కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“పరమభాగవతులు సానివాడ నుంద్రు”
(కవిమిత్రులారా, అనారోగ్యం కారణంగా ‘పద్యరచన, ఖండకావ్యము’ శీర్షికలను ప్రకటింపలేకపోతున్నాను. ఇస్తున్న సమస్యల పూరణలను సమీక్షించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. కాస్త ఆరోగ్యం కుదుటపడగానే మిగిలిన శీర్షికలను కొనసాగిస్తాను. మన్నించండి).
గొప్పలను తమగురించి చెప్పుకొనుచు
రిప్లయితొలగించండిదొంగ బాబాలు జనులను దోచుకొనును
చీకటి పడినంతనె సిగ్గు లేక నిట్టి
పరమభాగవతులు సానివాడ నుంద్రు
మీ పూరణ బాగుంది. మొదటి పాదము లో "జ"గణము పడింది చూడండి.
తొలగించండిపరమ భాగవతులు సాని వాడ నుంద్రు
రిప్లయితొలగించండినిజము కాదన నెవ్వరు భుజము దట్టి
యోగి వేమన శ్రీనాధు భోగ వశులు
పండితుం డైన ధూర్జటి పరమ పదము
మీ పూరణ కొంచెము సందిగ్ధముగా నున్నది. "శ్రీనాధు" అని విభక్తిప్రత్యయము లేకుండ వ్రాసారు. పరమ పదమని యసంపూర్తిగా వదిలారు.
తొలగించండినమస్కారములు కామేశ్వర రావుగారు
తొలగించండిమీసవరణకు ధన్య వాదములు .గురువుగారి అనారోగ్యం మనసుకి బాధగా ఉంది. అసలే నేనుకుస్తీ పట్టి రాస్తాను ఇకమళ్ళీ రాసే ఓపికలేదు క్షమించగలరు
నిరత ధ్యానయోగ నియమ నిష్ఠ లందు
రిప్లయితొలగించండివాసు దేవుడు గల స్వామి వాడ నుంద్రు
పరమ భాగవతులు; సాని వాడ నుంద్రు
మోహ పంకిలమున బడు మూర్ఖ జనులు
మీ పూరణ బాగుంది. "నిరత ధ్యానయోగ" లో "త" గురువవుతుంది. "నిరత" సంస్కృత పదము కదా.
తొలగించండికామేశ్వరరావుగారూ!నమఃపూర్వక ధన్యవాదములు. గమనించలేదు. గురువుగారి ఆరోగ్యం బాగుపడలని కోరుచూ వఇ బాధ్యత మీరుతీసికున్నందులకు అభినందనలు.ఎందుకంటే మంచి శిల్పి చేతిలో పడితేనే ఱాయి రూపం అందగిస్తుంది. చిన్న మార్పుతో
తొలగించండినిరత భక్తియోగ నియమ నిష్ఠ లందు
వాసు దేవుడు గల స్వామి వాడ నుంద్రు
పరమ భాగవతులు; సాని వాడ నుంద్రు
మోహ పంకిలమున బడు మూర్ఖ జనులు
శర్మ గారు మీ సవరణ బాగుంది.
తొలగించండితరమె వైష్ణవ మాయల దరచి జూడ
రిప్లయితొలగించండివేశ్యలట్టుల మసలుచు విద్య నరసి
ధరను చింతామణిన్వోలు ధన్యురాండ్రు
పరమ భాగవతులు సానివాడ నుంద్రు!
మీ పూరణ బాగుంది. అభినందనలు. మణిన్+ పోలు = మణింబోలు.ధ్రుత సంధి యిక్కడ. గసడదవాదేశ సంధి రాదు.
తొలగించండిబండికాడి అంజయ్య గౌడ్ గారి పూరణ....
రిప్లయితొలగించండిఈశ్వరుని గొల్తు రెవ్వారు హృదయమందు?
సతిని విడచిన పతులకు స్థానమెద్ది?
చింత లేనట్టి వారలు కొంతమంది?
పరమభాగవతులు; సానివాడ; నుంద్రు.
అంజయ్య గౌడ్ గారు క్రమాలంకారములో మీ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిభువనవిజయమందలి యష్టదిగ్గజముల
రిప్లయితొలగించండిపెద్దలయిన వారును పూజ్య పెద్దనార్యు
పరమ భాగవతులు సాని వాడలుంద్రు
దానిపూర్తి పేరును యల్లసాని వాడ
దేవరాయల యాస్థాన దిగ్గజముల
తొలగించండిపెద్దలయిన వారును పూజ్య పెద్దనార్యు
పరమ భాగవతులు సాని వాడలుంద్రు
దానిపూర్తి పేరును యల్లసాని వాడ
మీ పూరణ బాగుంది. అభినందనలు. మొదటి పద్యము మొదటి పాదములో యతి దోషము. పెద్దనార్యు విభక్తి ప్రత్యయము లేకుండ వ్రాసారు.
తొలగించండిశుభోదయం !
రిప్లయితొలగించండియిందు గలరందునుగలరు ! ఈకువ గొని
పరమ భాగవతులు సానివాడ నుంద్రు,
తరచి జూడ వారికి గలదా తరతమ
భేదములు జిలేబి వినుమా భేషు యనగ !
జిలేబి
మీ పూరణ బాగుంది. అభినందనలు. "గలరు ! ఈకువ" విసంధి గా వ్రాసారు.
తొలగించండి"యిందు గలరందునుంగలరీకువ" అనండి.
నా రెండవ పూరణము
రిప్లయితొలగించండివర మహోన్నత మగువిద్య భాసిలంగ
పరమ యోగి గణము నందు బరగు చుంద్రు
పరమ భాగవతులు: సాని వాడ నుంద్రు
వ్యసన వశ్యులు వెలయాళ్ళు యశము దప్పి!
నా రెండవ పూరణము
వర మహోన్నత మగువిద్య భాసిలంగ
పరమ యోగి గణము నందు బరగు చుంద్రు
పరమ భాగవతులు: సాని వాడ నుంద్రు
వ్యసన వశ్యులు వెలయాళ్ళు యశము దప్పి!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపరమభాగవతులు సాని వాడనుంద్రు
రిప్లయితొలగించండియనుచు పల్కుట సరికాద నరయుడయ్య
కారణాంతరమున జన్మ కాంచినట్టి
వారలంచు మ్రొక్కవలయు భక్తి తోడ.
మీ పూరణ బాగుంది. అభినందనలు.నుంద్రు+అనుచు= నుంద్రనుచు: సంధి నిత్యము.యడాగమము రాదు.
తొలగించండికాదని+అరయుడయ్య లో యడాగమము రావాలి
🙏 🌺🙏
రిప్లయితొలగించండితే**
హరిని దైవమని మనమున మరువరెపుడు,
పరమ భాగవతులు ,సానివాడ నుంద్రు !
నిత్యకాములు నెప్పుడు,నిలచి జూచు,
కామి మోక్షగామి విధము, కనరజీవ. !!
🌺🙏 🌺
అంబటి భానుప్రకాశ్.
గద్వాల.
మీ పూరణ బాగుంది. అభినందనలు. మొదటి పాదము లో గణ దోషము. "దైవమని మదిని" అనండి.నిలిచి అనండి.
తొలగించండికళలు మసిబార మరినేడు కలలు చితికె
రిప్లయితొలగించండిచిత్ర గీతాల గంతులె చివరి యాశ!
విటుల జతగూడి కూటికై విధిని దలచి
పరమ భాగవతులు సాని వాడ నుంద్రు
(కొంతమంది భాగవతులకు భుక్తికై రికార్డింగు డాన్సులే గతి అయ్యాయని ఒక వూహ మాత్రమె)
మీ పద్యము బాగుంది. అభినందనలు. సమస్య సమర్థనీయముగా పూరింప బడ లేదు.
తొలగించండివీధివాడనబేధమువిష్ణుతత్త్వ
రిప్లయితొలగించండిమెరుగ కర్మకర్తృత్వమె మోక్ష మిచ్చు
ముదము సానిగ నివసించె ముద్దు పళని
పరమభాగవతులు సానివాడనుంద్రు
మీ పూరణ బాగుంది. అభినందనలు.రెండవ పాదములో యతి దోషము. "విష్ణుతత్త్వ
తొలగించండిమెరుగదు" అనియా మీ భావన?
మంచి యారోగ్య మిమ్ముమా ,మాగు రువులు
రిప్లయితొలగించండిశంక రార్యుల కెప్పుడు, లెంకనుగద
వేడు కొనుచుంటి నిన్నునే వినయ ముగను
నాల కించుమ నామొఱ యాది దేవ !
స మ స్య
రిప్లయితొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అరయ భాగవతు డన౦గ =
. నా శౌరి వేషము౦ దాల్చి ,
తిరిగి , బిచ్చము నెత్తుచున్ , బ్ర
. తికెడు నట్టి కులము వాడు |
సురను సేవి౦చి - మా౦సమున c.
. జొక్కి - స౦ధ్య వడిన౦త. . " మన
పరమభాగవతులు " సాని
. వాడ ను౦ద్రు విలాసముగను ! !
{ చొక్కు = పరవశమ౦దు , .. మద్యమా౦సముల కిష్ట పడు }
ి
మధ్యాక్కర లో మీ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి కవి మిత్రులందరికి నమస్సుమాంజలుల తో చిన్న విన్నపము.
రిప్లయితొలగించండిపైన నాపేరు మీద నొక్కితే నా ”బ్లాగున” నా చే ప్రచురతమైన యీ క్రింది వాటిని నాలోకించ గలరు. అందలి గుణ దోషముల పరికించి మీ యమూల్య సూచనల నీయ గోర్తాను.
1. పండితారాధ్యము:
విమలము విబుధానందక | రము సుజన మనోవికాస లలితాస్పదమున్
సుమధుర వాచాలంకృత | కమనీయ కవన నికాయ కమలాకరమున్
అట్టి పండితారాధ్యమున “ పద్మావతీ శ్రీనివాసము”
2. రామచంద్ర శతకము:
రఘునాథ కీర్త నావృత | ము ఘనాతిశ యానురాగ పూరిత నినద
మ్ముఘ నాశన వచనాకర | ము ఘనాఘన సన్నుత ప్రమోద కరంబున్
3. పోచిరాజ శతకము:
సుమధుర భాషణ కలితము | రమణీయ నయ విశదీకరణ గురణంబున్
కమనీయౌపమ్యసహిత | సుమ నిభ మృదు నిత్యసత్య సూక్త్యావృతమున్
రిప్లయితొలగించండితే.గీ:అజమిళాదులు ఖ్యాతులు యవనియందు
పరమ భాగవతులు సాని వాడనుంద్రు
పాపకర్మముననుభవింపంగ బుట్టు
చుందురట్టివారిగనుము సుజను లనుచు
మీ పూరణ బాగుంది. అభినందనలు.ఆయన అజామిళుడు. పేరు కాబట్టి అజమిళుడు గా వ్రాయ వచ్చనుకుంటాను "దుస్ససేనుడు" వలె.
తొలగించండికుమ్మరి పురుగు తిరుగు పంకమ్ము నందు
రిప్లయితొలగించండినిర్మలముగఁ దమ్మి దళము నీరు వదలు
నెల్ల నాత్మలు పరమాత్మయే యనంగ
పరమభాగవతులు సానివాడ నుంద్రు
నిత్యాగ్నిహోత్రులు నిజ భాగవతులు
తొలగించండిసత్య సంధులె యనిశము భాగవతులు
నిజదార రతు లవనిని భాగవతులు
సుజనాళి సుముఖులు సుమ భాగవతులు
పరదారలం దలుపరు భాగవతులు
నిరతాధ్యయను లవనిని భాగవతులు
పర నిందలను సలుపరు భాగవతులు
పర ధన మపహరింపరు భాగవతులు
భూత గణ హితు లెపుడు భాగవతులు
వీత రోషులును భువిని భాగవతులు
భగవ”ద్ద్విపదా”శ్రిత భాగవతుల ధర్మము చాల చక్కగ నుడివిన మీకు అభినందనలు.
తొలగించండిశర్మ గారూ యిది నా పద్మావతీశ్రీనివాసమను కావ్యము లోనిది. ధన్యవాదములు.
తొలగించండిప్రవచనమ్ము చేయు పరమభాగవతులు
రిప్లయితొలగించండిసాని వాడ నుంద్రు రసికజాణసతులు
గాత్రమున్ను నమ్ముకొనును కథకుడనగ
గాత్రమున్ను యమ్ముకొనును గణిక గనక॥
మీ పూరణ బాగుంది. అభినందనలు."గాత్రమున్ను+ యమ్ముకొనును" ఇక్కడ యడాగమము రాదు. సంధి జరుగుతుంది.
తొలగించండిసత్యమార్గము చనుదెంచు సంతతమ్ము
రిప్లయితొలగించండిపరమ భాగవతులు,సానివాడ నుంద్రు
దొంగయోగులు ప్రజలను దోచుకొనుచు
చిక్క వలవదు వారల చేతికెపుడు
మీ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదైవ సాన్నిధ్యమున నుంద్రు తా రెపుడును
రిప్లయితొలగించండిపరమ భాగవతులు, సాని వాడ నుంద్రు
జారు లెప్పుడు, వారల సమయ మంత
వ్యర్ధ మొనరింతు రట్లు ని ర ర్ధక ముగ
అన్నయ్య నీ పూరణ బాగుంది. అభినందనలు. వ్యర్థము; నిరర్థకము పునరుక్తి యనుకుంటాను.
తొలగించండికామి గాక నెవ్వరు మోక్షగామి కారు!
రిప్లయితొలగించండివిప్రనారాయణార్యులు, వేమనయును
పుండరీకులు, జ్ఙానమ్ము పొంద నట్టి
పరమభాగవతులు సాని వాడనుంద్రు!
మీ పూరణ బాగుంది. అభినందనలు. జ్ఙానమ్ము పొందన్+అట్టి యనే గదా మీ భావన. కించిద్వ్యతిరేకార్థమును భ్రమింప జేస్తోంది.
తొలగించండిధన్యవాదములండీ! నా భావన మీరన్నట్లు పొందన్+అట్టి.
తొలగించండిచలన చిత్రము నందున చిత్రమగుచు
రిప్లయితొలగించండిభక్తి కథలలో మొదటగా పరమ నాస్తి
కత్వము గలిగి దేవుని కరుణ గనని
పరమ భాగవతులు సాని వాడ నుంద్రు
అరాశ
మీ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిచలన చిత్రము నందున చిత్రమగుచు
రిప్లయితొలగించండిభక్తి కథలలో మొదటగా పరమ నాస్తి
కత్వము గలిగి దేవుని కరుణ గనని
పరమ భాగవతులు సాని వాడ నుంద్రు
అరాశ
పరమ భక్తుల స్థాయిని వరలునట్టి
రిప్లయితొలగించండివారికెప్పుడు సాని సంసారి యనగ
భేదముండదు,జగతికి ప్రేమబంచు
పరమభాగవతులు సానివాడనుంద్రు.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిపూజనీయులు శంకరయ్య గారికి...మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు భగవానుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిపూజనీయులు శంకరయ్య గారికి...మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు భగవానుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండికామి గాకను,కైవల్య గామి గాడ
రిప్లయితొలగించండిటన్న సూక్తికి దీటుగా నాలయమున
స్వామి కిరుప్రక్క లిరువురు సానులుండ
పరమ భాగవతులు సాని వాడ నుంద్రు
మీ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండికరము విధినే స్మరించుచు గాన , నాట్య
రిప్లయితొలగించండికావ్యములను రచింతురు గాయకులగు
పరమభాగవతులు ; సానివాడ నుంద్రు
సభ్య సంసారముల గూల్చు సానివాండ్రు
మీ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిkavimitrulaku namaskRutulu.
రిప్లయితొలగించండిjvaram, onTi noppulu, talanoppi, neerasam kaaraNamga kaneesam mee pUraraNalanu kUDaa cadavalEka pOtunnaanu. mannimcamDi.
dayacEsi paraspara guNa dOSha vicaaraNa cEsikonavalasimdigaa manavi.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీరు విశ్రాంతి తీసుకోండి. మీకు త్వరగా స్వస్థత చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. మీ యానతి ప్రకారము నా చేతనైనంత వరకు పూరణలను పరిశీలించు చున్నాను. ఇది మీరొసగిన విద్యయే. కవి మిత్రుల సహకారము నాశిస్తున్నాను. నా వీక్షణ లో దోషము లున్న మన్నించ గోర్తాను.
తొలగించండిగురువర్యుల జ్వరం తగ్గేవరకు పోచిరాజు కామేశ్వర రావు గారు - గుణ దోష విచారణ చేయాలని ప్రార్థిస్తున్నాను.
రిప్లయితొలగించండిపోచిరాజు కామేశ్వరావు గారి సమీక్షకై ఎదురుచూస్తున్నాను.సమీక్షించ ప్రార్థన.
తొలగించండిధన్యవాదములండి రెడ్డి గారు, సహదేవుడు గారు.
తొలగించండినా పూరణ సమీక్షించమని మిమ్ములను కోరుచున్నాను.
తొలగించండిమీ సమస్యాపూరణములన్నియు బాగున్నవి.మాట మన్నించి మా పూరణలను సమీక్షించినందులకు ధన్యవాదములు.
తొలగించండిగురువు గారికి త్వరలో పూర్తి ఆరోగ్యం సమకూరాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిపడుపు వృత్తికి తెరవేసె ప్రభుత నాడు!
నాలయము లెన్నియొ వెలసెనచట, కాని
సాని వాడ పేరటులనే సాగుచుండె
పరమ భాగవతులు సాని వాడ నుంద్రు!
మీ పూరణ బాగుంది. అభినందనలు."నాడు! నాలయము" నుగాగమము రాదిక్కడ. సంధి నిత్యము. "నాడె / యాలయము" అనండి.
తొలగించండినమస్కారములు
రిప్లయితొలగించండిగురువులు త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించి . అక్క
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిబమ్మకయిన పుట్టునటయ్య రిమ్మ తెగులు
నింతిజూడను సామెత నిక్కమయ్యె
వేదములు పఠియించిన వేడుక పడి
పరమ భాగవతులు సానివాడ నుండ్రు
🙏 చెన్నకేశవ, రాయచోటి 🙏
మీ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిపరమభాగవతులు సానివాదనుంద్రు
రిప్లయితొలగించండియున్న తప్పని దలచుట యూహ గాదు
పూలపరిమళ మందించు బురద యందు
పుట్టి దైవ సేవకు జేరు పట్టుదలగ|
2.కవుల భావనలెన్నియో భువికి బంచి
ధర్మ మార్గాలు నిలిపెడి తలపు లందు
పరమ భాగవతులు|” సానివాడ నుంద్రు
కష్ట నష్టము లున్నను నిష్టబడుచు “|
మీ రెండు పూరణ బాగున్నవి. అభినందనలు."వాదనుంద్రు+ యున్న" యదాగమము రాదు. సంధి జరుగుతుంది. వాడ బదులు "వాద" పడింది.
తొలగించండిగురువుగారూ మీరు అతి శీఘ్రముగా కోలుకోవాలని ఆ పరమేశ్వరుడి పాదపద్మములకు నమస్కరించి ప్రార్థిస్తున్నాను.
రిప్లయితొలగించండిగురుదేవుల ఆరోగ్యము కుదుటపడవలెనని భగవంతునికి ప్రార్థన.
రిప్లయితొలగించండిసేవ చేయుచు నిత్యము చిత్తమందు
రిప్లయితొలగించండిదేవదేవుని గొల్తురు దీక్ష తోడ
పరమభాగవతులు ; సానివాడ నుంద్రు
వేశ్య లెందరో చూచుచు విటుల కొఱకు.
మీ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిసేవ చేయుచు నిత్యము చిత్తమందు
రిప్లయితొలగించండిదేవదేవుని గొల్తురు దీక్ష తోడ
పరమభాగవతులు ; సానివాడ నుంద్రు
వేశ్య లెందరో చూచుచు విటుల కొఱకు.
రిప్లయితొలగించండితే .గీ:సతతముభగవంతునిసేవ చక్కగాను
చేయు పుణ్యపురుషులు యీ సృష్టి యందు
పరమభాగవతులు:సానివాడనుంద్రు
కొంతమంది దుష్ట మతులీ కువలయమున.
మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిగురువు గారు మన గురించి రోజూ యెంత శ్రమ పడుతున్నారో యీనాడు నాకు ప్రత్యక్షముగా బోధపడినది.
రిప్లయితొలగించండిగతంలో పండిత నేమాని గారు పద్య విశ్లేషణ చేస్తూ, గురువుగారికి నిత్యము సహకరించేవారు. ఇప్పుడు గురువుగారొక్కరే చుస్తున్నారు. చక్కని విశ్లేషణ చేస్తున్నపోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదములు.
తొలగించండిపరమ పురుషుని గనుగొన పరగు చుంద్రు
రిప్లయితొలగించండిపరమభాగవతులు, సానివాడ నుంద్రు,
నగరు నుంద్రు, పటు విటులెన్న సులభముగ
పరము దొరకు వాడలవియె ప్రకటముగను
మీ పూరణ బాగుంది. అభినందనలు."నగరి నుంద్రు" అనండి.
రిప్లయితొలగించండివరలి వేశ్యల తరియించు వార మనుచు
రిప్లయితొలగించండిపరమభాగవతులు సానివాడ నుంద్రు
దైవ భక్తిని బోధించి;...తరచి చూచి
వారి దారులు నచ్చంగ...వదల లేరు :)
రిప్లయితొలగించండిఇచటనచట కల రెచటయినను కలరు
పరమ భాగవతులు సానివాడ నుంద్రు
గుళ్ళు గోపుర ముల నుంద్రు గుట్ట లందు
మేడలందు కాటినిగూడ మేల్మి బడసి!
జిలేబి