మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటిపూరణలో ‘విద్యలలో నిమిడియుండి’ అనండి. రెండవపూరణలో ‘నడక+ఎంచి’ అన్నపుడు ‘నడక యెంచి/ నడక నెంచి’ అవురుంది. సంధి లేదు.
కవిమిత్రులారా, నా ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడింది. కాకుంటే నీరసంగా ఉంది. ఏరోజు బ్లాగులో ‘పద్యరచన, ఖండకావ్యము’ శీర్షికలు కనిపిస్తాయో ఆరోజు నేను సంపూర్ణంగా స్వస్థతను పొందినట్టు లెక్క!
హృద్యం బుగ మెచ్చంగను
రిప్లయితొలగించండిపద్యములను వ్రాయవలెను పదుగురు; రోయన్
పద్యంబులు వ్యర్థంబని
పద్యంబులను నిరసించు వారలె యెపుడున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅధ్యయనము జేయకనే
రిప్లయితొలగించండిహృద్యము గాపలుకు నంట యోగము నందున్
సధ్యో జాతుని కరుణను
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్
సధ్యోజాతుడు = శివుడు
అక్కయ్యా,
తొలగించండి'రోయన్' ఏ అర్థంలో ప్రయోగించారు?
చేయక.. అన్నది కళ. కనుక '... జేయకయే' అనండి.
రెండవ పాదంలో యతి తప్పింది.
సద్యోజాతుని సధ్యోజాతుని.. అన్నారు.
సద్యోజాతుని కరుణను
తొలగించండిపద్యములను వ్రాయవలెను , పదుగురు రోయన్
అధ్యయనము జేయకయే
మద్యము సేవించుచు వ్రాయు మహిమాన్వితమౌ
శుభోదయం !
రిప్లయితొలగించండిఉద్యమ కారిణి వోలెన్
పద్యములను వ్రాయవలెను; పదుగురు రోయన్
విద్యను విడమాకు! భువిన
సాధ్యము పద్యములు నేర్వ సాధన జేయన్ !
చీర్స్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విడమాకు' అనడం గ్రామ్యం. 'విడబోకు' అనండి. 'భువిని' అనడం సాధువు. ఇకారాంత శబ్దం తరువాత 'ని' చేర్చాలి.
తొలగించండిధన్య వాదాలండీ కంది వారు !
ఆరోగ్యము కుశల మేనా ! విశ్రాంతి తగు పాళ్ళ అవసరం !
టేక్ కేర్ !
జిలేబి
హృద్య పద బంధురంబుల
రిప్లయితొలగించండినుద్యోదిత మహిత భావముప్పొంగంగన్
విద్యాలంకృత ధీయుత
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్!
రోయు=వెదకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఉప్పొంగన్'అనడం సాధువు. 'భావ ముప్పొంగ సదా' అనండి.
సేద్యము సేయగ మేధను
రిప్లయితొలగించండిపద్యములను వ్రాయవలెను, పదుగురు రోయన్
విద్యా ప్రకటన వృథ, నై
వేద్యము కాదా నిజముగ వేదాగ్రణికిన్||
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసద్యోజాతుడు మెచ్చగ
రిప్లయితొలగించండివిద్యల దల్లిని దలచుచు వేడుక తోడన్
హృద్యంబుగ ధరను నిలుచు
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్!!!
రోయు వెదకు, శోధించు,అరయు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి[5/28, 7:51 AM] NVNChary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
రిప్లయితొలగించండిఆద్యంతము రస మయమై
మద్యంబునుమించి మత్తు మదిలో నిండన్
సద్యో జాతంబుగ నిక
పద్యంములను వ్రాయవలెను పదుగురు రోయన్
[5/28, 8:10 AM] NVNChary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
గద్యము కన్నను సులభము
హృద్యంబుగ లయనుగూడి హితవరి తానై
విద్యార్జన సాధనమగు
పద్యంములను వ్రాయవలెను పదుగురు రోయన్
[5/28, 8:23 AM] NVNChary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
పద్యము డైలాగు గజలు
హృద్యము తెలుగాంగ్ల యుర్దు హిందీ లందున్
చోద్యంబుగ కవు లందరు
పద్యంములను వ్రాయవలెను పదుగురు రోయన్
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరోయు.. ఏ అర్థంలో ప్రయోగించారు?
అధ్యయ నమ్మును జేయక
రిప్లయితొలగించండిసాధ్యమె కైతల రచనను సాధన జేయన్
హృద్యముగ ప్రజల మదిగొను
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్
ద- ధ లకు స్వ వర్గజ ప్రాస వేశాను.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిహృద్యముగాగవులందరు పద్యములనువ్రాయవలెను,పదుగురురోయన్ విద్యనునవమానించకు విద్యయెమరికూడుబెట్టువిశ్వంబునకున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విద్యల నవమానించకు' అంటే బాగుంటుంది.
పద్యము మనసుకు హృద్యము
రిప్లయితొలగించండిమద్యమ్మునుమాన్పజేయు మహిమే గలుగన్
చోద్యము నిట్టివి జూచుచు
పద్యములనువ్రాయవలెను పదుగురురోయన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మనసునకు' అనడం సాధువు. 'పద్య మెడందకు హృద్యము' అనండి.
విద్యలు నేర్చిన యంతట
రిప్లయితొలగించండిగద్యమునకు ఛందము లయగా నిడి వైశా
రద్యము చాటక, యేలా
పద్యములను వ్రాయ వలెను పదుగురు రోయన్!
రోయు = ఏవగించు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచిన్న మార్పులతో రెండవ పద్యం
రిప్లయితొలగించండివిద్యలు నేర్చిన వారలు
గద్యమునకు ఛందము లయగా నిడి వైశా
రద్యము చాటుచు , యెన్నో
పద్యములను వ్రాయ వలెను పదుగురు రోయన్!
రోయు = ఈర్ష్య పడు
మీ సవరించిన పూరణ బాగున్నది.
తొలగించండి'చాటుచు నెన్నో' అనండి.
విద్యను సరిపడ నేర్వక
రిప్లయితొలగించండిగద్యమునే నాల్గు వరుస గావ్రాయుచునే
హృద్యముగ లేక నేలా
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్?
సమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమద్యమ్ము గ్రోలిరేమో
రిప్లయితొలగించండిచోద్యముగ కవిని పదుగురు సొట్టనలాడన్
విద్య,వివేకము నిచ్చెడు
పద్యములను వ్రాయ వలెను పదుగురు రోయన్!
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'గ్రోలిరేమో' అన్నచోట గణదోషం.
హృద్యరసాన్విత రీతిం
రిప్లయితొలగించండిబద్యములనువ్రాయవలెను పదుగురు-రోయ
న్విద్యల నవమానించుటె!
పద్యపు రుచులం దనివిన పరమాత్ముండౌ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిద్యలు ఎన్నియొ నేర్చితి
రిప్లయితొలగించండిఉద్యమ రీతిగ కవిత్వ మొప్పగ నుడువన్
తధ్యము మెచ్చరు; యికనే
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘విద్యల నెన్నియొ నేర్చితి నుద్యమ... మెచ్చరు మరి నే..’ అనండి. (మెచ్చరు+ఇక అన్నపుడు యడాగమం రాదు)
సేద్యముజేసిన పగిదిని
రిప్లయితొలగించండిపద్యములను వ్రాయవలెను -పదుగురురోయన్
విద్యలనేర్వక యుండుట
సద్యశములనెల్ల కోరి చంపుటకాదే!
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసరస కవితా విశారదులు శంకరయ్యగారికి నమస్సులు. మీరాక వలన ఆరోగ్యం కుదుటబడినట్లు భావిస్తున్నాము. సంతోషము.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ! ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఒంటినొప్పులు, నీరసం అలాగే ఉన్నాయి.
తొలగించండిహృద్యముగను మది నిలిచే
రిప్లయితొలగించండిపద్యములను వ్రాయవలెను,
పదుగురు రోయన్
గద్యము నిండియు నీరస
పద్యములను వ్రాసినచో పాడియు గలదే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘నిలిచే’ అనడం వ్యావహారికం. ‘నిలిచెడి’ అనండి. ‘వ్రాసినచో’ అన్నచోట గణదోషం. ‘వ్రాయ బూన పాడియు గలదే’ అనండి.
ఆద్యంతము సంక్లిష్టము
రిప్లయితొలగించండివిద్యావంతులిటు రాష్ట్ర విభజన జేయన్
చోద్యంపు ఘాతుకముపై
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసద్యఃఫల దాయకములు
తొలగించండివిద్యాధికుల కవనౌఘ విజ్ఞాన నిధుల్
హృద్యముగ నిగూఢార్థపు
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్
[రోయు = వెదకు]
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిద్యావశ్యకతను ప్రతి
రిప్లయితొలగించండివిద్యార్ధికి విశదపరచు విధముగ కవులున్
హృద్యముగా మది నిలిచెడు
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్.
రోయు = వెదకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసేద్యంబును చేయుచు యన
రిప్లయితొలగించండివద్యంబగు రచన జేయు పోతన వోలెన్
సద్యంబున హృద్యంబగు
పద్యంబుల వ్రాయవలెను పదుగురు రోయన్
ఈర్ష్య అనే అర్థంలో వాడియున్నాను.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘చేయుచు ననవద్యంబగు...’ అనండి.
గురువుగారూ, సవరణకి ధన్యవాదములు. మీ ఆరోగ్యం కుదుట పడినట్లు తలుస్తాను.
తొలగించండిపద్యము సంగీత మునకు
రిప్లయితొలగించండిహృద్యమమగు సాధనమ్ము ; హిందోళము నై
వేద్యము గా గాయకులన
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్
గద్యము కన్నను పద్యము
నుద్యమముగ రచన చేయ నోర్వగ లేకన్
పద్య విరోధులు పరుగిడ
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిహృద్యమగు పద్యము c జదువ
రిప్లయితొలగించండిఆద్యంతము రోయు జనులు యానందమునన్,
చోద్యము జూడంగ నిచట
పద్యములను వ్రాయ వలెను పదుగురు రోయన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘జనులు+ఆనందమునన్’ అన్నపుడు యడాగమం రాదు. ‘రోసెడి జను లానందమునన్’ అనండి.
నా రెండవ పూరణము.
రిప్లయితొలగించండిమద్యము వరకట్నము గొను
నధ్యాయంబుల చరితను నంతము చేయ
న్నాద్యంతము నిరసించుచు
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిద్యార్థు లెంద రున్నను
రిప్లయితొలగించండిపద్యములను వ్రాయవలెను పదుగురు, రోయన్
గద్యము వలె చదివెడు యా
విద్యార్థికి కఠిన శిక్ష వేయగ వలయున్ .
హృద్యముగా చదవ వలెను
పద్యములను, వ్రాయవలెను, పదుగురు రోయన్
విద్యాహీనులు, సైపుము
విద్యాధికులే పొగడెడు విధమున సుమ్మీ.
విద్యలు నేర్చిన చాలదు
పద్యములను వ్రాయవలెను, పదుగురు రోయన్
విద్యాధికుడే బెదరక
హృద్యముగా జదవగలడు శృతిదప్పకనే
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణలో ‘చదివెడు నా...’ అనండి.
హృద్యముగ జనులు మెచ్చగ
రిప్లయితొలగించండిపద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్
పద్యంబు లెచటి వనుచును
నధ్యయనము చేయవలయు నవనిని వారున్.
2.విద్యల తల్లికి మ్రొక్కుచు
పద్యములను వ్రాయవలెను :పదుగురురోయన్
పద్యములనువ్రాయదలచ
తద్యము జనులచె సతతము తప్పవు నిందల్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి‘జనులచె’ అని చే ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాయరాదు.
.పద్యంబన?యతి,ప్రాసలు
రిప్లయితొలగించండివిద్యలలో యిమిడియుండి|వినయమునందే
ఉద్యమమౌ |సరిలేకను
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్|
2.------------మధ్యాక్కర----------
పద్యముబాడగ?మనసు పాపయ శాస్త్రిని దలచు
హృద్యమువిలవిలలాడు|”హృదయము పుష్ప విలాప
పద్యాల నడకెంచి జేయ?పదగుంభన ప,దని,స,లుగ
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్ వినగనె|
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటిపూరణలో ‘విద్యలలో నిమిడియుండి’ అనండి.
రెండవపూరణలో ‘నడక+ఎంచి’ అన్నపుడు ‘నడక యెంచి/ నడక నెంచి’ అవురుంది. సంధి లేదు.
నా రెండవ పూరణము
రిప్లయితొలగించండివిద్యను బడయుము ఘనముగ
నుద్యమ పథమందు సాగు యువకుని వోలెన్
విద్యుక్తమైన రీతిని
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్!
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిద్యలు గరపిన యొజ్జల,
రిప్లయితొలగించండివేద్యుల,మాతాపితరుల వేధింపుచు నా
యాద్యుని సేవించినచో
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికవిమిత్రులారా,
రిప్లయితొలగించండినా ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడింది. కాకుంటే నీరసంగా ఉంది.
ఏరోజు బ్లాగులో ‘పద్యరచన, ఖండకావ్యము’ శీర్షికలు కనిపిస్తాయో ఆరోజు నేను సంపూర్ణంగా స్వస్థతను పొందినట్టు లెక్క!
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[నేఁటి పద్యకవుల దుఃస్థితి దినదినము పద్య కవిత్వమునుండి వచన కవిత్వమునకు దిగజారుతున్నది. ఇచ్చటఁ బదుగురన, వచన కవితను మెచ్చని పలువురు సంప్రదాయిక పద్య కవులు నని యన్వయము]
సద్యశము గలుగఁ గవు లిఁకఁ
బద్యము విడనాడి యన్యభాషోద్యద్దు
ర్భేద్య ససాంకర్య వచన
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్!
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండిసద్యః ప్రఖ్యులగుటకుఁ గు
విద్యల్ దగఁ గొనిన దుర్వివేచక కవి దు
ర్భేద్యుల భరతము పట్టఁగఁ
బద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్!
మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉన్నాయి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిహృద్యమ భావాన్వితముగ
సాధ్యంబగునంత వరకు సరసోన్నతితోన్
పద్యముల వ్రాయు మెందుకు
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిస్వానుభవము:
రిప్లయితొలగించండిఊద్యోగము ముండనమై
సద్యశమునుగోరి చదువు చంకను నాకన్
చోద్యమ్మౌ రవములతో
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్ :)