14, మే 2016, శనివారం

సమస్య - 2033 (రామచంద్రుండు శయనించె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
రామచంద్రుండు శయనించె రంభతోడ.

92 కామెంట్‌లు:

 1. అలతి నిందను సీతను యడవి బంపి
  మనసు వేదన భారము బెనచి వేయ
  స్వాంత మందున సాధన సమితి నరసి
  రామ చంద్రుడు శయనించె రంభ తోడ!

  రం= ధ్యానము
  భ= కిరణము, స్వభావము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘సీతను+అడవి=సీత నడవి’ అవుతుంది, యడాగమం రాదు. ‘సీతమ్మ నడవి బంపి’ అనండి.

   తొలగించండి
 2. విరహ వేదన మందున వరమ టంచు
  దలచె సీతను కనుమూసి తనరు మదిని
  రామ చంద్రుండు శయనించె రంభ తోడ
  పీడ కలగాంచ నాతడు భీతి చెందె

  రిప్లయితొలగించండి
 3. లోక విఖ్యాత రాకుమారుండు తనదు
  పెద్దలొప్పగ రంభను బెండ్లి యాడి
  రంగ వల్లిపై నల కూబరుండభినవ
  రామ చంద్రుండు శయనించె రంభ తోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో యతి తప్పింది. ‘రూపవంతుడు నలకూబరుం డభినవ...’ అనండి.

   తొలగించండి
  2. 'రం' కి 'రుం' కి పూర్ణానుస్వారం ఉండడం వలన యతి కుదురుతుంది అని భావించాను. తెలియ చేసినందుకు ధన్యవాదములు. మీ సవరణ చాలా బాగుంది.

   తొలగించండి
 4. శుభోదయం !

  రంభ = బ్రహ్మచారి చేత నుండు వెదురు కోల

  రామచంద్రుండు శయనించె రంభ తోడ
  మధ్య రాత్రి నతని మనమలజడి పడి
  చనియె గురువు చెంతకు వింటి శరము వోలె
  యోగ వాశిష్ట నేర్చెను యోగి వోలె !


  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘యోగవాసిష్టమును నేర్చె యోగి...’ అనండి.

   తొలగించండి


 5. 🔴🔴🔴

  ఇంద్ర పదవికి ఎసరొచ్చె నేమిసేతు
  అనుచు ప్రశ్నింప పాటించు మాట జెప్పి
  రామచంద్రుండు శయనించె, రంభతోడ
  వెడలె నింద్రుడు,అటనుండి వెతలు మరచి
  🔴🔴🔴

  వీరా గుడిపల్లి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘ఇంద్రుడు+అట’ అన్నపుడు సంధి నిత్యం. ‘వెడలినా డింద్రు డటనుండి...’ అనండి.

   తొలగించండి
 6. నలతి నెపముకై జానకి నడవికంపి
  దుఃఖమొందుచు కాయము దూలిపడగ
  సతిని దలచుచు మనమున శయ్య పైన
  రామచంద్రుండు శయనించె రంభతోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పద్యం బాగుంది. కాని సమస్య పరిష్కరింపబడలేదు. రాముడు రంభతో శయనించడం ఏమిటి?
   ‘నలతి’ కాదు... ‘అలతి’. నెపమునకై అనడం సాధువు.అక్కడ ‘అలతి నెపమున జానకి...’ అనండి.

   తొలగించండి
 7. ఒకరి బాధలింకొకరికి యొప్ప వనుట
  నిజము, సతి వియోగంబున
  నిద్రలేక
  రామచంద్రుడు శయనించె,రంభతోడ
  నింద్రుడు కులికె స్వర్గాన నింపు గాను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘ఇంకొకరికి నొప్ప వనుట...’ అనండి.

   తొలగించండి
 8. సతిని యెడబాయగ కడుయ శాంతి తోడ

  రామ చంద్రుడు శయనించె, రంభ తోడ
  తాను గతమున చేసిన తప్పిదముకు
  సీత నంటునా లంకేశు! భీతి కాదె ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘సతిని+ఎడబాయగ=సతి నెడబాయగ’ అవుతుంది. ‘కడు+అశాంతి=కడు నశాంతి’ అవుతుంది. ‘సతినె యెడబాయగ గడు నశాంతితోడ...’ అనండి.‘లంకేశు’ అని డుప్రత్యయం లేకుండా వ్రాశారు. “లంకేశు డాతతాయి’ అనండి.

   తొలగించండి
 9. డా సముద్రాల శ్రీనివాసాచార్య skno2036 కవితసంఖ్య9
  ఆంజ నేయుని నారాద్య దైవమెవరు?
  వటపు పత్రాన విష్ణవు నెటులనుండు?
  అలరు నెవరితొ నాయిగా నలకు బరుడు
  రామచంద్రుడు,శయనించు, రంభతోడ సరిచూచిన వాట్సప్ లో పెట్టగలను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రమాలంకార పూరణలో మీ ప్రయత్నం ప్రశంసనీయం.
   మొదటిపాదంలో యతి తప్పింది. ‘నలకూబరుడు’ను ‘నలకుబరుడు’ అన్నారు. మీ పూరణకు నా సవరణ....
   ఆంజనేయున కారాధ్యమైన దెవడు?
   వటదళమ్ముపై మాధవుం దెటుల నుండు?
   నలరు నలకూబరుం డెట్టి లలనతోడ?
   రామచంద్రుండు; శయనించు; రంభతోడ.

   తొలగించండి
 10. రోహినిపయి ప్రేమగల చంద్రుడనుదినము
  ప్రేమగా జూచు కొనుచుండ నామె స్వప్న
  మందు నతనిని గని యిట్టు లన్న దయ్యొ
  రామ​​! చంద్రుడు శయనించె రంభతోడ!

  రిప్లయితొలగించండి
 11. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
  దైవ వ్యతిరేక శక్తులై దైత్యు లగుచు
  హైందవమ్మును ధూషించు హీన మతులు
  రామ చంద్రుండు శయనించె రంభ తోడ
  నన్న నమ్మ గలరె విఙ్ఞు లవని యందు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘దైవ వ్యతిరేక’ అన్నపుడు ‘వ’ గురువై గణభంగం. ‘దైవ ప్రతికూల శక్తులై’ అనండి. (రేఫసంయుక్తం వల్ల ముందున్న అక్షరం ఒక్కొకసారి లఘువు కావచ్చు, గురువు కావచ్చు.)

   తొలగించండి
 12. మిత్రులందఱకు నమస్సులు!

  రంభతో శయింప వలె సంరంభమున న
  టంచుఁ దంభము ల్వలికెడు నతని రామ
  చంద్రు రంభాకుజ యుత శయ్యేంద్రుఁ జేయ;

  రామచంద్రుఁడు శయనించె రంభతోడ!

  రిప్లయితొలగించండి
 13. భార్యతో వెడలెను వనవాస మెవరు?
  ధాత్రి జనులేమి చేసిరి రాత్రి యందు?
  ఇంద్ర సభను మేనక నాట్య మెవరి తోడ?
  రామచంద్రుండు; శయనించె; రంభ తోడ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘జనులు’ బహువచనం, ‘శయనించె’ ఏకవచనం అయి అన్వయదోషం ఏర్పడుతున్నది.

   తొలగించండి
  2. ' శయనించె ' పదాన్ని ఏకవచనానికి, బహువచనానికి అన్వయించుకోవచ్చు కదండీ!
   సందేహం తీర్చండి.

   తొలగించండి
  3. ' శయనించె ' పదాన్ని ఏకవచనానికి, బహువచనానికి అన్వయించుకోవచ్చు కదండీ!
   సందేహం తీర్చండి.

   తొలగించండి
 14. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
  శిష్ట రక్షణంబును దుష్ట శిక్షణంబు
  చేసి సంతృప్తి నందుచు సీత తోడ
  రామ చంద్రుండు శయనించె , రంభ తోడ
  కూడె నలకూభ రుండును కూర్మి పంచి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నలకూబరుణ్ణి నలకూభరుడు అన్నారు.

   తొలగించండి
 15. కంటి గలలోన నొకనాడు తొంటి యట్ల
  చూడ చక్కని రూపమ్ము, చుక్కలకును
  ఱేడు, సతులట యిరువది యేడు! రామ!
  రామ! చంద్రుండు శయనించె రంభతోడ.

  రిప్లయితొలగించండి
 16. 🌺🙏 🌺

  సమస్యా....
  పూరణము :-- తేటగీతి.

  ధరను గాపాడ శ్రీహరి, ధాత్రి వెలిసి,
  సీత సీతని దలచుచు శిలల పైనె,
  రామచంద్రుండు ,శయనించె ; రంభ తోడ
  దివిని , నాట్యమందు మునిగె, దేవ రాజు!

  అంబటి భానుప్రకాశ్.
  గద్వాల.
  **********************************

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘సీత+అని=సీత యని’ అని యడాగమం వస్తుంది. ‘సీత సీత యని తలచి శిలల...’ అనండి.

   తొలగించండి
 17. _/!\_

  రామ భక్తుడు హనుమ యరణ్యమందు
  నందముగ శయ్య గూర్చెను నరటి తోడ
  చింత జేయుచు సీతకై సేదదీర
  రామ చంద్రుడు శయనించె రంభతోడ

  రిప్లయితొలగించండి
 18. అవని సుతను పరిణయంబు నాడినట్టి
  రాకుమారు డెవరు,రంజుగాను
  వజ్రి తానెవరినిగూడె వలపుచూపి
  రామచంద్రుండు,శయనించెరంభ తోడ.

  2అంబుధితటాన కపులతో ననుజు గూడి
  రామచంద్రుండు శయనించె;రంభ తోడ
  వాసవుడు కాలము గడిపె వాసిగాను.

  3.ధరణి సుతనుగావనెవడు దానవేంద్రు
  జంపె;?హరియునే మొనరించె సాగరాన?
  మఘవుడే కాంతతోసుఖమనుభవించె?
  రామచంద్రుండు శయనించె రంభతోడ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. రెండవపూరణలో అన్వయలోపం ఉంది.
   మొదటి పూరణ రెండవపాదంలో గణదోషం. ‘రాకుమారుం డెవరు తాను రంజుగాను’ అనండి.

   తొలగించండి
 19. కటిక నేలపై సీతతో గాననమున
  రామచంద్రుడు శయనించె, రంభ తోడ
  కులుకు చుండెడి వాడట కౌతు కమున
  దేవతల రాజు నిరతము దివిని యందు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘దివిని యందు’ అన్నదానిని ‘దివమునందు’ అనండి.

   తొలగించండి
 20. . సుందరమ్మున సీత నానంద బరచ
  రామచంద్రుడు శయనించె|”రంభ తోడ
  ఇంద్ర సభయందు మేనక యింగితాన
  నాట్య మాడగ? రసికుల నాట్యమాయె|

  రిప్లయితొలగించండి
 21. గాధిసుతు నానతిని రేయి కసవు పఱచి
  రామచంద్రుండు శయనించె, రంభ తోడ
  ఇంద్రు డదిచూసి పలికెనా ఇనకులజుని
  సద్గుణాచరణ కెవరు సాటి యనుచు

  రిప్లయితొలగించండి
 22. సీత జాడను గానక చెదరి మనసు
  మానవుని వలె తిరుగాడె కానలందు
  రామచంద్రుండు ; శయనించె రంభతోడ
  జారుడైనట్టి యింద్రుడు సంతసమున

  రిప్లయితొలగించండి
 23. డా.సముద్రాల శ్రీనివాసాచార్య
  Sk no2036
  ఆంజనేయుని యారాధ్య దైవమెవరు?
  వటపు పత్రాన విష్ణువు నెటుల నుండు?
  నెవతెతొ నలకూబరుం డెలమిగూడు
  రామచంద్రుడు, శయనించు రంభతోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యానికి పైన నా సవరణ చూడండి. ఈ పద్యంలోను లోపాలున్నవి.

   తొలగించండి
 24. రావు గోపాల రావంత రగిలి పోయె
  దొంగ చాటుగ కనుగప్పి దూరెనయ్య
  ఆయొకటితప్ప యనిచెప్ప నతడు రామ
  రామ! చంద్రుండు శయనించె రంభతోడ.
  ( సరదాగా ఆ ఒక్కటి అడక్కు సినిమా నేపథ్యంలో)

  రిప్లయితొలగించండి
 25. తండ్రి మాటను నిలబెట్ట తపనజెంది
  అడవిబాటను బట్టి యా పుడమియందె
  రామచంద్రుండు శయనించె, రంభతోడ
  నింద్రుడలరెను రసమయసాంద్రుడగుచు.

  రిప్లయితొలగించండి
 26. రతికి రక్కసి బిలువగ రాననుచునె
  సతిని వెదుకగ వెడలెను మతి చలించ
  రామచంద్రుండు; శయనించె రంభతోడ
  రుచియమృతమని యింద్రుడు శచినివదలి

  రిప్లయితొలగించండి
 27. శివుని విల్లు నెత్తియు విరిచినది యెవరు?
  లక్ష్మణుడు లేని యపు డూర్మిళ యెటులుండె?
  ఇంద్రసభ నుందు రచ్చర లెవరితోడ?
  రామచంద్రుండు-శయనించె-రంభతోడ!

  రిప్లయితొలగించండి
 28. స మ స్య
  * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  ర౦భను బలాత్కరి౦చిన రావణు౦డు

  ధరణిజన్ గా౦చి యిటు పల్కె " మరచి పోయె

  నిను , పరా౦గనా లోలుడై నీదు విభుడు

  రామచ౦ద్రుడు శయని౦చె ర౦భ తోడ

  దుష్క్రియ న్నాచరి౦చిన దుష్టు డెపుడు

  సుగుణి పైన నాపాది౦పగ జూచు చు౦డు "

  రిప్లయితొలగించండి
 29. తండ్రి యాజ్ఞతో నడవికి తరలి పొయి
  కటిక నేలపై పత్నితో కరము తృప్తి
  రామచంద్రుండు శయనించె, రంభ తోడ
  పరవశించి నటించు నూర్వసి సతతము

  రిప్లయితొలగించండి
 30. కాలు కదుపగ జాలని కానయందు
  దైత్య సంహారము ముగియ తనువునలయ
  రామచంద్రుండు శయనించె, రంభతోడ
  నితర యప్సర సలు తొంగి నేల జూడ .

  రిప్లయితొలగించండి
 31. వాయసమ్ముయె జానకి వక్షమందు
  గాయమొనరించు సమయాన కలికి యొడిన
  రామచంద్రుడు శయనించె, రంభతోడ
  పలు ఫలముల భక్షించి యా వనము నందు

  ధర్మచరితుండు ఘనమైన కర్మశీలి
  యల్పుడొకరుండు నిందింప నతివ సీత
  గానలకునంపి హృదయమ్ము గాయపడగ
  రామచంద్రుడు శయనించె రంభతోడ

  రాము నెడబాసి విలపించు రమణి సీత
  ధర్మమెరిగిన వాడైన తనదు పతియె
  యతివ లేకున్న కూడదే యజ్ఞ మనుచు
  తలచె స్వప్నమందునగాంచె కలికి నాడు
  రామచంద్రుడు శయనించె రంభతోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘వాయసమ్ము+ఎ=వాయసమ్మె’ అవుతుంది. యడాగమం రాదు. ‘వాయసమ్మది జానకి... యొడిని’ అనండి.

   తొలగించండి
 32. దేవి గాయత్రీ మంత్రోపదేశవేల
  కొత్త బట్టల ధరియించి గోడుగు వట్టి
  క్రతువు ముగియగ నలసటన్ మతియు మరచి
  రామచంద్రుండు శయనించె రంభ తోడ
  రంభ -బ్రహ్మచారి ధరించు కర్ర /కోల
  పరిశీలించండి

  రిప్లయితొలగించండి
 33. సీత మగనికి పేరేమి? శేషతల్ప
  మందు హరి యేమి చేసెను? నందనమున
  నెవరితో నలకూబరు డెలమి గూడె?
  రామచంద్రుండు, శయనించె, రంభ తోడ.

  రిప్లయితొలగించండి
 34. కౌశికుని యజ్ఞమును గాచ కానలంద
  సురుల సంహరించియలసి సుగుణ శీలి
  రామచంద్రుడు శయనించె, రంభతోడ
  నప్సరసలు గాంచిరతని యందములను

  రిప్లయితొలగించండి

 35. రాముఁ బొందిన వివశ సంరంభ తోడ
  చేరెనంచును చెప్పుట చేతగాక
  "రామ చంద్రుడు శయనించె రంభతోడ"
  ననుచుఁ గూసెను మతిలేని యల్పుఁడొకడు

  రిప్లయితొలగించండి
 36. కంది శంకరయ్య గారికి నమస్సులు

  రంబ పేరున మార్కెట్లొ రంజుగాను
  పరుపు నొకటొచ్చె పవళింప తీరికగను
  రామచంద్రుండు శయనించె రంభతోడ.
  జ్యోతి నవ్యాఖిలా! నీకు జోత కృష్ణ!!

  మీ
  గోగులపాటి కృష్ణమోహన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘రంభ పేరున విపణిలో రంజుగాను| పరువు వచ్చెను హాయిగా పవ్వళింప’ అనండి.

   తొలగించండి
 37. అడవిలో తిర్గి యొ క్క నాడలసి పోయి
  రామచంద్రుడు శయనించె, రంబతోడ
  మేనకయు వచ్చి యాతని మేని సొబగు
  గాంచి పరవశ మొందెనా కమల నయని.

  రిప్లయితొలగించండి
 38. నా రెండవ పూరణము:

  రంభ నలకూబరుల పెండ్లి రమణ మీఱఁ
  గనఁగ వచ్చి, చనియె శశాంక హృదయాభి

  రామ, చంద్రుఁడు! శయనించె రంభతోడ
  ను నలకూబరుం, డతిథులు చనిన పిదప!


  నా మూఁడవ పూరణము:

  రావణుం గూల్చినట్టి యా ఘనుఁ డెవండు?
  శిశువు తనతల్లి యొడిఁజేరి చేసె నేమి?
  యెవతెతో నలకూబరు వివహ మయ్యె?

  రామ చంద్రుఁడు; శయనించె; రంభతోడ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ తాజా పూరణలు వైవిధ్యంగా ఉండి అలరింప జేసాయి. అభినందనలు.

   తొలగించండి
 39. విధికి తలయొగ్గియే కదా! విపిన మందు
  రామచంద్రుండు శయనించె! రంభ తోడ
  స్వర్గ వాసులందరి రాజు సవితయు నొక
  నాడు తామర తూండ్లలో నక్కి యుండె!

  రిప్లయితొలగించండి
 40. శివుని విల్లుని విరిచిన శీలి ఎవరు?
  విష్ణు వేరితి యుండెను విష్ణు పురిన?
  ఇంద్ర సభలోన నాట్యమే ఇంతి తోడ?
  రామ చంద్రుడు,శయనించే,రంభ తోడ ,
  కొరుప్రోలు రాధకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘శివుని విల్లును విఱిచిన శ్రేష్ఠు డెవరు?’ అనండి. ‘పురిని’ అనాలి.

   తొలగించండి
  2. శివుని విల్లుని విరిచిన శ్రేష్టుడె వరు?
   విష్ణు వేరితి యుండెను విష్ణు పురిని?
   ఇంద్ర సభలోన నాట్యమే ఇంతి తోడ?
   రామ చంద్రుడు,శయనించే,రంభ తోడ ,
   కొరుప్రోలు రాధకృష్ణ రావు

   తొలగించండి
  3. శివుని విల్లుని విరిచిన శ్రేష్టుడె వరు?
   విష్ణు వేరీతి యుండెను విష్ణు పురిని?
   ఇంద్ర సభలోన నాట్యమే యింతి తోడ?
   రామ చంద్రుడు,శయనించే,రంభ తోడ ,
   కొరుప్రోలు రాధకృష్ణ రావు

   తొలగించండి
 41. రావణుని జంప బుట్టిన్ లచ్చిమగడె
  రామచంద్రుండు,శయనించే రంభ తోడ
  బుట్టువై నట్టి మున్నీటి పట్టీ సిరియె
  పృథ్వి సూతిగా జనియించి పెండ్లి యాడె.

  రిప్లయితొలగించండి
 42. నాడు సంతోషమునుజెంది వీడె బాధ
  లన్ని సురలకు ననిదల్చి యమర పతియె
  సమరమందున రావణు చంపగానె
  రామచంద్రుండు, శయనించె రంభ తోడ

  రిప్లయితొలగించండి
 43. అయుతకవిసమ్మేళనం��sk2020��సందిత ��కవిత సంఖ్య:64 శంకరాభరణంవారి సమస్య చలనచిత్రాలనాయిక కలదు రంభ! రామచంద్రుడు కారుకుడ్రైవరగుటఁ ఆగిపోవ గకారులోఅణగిమనిగి రామచంద్రుండుశయనించె రంభతోడ��సందిత బెంగుళూరు

  రిప్లయితొలగించండి
 44. అయుతకవిసమ్మేళనం��sk2020��సందిత ��కవిత సంఖ్య:64 శంకరాభరణంవారి సమస్య చలనచిత్రాలనాయిక కలదు రంభ! రామచంద్రుడు కారుకుడ్రైవరగుటఁ ఆగిపోవ గకారులోఅణగిమనిగి రామచంద్రుండుశయనించె రంభతోడ��సందిత బెంగుళూరు

  రిప్లయితొలగించండి
 45. భీమ మోడిని గెల్వంగ భీకరముగ
  రాహులుండహ కలిసెను రమ్యముగను
  మాయవతిని నుత్తర దేశమందు నగుచు...
  రామచంద్రుండు శయనించె రంభతోడ!

  రిప్లయితొలగించండి