ప్రతిరోజు ఈ సమయానికి కనీసం ఐదారు పూరణలు వచ్చేవి. వృత్తం కనుక తటపటాయిస్తున్నారేమో అనుకొని అదే భావాన్ని తేటగీతి పాదంగా ఇచ్చాను. ఇక విజృంభించండి. నా ఆరోగ్య పరిస్థితి నిన్నటికంటె కొంత మెరుగు. జ్వరం లేదు కాని నిస్సత్తువ అలాగే ఉంది. నిన్నటి మిత్రుల పూరణలను సహృదయంతో సమీక్షించిన పోచిరాజు కామేశ్వర రావు గారికి, ఉత్సాహంగా పూరణలు పంపిన కవిమిత్రులకు ధన్యవాదాలు.
మీ పూరణ బాగుంది. అభినందనలు. "మాటికింబరుషంపు మాటలతోడఁ / గారణ..." అనండి.తో ని హ్రస్వముగా వ్రాయకూడదు. మీరు "ప్రచురించు" మాటను గట్టిగా నొక్కుతున్నట్టున్నారు. అందుకే రెండు సార్లు వస్తున్నది మీ పూరణ.
కోరగ లేక లేకనొక కూతురు కల్గెనె, ఇంటనందరిన్ కూరిమి పొందుచుండె, మరి గుండెల నిండిన వ్యాకులమ్ముకున్ కారణమేమి? లేక నిజకాంతుని దూఱరె కాంతలెల్లరున్ పేరును నిల్పు పుత్రుగొని వేదన తీర్చను శాసనమ్మిడెన్॥
నా ఉద్దేశ్యం, వ్యాకులతకి కారణం మొగుడు ఆశించినట్టుగా కొడుకు కాక కూతురు పుట్టిందని! అలాంటి పక్షపాత ధోరణి ఉన్నందుకు తోటి స్త్రీలు నిందిస్తారు (దూఱురు) అని!
మీపూరణ బాగుంది. అభినందనలు. విభవ వైభవముల్ పునరుక్తి గదా. "సంస్కృతి" ఇ కారాంత పదము. దీర్ఘము రావచ్చునా యని నా యనుమానము. (భారతీయ సంస్కృతి సాధువనుకుంటాను.) దీని మీద నాకు పూర్తి యవగాహన లేదు. తెలుసుకోవడానికే వ్రాస్తున్నాను.
సూర్యనారాయణ గారు చక్కటి సందేహము. "కారణ కారణుండు నొక" విషయములో నేను చాలా సేపు తర్జన భర్జనలు చేశాను నాలో నేను. "కారనుండును" అని ప్రత్యేక గుర్తింపు పదమని భావించి వ్యాఖ్యానించలేదు దాని పై.
ఇక్కడ, కారణ కారణు౦డును,వామభాగము నొక్క కాంతకు నిచ్చెను (అంతే కాక), వేరొకతెను కూరిమి నెత్తి(న) కూర్చొన జేసె అని అన్వయం. ఐతే నేను కుండలీకరణంలో బండ-అక్షరంగా చూపినట్టి న తో కలిపి నెత్తిన అన్న పదం ఉండాలి. కాని నెత్తి అని వ్రాసారు. అది సరిపోదు. నెత్తిన అంటే సరాసరి గణభంగం! అదటుంచి అన్వయపరంగా చూస్తే సామాన్యులనే కాదు సాక్షాత్తూ జగత్కర్త ఐన పరమేశ్వరుడే ఒక భార్యకు సగం ఒళ్ళు పంచి ఇచ్చి మరొకామెను కూడా నెత్తిమీద పెట్టుకున్నాడు (ఆదరంగా) అని చెప్పవచ్చు. ఐనా గంగాగౌరీ సంవాదాలూ తప్పలేదు వారు శివుణ్ణి మధ్యలోకి తెచ్చి ఆడిపోసుకోవటమూ తప్పలేదు అని కవిహృదయంగా గ్రహించాలి. హృదయంగమమైన భావన. బాగుంది.
మరొక సూచన. అప్పుడప్పుడు కొన్ని పూరణల క్రింద బోలెండంత -ఒక పేజీ సైజులో-ఖాళీ లైన్లు వస్తున్నాయి. పద్యాన్ని విడిగా వ్రాసిన పక్షంలో సరిగా cut&paste చేయవలసిందిగా ప్రార్థన.
భారముగాగ యింటిపని, బాధ్యత లందున నత్తమామలన్ గారవమొప్ప సాకగను, ఘర్షణతోడుత పిల్లలుండగన్ నీరస మానసంబొనరి నెత్తిని మొత్తుకొనంగ భర్త పై కారణమేమి లేక నిజకాంతుని దూఱరె కాంతలెల్లరున్.
కామేశ్వరాయ నమః! ఈరోజు ఇంటివద్ద అంతర్జాలము సరిగా పనిచేయుటలేదు. కార్యాలయపనిభారముతో విరళముచూసి వ్రాసి ఇంటికి వచ్చు తొందరో తట్టిన పదంపెట్టి కథ ముగించాను. నిజంగా పునరుక్తి దోషమే. మేల్కొల్పినందులకు, మీకు నచ్చినందులకు ధన్యవాదములు. మీరు చెప్పినట్లు మార్పుచేసి
భారముగాగ నింటిపని, బాధ్యత లందున నత్తమామలన్ గారవమొప్ప సాకగను, ఘర్షణతోడుత పిల్లలుండగన్ నీరస మానసంబొనరి నెత్తిని మొత్తుకొనంగ నంతటన్ కారణమేమి లేక నిజకాంతుని దూఱరె కాంతలెల్లరున్.
ఇందులో సమస్య ఏమిటి స్వామీ! నిజ జీవితంలోని పరమ సత్యమే గదా :-)
రిప్లయితొలగించండి(సోదరీమణులు మన్నించాలి...యిది కేవలం సమస్యా పూరణకు మాత్రమే)
రిప్లయితొలగించండివారిజ నేత్రు లెల్లడల వంకల జూపుచు శంక నొందుచున్
వారి మనంబులం దొలుకు వాక్కుల చుర్కలు వేయుచుందురే
కారము మిర్యముల్ నుఱిచి కామిత మందెడి వారలం గనన్
కారణ మేమి లేక నిజ కాంతుని దూఱరె కాంతలెల్లరున్!
మీ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిప్రతిరోజు ఈ సమయానికి కనీసం ఐదారు పూరణలు వచ్చేవి. వృత్తం కనుక తటపటాయిస్తున్నారేమో అనుకొని అదే భావాన్ని తేటగీతి పాదంగా ఇచ్చాను. ఇక విజృంభించండి.
రిప్లయితొలగించండినా ఆరోగ్య పరిస్థితి నిన్నటికంటె కొంత మెరుగు. జ్వరం లేదు కాని నిస్సత్తువ అలాగే ఉంది.
నిన్నటి మిత్రుల పూరణలను సహృదయంతో సమీక్షించిన పోచిరాజు కామేశ్వర రావు గారికి, ఉత్సాహంగా పూరణలు పంపిన కవిమిత్రులకు ధన్యవాదాలు.
గురువుగారూ, మీ ఆరోగ్యం మెరుగైన విషయం మాకు ఆనందదాయకం. విశ్రాంతి తీసుకోండి. మీ ఆరోగ్యం పూర్తిగా మెరుగయిందన్న వార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాము.
తొలగించండిగురువు గారూ నమస్కారములు..మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం......విశ్రాంతి తీసుకోండి
రిప్లయితొలగించండిగురువు గారూ నమస్కారములు..మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం......విశ్రాంతి తీసుకోండి
రిప్లయితొలగించండిపూరణ కోసమై నిడగ ప్రొద్దున ప్రొద్దున పద్యమల్లగా
రిప్లయితొలగించండినేరమదేమిటో గనగనేరను వంటకు కూరగాయలన్
కోరగ వేళమీరెనని కోమలి చిందులు వేసె శ్రీహరీ !
కారణమేమిలేక నిజకాంతుని దూరరె కాంతలెల్లరున్
అరాశ
పూరణ కోసమై నిడగ ప్రొద్దున ప్రొద్దున పద్యమల్లగా
రిప్లయితొలగించండినేరమదేమిటో గనగనేరను వంటకు కూరగాయలన్
కోరగ వేళమీరెనని కోమలి చిందులు వేసె శ్రీహరీ !
కారణమేమిలేక నిజకాంతుని దూరరె కాంతలెల్లరున్
అరాశ
స్వీయానుభవము తో మీ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిజోరుగ నల్దెసల్ దిరిగి ఝుమ్మని వాగదె తేనెటీగ , యే
రిప్లయితొలగించండితీరమునందు, హోరుమని దిగ్గనదే కెరటమ్ము నీరధిన్,
పారుచు గార్ధభంబు పలు భంగుల రోయదె గాండ్రు మంచునున్
కారణమేమి లేక నిజకాంతుని దూఱరె కాంత లెల్లరున్.
మీ పూరణ బాగుంది. అభినందనలు.మీ కోపోద్రేకముతో గార్దభమున కొత్తు రప్పించారు. "రోయదె యోండ్రపెట్టుచున్" అంటే బాగుంటుంది.
తొలగించండికారణము లేక దూఱును కాంత పతిని
రిప్లయితొలగించండియనుట భావ్యము గాదని యనగ దగును
యీతి బాధలు,రంపపు కోత లిడగ
నూర కుందురె భర్తల తీరుజూచి?
మీ పూరణ బాగుంది. అభినందనలు.ఈతి బాధలు పతులిచ్చేవి కావు గదా.
తొలగించండిదారుణమయ్యె నేడకట! ధారుణిలో మగ జీవితమ్ములే
రిప్లయితొలగించండినేరుగ నన్నివిద్యలను నేర్చితిమంచు, ధనమ్ముదన్నుతో
కోరుచు వేరుకాపురము కూరిమిఁజూపక నత్తమామపై
కారణ మేమిలేక నిజకాంతుని దూరరె కాంతలెల్లరున్
(పొమ్మనకుండా పొగబెట్టటమే భర్తను తిట్టటం)
అన్నపరెడ్డిగారి పూరణ చాల బాగుంది
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు."ధనంపు దన్నుతో" అంటే బాగుంటుంది. "అత్తమామలు" సాధువు. "అత్తమామలం/ గారణ.." అనండి.
తొలగించండికామేశ్వర రావుగారూ - తమరి సవరణలకు ధన్యవాదములు. "కూరి మి జూపక నత్తవారిపై" అంటే సరిపోతుందా.
తొలగించండిమీ సవరణ బాగుంది సత్యనారాయణ రెడ్డి గారు.
తొలగించండిమారుని కన్నతండ్రి సుకుమారుడు వారిజనేత్రుఁ గృష్ణు దు
రిప్లయితొలగించండిర్వార పరాక్ర మాసదృశ భండన దుర్జయు నత్తరిన్ శిరో
భారము ప్రజ్వరిల్లగను భర్తను దాపెను సత్యభామయే
కారణమేమి లేక నిజ కాంతుని దూఱరె కాంత లెల్లరున్
మురిపెముగఁ బెండ్లి సేయగఁ బుట్టినిల్లు
తొలగించండివీడ నొంటరి యత్తింట వికసితప్ర
ణయని చీటికి మాటికి నవ్య వధువు
కారణము లేక దూఱును కాంత పతిని
[ దూఱును = చొచ్చును]
సుకవి మిత్రులు కామేశ్వర రావు గారూ...మీ మొదటి పూరణమున సాత్రాజితి కృష్ణుని శిరాన్ని వామపాదాన తొలగం ద్రోచిన యంశాన్ని మనోహరంగా చెప్పారు.
తొలగించండిద్వితీయ పూరణలో నవోఢ భర్తసమాగమాసక్తయై సమయము చిక్కక, యింటిలోని వారి నేమన లేక, భర్తను దూఱిన యంశము సహజసుందరముగా నున్నది.
అభినందనలు!
మధుసూదన్ గారు ధన్య వాదములండి.
తొలగించండిపెండ్లికిన్ ముందు తెలియదు పిసరు కూడ
రిప్లయితొలగించండినాలి నైజగుణమది గయ్యాళి తనము
మాటిమాటికిన్ పరుషంపు మాటలతొ స
కారణము లేక దూఱును కాంత పతిని.
పెండ్లికిన్ ముందు తెలియదు పిసరు కూడ
రిప్లయితొలగించండినాలి నైజగుణమది గయ్యాళి తనము
మాటిమాటికిన్ పరుషంపు మాటలతొ స
కారణము లేక దూఱును కాంత పతిని.
మీ పూరణ బాగుంది. అభినందనలు. "మాటికింబరుషంపు మాటలతోడఁ / గారణ..." అనండి.తో ని హ్రస్వముగా వ్రాయకూడదు.
తొలగించండిమీరు "ప్రచురించు" మాటను గట్టిగా నొక్కుతున్నట్టున్నారు. అందుకే రెండు సార్లు వస్తున్నది మీ పూరణ.
కామేశ్వర రావు గారూ...మిత్రులందఱి పూరణములను సమీక్షించుచు, గుణదోష విచారణముం జేయుచున్నందులకు శుభాభినందనలు!
తొలగించండి"ప్రమాదో ధీమతా మపి" యనికదా పెద్దల వచనము!
పిన్నక వారి మూఁడవ పాదమున మీరు సూచించిన సవరణమున గణభంగమైనది.
దానిని...
"మాటిమాటికిం బరుషంపు మాటలనుచు" అనిన సరిపోవునేమో పరిశీలింపుఁడు.
అవునండి మధుసూదన్ గారు. వెనుక పదము చూడకుండా చేసిన సవరణ యది. మీ సూచన బాగుంది.
తొలగించండికామేశ్వరరావు గారికి,మధురకవి గారికి నమస్సులు.
తొలగించండిధన్యవాదములు.
మీరు సూచించిన విధముగ సవరించిన పద్యమును
పంపుచున్నాను.
పెండ్లికిన్ ముందు తెలియదు పిసరు కూడ
నాలి నైజగుణమది గయ్యాళి తనము
మాటిమాటికిం పరుషంపు మాట లనుచు
కారణము లేక దూఱును కాంత పతిని.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికారణ కారణు౦డు నొక కాంతకు నిచ్చెను వామభాగమున్
రిప్లయితొలగించండికూరిమి నెత్తి వేరొకతెను కూర్చొన జేసె.జగమ్ము మెచ్చె నీ
తీరును జూచి యీసుపడి తీవ్రపు కోరిక గల్గ నెమ్మదిన్
కారణమేమి లేక నిజకాంతుని దూఱరె కాంత లెల్లరున్.
మీ పూరణ బాగుంది. అభినందనలు. రెండవ పాదములో గణ దోషము."వేరొకతెఁగూర్చొన" అనండి.
తొలగించండిఊరక రాళ్ళు రువ్వుదురు యుర్విని నాథులు గేస్తురాళ్ళపై
రిప్లయితొలగించండినేరము లేకనెవ్వరిని నిష్ఠుర మాడరు నింతులీధర
న్నోరిమి గోలుపోవమరి యొడ్డును దాటును సింధువైన యే
కారణ మేమి లేక నిజ కాంతుని దూఱరె కాంతలెల్లరున్!!!
మీపూరణ బాగుంది. అభినందనలు. “రువ్వుదురె యుర్విని” అనండి. “నిష్ఠుర మాడరు నింతులీధర”: “ఆడరు” తద్ధర్మ విశేషణము కాదు గనుక నుగాగమము రాదు. “నిష్ఠుర మాడరు భామలీధర” అనవచ్చును.
తొలగించండియే/కారణ మేమి లేక నిజ కాంతుని దూఱరె కాంతలెల్లరున్!!! సమస్య కు పరిష్కారము దొరకలేదు.
“ న్నోరిమి గోలుపోవమరి యూరక వాగుదురిట్లసత్యమున్” అనవచ్చును.
సవరణ తోడ నీ పద్యాన్ని చూడండి. మీకుపశమనము కలిగి నట్లు భావిస్తాను.
ఊరక రాళ్ళు రువ్వుదురె యుర్విని నాథులు గేస్తురాళ్ళపై
నేరము లేకనెవ్వరిని నిష్ఠుర మాడరు భామలీధర
న్నోరిమి గోలుపోవమరి యూరక వాగుదు రిట్లసత్యమున్
కారణ మేమి లేక నిజ కాంతుని దూఱరె కాంతలెల్లరున్!!!
ధన్యవాదమములు సర్
తొలగించండికారణము లేక దూఱును కాంత పతిని
రిప్లయితొలగించండినామె కేమైన పిచ్చియా ?యార్య చెపుమ
కారణము లేక దూఱదు కాంత తనదు
పతిని నెన్నడు జగతిని ,భయము తోడ
అన్నయ్య నీ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండితనమగడు,పిల్లలంచును తాల్మి జూపి
రిప్లయితొలగించండితనకు మాలిన ధర్మమై తనరుచున్న
సతికి నసహన మొదవెడు సమయ మందు
కారణము లేక దూరును కాంత పతిని
మీపూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిఊరకేయున్న బుర్రలో దూరుచుండు
రిప్లయితొలగించండిదయ్యములటంచు చెప్పుదు రయ్యలెపుడు
సీరియళ్ళను చూచుచు తీరుబడిగ
కారణములేక దూఱును కాంతపతిని
మీపూరణ బాగుంది. అభినందనలు. తెలుగు పద్యములలో నన్య భాషా పదములు రుచింప నేరవు.
తొలగించండిసత్యనారాయణ రెడ్డి గారు తేట తెలుగు లో మీ మాటకు నానోట నూరిన యూట తిలకించండి.
తొలగించండి"నాటకపు తున్కలఁ గనుచుఁ బూట పూట"
వారల వీరలన్ గని యపారముగా పరిగొన్న కోర్కెలన్
రిప్లయితొలగించండితీరుగ దీర్చమంచు తమదృష్టికి వచ్చినవన్ని కోరుచున్
కూరిమి గోరుచున్న నతి ఘోరముగా పరుషమ్ము లాడుచున్
కారణ మేమి లేక నిజకాంతుని దూఱరె కాంతలెల్లరున్
మీపూరణ బాగుంది. అభినందనలు. "వీరలంగని" అంటే బాగుంటుంది.
తొలగించండివారిజ వస్త్రముల్ విడిచి వడ్డన చేయమ నానతీయగా
రిప్లయితొలగించండివారల లీలచేత పసి బాలల జేసిన మాతతీరుగా
లేరిక నేడు సాటి సరి లీలలుజూపు పతివ్రతల్గనన్
కారణమేమి లేక నిజకాంతుని దూఱరె కాంత లెల్లరున్
మీపూరణ బాగుంది. అభినందనలు. "చేయమని + ఆనతీయగా" లో యడాగమము రావాలి.
తొలగించండి...వడ్డన చేయగ నానతీయగన్...అనిన నెట్లుండును?
తొలగించండిఅవును, దోషము గమనించలేదు. తెలిపినందుకు ధన్యవాదములు. సవరణతో కూడిన పద్యం.
తొలగించండివారిజ, వస్త్రముల్ విడిచి వడ్డన చేయుమటంచుపల్కగా
వారల లీలచేత పసి పాపల జేసిన మాతతీరుగా
లేరిక నేడు సాటి సరి లీలలుజూపు పతివ్రతల్గనన్
కారణమేమి లేక నిజకాంతుని దూఱరె కాంత లెల్లరున్
మీ సవరణ బాగుంది. మధుసూదన్ గారి సవరణ మీ మొదటి యాలోచనకు తగ్గట్లుంది.ఆనతీయడము మిక్కిలి సమంజసము.
తొలగించండికారణ మేమిలేక నిజ కాంతుని దూ ఱరె కాంత లెల్లరున్
రిప్లయితొలగించండికారణ మేమియుండ దట కాంతుని దూ ఱు ట యొక్కటే పనిన్
వారల భావమం చనెడు భావన దోచెడు నామదిన్ మరిన్
మీరలు సెప్పుడీ యిపుడు మీకుగ నేమని దోచెనో గదా
అన్నయ్య నీ పూరణ బాగుంది. అభినందనలు. "పనిన్" ద్వితీయా విభక్తిలోనుంది గదా. "దూఱుట యొక్క కార్యమే" అంటే బాగుంటుంది.
తొలగించండిబాగుంది
తొలగించండిచేరితి చెన్నపట్నమనుచు చిక్కగ నాథుడు పేకలాడుచున్!
రిప్లయితొలగించండిమారితి, మాటదప్పనని మందు బిగించియు నింటవాలగన్!
భారము జీవితమ్మనుచు బాధ్యత నేర్పెడు నెత్తువేయుచున్
కారణమేమిలేక నిజకాంతుని దూఱరె కాంతలెల్లరున్!
మీపూరణ బాగుంది. అభినందనలు. మొదటి పాదము లో గణ దోషము.
తొలగించండిధన్యవాదములండీ. మొదటి పాద సవరణతో:
తొలగించండిచేరితి చెన్నపట్నమని చిక్కగ నాథుడు పేకలాడుచున్!
మారితి, మాటదప్పనని మందు బిగించియు నింటవాలగన్!
భారము జీవితమ్మనుచు బాధ్యత నేర్పెడు నెత్తువేయుచున్
కారణమేమిలేక నిజకాంతుని దూఱరె కాంతలెల్లరున్!
మీసవరణ బాగుందండి.
తొలగించండి** గు రు మూ ర్తి ఆ చా రి **
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
చీరల నెన్ని తెచ్చినను చీటికి - మాటికి ,
గొ౦తు ని౦డ బ౦
గారము ని౦పినన్ , మిగుల కమ్మని బోనము
వెట్టి సాకినన్
చేరువ నత్తమామలు వసి౦చుట సైచరు ;
ఓరి దెవుడా !
కారణ మెమి లెక నిజ కా౦తుని దూరరె
కా౦త లెల్లరున్
మీపూరణ బాగుంది. అభినందనలు. "మాటికినొంటి ని౦డ" అంటే బాగుంటుందేమో? "సైచరు ఓరి దేవుడా" విసంధి గా వ్రాసారు. అక్షర దోషాలున్నవి ప్రచురించుటలో.
తొలగించండికోరిననగలివ్వక యున్న గోల చేయు
రిప్లయితొలగించండిచుండు చీటికి మాటికి సొట్ట మూతి
నిడుచు పరులపై నెపములు నెట్టి సతము
కారణము లేక దూఱును కాంత పతిని
మీపూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిఆకలని గోలలిడు వారి నాపలేక
రిప్లయితొలగించండితన్ను తానుతి ట్టుకొనుచు దారి లేక
నిస్సహాయత తోడను నేడ్పు నాపి
కారణము లేక దూఱును కాంత పతిని.
మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిశంక రార్య !
రిప్లయితొలగించండిజ్వరము దగ్గె నీర సమ్మును నుండెను
ననుచు దెలుప మోద మయ్యె మదికి
పుష్టి గలుగు నన్న మునుదినిన యెడల
నీర సమ్ము దగ్గు నార్య !మీకు
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిపంచపాది:
"చేరెదరో సపత్ను లటఁ జెల్వునిఁ గృష్ణుని హృత్సరోజమున్;
వారికి వెన్నదొంగ చెలు వందఁగ డగ్గఱి ప్రేమఁ బంచియున్,
వారికె దక్కు నేమొ!" యని వ్యర్థ వితర్కము నూని, మోహనా
కారునిఁ బ్రాణ వల్లభు నకారణ శంకను దూఱె సత్య! స
త్కారణ మేమి లేక నిజకాంతుని దూఱరె కాంత లెల్లఱున్?
మీ పూరణని పరిశీలించతగ్గ వాణ్ని కాదు నేను. కాని మెచ్చుకొనే యర్హత యుంది కనుక నా యభినందనలు మీకు. నా పూరణను తిలకించగోర్తాను.
తొలగించండితిలకించుటయు నభినందించుటయు నెప్పుడో జరిగినది కామేశ్వర రావు గారూ!
తొలగించండిచేరి యెన్నెన్నొ కానుకల్జిత్త మలర
రిప్లయితొలగించండివిసుగు లేకుండ నర్పింప, వీధిజాణ
కారణములేక దూరును-కాంత పతిని
గౌరవాదరములజూపి ఘనతబెంచు.
విరుపు తో మీపూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండికృతజ్ఞతలు, కామేశ్వరరావుగారు.
తొలగించండికోరగ లేక లేకనొక కూతురు కల్గెనె, ఇంటనందరిన్
రిప్లయితొలగించండికూరిమి పొందుచుండె, మరి గుండెల నిండిన వ్యాకులమ్ముకున్
కారణమేమి? లేక నిజకాంతుని దూఱరె కాంతలెల్లరున్
పేరును నిల్పు పుత్రుగొని వేదన తీర్చను శాసనమ్మిడెన్॥
మీపూరణ బాగుంది. అభినందనలు. సమస్య పరిష్కారమయినట్లు లేదు. పుత్రుగొని?
తొలగించండినా ఉద్దేశ్యం, వ్యాకులతకి కారణం మొగుడు ఆశించినట్టుగా కొడుకు కాక కూతురు పుట్టిందని! అలాంటి పక్షపాత ధోరణి ఉన్నందుకు తోటి స్త్రీలు నిందిస్తారు (దూఱురు) అని!
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికూరిమితోడ గారమున కోమలి మేలము లాడగా సఖున్
రిప్లయితొలగించండివారిజ లోచనాంగి తన వాలుజడన్ ఝళి పించినంతనే
పోరుచు వేడుకే యనుచు పొంకము నందున హాసమాడినన్
కారణ మేమిలేక నిజకాంతుని దూఱరె కాంత లెల్లరున్
మీపూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండిదారుణరీతి వర్తిలుచు దర్పమదాంధత క్రూరకామినుల్
రిప్లయితొలగించండికారణమేమిలేక నిజకాంతుని దూఱరె!-కాంతలెల్లరున్
భారత సంస్కృతీ విభవవైభవముల్పచరించుచున్సదా
సారగుణాఢ్యలై మెలగి సద్యశమందగ భావ్యమౌనుగా!
మీపూరణ బాగుంది. అభినందనలు. విభవ వైభవముల్ పునరుక్తి గదా. "సంస్కృతి" ఇ కారాంత పదము. దీర్ఘము రావచ్చునా యని నా యనుమానము. (భారతీయ సంస్కృతి సాధువనుకుంటాను.) దీని మీద నాకు పూర్తి యవగాహన లేదు. తెలుసుకోవడానికే వ్రాస్తున్నాను.
తొలగించండిసమాసంలో ఇ కారము ఈ కారాంతమై సంస్కృతీవిభవము/వైభవము గా వచ్చునేమో?
తొలగించండిసమాసంలో ఇ కారము ఈ కారాంతమై సంస్కృతీవిభవము/వైభవము గా వచ్చునేమో?
తొలగించండి* గు రు మూ ర్త ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్రీ పోచిరాజు గారికి :--
సైచరు ఓరిదేవుడా విస౦ధి గా వ్రాశాను. చూసుకో లేదు . సైచరు దేవదేవుడా అ౦దాము .
గొ౦తుని౦డ బ౦గారము అని ఎకసక్కెము గా
ప్రయోగి౦చాను . తప్పేమి లేదనుకు౦టాను .
నిజమే type mistakes చివరన రె౦డు కలవు
నా cell డొక్కు cell అయినది
ఆర్యా!క్షమించాలి.. తిమ్మాజీ రావు గారి ఉత్పలమాలలో...కారణ కారణుండు నొక...
రిప్లయితొలగించండికారణుండు ,ద్రుతాంతమా? కారణుండు+ఒక= కారణుండొక.ఉత్వసంధి,నిత్యసంధికదా!
సూర్యనారాయణ గారు చక్కటి సందేహము. "కారణ కారణుండు నొక" విషయములో నేను చాలా సేపు తర్జన భర్జనలు చేశాను నాలో నేను. "కారనుండును" అని ప్రత్యేక గుర్తింపు పదమని భావించి వ్యాఖ్యానించలేదు దాని పై.
తొలగించండి"కారణుండును" అని చదువ గలరు.
తొలగించండి"కారణ కారణు౦డు నొక కాంతకు నిచ్చెను వామభాగమున్
తొలగించండికూరిమి నెత్తి వేరొకతెను కూర్చొన జేసె....."
ఇక్కడ, కారణ కారణు౦డును,వామభాగము నొక్క కాంతకు నిచ్చెను (అంతే కాక), వేరొకతెను కూరిమి నెత్తి(న) కూర్చొన జేసె అని అన్వయం. ఐతే నేను కుండలీకరణంలో బండ-అక్షరంగా చూపినట్టి న తో కలిపి నెత్తిన అన్న పదం ఉండాలి. కాని నెత్తి అని వ్రాసారు. అది సరిపోదు. నెత్తిన అంటే సరాసరి గణభంగం! అదటుంచి అన్వయపరంగా చూస్తే సామాన్యులనే కాదు సాక్షాత్తూ జగత్కర్త ఐన పరమేశ్వరుడే ఒక భార్యకు సగం ఒళ్ళు పంచి ఇచ్చి మరొకామెను కూడా నెత్తిమీద పెట్టుకున్నాడు (ఆదరంగా) అని చెప్పవచ్చు. ఐనా గంగాగౌరీ సంవాదాలూ తప్పలేదు వారు శివుణ్ణి మధ్యలోకి తెచ్చి ఆడిపోసుకోవటమూ తప్పలేదు అని కవిహృదయంగా గ్రహించాలి. హృదయంగమమైన భావన. బాగుంది.
మరొక సూచన. అప్పుడప్పుడు కొన్ని పూరణల క్రింద బోలెండంత -ఒక పేజీ సైజులో-ఖాళీ లైన్లు వస్తున్నాయి. పద్యాన్ని విడిగా వ్రాసిన పక్షంలో సరిగా cut&paste చేయవలసిందిగా ప్రార్థన.
అనవుడుఁ గృష్ణుఁ డిట్లనియె ‘నా ధృతరాష్ట్రుఁడు నట్టివాఁడ త భా. ఉద్యోగ. 3. 30 వ పద్యము గమనించండి.
తొలగించండినా రెండవ పూరణము
రిప్లయితొలగించండినీవు నేనను వాదము నిలచి పెనగ
నలసి సొలసియు నిర్వురు యలుక బూన
కారణము లేక సతిజూచి కసరు కొనగ
కారణము లేక దూఱును కాంత పతిని!
నా రెండవ పూరణము
రిప్లయితొలగించండినీవు నేనను వాదము నిలచి పెనగ
నలసి సొలసియు నిర్వురు యలుక బూన
కారణము లేక సతిజూచి కసరు కొనగ
కారణము లేక దూఱును కాంత పతిని!
మీపూరణ బాగుంది. అభినందనలు."నిర్వురు నలుక" అనండి. కారణము చూపిస్తూ కారణము లేక యంటున్నారు.
తొలగించండిఅది అలుకే గదా...పెద్ద కారణం కాదేమోనని...
తొలగించండిఅది అలుకే గదా...పెద్ద కారణం కాదేమోనని...
తొలగించండిభారముగాగ యింటిపని, బాధ్యత లందున నత్తమామలన్
రిప్లయితొలగించండిగారవమొప్ప సాకగను, ఘర్షణతోడుత పిల్లలుండగన్
నీరస మానసంబొనరి నెత్తిని మొత్తుకొనంగ భర్త పై
కారణమేమి లేక నిజకాంతుని దూఱరె కాంతలెల్లరున్.
మీ పూరణ బాగుంది. మంచి సమర్థన యకారణపుటలుకకు.అభినందనలు. "గాగ నింటిపని" అనండి. "భర్త పై" పునరుక్తి. సమస్యలోనే కాంతుని యని యుందిగద.
తొలగించండికామేశ్వరాయ నమః! ఈరోజు ఇంటివద్ద అంతర్జాలము సరిగా పనిచేయుటలేదు. కార్యాలయపనిభారముతో విరళముచూసి వ్రాసి ఇంటికి వచ్చు తొందరో తట్టిన పదంపెట్టి కథ ముగించాను. నిజంగా పునరుక్తి దోషమే.
తొలగించండిమేల్కొల్పినందులకు, మీకు నచ్చినందులకు ధన్యవాదములు. మీరు చెప్పినట్లు మార్పుచేసి
భారముగాగ నింటిపని, బాధ్యత లందున నత్తమామలన్
గారవమొప్ప సాకగను, ఘర్షణతోడుత పిల్లలుండగన్
నీరస మానసంబొనరి నెత్తిని మొత్తుకొనంగ నంతటన్
కారణమేమి లేక నిజకాంతుని దూఱరె కాంతలెల్లరున్.
పరుష మాడ బోదు వనిత పరుల నెపుడు
రిప్లయితొలగించండికారణము లేక! దూఱును కాంత, పతిన
గౌరవము సేయు వారిని గనిన యంత!
మగని విజయాల హేతువే మగువ యంద్రు!
మంచి విరుపులతో మనోహరముగనుంది మీ పూరణ.
తొలగించండి
రిప్లయితొలగించండిదేవుడంతట నుండక దల్లినిచ్చి
యముడు నంతట నుండక యాలినిచ్చె
బతుకులన్నియు జట్కాల బండులయ్యె
కారణము లేక దూఱునుకాంత పతిని
😜చెన్నకేశవులు, రాయచోటి 😜
చెన్నకేశవులు గారు మీపూరణ బాగుంది. అభినందనలు. కానీ సమస్య ను గాలికి యిచ్చేశారు.
తొలగించండికామేశ్వరరావుగారు..క్షమించండి..పునరుక్తి దొర్లింది. "సంస్కృతీ జనిత వైభవము" అంటే బాగుంటుందేమో. సూచించిన మీకు కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిదూర దర్శినీ కృతకమౌ దుర్నిరీక్ష్య
తొలగించండికథల ధారలు దర్శింప కాంక్షతోడ
ఫలితముగ నంత మానస పథము చెడిన
కారణము లేక దూఱును కాంత పతిని
అత్తమామలతిట్లకు నలసిపోయి
రిప్లయితొలగించండిక్రొత్తకోర్కెల తీ ర్పుకై కోరిపిలువ?
కరణము లేక దూఱును కాంతపతిని
అత్తకోపము దుత్తపై పెత్తనంబు|
2.తీరిక చేతనిద్దురను దిక్కనినమ్మిన కష్టజీవికీన్
చేరె కళాత్మ కంబుకల”చింతలపంతము నందు భార్యయే
కారణమేమిలేక నిజకాంతుని దూఱరెకాంతలెల్లరున్
రారనికేకలేయగనె రక్షణకైమగరాయు డేడ్చెగా|
ధారుణి యందునన్ చరణ దాసులు గాను దలంచు భర్తతో
రిప్లయితొలగించండిపోరును సల్పకున్న విరిబోణుల స్వేచ్ఛకగాధమేర్పడున్
వారిజలార మేల్కొనుడు భారపు జీవనమెంతకాలమో
కోరుముస్వేచ్ఛనే యనుచు కోమలులిచ్చునినాదమే భువిన్
కారణము లేక నిజకాంతుని దూఱరె కాంతలెల్లరున్
పాద దాసిగ మార్చిరి భార్యనిలను
భర్తలపురుషాధిక్యతే భారమనుచు
తలచినట్టి యాధునికపు తరుణి యొకతె
కారణములేక దూఱును కాంత పతిని
నిన్నటి పూరణలు
సతతము భగవన్నామమె శరణమనుచు
ధ్యానమున్ జేయు వారలీ ధరణి యందు
పరమ భాగవతులు, సానివాడ నుంద్రు
కామతృష్ణులు నీచులు ఖలులు సుమ్ము
జ్ఞానులమనియు దైవసమానులమని
ధర్మ రక్షకులమనుచు ధరణిలోని
జనులవంచించెడు కపట స్వాము లైన
పరమ భాగవతులు సాని వాడలుంద్రు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచీరలు నారలన్ కొనక చిల్లర కర్చులు కొంపముంచగా
రిప్లయితొలగించండిమారణ హోమమై మనసు... మామలు నత్తలు నిల్లుజేరినన్
వారల కోర్కెలన్ని తెలవారున తీర్చగ తిక్కలేచుచో
కారణమేమి లేక నిజకాంతుని దూఱరె కాంత లెల్లరున్!