11, మే 2016, బుధవారం

పద్యరచన - 1220

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

69 కామెంట్‌లు:

 1. విందుకార్యములందు పసందు గూర్చు
  మందు బాబులం దరిదరికందు చుండు
  మిర్చి బజ్జీల ఘనతను మించ గలవె
  యితర కారపు ఖాద్యము లెన్ని యున్న.

  రిప్లయితొలగించండి
 2. బజ్జీలు తినని వారలు
  ముజ్జగముల నుండ బోరు మోక్ష మటంచున్
  బిజ్జోడు సైతము వేడిగ
  బొజ్జను నింపగ తినునట వూష్టము నందున్
  బిజ్జోడు = పిసినారి
  వూష్టము = జ్వరము ,వేడి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పద్యం బాగుంది.
   మూడవపాదంలో గణదోషం. ‘బిజ్జోడు కూడ వేడిన’ అనండి. ‘వూష్టం’ మాండలికం. తెలుగులో వూతో మొదలయ్యే పదాలు లేవు కదా!

   తొలగించండి
  2. బజ్జీలు తినని వారలు
   ముజ్జగముల నుండ బోరు మోక్ష మటంచున్
   బిజ్జోడు రుచిని వీడక
   బొజ్జను నింపగ తినునట భూరిగ హితమున్

   తొలగించండి
  3. అక్కయ్యా, సవరించిన మీ పూరణ బాగుంది. సంతోషం!

   తొలగించండి
 3. హరువిడు రుచియట! దీనిం
  గరమందున నిల్పి దినగ కైతలు వచ్చున్
  దరినెచట దొరకునోయని
  పరుగిడుదురు పచ్చిమిరప బజ్జీ కొరకున్!

  రిప్లయితొలగించండి
 4. నోరుకాలుచున్న నిసుమంత నదరక
  మెండుకారమింత మండుచున్న
  మిరపబజ్జి దినెడు మేదిని నరులకు
  నేర్పు నోర్చుకొనుట నేర్పుగాను.

  రిప్లయితొలగించండి
 5. నీతుల నేన్నియొ జెప్పును
  గూతురు గనినసుతునకును గూరిమితోడన్
  తాతయ జెప్పిన "కథ"లో
  కోతిని పెండ్లాడి నాతి కొమరుని బడిసెన్

  రిప్లయితొలగించండి
 6. చిత్ర మందున జూడుబ జ్జీ ల సొగసు
  నెంత బాగుగ నుండెనో నంత రుచిని
  గలుగ జేయును నిజమది కల్ల కాదు
  వేడి వేడివి తిందము వేగ రండు

  రిప్లయితొలగించండి
 7. పిజ్జాలెందుకు మిర్చీ
  బజ్జీ లను దినిన జనులు వహవా యనరే!
  బుజ్జీ! త్వరగా గొనుమివి
  నజ్జంతయు వదలిబోవు నమ్ముము సుమ్మీ!!!

  రిప్లయితొలగించండి
 8. బుజ్జీ! మిరపను కూడిన
  బజ్జీ రుచి మేటి, యిట్టి భక్ష్యమునకు యా
  వజ్జీవం దాసుడనే,
  ఉజ్జీ లేదిక వెదకిన నుర్విని సర్వం॥

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   జీవం, సర్వం... అని వ్యావహారికాలను ప్రయోగించారు.

   తొలగించండి
 9. దోరగ వేయించిన నా
  కారము మానస హరణము కాదే తలుపన్
  నోరూరు జనుల కెల్ల న
  పారమ్ముగ మిరెప కాయ బజ్జీలఁ గనన్

  రిప్లయితొలగించండి
 10. తే**
  చల్ల చల్లని సాయంత్ర సమయ మందు,
  వేడి వేడిగ బజ్జీలు వేళ కందు,,!
  తినుడు ముందుగ మీరలు తీరు గాను,
  బిల్లు మాటది లేదురా చల్ల వేళ. !!

  రిప్లయితొలగించండి
 11. మిర్చి బజ్జీలు తిని చూడు మర్చి పోవు
  కనుల కింపుగా నుండును కమ్మనుండు
  కష్ట జీవుల మందులో కలిమి పరుల
  విందులో తిను చానంద మొందు చుంద్రు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘తినుచు+ఆనందము=తినుచు నానందము’ అవుతుంది. ‘తిని యానంద’మనండి.

   తొలగించండి
 12. మిరప కాయల బజ్జీల మిడిసి పాటు
  నూనె యందున,జేరిన నోటియందు
  రుచుల ఘాటున పళ్ళ చే రోటిపోటు
  బొంద?నాలుక రుచులకు విందు బజ్జి|
  2.సతిపతి వోలె పిండి మనసందున జేరిన మిర్చి తోడుగా
  అతివినయానజేరగ?సహాసమునందున వేడి నూనెలో
  మెతకగ దూకి నాడుకొన?మిక్కిలి మోజుగ గానుపించగా
  చతురత యందు బజ్జి తినజాలగ నెంచును మానవత్వమే|

  రిప్లయితొలగించండి
 13. చినుకు బడిన వేళ శ్రీనివాసుఁడు జేరె
  కొండ దిగుచు పద్మ గుండెఁదట్టి
  స్వామి మనసు లోని సంగతిఁ దెలియుచున్
  మిరప బజ్జి పెట్టెఁ దరుణి తానె!

  రిప్లయితొలగించండి
 14. పచ్చి మిరప కాయ దెచ్చి నిలువుగాను
  చీరి మొదట నుప్పు జేర్చి పిదప
  వేడి నూనె లోన వేయించు బజ్జీలు
  కారముండనట్టి కమ్మదనము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిరపకాయ బజ్జీలు చేయడాన్ని వివరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
   మరి సెనగపిండి అక్కరలేదా?

   తొలగించండి
  2. పచ్చి మిరప కాయ దెచ్చి నిలువుగాను
   చీరి మొదట నుప్పు జేర్చి శనగ
   పిండి లోన ముంచి వేయించు
   కమ్మ నైన బజ్జి సుమ్ము యిదియె

   తొలగించండి

 15. మిరప కాయ బజ్జి మీద మోజు గలిగి
  నోరు యూర జూచి నొక పరినిటు
  చక చక యని రాగ, చక్కని చుక్కగ
  సరస మాడె కార సాపు గీతి !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘నోరు+ఊరి’ అన్నపుడు యడాగమం రాదు, సంధి నిత్యం. ‘నోట నీరమూరి’ అనండి. ‘కార సాపు గీతి’... అర్థం కాలేదు! (ఏమిటో... మీ ప్రయోగాలు ఒక్కొక్కసారి ఒకపట్టాన అర్థమై చావవు నాకు.. మళ్ళీ మీ రాంపడును తెలుగు నేర్చుకొమ్మని నా దగ్గరికే పంపిస్తారు!)

   తొలగించండి
 16. సూర్య ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
  U | U | | U | U U | | | |
  మా ట తీ రు ను బ ట్టి యే మా న వు ని కి
  ✔ సూర్య ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
  | | | | | | | | | | | U | | | |
  వి లు వ గ ల దు మ హి ని మ రి వి జ్ఞ త క లి
  ✔ సూర్య ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
  | | | | | | | | | | | U | | | |
  గి న డ చు ట వ ల న క ల దు గా దె మ మ త
  ✔ సూర్య ఇంద్ర ఇంద్ర సూర్య సూర్య
  U | | | | | U U | U | | | |
  మా ట ని లు క డ లే కు న్న మా న్యు డ గు ను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఛందస్సు సాఫ్టువేరు మీ పద్యం అన్ని విధాల సరిగా ఉన్నదని చూపుతున్నది. కాని మీరొక విషయం తెలుసుకోవాలి. ఆ సాఫ్టువేరు ఇంకా అసంపూర్ణమని, మెరుగు పరచవలసి ఉన్నదని దాన్ని తయారు చేసినవాళ్ళే చెప్పారు.
   మూడవపాదంలో గి-క లకు యతి లేదు. యతిమైత్రిలో హాల్లులతో పాటు వాటితో కూడిన అచ్చులకు మైత్రి పాటించాలి.

   తొలగించండి
  2. రామకృష్ణ గారూ,

   ఛందస్సు అన్న సాఫ్ట్‌వేర్ ఒక ఉపకరణం మాత్రమే. అనేక పరిమితులున్నాయి దానికి. ఔత్సాహికులు తెలిసుకొనవలసిన కొన్ని ముఖ్యవిషయాలున్నాయి. మొదటిది. గురులఘువులను ఆయాస్థానాల్లో వచ్చేలాగు పద్యలక్షణానికి సరిపెడుతూ అక్షరాలు పొదిగినంత మాత్రాన అది ఎంతమాత్రమూ పద్యం‌ కాదండి. రెండవది - పద్యానికి ముఖ్యమైనది నడక - అది ఉండాలి, సాఫీగా ఉండాలి. మూడవది -సంప్రదాయకవిత్వంలో భాషామర్యాదలనూ, వ్యాకరణాన్నీ అతిక్రమించటం బాగుండదు. నాలుగు - మార్గికవిత్వంలో ఐనా దేశికవిత్వంలో ఐనా సరే పద్యలక్షణంలోనే దానితాలూకు నడకకు సంబందించిన కొన్ని విషయాలు ఉంటాయి అంతర్లీనంగా - వాటిని గ్రహించకుండా ఏదో ఒకటి అన్నట్లు ఎన్నుకొని వ్రాస్తే కళకట్టకపోవచ్చు - మహామహులెవరైనా ఆలాగు చేసి కళ కట్టించినా మనం అనుకరించటానికి మన విద్వత్తులు చాలవన్న వినయంతో అలాంటి ప్రయత్నాలకు దూరంగా ఉండటం‌ మంచిది. ఇలాంటివి ఇంకా కొన్ని కొన్ని విషయాలున్నాయి -రీతి, శయ్య, పాకం, గుణము, ఆలంకారికత వగైరాలు -వాటీజోలికి పోయి వివరించటానికి ఇది సందర్భం కాదు.

   దయచేసి అక్షరాలు పేర్చాం కదా గణాలు కూర్చాం‌కదా పద్యం సుష్టువు కాదా అన్న భ్రమలకు లోను కాకండి. మాట వరసకు ఒక ఉపాయం చెబుతాను. మీరొక పద్యాన్ని వ్రాస్తే దానిని మీకు తోచినట్లుగా సాఫీగా మీరు పాడుకోగలగితే కొంత లయ ఉందన్న మాటే. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అలాంటి దాని జాడేమీ లేకపోతే ఆలోచించుకోవాలి.

   ఛందసస్సు సాఫ్ట్‌వేర్ సాయంతో పద్యాలు వ్రాసేస్తున్నానన్న భ్రమతో జిలేబీ గారు వ్రాస్తున్నవి చదువుతుంటే ఒక్కో సారి జీవితంపైన విరక్తి కలుగుతోంది!

   పద్యాలు వ్రాయాలని ప్రయత్నించే అందరికీ నా విన్నపం ఏమిటంటే పద్యాలను చదవండి బాగా. వందలకొద్దీ చదవండి. శతకాలు చదవండి దొరికినన్ని. వ్యాకరణం భూతం కాదు దాన్ని అధ్యయనం చేయండి. ఆంధ్రమహాభారతం, భాగవతం బాగా చదవండి. మీ విద్వత్తును పెంపొందించుకుంటూ ప్రబంధాలు కూడా చదవండి. భాషమీద అధికారం వచ్చిన కొద్దీ పద్యవిద్యలో ఆరితేరుతారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు భాషమీద చెప్పుకోదగ్గ పాండిత్యం ఏమీ లేదు - భారతం చదివి గ్రంథభాష కాస్త ఒంట బట్టించుకున్నా నంతే!

   ఉపకరణాల సాయంతో, నిఘంటుపదాల సహాయంతో కృతకంగా ఎలాగో అలా పద్యాలు కష్టపడి అల్లుకుంటూ పోతున్నంత కాలమూ మనకు కేవలం ప్రయాస తప్ప ఏమీ మిగలదు. నమ్మండి.

   ఇలా వ్రాసినందుకు దయచేసి ఏమీ అనుకోవద్దని మనవి.

   తొలగించండి


  3. శ్యామలీయం వారు :)


   నీవే రామా స్పూర్తీ ! నీవేరా, మా స్పూర్తీ !

   దేవా ! మహాదేవా! శ్యా
   మా! వాగీశా ! జిలేబి మానస సుకవీ !
   నీవే రామా స్పూర్తీ !
   నీ వరముగ నేర్చినాము నిజమిది సుమ్మీ !

   చీర్స్
   జిలేబి

   తొలగించండి
  4. శ్యామల రావు గారు,
   ఔత్సాహికుల దోషాల పట్ల మీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. వారికి (మాకందరికీ) సవివరంగా కవిత్వ స్వరూపాన్ని వివరించి, సూచన లిచ్చినందుకు ధన్యవాదాలు.
   ఈ బ్లాగు పద్యరచనాభ్యాసానికి వేదిక. క్రొత్తగా ఆసక్తితో పద్యరచన ప్రారంభించినవాళ్ళ దోషాలను సరిదిద్దుతూ, తగిన సూచనలిస్తూ ప్రోత్సహిద్దాం.

   తొలగించండి
  5. జిలేబీ గారూ,
   మీ పద్యం బాగుంది.
   మొదటి పాదంలో గణదోషం. ‘దేవ! మహాదేవా! శ్యా...’ అనండి.

   తొలగించండి

  6. oops!

   కంది వారు ! నెనర్లు !

   జిలేబి

   తొలగించండి
 17. పిన్నక నాగేశ్వరరావు. తెనాలి.
  పళ్లెమందు నెన్నొ బజ్జీలు చూడగా
  లాలజలము యూరె గళము నందు
  తినగ చేయి చాచి తీసుకుందామవ్న
  భ్రాంతి కలుగ జేసె వింతగాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది.
   ‘లాలజలము’ను ‘లాలాజలము’ అనాలి. ‘జలము+ఊరె=జలమూరె’ అవుతుంది. యడాగమం రాదు. ఆపాదంలో ప్రాసయతి కూడ తప్పింది. ప్రాసాక్షరాలకు ముందు గురులఘు సామ్యం పాటించాలి. ‘లాల - గళ’ ప్రాసయతి చెల్లదు. ‘తీసుకుందా’మని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

   తొలగించండి
  2. శంకరయ్య గారూ!
   మీ సూచనకు ధన్యవాదాలు.పద్యాన్ని ఇలా సవరిస్తున్నాను. పరిశీలించండి.


   పళ్లెమందునెన్నొ బజ్జీలు చూడగా
   నోటినుంచి జలపు యూట వచ్చె
   తినగ చేయి చాచి తీసుకో వలెనన్న
   భ్రాంతి కలుగ జేసె వింత గాను.

   తొలగించండి
  3. సవరించినందుకు సంతోషం!
   ‘జలము+ఊట = జలపుటూట’ అని పుంప్వాదేశ, టుగాగమాలు వస్తాయి. అక్కడ ‘నీటి యూట’ అంటే సరి.

   తొలగించండి
  4. పళ్లెమందునెన్నొ బజ్జీలు చూడగా
   నోటినుంచి జలపు టూట వచ్చె
   తినగ చేయి చాచి తీసుకో వలెనన్న
   భ్రాంతి కలుగ జేసె వింతగాను.

   తొలగించండి
  5. పళ్లెమందునెన్నొ బజ్జీలు చూడగా
   నోటినుంచి జలపు టూట వచ్చె
   తినగ చేయి చాచి తీసుకో వలెనన్న
   భ్రాంతి కలుగ జేసె వింతగాను.

   తొలగించండి

 18. మిరపకాయఁజూడ మిరుమిట్లు గొలుపుచు
  తినగ నాశ పుట్టు తీరుబడిగ
  దీని మెచ్చనట్టి తెలుగు వాడుండునా
  వేడి వేడివి తిన వేగ రండు.

  2మిర్చి బజ్జి చూడ మేదిని యందున
  నోట నెపుడు నీరు నూరు చుండు
  కార మనుచు వీని కమ్మగా తిందురు
  తెలుగు వారి కెరుక దీని రుచియు.

  3.ఆహ యేమి రుచని యననట్టి ఆంధ్రుండు
  అవని యందు గలడె నరసి జూడ
  నోట కారమనుచు నెమ్మదిఁలాగించు
  వలదు యనెడి వాడు గలడె చెపుమ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘రుచి+అని’ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘ఆంధ్రుండు+అవని’ అన్నపుడు సంధి నిత్యం. మీరు విసంధిగా వ్రాశారు. ‘...గలడె యరసిచూడ’ అనండి. నెమ్మది తరువాత అరసున్న ఎందుకు? ‘వలదు+అనెడి’ అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 19. నా పూరణములోని రెండవ పాదాన్నిఇలా సవరిస్తున్నాను.

  లాలజలము యూరు నాలుక పయి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాగేశ్వరరావు గారూ

   యడాగమాదులపైన అధికారం సాధించటం అవసరమండీ. జలము + ఊరు -> జలమూరు అవుతుంది కాని జలము యూరు కాదు. 'సంధిలేని చోట స్వరంబు కంటెం బరంబయిన స్వరంబునకు యడాగమం బగు' అని (బాల.వ్యా. సంధి. ౩) సూత్రం. ఇక్కడ సంధి ఉంది కాబట్టి యడాగమం చేయకూడదు కదా. సంది ఎలాగంటారా? అదే (బా.వ్యా. సంధి. ౧) వ్యాకరణంలో సూత్రం‌ ఉంది కదా 'ఉత్తున కచ్చు పరంబగు నపుడు సంధి యగు' అని. జలము అనేది ఉకారాంతమైన తత్సమం. ఊరు అన్నది అచ్చుతో ప్రారంభమైన మాట. జలములో చివర ఉకారం ఉన్నది - తరువాతి మాట మొదట్లోనే ఊ అన్న అచ్చు ఉన్నది. ఇక్కడ సంధియగు అంటే చచ్చినట్లు సంధి అవుతుంది. కాబట్టి జలమూరు అవుతుంది.

   కవిమిత్రులు సంప్రదాయకవిత్వంలో సాధన చేయటనికి వ్యాకరణాన్ని కూడా తప్పక అభ్యాసం చేయాలి. అలాగె సంప్రదాయకవిత్వాన్ని బాగా చదివితే భాషాస్వరూపం బాగా అవగతం అవుతుంది.

   ఇలా చెప్పినందుకు దయచేసి అన్యధా భావించకండి.

   తొలగించండి
  2. శ్యామల రావు గారూ,
   యడాగమ, నుగాగమాల విషయంలో ఔత్సాహికులు ఎన్ని సార్లు హెచ్చరించినా తప్పులు చేస్తూనే ఉన్నారు. గతంలో వివరంగా బ్లాగులో యడాగమ,నుగాగమాల గురించి పాఠాలు కూడ పెట్టాను.
   వివరమైన వ్యాఖ్య పెట్టినందుకు మనస్ఫూర్తిగా ఆనందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఛందోవ్యాకరణాంశాల దోషవిచారణకు అందరికీ ఈ బ్లాగు స్వాగతం పలుకుతున్నది. అభ్యంతరం చెప్పడం, అన్యధా భావించడం అన్న ప్రసక్తి లేదు.

   తొలగించండి
 20. నా పూరణములోని రెండవ పాదాన్నిఇలా సవరిస్తున్నాను.

  లాలజలము యూరు నాలుక పయి

  రిప్లయితొలగించండి
 21. పచ్చిమిరపకాయలు చీల్చి వాము వేసి
  ఉప్పు చేర్చి శనగపిండిలోన ముంచి
  సలసల మరుగు నూనెలోచక్కగాను
  వేగినఘుమ ఘుమల బజ్జి ఇష్టపడని
  వారు లేరు చూడగనె నోరూరు గాన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగుంది.
   రెండవపాదంలో యతి తప్పింది. ‘ఉప్పు జేర్చి సెనగపిండి నొనర ముంచి’ అనండి.

   తొలగించండి
 22. అన్నయ్యగారూ నమస్తే.సవరించవీలుకాక మరోపద్యంవ్రాశాను.చూడగలరు.

  ఆవురావు మనుచు నారగించుచు నుండు
  అవని యందు జనులు యరసి జూడ
  నోట కారమనుచు నెమ్మదిఁలాగించు
  వారి సంఖ్య హెచ్చె వసుధయందు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది మీ పద్యం.
   ‘ఆరగించుచునుందు| రవని...’ అనండి. ‘జనులు+అరసి’ అన్నపుడు యడాగమం రాదు. ‘అవనియందలి జను లరసి చూడ’ అనండి.

   తొలగించండి
 23. చూడఁగిరీటముందొడిగి సోకొలికింతువు; నాసికాగ్రమున్
  వాడిగదాడిజేయుచు సువాసనతోమదిఁదోచినావటే !
  వేడిగవేచిదెచ్చి నినువేగమెతిందుము స్వర్గలోకపుం
  బోడిమిజూడఁ ధన్యమయెఁబో రసనంబులు! మిర్చిబజ్జిరో !

  రిప్లయితొలగించండి
 24. కమ్మనైన బజ్జీ కనువిందుగా యుండు
  మంటనైన కూడ మంచిగుండు
  తినని వారు లేరు తెలుగు వారింటను
  వేడి, వేడి బజ్జీ వేళ కుండు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘కనువిందుగా నుండు’ అనండి.

   తొలగించండి
 25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 26. ధన్యవాదాలు సార్,

  కమ్మనైన బజ్జీ కనువిందుగా నుండు
  మంటనైన కూడ మంచిగుండు
  తినని వారు లేరు తెలుగు వారింటను
  వేడి, వేడి బజ్జీ వేళ కుండు!

  రిప్లయితొలగించండి
 27. చూడ ముచ్చటైన చురుకైన బజ్జిలు
  జిహ్వమీద దాడి చేయు గలవు
  యదుపు దప్పి రేని అపైన నారోగ్య
  మదుపు తప్పి కోరు నౌషధములు

  రిప్లయితొలగించండి
 28. తే.గీ. కంట బడిన జాలు మిరప కాయ బజ్జి
  ఆవురావు రనుచును దామాశ తీర
  పంట నమలంగను మనసు పడని వారు
  ఎవరు గల్గుదు రీభువి నెంచి జూడ!

  రిప్లయితొలగించండి

 29. మిరప కాయబజ్జీలని మిక్కుటముగ
  పరువిడి నిటువచ్చితిని బో ! పాతది యిది
  యైనను నొక పరి జిలేబి వైనము గను
  పదము బేర్చెద ననుకొన పద్య మయ్యె !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 30. మిర్చి బజ్జి జూడ మిరిమిడిగా నుండు
  కొరికి నంత ఘాటు గూబ కంటు
  క్రొత్త పొలతి జూడ మెత్తనై యుండదె...
  విశ్వ దాభి రామ వినుర వేమ

  రిప్లయితొలగించండి


 31. మిరప కాయ బజ్జి మిడిసిపడు జిలేబి
  పరువ మందు త్రుళ్ళు పడుచు పిల్ల
  వీటి టెక్కు చూడ వింతయే మడుసుల
  కెన్ని కెంపు లద్దె గిబ్బరౌతు


  జిలేబి

  రిప్లయితొలగించండి