13, మే 2016, శుక్రవారం

సమస్య - 2032 (తొలుత మ్రొక్కంగ...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
తొలుత మ్రొక్కంగవలె నెల్ల దుర్జనులకు. 

98 కామెంట్‌లు:

  1. కాని పనులను జేయుచు కలత బెడుచు
    హాని తలపెట్టి బాధింతు రవని పైన
    మనుజ లోకాన దిరిగెడు దనుజు లనగ
    తొలుత మ్రొక్కంగవలె నెల్ల దుర్జను లకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పెడుచు’ అనడం సాధువు కాదు. అక్కడ ‘కలత బెట్టి’ అనండి.

      తొలగించండి
    2. కాని పనులను జేయుచు కలత బెట్టి
      హాని తలపెట్టి బాధింతు రవని పైన
      మనుజ లోకాన దిరిగెడు దనుజు లనగ
      తొలుత మ్రొక్కంగవలె నెల్ల దుర్జను లకు

      తొలగించండి
  2. శుభోదయం !


    హృదయపు కుహురమున యున్న హృత్తు తెలిసి
    తొలుత మ్రొక్కంగవలె, నెల్ల దుర్జనులకు
    తొలగ వలె దూరము జిలేబి, తోడు గలడు
    ఈశు డతడనాది పురుష, నీర జాక్షి !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో ‘హృదయము, హృత్తు’ అని పునరుక్తం. ‘కుహరమున+ఉన్న= కుహరమున నున్న’ అవుతుంది. యడాగమం రాదు. అలాగే ‘..గలడు+ఈశు’డని విసంధిగా వ్రాయరాదు. నా సవరణ....
      ‘హృదయకుహరము నందున్న యెఱుకఁ దెలిసి... గలడు|నీలగళుఁ డాదిపురుషుండు (శివపరంగా) నీరజాక్షి’ లేదా ‘నీలకాయుఁ డనంతుండు (విష్ణుపరంగా) నీరజాక్షి’ అనండి.

      తొలగించండి
  3. జాలి జూపుచు పీడిత జనుల పట్ల
    సాయ పడువాని మన్నించి సాగిలపడి
    తొలుత మ్రొక్కంగవలె , నెల్ల దుర్జనులకు.
    మోము వంచి కపటముతో మ్రొక్కనేల ?

    రిప్లయితొలగించండి
  4. సాధు బీదలకు తగిన సాయ మిచ్చి
    అదుకొను ప్రజా ప్రతినిథుల నాద రించి
    తొలుత మ్రొక్కంగవలె , నెల్ల దుర్జనులకు
    ఓటు నివ్వగ జనులెల్ల యూగు టేల ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘సాధు బీదలు’ అని సమాసం చేయరాదు. ‘సాధు దీనులకు...’ అనండి. ‘జనులెల్ల నూగుటేల’ అనండి.

      తొలగించండి
  5. చెడును చేేయకు, వినకుము, జూడకుమని
    జెప్పు నార్యోక్తి విలువల గొప్ప దెలియ
    వెలచు కొనగను మనలోని మలినములను
    తొలుత మ్రొక్కంగ వలె నెల్ల దుర్జనులకు!

    వెలచు=శుద్ధిచేయు

    రిప్లయితొలగించండి
  6. డా .ఎన్.వి.ఎన్.చారి గారి పూరణ....

    విలువల వలువ లనువిప్పి కలత నింపు
    తులువ లవలనే నష్టంబు కలుగు చుండు
    వారు మారిన శుభములు కలుగు ననగ
    తొలుత మ్రొక్కంగవలె నెల్ల దుర్జనులకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వలననే’ అనడం సాధువు. అక్కడ ‘తులువల వలన’ అనండి.

      తొలగించండి
  7. అంజయ్య గౌడ్ గారి పూరణ...


    కంచు మ్రోగిన యట్టుల కనక మిలను
    మ్రోగబోదనె నానుడి మున్నె యుండె
    మంచి వారలు ధరలోన మరుగు పడగ
    తొలుత మ్రొక్కంగ వలె నెల్ల దుర్ఙనులకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మ్రోగబోదను నానుడి’ అనండి.

      తొలగించండి
  8. డా సముద్రాల శ్రీనివాసాచార్య skno2036 కవితసంఖ్య8
    కామ క్రోధ లోభములును కష్ట పెట్టు
    మోహ మత్సర మదములు మోస గింపు
    అట్టి యరిషడ్వర్గమ్ముల అంతరింప
    తొలుత మ్రొక్కంగ వలెనెల్ల దుర్జనులకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అరిషడ్వర్గమ్ముల’ అన్నచోట గణదోషం. ‘అట్టి శత్రు షడ్వర్గమ్ము నంతరింప’ అనండి. అలాగే పైన ‘మోసగించు’ అంటే అన్వయం కుదురుతుంది.

      తొలగించండి
  9. మిత్రులందఱకు నమస్సులు!

    దుర్జనత్వమ్ము నంతయుఁ దొలఁగఁ ద్రోచి,
    సాధు గుణముల నెల్లను సత్వరమె ప్ర
    తిగ్రహించి, మనీషిగ దీప్తినందఁ,

    దొలుత మ్రొక్కంగ వలె నెల్ల దుర్జనులకు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిమిత్రులు గుండు మధుసూదన్ గారికి నమస్సులు. చాల మంచి భావంతో అలరారుచున్నది మీ పూరణ. అభినందనలు. మీ పద్యం చదువగా రామకృష్ణ పరమహంస చెప్పిన కథ గుర్తుకు వచ్చినది.( సాధువు-తేలు-నదీస్నానం)

      తొలగించండి
    2. సుకవి మిత్రులు తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి నమస్సులు...ధన్యవాదములు!

      విద్వన్మిత్రులు శంకరయ్య గారికి నమస్సులు...ధన్యవాదములు!

      తొలగించండి
  10. డా సముద్రాల శ్లీనివాసాచార్య skno2036 కవిత సంఖ్య8
    కామ క్రోథ లోబములును కష్ఠ పెట్టు
    మోహ మాత్సర్య మదములు మోసగించు
    నట్టి యరిషడ్గణమ్ముల నంతరింప
    దొలుత మ్రొక్కంగ వలెనెల్ల దుర్జనులకు

    సవరించిన పద్యము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సవరణను నేను చూడకుండా సూచన లిచ్చాను. మీ సవరణ బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  11. విఘ్నముల బాపు కొఱకునై విఘ్ననాధు
    దొలుత మ్రొక్కంగ వలె ,నెల్ల దుర్జనులకు
    దగిన శిక్షను వేయగ దగును సుమ్ము
    చెడ్డ పనులను భావిని జేయ కునికి

    రిప్లయితొలగించండి
  12. ఉదయమున లేచి రామున కుల్లమందు
    తొలుత మ్రొక్కంగవలె నెల్ల దుర్జనులకు
    నెల్ల దుర్వర్తనములకు నెడము చేసి
    నేడు రక్షించవే యని వేడుకొనుచు

    రిప్లయితొలగించండి
  13. 1 వ పూరణం
    విఘ్నముల దొలగించ నా విఘ్నపతికి
    మ్రొక్కుటెప్పుడు? జగదేక మూర్తి విష్ణు
    చేతి చక్రమ్ము నెవరికి చేటు యౌను?
    దొలుత మ్రొక్కంగ వలెనెల్ల దుర్జనులకు

    గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ
    2 పూపూరణము
    కామ క్రోధ వశమున చీకాకు జెంది
    సంఘ వ్యతిరేక గార్యాల సాగుచుండి
    మాట జెప్పిన యంతనే మనసు మార
    దొలుత మ్రొక్కంగ వలెనెల్ల దుర్జనులకు
    గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో ‘చక్ర మెవ్వారికి జేటుదెచ్చు’ అనండి.
      రెండవపూరణలో ‘వ్యతిరేక కార్యాల’ అనండి.

      తొలగించండి
  14. ప్రతి దినారంభమూ జన్మ ప్రదులకేను
    తొలుత మ్రొక్కంగవలె, నెల్ల దుర్జనులకు
    దూరముగనుండవలె, సజ్జనుల సమాగ
    మంబు చేయవలె, నిదియె మంత్రముగను||

    రిప్లయితొలగించండి
  15. దైత్య సంతతి చిత్తంపు వృత్తు లందు
    కలిసి యుండుట నిక్కంబు కలియుగాన
    సజన దుర్జన భేదంబు సాగదింక
    తొలుత మ్రొక్కంగ వలె నెల్ల దుర్జనులకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘సజన’ విషయంలో కాస్త సందేహం!

      తొలగించండి
    2. చిత్త వృత్తుల దనుజుల జీవ యాత్ర
      కలిసి యుండుట నిక్కంబు కలియుగాన
      సుజన దుర్జన భేదంబు చూపదగదు
      తొలుత మ్రొక్కంగ వలె నెల్ల దుర్జనులకు

      ధన్య వాదములు గురువుగారు, సవరించాను. మొదటి పాదంలో యతి దోషం కూడా చూసుకోలేదు. అది కూడా సవరించాను.

      తొలగించండి
    3. యతిదోషాన్ని నేను గమనించలేదు. సవరించినందుకు సంతోషం!

      తొలగించండి
  16. జన్మ నిచ్చినట్టి జనని జనకులకును
    చదువు నేర్పెడి గురునకు, సజ్జనులకు
    తొలుత మ్రొక్కంగ వలె, నెల్ల దుర్జనులకు
    కేలుమోడుచు నున్నచో నేమి ఫలము? !!!

    రిప్లయితొలగించండి
  17. క్రూర నేరాలననచగా ప్రభుత యెన్ని
    చట్టముల దెచ్చినను గాని వట్టివాయె
    తొలుత మ్రొక్కంగవలె నెల్ల దుర్జనులను
    మార్చుమనుచునందరమమ్మ,మారి యెదుట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘దుర్జనులకు’ను మీరు ‘దుర్జనులను’ అని మార్పు చేశారు. సమస్యను మార్చకూడదు.

      తొలగించండి
  18. బడుగువారల సేవలో పరవశించి
    మంచిమార్గముఁజనువారి కంచితముగ
    తొలుత మ్రొక్కం గవలె, నెల్ల దుర్జనులకు
    సతముదూరముగానున్న జరుగు మేలు

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. పెక్కు చిక్కుల స్రుక్కుచు దిక్కు లేక
      నక్కసు మనము నందునఁ బిక్కటిల్ల
      రక్కసుడు రాజ్య మేలంగ నుక్కు దక్కి
      తొలుత మ్రొక్కంగవలె నెల్ల దుర్జనులకు.

      తొలగించండి
    2. సుకవి మిత్రులు కామేశ్వర రావు గారికి నమస్సులు! మీ పూరణము బాగున్నది.

      ప్రథమ పాదాంతాన... లేక...వ్యతిరేకార్థకము. ఇది నకారాంతము కాదు. దీనికి తదుపరి అచ్చువస్తే యడాగమం చేయాలి. ...లేక/నక్కసు...అనరాదు...లేక/యక్కసు...అనాలి. స్వస్తి.

      తొలగించండి
    3. మధుసూదన్ గారు నమస్సులు. సవరణకు ధన్యవాదములు. “దిక్కు లేకను + అక్కసు” అనుకొని వ్రాసాను.

      తొలగించండి
  20. కార్యమేదైన ప్రారంభ కాలమందు
    విఘ్నమన్నది లేకుండ విఘ్న రాజు
    దొలుత మ్రొక్కంగ వలె;నెల్ల దుర్జనులకు
    దూరముగనున్న జయము చేకూరు నిజము.

    రిప్లయితొలగించండి


  21. భార్య పిల్లల బాదియు బాధపెట్టు
    కన్న వారిని కానక కలత పెట్టు
    చేయ వలదిట్టి పనులని చేతులెత్తి
    తొలుత మ్రొక్కంగవలె నెల్ల దుర్జ నులకు

    🙏 చెన్నకేశవ, రాయచోటి 🙏

    రిప్లయితొలగించండి
  22. ఊరి పెద్దలే పేదల నోర్వకుండ
    కష్టముల గలిగించెడు దుష్టులైన
    వారు పెట్టెడు బాధలు వలదటంచు
    తొలుత మ్రొక్కంగ వలెనెల్ల దుర్జనులకు

    రిప్లయితొలగించండి
  23. రాహు కేతుల వేధకు రక్ష వలెను
    దురిత నరఘోషలన్నియు తొలగుటకును
    శాంతి జేసెడి రీతిని సత్వరముగ
    తొలుత మ్రొక్కంగ వలె నెల్ల దుర్జనులకు

    రిప్లయితొలగించండి
  24. మాతృ భూమిని రక్షించు మాన్యులైన
    భారతీయ సిపాయికే భరత జాతి
    తొలుత మ్రొక్కంగ వలె , నెల్ల దుర్జనులకు
    దూరమై చరిం చుటమేలు పౌరు లంత

    పిదప కాలము ప్రాప్తించె పెను విపత్తు
    పొంచి యుండెను జనులార కాంచు మికను
    నోటు గై కొని వేసిన యోటు ఫలము
    ప్రభువు లై వెలుగు చుండెడి పాపు లకును
    తొలుత మ్రొక్కంగ వలె నెల్ల దుర్జనులకు

    రిప్లయితొలగించండి


  25. సలిపి కావ్యంపు రచనను చక్కగాను
    పలికె జోతలు కువిమర్శ కులకు ముందు
    కావ్యకర్త వినమ్రుడై కారణమ్ము
    తొలుత మ్రొక్కంగ వలె నెల్ల దుర్జనులకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని ఒక్క సందేహం. కావ్యరచనలో పాటించే క్రమం ఇది కదా! దైవస్తుతి,సుకవిస్తుతి, కుకవినింద... మీరు మొదటనే కుకవి నిందను ప్రస్తావించారు.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారం. ముందు అంటే నా ఉద్దేశం దైవమును, సుకవులను కాదని కుకవులను ప్రస్తావించారని కాదు. కుకవులకు కూడా ఆదిలోనే నా జోలికి రావద్దని ఒక నమస్కారం పెట్టేసారని.

      తొలగించండి
  26. సమయమాసన్న మగుదాక సాగునెపుడు
    ధరణి దుష్కృత్యముల జేయు దనుజ గతులు!
    రావణాదుల మ్రొక్కెను దేవమునియె!
    తొలుత మ్రొక్కంగ వలె నెల్ల దుర్జనులకు!

    రిప్లయితొలగించండి
  27. . కలతలెరుగని సన్మార్గ బలముయున్న?
    తొలుత మ్రొక్కంగ వలె|”నెల్ల దుర్జనులకు
    ఆశ,నత్యాశగా మార్చు |నళుకునందె
    చావుతప్పదు వారి విశ్వాస ముడుగ”.
    2.పరులకుపకార మొనరించు పద్ధతులకు
    తొలుత మ్రొక్కంగ వలె|”నెల్లదుర్జనులకు
    శిక్ష వేయక బ్రతికించ? కక్ష లందు
    ధర్మ మన్నది మారు నధర్మమున్న|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘బలము+ఉన్న’ అన్నపుడు యడాగమం రాదు. ‘బలమె యున్న’ అనండి.

      తొలగించండి
  28. దుర్జనుల్ హానికలిగింప ధర్మ మునకు ఉద్ధరింపగ మన మధ్య నుద్భ వించు కాంచి తరియింతు మా హరిన్ కన్నులార! తొలుతమ్రొక్కంగవలె నెల్ల దుర్జనులకు

    రిప్లయితొలగించండి
  29. ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే అన్నది భగవద్వాక్యం అది జరగాలంటే ధర్మగ్లాని జరగాలి దానిని జరిగేట్లు చేసేవారు దుర్జనులే మరి అవతారమూర్తిని ఆహ్వానించే వారికి తొలుత నమస్కరించటం మంచిదే కదా!

    రిప్లయితొలగించండి
  30. సమస్యాపూరణం

    దుర్జనులె నాయకులుగను ధనమదాందు
    లెసచివులుగ రాజ్యపరిపాలనము సేయ
    తప్పకజనులు భయపడి తలలు వంచి
    తొలుత మ్రొక్కంగవలెనెల్ల దుర్జనులకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణలో మొదటి రెండు పాదాలలో యతి తప్పింది. పద్యం నడక కూడ కుంటుపడింది. సవరించండి.

      తొలగించండి
    2. దుర్డ-నులెనాయ-కులుగను ధనమ దాందు
      తప్పా?

      తొలగించండి
    3. లక్షణమున కోపికతో
      నక్షరములు పొదిగి వ్రాయు నట్టి కవితలన్
      లక్షణమగు లయ నడగెడు
      పక్షంబున నేమి చెప్పవచ్చును రామా!

      తొలగించండి
    4. అయ్యా చేపూరి శ్రీరామారావు గారూ! గురువుగారు చెప్పినట్లు 1,2 పాదాల్లో యతి తప్పినది. మదాంద టైపింగ్ పొరపాటు కావచ్చు. ధన+మద+అంధ = ధనమదాంధ. మొదటి పాదంలో హల్ మైత్రి కుదిరినా అచ్ మైత్రి కుదరలేదు. (అ,ఆ,ఐ,ఔ) లు వేరు (ఉఊఒఓ) లు వేరు. కాబట్టి “దు” కి “ధ”కి యతి చెల్లదు. అలాగే 2 వపాదంలోని “లె” కిని “ల” కును యతి కుదరదు.
      ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులు మీరు చేప్పినట్లుగనే యున్నవి. పద్యం బాగున్నది. మీకభ్యంతరం లేనిచో మీభావము దెబ్బతినకుండగ చిన్ని మార్పులతో ఈ పద్యాన్ని పరిశీలించండి.

      దుర్జనులె నాయకులగుచు దోచుచుండ
      లాలస సచివులె పరిపాలనము సేయ
      తప్పక జనులు భయపడి తలలు వంచి
      తొలుత మ్రొక్కంగవలెనెల్ల దుర్జనులకు

      తొలగించండి
    5. తోపెల్లవారూ, మీ సవరణ పద్యంతో పాటు నాది కూడా ఒక సారి పరికించండీ.

      దుర్జనావళి నేతలై తోచుచుండ
      ధనమదాంధులు సచివులై తగిలియుండ
      చేయునది లేక పౌరులు చేతులెత్తి
      తొలుత మ్రొక్కంగవలెనెల్ల దుర్జనులకు

      ఊరకనే సరదాగా వ్రాసినదే కాని ఎవరిపద్యాన్నీ తప్పుపట్టేందుకు కాదు సుమా.

      తొలగించండి
    6. తెనుగు భాషాక్షేత్రమున హాలికులై పద్య సస్యశ్యామలము చేయు చదువరులు శ్రీ శ్యామలరావు గారికి నమస్సులు. చేపూరి వారి పద్యాన్ని మార్చకుండగ యతి కోసం మాత్రమే పదాల మార్పు చేసితిని. మీపూరణ కడు రమ్యముగానున్నది. చేయి తిరిగిన వారి చేత బడిన అందమునకు కొదవేముండును. ధన్యవాదములు.

      తొలగించండి
    7. తోపెల్ల వారూ,
      శ్యామలీయం గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
  31. చెరుప జూచెదరట మంచి చేయువారి
    నెల్ల వేళల దుష్టులు కల్లలాడి ;
    సజ్జనుల వెంట బడకున్న చాలు ననుచు
    తొలుత మ్రొక్కంగవలె నెల్ల దుర్జనులకు.

    రిప్లయితొలగించండి

  32. తొలుత మ్రొక్కంగ వలె :నెల్ల దుర్జనులకు
    దూరముంచుమని హరిని,దుష్టపీడ
    లనిశము దరి చేరగ నీక హర్ష మొసగు
    మంచు వేకువసమయమ లందు లేచి.

    2.తొలుత మ్రొక్కంగ వలయునెల్ల దుర్జనులకు
    హాని తలపెట్టక ప్రజకు హర్షమొదవు
    నట్లు సకల కార్యంబులు ననవ రతము
    జరుగు నట్లొన రించగ జయము కలుగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘వలె’ను ‘వలయు’ ననడం వల్ల గణదోషం.

      తొలగించండి
  33. 🌺🙏 🌺


    అంబటి భానుప్రకాశ్,
    గద్వాల.

    తే**
    కవులు పండిత వర్యుల కాల మేది,
    నిలుచు చుండిరి మతిహీను నీతి దప్పి,
    గతియు లేకను కవులిల ఘనత మరచి,
    దొలుత మ్రొక్కంగ వలెనెల్ల దుర్జనులకు!


    🙏 ✅🙏 🌺🌻🌺🙏 ✅🙏

    రిప్లయితొలగించండి
  34. పనులు సమకూరగ ఖరము పాదమైన
    పట్ట వలయు ననెడి మాట పచ్చి నిజము!
    కంస వారసులేలు లోకమున తొట్ట
    తొలుత మ్రొక్కంగ వలె నెల్ల దుర్జనులకు!

    రిప్లయితొలగించండి
  35. క్రూర నేరాలననచగా ప్రభుత యెన్ని
    చట్టముల దెచ్చినను గాని వట్టివాయె
    తొలుత మ్రొక్కంగవలె నెల్ల దుర్జనులకు
    మీరలే మమ్ము కరుణించి మారు డనుచు




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అణచగా’ను ‘అనచగా’ అన్నారు టైపాటు వల్ల.

      తొలగించండి
  36. పొలుపుగ యపకారికి నుపకారము తగ
    చెలువమున పగతునిమితృచేయవలెను
    తొలుత మ్రొక్కంగవలె నెల్ల దుర్జనులకు
    మెలుగు దురు మంచిగ ముదము మీర ఇలను
    కలుములు తొలగి సుఖపడుదురు జనములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పొలుపుగ నపకారికి...’ అనండి. అలాగే ‘మిత్రుఁ జేయవలెను’ అనండి.

      తొలగించండి
    2. పొలుపుగ నపకారికి నుపకారము తగ
      చేలువమున పగతుని మిత్రు జేయవలెను
      తొలుత మ్రొక్కంగవలె నెల్ల దుర్జనులకు
      మెలుగు దురు మంచిగ ముదము మీర ఇలను
      కలుములు తొలగి సుఖపడుదురు జనములు

      తొలగించండి
  37. ఎన్ని సినిమాల యందున నెన్ని మార్లు
    చూప లేదె యిట్టి స్థితిని సున్నితముగ
    చూడ గబ్బరసింగును “షోలె” యందు
    గ్రామ ప్రజలసమర్థ విరాగు లగుచు
    తొలుత మ్రొక్కంగవలెనెల్ల దుర్జనులకు

    రిప్లయితొలగించండి
  38. గురువులు శంకరయ్య గారికి, మాన్యులు మిస్సన్న గారికి మా తాతగారి స్నేహితులు శ్రీ పోచిరాజు సుబ్బారావు గారికి పండిత పెద్దలందరికి నమస్కారములు. ఇది నా జీవితంలో మొట్ట మొదటి పద్య ప్రయత్నము. మీ అందరి ఆశీస్సులు కోరుచూ……………….. అనంత శర్మ తోపెల్ల

    అడ్డ దారిని జేరుచు నడుగులేయ
    పెద్ద మేడలు గట్టెడి పెను తపనను
    మనము నందున బూనుచు మసలు వాడు
    తొలుత మ్రొక్కంగవలెనెల్ల దుర్జనులకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తోపెల్ల అనంత శర్మ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మొదటి ప్రయత్నమైనా నిర్దోషంగా పద్యాన్ని వ్రాసారు. సంతోషం.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. భేష్ అనంతశర్మా! తొలి అడుగు మురిపించింది.

      తొలగించండి
    3. భేష్ అనంతశర్మా! తొలి అడుగు మురిపించింది.

      తొలగించండి
  39. కలత లెన్నింటినో సైచి కలలు పండ...
    నలిగి కాంగ్రెసు టిక్కెట్టు గెలుచు కొనగ...
    ప్రజల వోట్లను నర్థించు పర్యటమున...
    తొలుత మ్రొక్కంగవలె నెల్ల దుర్జనులకు

    రిప్లయితొలగించండి

  40. Oct 2nd Gandhiji amar rahe !


    పిరియపు శుభదినము జాతిపిత కనుబడి
    న దినమిదియె జిలేబి మనసున నుతుల
    తొలుత మ్రొక్కంగవలె, నెల్ల దుర్జనులకు
    ఖలులకును పాఠమును‌ నేర్ప కదులవలెను!

    జిలేబి

    రిప్లయితొలగించండి