిజేరదుగా
    తాటికి నుండెడి ముంజలు
    గోటిని గిల్లుచును తినుడు గొప్పగ చలువౌ.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నదిక్. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నదిక్. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. కష్ట బడుచు నటుల కల్లు దాగుటకన్న
    ఇష్టబడుచు కొన్ని యితరబనులు
    జేసి మధుర మైన జీవితంబును నీవు
    గడుప వచ్చు నింక కల్లదేల


    పనులు

    రిప్లయితొలగించండి
  8. తాటి కల్లును దీయగ తాత యొకడు
    తాడి చెట్టును నెక్కెను వీడి భయము
    చలువ జేయును వేసవి సమయ మందు
    పల్లె టూరుల యందున పల్లె జనము
    త్రాగు దురు ముఖ్య ముగనునీ తాటి కల్లు

    రిప్లయితొలగించండి
  9. మెల్లగ నెక్కెను తాడిని
    కల్లును దీయంగ గీత కార్మికుడదివో!
    ముల్లెను సంపాదించగ
    వల్లడి కలిగించు కల్లు వదలుము నరుడా!!!

    రిప్లయితొలగించండి
  10. కల్లులోన నేడు కాలకూట విషము
    కలుపు చుండ్రి ధనపు కాంక్షతోడ
    నట్టి కల్లు సతత మారోగ్యముఁజెఱచు
    కల్లుమాని సుఖముఁ గాంచుడయ్య

    రిప్లయితొలగించండి
  11. తాటికల్లుద్రాగు తాతల నలవాటు
    వంశ మెల్ల వాడు యంశ మనుచు
    మంచి దనుచు వాడ?వంచనచే ముంచు
    డబ్బు దరుగు జబ్బు లబ్బు జూడ|

    రిప్లయితొలగించండి
  12. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘కల్లు+అది+ఏల= కల్లది యేల’ అవుతుంది. అక్కడ ‘కల్లు వలదు’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘తాతల యలవాటు’ అనండి.

    రిప్లయితొలగించండి
  13. జీవన మెంచు చెట్టు గన?చింతల పంతపు కాండమెక్కుచున్
    కేవల మున్నయాకలికి కీడును గోడును లెక్కజేయకన్
    కావలిగాయుచున్ తనకు గావలె నన్న సకాలమందునే
    దేవుని నెంచి కల్లుకని ధీరత జూపునుకార్మికుండిటన్

    రిప్లయితొలగించండి
  14. తాడు నడుముఁ జుట్టి తాటి నెక్కెదవోయి
    'నీర' కుండలందు చేరె నంచు!
    ముంజలడుగు నీదు ముత్తైదువ నెపుడు
    మనసు లోన మరచి మసలకోయి!

    రిప్లయితొలగించండి
  15. వేసవి తాపమందు నతివేదన నొందిన పల్లెజనమ్ము దప్పితో
    కోసుల దూరభారమున కోర్చియు పానము జేయ కానలో
    కాసుల తోడ వచ్చిరి వడగాలికి పెక్కగు బాధనొందియున్
    వాసిగ గీత కాడు నొక పాదప మెక్కెను కల్లు దీయగా!

    రిప్లయితొలగించండి
  16. ఎక్కెను తాటిచెట్టు మనసెంచెడి కోర్కెల లక్ష్యసాధనా
    మక్కువ?కాదుకాదు "పరమావధి కల్లును త్రాగు వారికిన్
    దక్కగ లొట్టె లుంచుటకె|దక్కినకష్టము నష్టమైన?కై
    పెక్కెడి మక్కువైనదని వీడక కార్మికు డెంచు పద్దతే"|

    రిప్లయితొలగించండి
  17. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. ​సవరణతో....​

    ​​వేసవి తాపమందు నతివేదన నొందిన పల్లెజనమ్ము దప్పితో
    కోసుల దూరభారమున కోర్చియు పానము జేయ కానలో
    కాసుల తోడుతన్ చెమట కారగ వచ్చిరి సేద తీరగన్
    వాసిగ గీత కాడు నొక పాదప మెక్కెను కల్లు దీయగా!

    రిప్లయితొలగించండి