7, మే 2016, శనివారం

పద్యరచన - 1217

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

36 కామెంట్‌లు:

  1. గులాబు జాము నొక్క మారు కోరి తిన్న చాలికన్
    గులాము కారె జన్మ జన్మకున్ సలాము కొట్టరే
    హలాహలంబుఁ జేత బట్టి యారగింపపూనునే
    యిలాతలంబునన్ కపర్థి యిట్టి టేస్టుఁ జూచినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ‘హలాహలంబుఁ జేత బట్టి యారగింపపూనునే
      యిలాతలంబునన్ కపర్థి యిట్టి టేస్టుఁ జూచినన్’ అనడం చక్కని భావన! అన్యదేశ్యాలున్నా (విషయం అలాంటిది, తప్పదు!) మీ పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  2. తీరగు గులాబు జాములు
    నోరూరగ దినని వారు నుర్విని గలరే
    పేరిమితో నొకటొకటిగ
    ఆరారా దినును జనులు నాహా యనుచున్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘ఆరారా’... ఆవురావురుమనియా?

      తొలగించండి
  3. రసనామోదము నొసఁగెడు
    రసగోళము లివ్వి జనులు రసగుల్లాలన్
    కొసరి గులాబ్ జామూన్లను
    వెసఁ గ్రోలెద రెల్లరకును ప్రీతిన్ గూర్చున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “రసగోళ” నామకరణముతో మీ పద్యము హృద్యముగా నున్నది. మాకెల్లరుకును బ్రీతి నొసంగిరి. ధన్యవాదములు.

      తొలగించండి
  4. జామూన్ల జూడగానే
    నామది యుప్పొంగుచుండు నాలుక తడయున్
    సామూహికభోజనముల
    ప్రేమగ వడ్డించుచుంద్రు వేడుక లందున్

    రిప్లయితొలగించండి
  5. చక్కనిజామూనులు గన
    మక్కువ హెచ్చగు చుండు మనసారంగన్
    గ్రక్కున యాబగ గబగబ
    మిక్కుటముగ తినవలె నను మోజును పెరుగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో గణదోషం. ‘హెచ్చగుచునుండు’ అనండి.

      తొలగించండి
  6. తీయ తీయ గు లాబిని దినగ జిహ్వ
    లేచి వచ్చును గద మరి లీల !తీసి
    కొనుము వాటిలో మనకుగా గొన్ని టిపుడు
    తనివి దీరగ దింద ము మనము బాల !

    రిప్లయితొలగించండి
  7. సద్మావిర్భూత సురస
    ఛద్మా కలిత మధురాతిశయ భక్ష్య మటన్
    పద్మారుణ మాణిక్యము
    పద్మాక్షునకైన ప్రీతి పాత్రంబు గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శబ్దాడంబరంతో మనోజ్ఞమైన పద్యాన్ని అందించారు. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. చిన్న సవరణ: పద్మాక్షునకైన బ్రీతి పాత్రంబు గదా

      తొలగించండి
  8. గుడరసమునంత పీల్చియు
    వడివడిగా రంగుమారి వహ్వాయనగన్
    సడిలేకగొంతు జారెడు
    తడితడి గులాబు జామూన్ దప్పకదినుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగున్నది మీ పద్యం. కాని చివరిపాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  9. చక్కని బంతులె కాంచగ
    చిక్కని పాకంబు నందు చెక్కర గుళికల్
    ఎక్కడజూచిననక్కడ
    జక్కగ సిద్ధము గులాబు జాముానదియే

    వసుధ జనుల కోర్కెల దీర్చు వారలైన
    పద్మనాభుండు నివసించు పాలకడలి
    మనసు దోచెడు పాకంబు మధ్యలోన
    గుళికలౌ గులాబ్ జామూను నిలిచి యుండు

    రిప్లయితొలగించండి
  10. నాల్గవ పాదము.. సవరణ.
    ,,,,,,,

    తడితడి జామూను దినగ తపనదిహెచ్చెన్.

    రిప్లయితొలగించండి
  11. లడ్డుల పోలికల్ గలిగి లౌఖ్యము నందున తీపి పాకమున్
    జిడ్డును బొందుచున్ గనగ?జిహ్వకు సంతస మంద జేయుచున్
    గడ్డు సమస్యలందొదిగి గర్వమునందున గానుపించగా
    దుడ్డును లెక్క జేయుదుమ?తొందరగా దినదల్చు జామునే|

    రిప్లయితొలగించండి
  12. ఆహా! గులాబు జామున్
    ఓహో! యిది తినగ వలయు నొకమారైనన్
    ఊహాతీతపు రుచియది
    ఊహూ, వద్దెన రెవరును! ఓ యిమ్మందుర్!

    రిప్లయితొలగించండి
  13. ఆహా! గులాబు జామున్
    ఓహో! యిది తినగ వలయు నొకమారైనన్
    ఊహాతీతపు రుచియది
    ఊహూ, వద్దెన రెవరును! ఓ యిమ్మందుర్!

    రిప్లయితొలగించండి
  14. చక్కెర పాకంబుననే
    చక్కగనే మునిగి దేలు జామూన్ గనగా
    మక్కువ మీరగ వదలక
    మెక్కగ నా మనసు కోర్కె మిక్కుటమయెగా!

    రిప్లయితొలగించండి
  15. రసన మెచ్చు నెపుడు రసముతో జామూను
    రచిని కలిగి యుండు రుజలు తగ్గు
    పిన్న వారి కైన పెద్దల కైననూ
    మరల మరల తినగ మనసు పుట్టు /కలుగు

    రిప్లయితొలగించండి
  16. చుయ్యను శబ్దమున్ మిగుల జూంకృతిలట్టుల వేగి,వేడిగా
    తియ్యని పాకమున్ మునిగి తీరగు రూపము పొంది,నింపుగాన్
    యయ్యరొ రంగుదేలి, మనకందరి నోటిని లొట్టలూరగన్
    చయ్యన ముక్కతీసి,నొక సారిటు మింగుట తప్పుగాదురా

    రిప్లయితొలగించండి
  17. చుయ్యను శబ్దమున్ మిగుల జూంకృతిలట్టుల వేగి,వేడిగా
    తియ్యని పాకమున్ మునిగి తీరగు రూపము పొంది,నింపుగాన్
    యయ్యరొ రంగుదేలి, మనకందరి నోటిని లొట్టలూరగన్
    చయ్యన ముక్కతీసి,నొక సారిటు మింగుట తప్పుగాదురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'జూంకృతి యట్టుల.. లేదా.. జూంకృతు లట్టుల' అనండి.

      తొలగించండి
  18. చంద్ర బింబమంది సారఘమ్మునముంచి
    తీసినంత కలుగు తీపి గాక
    తుదకు సుధకు తాను తోబుట్టువౌ చంద్రు
    సారమది గులాబు జాము దేమొ?

    రిప్లయితొలగించండి
  19. డజను గులాబులు తినగనె
    వజను కడుపున పెరుగుగగ వాంతులు వచ్చున్...
    సుజనులు పోటీలందున
    భుజబలమున పిండి మెండు పూడ్చురు కుక్షుల్!

    రిప్లయితొలగించండి