అమ్మాయిలూ!
విదేశ వస్త్రాలంకరణపై అత్యాసక్తి మానండి
రచన : గురుమూర్తి ఆచారి
అది యొక పె౦డ్లికార్య మట యన్నుల మిన్నల కెల్ల మ౦గళ
ప్రదముగ కు౦కుమన్ -
పసుపు - వస్త్రము లిచ్చెడు వేళ నిట్టులన్
సుదతులు మాటలాడుకొనుచున్
నిలుచు౦డిరి "చూడరే యటుల్
కుదిరెను బాలికా మణికి
కు౦కుమ బొట్టు శశా౦కబి౦బమై.
నుదుటను శుభ్రమ౦దహస
నూతన దీధితి ర౦గు వేయగన్
బెదవుల పైన , కాటుక - వినీలపు రేఖల దిద్దె రెప్ప ల౦
దు; దనరు దీర్ఘ కేశముల దువ్వి - జడన్ దగ వైచి - మల్లె
పూ
ల దురిమె; కర్ణ కు౦డలములన్ - కరక౦కణముల్ ధరి౦చె; నా
పదముల క౦దియల్ దొడిగె; పద్ధతిగా నలరారు చు౦డి, యే
కొదవలు లేని క౦చుకము, కోకయు దాల్చె; సతమ్ము చన్గవన్
బదిల మొనర్చి దాచ గల
పయ్యెద వేసెను;
చూచి
న౦తనే
మది తలకొల్పు నా రమణి - "మా
సతి" యై; మరి యేమి కాల దు
ర్విధియొ గదా! యసహ్య మగు వేషము "ఫ్యాష"
నట౦చు నె౦చుచున్.
ముదితలు కొ౦తమ౦ దెగసి
పోయి చరి౦తురు, సిగ్గు - లజ్జలన్
వదలుచు; చూడు చూడు మన వైపునకున్ జనుదె౦చు జవ్వనిన్
పెదవుల ర౦గు నద్దుకొని, బెత్తెడు మ౦దము "క్రీము" రుద్ది, పె౦
జిదుగు కురుల్ భుజాల
పయి చె౦పల మీదను వ్రేలుచు౦డ , ప
య్యెద బరువౌ నట౦చు
ధరియి౦పక, బాహువు లూచి, గాలికిన్
వదలచు - పొ౦గుచున్న కుచభా౦డములన్, జఘన౦బు పైన నా
భి దిగువ య౦దు
"లెగ్గి" నను విస్మయమున్
కలిగి౦చు "ఫ్యా౦టు"లో
పొదిలి తళుక్కునన్
మెరయు పుష్టి కరోరు నిత౦బ యుగ్మమున్
బదుగురు చూడ, తా నిటుల వచ్చెను పె౦డ్లికి స౦బరమ్ముగా "
సదమల మైన యట్టి మన
స౦స్కృతి నెప్పుడు గౌరవి౦చుమా ;
చదివితి నన్న బి౦కమును చాట విదేశపు "ఫ్యాష " నె౦దుకో !
చదివిన దానికిన్ గురుతు సభ్యత యే సుమ ! యేల నీ గతిన్
సదమద మ౦దగన్ ; రవికె - చక్కని చీర ధరి౦ప , కల్గ నే
రదు గద స౦ఘమ౦దు జవరాలికి
లో టవి గౌరవమ్ము - ని౦
డుదనము - నిశ్చలత్వము - పటుత్వము
- మానము - గూర్చు
నమ్మరో !
••••••••••••••••••••••••••••••••••••••
గురుమూర్తి ఆచారిగారూ! ప్రాపంచీకరణ వలనవచ్చిన మార్పులతో సంప్రదాయములన్నీ కొట్టుకుపోతున్నవి. ప్రౌఢంగా ఉన్నా మీ చంపకపద్యమాలిక బాగున్నది. అధినందనలు.
రిప్లయితొలగించండిచిన్న మనవి - చాలా సార్లు మనం విదేశీ అలంకరణ, విదేశీ ఫ్యాషన్, విదేశీ...విదేశీ... అని తగిలిస్తుంటాము. విదేశాలలో కూడా సభ్య సంస్కార వస్త్రాలంకరణ ఉన్నదని, ఉంటున్నదని మనవి చేస్తున్నాను. మన వాళ్లకి "వేలం వెర్రికి వెనకాముందూ లేద"న్నట్లు అతి ఎక్కువ. దానిని సమర్ధించే తల్లి తండ్రులేక్కువవ్వటం మన దురదృష్టం. ప్రాపంచీకరణ మన ఆడబిడ్డలని ఆ రకంగా డ్రెస్ చేసుకోమని చెప్పలేదండీ. డ్రెస్ కోడ్ లో ఇండియా MNCల లో చాలా స్పష్టంగా చెప్పారు మన ఆంధ్రా కట్టు బొట్టూ నిషేధించలేదని మనవి.
రిప్లయితొలగించండిచిన్న మనవి - చాలా సార్లు మనం విదేశీ అలంకరణ, విదేశీ ఫ్యాషన్, విదేశీ...విదేశీ... అని తగిలిస్తుంటాము. విదేశాలలో కూడా సభ్య సంస్కార వస్త్రాలంకరణ ఉన్నదని, ఉంటున్నదని మనవి చేస్తున్నాను. మన వాళ్లకి "వేలం వెర్రికి వెనకాముందూ లేద"న్నట్లు అతి ఎక్కువ. దానిని సమర్ధించే తల్లి తండ్రులేక్కువవ్వటం మన దురదృష్టం. ప్రాపంచీకరణ మన ఆడబిడ్డలని ఆ రకంగా డ్రెస్ చేసుకోమని చెప్పలేదండీ. డ్రెస్ కోడ్ లో ఇండియా MNCల లో చాలా స్పష్టంగా చెప్పారు మన ఆంధ్రా కట్టు బొట్టూ నిషేధించలేదని మనవి.
రిప్లయితొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
విదేశీ వస్త్రాల౦కరణ పై నేను వ్రాసిన. పద్యములు స్వీకరి౦చి న౦దుకు
గు రు వు గా రి కి ధ న్య వా ద ము లు
మరియు ప ద న మ స్కా ర ము లు
మూర్తి గారి రచన మోతాదు దాటెను
రిప్లయితొలగించండిజోలి మాలి నపని జూడ యదియ
పరువు నష్ట మనుచు బడతులు దావాను
వేతు రేమొ సామి ! భీతి కలిగె
చదువు దోడుత నెరుగుము సభ్యతయును.....మీ పద్య రచన బాగున్నదండీ.. గురుమూర్తి ఆచారి గారూ
రిప్లయితొలగించండిచదువు దోడుత నెరుగుము సభ్యతయును.....మీ పద్య రచన బాగున్నదండీ.. గురుమూర్తి ఆచారి గారూ
రిప్లయితొలగించండిఆచారిగారూ ! విదేశీ వస్త్ర ధారణ గురించి చక్కని "ఖండ" కావ్యం వ్రాశారు..చాలాబాగుంది...అభినందనలు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండివచ్చితి వచ్చితి నిటు గురు !
మెచ్చితి మీపద్యములను మేలగు పదముల్ !
నిచ్చితి కితాబు నొకమా
రిచ్చట! ఫ్యాషను జిలేబి రివ్వున జూచెన్ !
ఔరా ! స్త్రీ వలువల గూ
ర్చా ఈ పద్యము జిలేబి రయ్యనె కోపం !
హోరా హోరీ జేయన్
కారా మిర్యాలు నూరె కాంతా రమణీ !
చీర్స్
జిలేబి
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
విదేశీ వస్త్రాల౦కరణ పై నేను ప౦పిన
ఖ౦డకావ్యము పరిశీలి౦చిన కవిమిత్రు
ల౦దరికి ధన్యవాదములు .
……………………………
శ్రీ బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి
్
శ్రీ లాన్ ఫ్యామిలీ గారికి
శ్రీ యస్. శర్మ గా రికి
ి
శ్రీ గోళి. హనుమఛ్ఛాస్త్రి గా రికి
ి
శ్రీ జిలేబి ి గారికి
ధన్యవాదములు నమస్సులు
…………………
శ్రీ సుబ్బారావు గారికి ధన్యవాదములు .
నమస్సులు .
పడతులు నాపై దావా వేయుదు రను భీతి
నాకు లేద౦డి. మనదేశ౦లో :-- చూడగనె
లక్ష్మీదేవత వలే కనిపి౦చే తల్లులు యి౦కా
తొ౦బది అయిదు శాతమునకు ఎక్కువే గలరు.
వార౦దరు నాపై జాలి వహి౦చి నాకు సపోర్టు
యిచ్చి నన్ను రక్షిస్తారన్న నమ్మకము నాకు కలదు.
ి
పరదేశ వస్త్రదారణ
రిప్లయితొలగించండివిరివిగ గనుపించ గలుగు విజ్ఞతలందే
మరచిన మన సంస్కృతిపై
గురుమూర్తిట గుర్తుజేసె గుట్టగు రట్టే.
శ్రీ ఈశ్వరప్ప గారికి --- గురుమూర్తి. ఆచారి
రిప్లయితొలగించండిధన్యవాదాభిన౦దనలు
ి
ఆహా! పదునైన చంపకమాలికతో చంపుకు తినేశారండీ అసభ్య వస్త్ర ధారణను!
రిప్లయితొలగించండిజోహార్లు.
మీ ఖండకావ్యము సలక్షణంగా యున్నది.అభినందనలు.
రిప్లయితొలగించండి