23, మే 2016, సోమవారం

సమస్య - 2042 (కనికరముం జూప...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కనికరముం జూపఁ దగదు కాంతలపైనన్.

89 కామెంట్‌లు:

  1. మనసున ననుమా నంబును,
    పెనిమిటి యనచి న్నచూపు, పెద్దగు గొంతున్,
    వినయం బించుక లేదని,
    కని, కరముం జూప దగదు కాంతలపైనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కని,.. కరాన్ని బాగా విరిచారు. అభినందనలు

      తొలగించండి
    3. తమ్ముడూ చెయ్యెత్త కూడదంటావ్ భేష్. అయినా
      నీ వెర్రి కానీ యీ రోజుల్లో అంత దమ్ము లెవరి కున్నాయ్ బాబూ. పూరణ చితక్కొట్టేశాడు.

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    5. అన్నా! మీమెప్పుకు ధన్యుడను. స్త్రీ, బాల, వృద్ధుల ఎడ సంయమనముతో ఉండాలిగదా! ధన్యవాదములు.

      తొలగించండి
  2. వనితలు గిట్టని కొందరు
    పనిగట్టుకు వచ్చి చెప్పు "పతులారా మీ
    మనముననేమాత్రమ్మున్
    కనికరముం జూపఁ దగదు కాంతలపైనన్".

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాళ్ళు భార్యాబాధితసంఘం సభ్యులై ఉంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  3. అనిశము నతివల యెడలం
    దనురాగము జూపుచుండ, నతి ప్రేమమునం
    దనరెడి సరసపు టబలల
    గని, కరముంజూప దగదు కాంతల పైనన్!

    రిప్లయితొలగించండి
  4. డా.ఎన్.వి.ఎన్.చారి9866610429
    వనితలు సున్నిత హృదయులు
    ఘనమున సేవలు సేతురు కారుణ్యమునన్
    పెనిమిటి సుఖమే సరి మా
    కని,కరమున్ చూప దగదు కాంతల పైనన్

    రిప్లయితొలగించండి

  5. వనితల కిచ్చిరి నిర్భయ
    అనఘా! శోభస్కరముగ అవసర మనగన్ !
    జనులార! మాట వరసల
    కని, కరముం జూపఁ దగదు కాంతలపైనన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. డా.ఎన్.వి.ఎన్.చారి9866610429
    Sk2031అకస
    వనితలు సున్నిత హృదయులు
    ఘన సేవలు సేతురయ్య కారుణ్యమునన్
    పెనిమిటి సుఖమే సరి మా
    కని,కరమున్ చూప దగదు కాంతల పైనన్

    రిప్లయితొలగించండి
  7. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. అనయముగను నీచులపై
    కనికరముం జూప దగదు, కాంతల పైనన్
    ఒనరగ బాధ్యత గలదే
    వెనుదీయక వీరముగొని విజయము బొందన్

    రిప్లయితొలగించండి
  9. నినయము చూపని సుతుపై
    కనికరమున్ జూపదగదు,కాంతలపైనన్
    ననయము కినియుచు నుండిన
    ఘనమగు సత్కారమునిల గాంతువు సుమ్మీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వినయము’.. ‘నినయము’ అయింది టైపాటువల్ల.
      ‘కాంతలపైనన్| కినియుచు నుండిన ననయము...’ అనండి.

      తొలగించండి
  10. వనితలు మృదుల స్వభావులు
    పనిమంతులు కరుణ నిండు పడతులు, సిరులౌ
    వినుమా పురుషా! యందుల
    కని, కరముం జూపఁ దగదు కాంతలపైనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘స్వ’కు ముందున్న ‘ల’ గురువై మొదటిపాదంలో గణదోషం. ‘వనితలు మృదుస్వభావులు’ అనండి.

      తొలగించండి


    2. మాస్టరుగారూ! ధన్యవాదములు...సవరణతో...


      వనితలు మృదుస్వభావులు
      పనిమంతులు కరుణ నిండు పడతులు, సిరులౌ
      వినుమా పురుషా! యందుల
      కని, కరముం జూపఁ దగదు కాంతలపైనన్

      తొలగించండి
  11. గత పూరణలు....

    నాతి సీతమ్మ పుత్రుల నామములెవి?
    తల్లి యన్నయు తమ్ములు తనయకెవరు?
    హనుమ యెవ్వరికైదెచ్చె నౌషదములు?
    లవకుశులు, మేనమామలు, లక్ష్మణునకు

    విరటుడు కంకుభట్టుతో...
    ఉత్తరమ్మున చెరనున్న మొత్తమాల
    నుత్త చేతుల పోరాడి యొసగు మనకు
    ఉత్తరించును శత్రుల మత్తనయుడె
    ఉత్తరుం డర్జునునకంటె నుత్తముండు.

    రిప్లయితొలగించండి
  12. అనికి జని సత్యభామను
    గని వెనుకకుజని భయము నుగొని తలపోసెన్
    మనమున నరకుడు సుమ్మీ
    కనికరముంజూపదగదు కాంతలపైనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో యతి తప్పింది. ‘..గని వెనుకకు జని భయపడి కలతన్ దలచెన్’ అందామా?

      తొలగించండి
  13. శంకరాభరణం సమస్యాపూరణం
    23/5/2016

    1.
    తన కోపమె తన శత్రువు
    యనిదెలిసియు దానినెపుడు నదుపున బెట్టన్
    వినయముతో యత్నించగ
    గని, కరముంజూప దగదు కాంతలపైనన్

    2.
    జనులకు జన్మంబు నొసగి
    యనయము నిన్నియొ సేవల నార్తిన్ జేయన్
    ఘనమగు నా సేవలెపుడు
    గని, కరముంజూప దగదు కాంతలపైనన్

    3.
    పనిలో నెంతయు నైనను
    గనికరమును జూపదగును గని దాననిలో
    దన కెదురుబడిన సుంతన్
    గని కరముంజూప దగదు కాంతలపైనన్

    4.
    చినదానను, నేనిను వల
    చినదాన,ననుచు పడకను సింగారముతో
    తనువీయ మగడు రతిలో
    గని కరముంజూప దగదు కాంతలపైనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపూరణలో ‘శత్రువు+అని=శత్రువని’... ఇక్కడ యడాగమం రాదు. ‘తనకోపమె శత్రువు తన|కని దెలిసియు...’ అనండి.
      రెండవపూరణలో రెండవపాదం మూడవగణంగా (సేవల) భగణం వేశారు. అక్కడ తప్పక జగణం కాని నలం కాని ఉండాలి కదా! ‘..యనయము సేవలను గోరి యార్తిన్..’ అనండి.

      తొలగించండి
  14. దనుజుల సతి తాటకపై
    ధనువును చేపట్టి యిపుడె బాణంబిడుమా
    మనుజులకున్ కీడయ్యెడి
    కనికరమున్ చూపదగదు కాంతలపైనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దనుజుల సతి తాటకపై
      ధనువును చేపట్టి యిపుడె బాణము విడుమా
      మనుజులకున్ కీడయ్యెడి
      కనికరమున్ చూపదగదు కాంతలపైనన్

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘దనుజాంగన తాటకపై’ అంటే ఇంకా బాగుంటుందేమో?

      తొలగించండి
    3. గురువుగారూ, మీ సవరణకి ధన్యవాదములు

      దనుజాంగన తాటకపై
      ధనువును చేపట్టి యిపుడె దండన నిడుమా
      మనుజులకున్ కీడయ్యెడి
      కనికరమున్ చూపదగదు కాంతలపైనన్

      తొలగించండి
  15. వినయవిహీనలు,కూళల
    గు నతివ లపకారములిల గూర్తురు. మదిలో
    ననునయ మించుక దలపక
    కనికరముంజూప దగదు కాంతలపైనన్.

    రిప్లయితొలగించండి
  16. చెనటులు దుర్మార్గులపై
    కనికరముంజూపదగదు. కాంతలపైనన్
    వినుటకు నశ్లీల విమ
    ర్శన జేసెడి వదరుబోతు లను దీర్చ వలెన్

    రిప్లయితొలగించండి
  17. కనుడీ వాక్యము మీరలు
    కనికరముంజూ పదగదు కాంతల పైన
    న్వినుటకు సొంపుగ గలదే ?
    వనితలు లేనట్టి గృహము పరేత భూమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరిపాదంలో (పరేత) గణదోషం. ‘...గృహము వ్యర్థము గాదే’ అందామా?

      తొలగించండి
  18. రిప్లయిలు
    1. సునిశిత వాక్చాతుర్యత
      మన మార్తిం జెందు నుడుకు మాటల కరకుం
      దనము పతులు, హాస్యంబున
      కని, కరముం జూపఁ దగదు కాంతలపైనన్.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. మనమున మదనుడు జొరబడి
    తనువున తాపమునుబెంచి తగవులనాడన్
    వినుము సరస సమరమ్మున
    కనితరముంజూపదగదుకాంతల పైనన్

    రిప్లయితొలగించండి
  21. తనజాతకమ్ముఁజూచుట
    కని , కరముంజూపఁ, దగదు కాంతలపైనన్
    వినయములేకుండ, వికృత
    కనుసైగల రెచ్చగొట్టి కరమును బట్టన్

    రిప్లయితొలగించండి
  22. 1అనయము కోకలు నగలను
    కొనమని వేధించుచున్న గోమలి నిలలో
    ననిశము దూరంబిడవలె
    కనికరము జూపదగదు కాంతల పైనన్.
    2గొనయము సారించుచు వ
    చ్చినవనితామణి నిగనుచు చిడుముడి పడుచున్
    కనలుచు పలుకుచు నుండెను
    కనికరము జూపదగదు కాంతలపైనన్

    3.వినుమొక మాటను నుడివెద
    కనికరము జూపదగదు కాంతలపైనన్
    యనియెడి పలుకుల వినకుము
    ననిశము శుభమును తలచెడు నతివలు వీరే.

    4.ఘనముగ నప్పులు చేయుచు
    జనులకు టోపీలిడుచును జారెడు లలనా
    మణులన్ శిక్షించగ వలె
    కనికరము జూపదగదు కాంతల పైనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ నాల్గు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మూడవపూరణలో ‘పైనన్+అనియెడి’ అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  23. 🙏 🌺🙏

    కం**

    మనమున కపటపు ప్రేమను,
    ననిశము జూపెడి వగలవి హానిని జేయున్ !
    తనమది నమ్మకు మెపుడున్,
    కనికరము జూపదగదు కాంతల పైనన్ !!


    🌺🙏 🌺

    అంబటి భానుప్రకాశ్.

    రిప్లయితొలగించండి
  24. వనితలు ఇంటన్ బయటన్
    వినయం బుగ సే వజేయ విసురుగ మగడున్
    అనెని ట్లేదా సివిమా
    కని,కరముంజూపఁదగదు కాంతలపైనన్

    2
    వనితల పరువున్ దీయుచు
    మనసంస్కృతిసాంప్రదాయములను మరచితే
    మని పల్కునతివలపైనన్
    కనికరము జూపఁదగదు కాంతల పైనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణలు బాగున్నవి.
      మొదటిపూరణలో ‘వనితలు+ఇంటన్’ అని విసంధిగా వ్రాశారు. ‘వనితలు తా మింట బయట’ అందామా?
      రెండవపూరణ రెండవపాదంలో యతి తప్పింది. ‘మన సంస్కృతి సభ్యతలను మరువం దగునా| యని పల్కు...’ అందామా?

      తొలగించండి
  25. అనురాగము చూపించక

    సినిమాలో సూర్యకాంత చేష్టల పగిదిన్

    పనిగట్టుక పోట్లాడిన

    కనికరముంజూప దగదు కాంతల పైనన్.

    రిప్లయితొలగించండి
  26. తన బాగోగులె జూచుచు
    ననిశము తనవారి కిడుము లధికము గూర్చన్
    పనిగొని పురుషుల దూరగ,
    కనికరముం జూపఁ దగదు కాంతలపైనన్.

    వనితల విరోధి పైనన్
    కనికరముం జూపఁ దగదు; కాంతలపైన
    న్ననివార్య ప్రేమ గలిగి
    గణనీయము గాగ మెచ్చ గావలె పురుషుల్

    రిప్లయితొలగించండి
  27. అనుపమ శుభగుణ శీలురు
    అనురాగపు గనులు మణులు నన్నిటి లోన,
    న్ననితర సాధ్యులు, వారల
    గని, కరముం జూప దగదు కాంతల పైనన్!!!

    రిప్లయితొలగించండి
  28. స మ స్య
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    అనియె వయస్యుడు కృష్ణ !
    యా సత్యభామ. మదమున

    నిను బతి యనుచు దలపక
    నీశిర౦బును తాచె నౌర !

    వినవల దతివల మాట ;
    ప్రేమను గుప్పి౦చ దగదు;


    కనికరము౦ జూప దగదు
    కా౦తల. పైనన్ నిజముగ

    రిప్లయితొలగించండి
  29. దినదినము చెడ్డపనులన
    కనికరముంజూప వలదు|”కాంతల పైనన్
    సునిశిత భావము జూపుము”
    అనవరతము వనిత లేక నాయువు దరుగున్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘..జూపుము అనవరతము’ అని విసంధిగా వ్రాశారు. ‘..జూపుం డనవరతము’ అనండి. ‘లేక’ ద్రుతాంతం కాదు. లేక యాయువు అని యడాగమం వస్తుంది.

      తొలగించండి
  30. వినదగు పెద్దల మాటలు
    ననుభవమున జెప్ఫుచుందు రందరి యెదుటన్
    సునయన సుందర జవ్వని
    గని కరమును జూప దగదు కాంతల పైనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది. కాని భావం అర్థం కాలేదు. ‘సుందర జవ్వని’ అనడం దుష్టసమాసం. ‘సునయన సుందరి జవ్వని’ అనవచ్చు. అలాగే ‘మాటల| ననుభవమున..’ అంటే బాగుంటుంది.

      తొలగించండి
  31. Srinivas Chari గారి పూరణ...

    తను పెండ్లాడిన భర్తను
    తనపిల్లల నత్తమామ తండ్రుల నిలలో
    కవయక తిరిగిన కించిత్
    కనికరముం జూపదగదు కాంతలపైనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో టైప్ పొరపాటని చెప్పారు. అక్కడ 'కనయక' అని కాక 'కనకయె' అనండి.

      తొలగించండి
  32. చినవానిఁ జంప పూతన
    వినయమ్ముగఁ బాలు త్రాప విడె యూపిరులన్!
    దనుజ గుణమ్మున మెదలెగఁ
    గని కరముం జూపఁ దగదు కాంతల పైనన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.టైపాటు సవరణతో
      చినవానిఁ జంప పూతన
      వినయమ్ముగఁ బాలు త్రాప విడె యూపిరులన్!
      దనుజ గుణమ్మున మెదలగఁ
      గని కరముం జూపఁ దగదు కాంతల పైనన్!

      తొలగించండి
  33. ధనమును సంపా దించుచు
    వినయము లేకుండ మెలగి వేధించ పతిన్
    తననే మించున దెవరన
    కనికరముం జూపఁ దగదు కాంతల పైనన్

    రిప్లయితొలగించండి
  34. ధనమును ఆశించియు పసి
    కూనలనపహరణజేయు కుటిలాంగనలన్
    కనగనె శిక్షింపవలయు
    కనికరముంజూపఁదగదు కాంతల పైనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      కాని రెండవ పాదాన్ని గురువుతో ప్రారంభించారు. కందపద్యంలో మొదటి పాదాన్ని లఘువుతో ప్రారంభిస్తే మిగిలిన పాదాలను లఘువుతోనే ప్రారంభించాలి. గురువుతో ప్రారంభిస్తే మిగిలిన పాదాలను గురువుతోనే ప్రారంభించాలని నియమం.

      తొలగించండి
  35. అణగెను పురుషాధిక్యత
    వనితలు ద్రుంచె నసమత్వ భావన మనలో!
    వినయమ్ము జూపి ,వీరిన్
    గని;కరముం జూపఁదగదు కాంతల పైనన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వనితలు ద్రుంచి రసమత్వ... 'అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములండి శంకరయ్య గారు
      మీ సూచన మేరకు సవరించాను
      సవరించిన పద్యములు

      తొలగించండి
    3. వనితలు తా మింట బయటన్
      వినయం బుగ సే వజేయ విసురుగ మగడున్
      అనెని ట్లేదా సివిమా
      కని,కరముంజూపఁదగదు కాంతలపైనన్

      2
      వనితల పరువున్ దీయుచు
      మనసంస్కృతిసభ్యతలను మరువం దగునా !
      యనిపల్కునతివపైనన్
      కనికరముం జూపఁదగదు కాంతల పైనన్

      తొలగించండి
  36. sk2030- 49, 50, 51.
    శ౦కరాభరణము- సమస్యాపూరణం- 23/05/2016
    5.
    జన జాతర లో జొరబడి
    పనిగట్టుక పరులజేరి పాకెట్ గొట్టన్
    కనుగొన బట్టించవలెను
    గనికరముంజూప దగదు కాంతలపైనన్.
    6.
    జనిని గానని సుతుపై
    కనికరముంజూప దగదు; కాంతలపైనన్
    జనని యనెడు భావమునిడి
    ననయము గొలచెడు వారలె యాదర ణీయుల్!
    7.
    కనిపించిన వారి గసుర
    గనికరముంజూప దగదు; కాంతలపైనన్
    నేనరింతయు లేక దాడి
    ఘనముగ జేసెడు వారల ఖండించ వలెన్!


    - గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ.

    రిప్లయితొలగించండి
  37. నా రెండవ పూరణము.

    ప్రణయాంబుధి దేలించుచు

    ననయము సంసార క్షేమమరసెడుసతులన్

    వినయము సౌశీల్యంబును

    గని ; కరముం జూప దగదు కాంతల పైనన్.

    రిప్లయితొలగించండి
  38. నా రెండవ పూరణము.

    ప్రణయాంబుధి దేలించుచు

    ననయము సంసార క్షేమమరసెడుసతులన్

    వినయము సౌశీల్యంబును

    గని ; కరముం జూప దగదు కాంతల పైనన్.

    రిప్లయితొలగించండి
  39. శ్రీ కంది శంకరయ్య గురువుగారికి వందనములు

    మీరు సూచించాన పొరపాట్లు టైపింగు చేయడములో జరిగినవి
    టైపింగ్ పొరపాట్లను కూడా కాకుండా చూచుకోవడములో పొరపాటు జరిగింది మీ సూచనకు ధన్యవాదములు

    పదిమందిలో అందమైన స్త్రీల వైపు చేయి చూపించుట మంచిది కాదని ఉహించి వ్రాశాను
    భావము కుదరలేదేమో.

    రిప్లయితొలగించండి
  40. అనువుగ తగలెట్టంగను
    తినుబండారమ్ములన్ని తియ్యనివనుచున్
    కినువక కొనియాడుటలో
    కనికరముం జూపఁ దగదు కాంతలపైనన్!

    రిప్లయితొలగించండి