30, మే 2016, సోమవారం

సమస్య - 2049 (వ్రతపీఠమ్మున...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“వ్రతపీఠమ్మునఁ బాదరక్ష లిడుమా భక్తిన్ బ్రపూజింపఁగన్”
లేదా
“వ్రతపీఠముపైనఁ బాదరక్షల నిడుమా”

117 కామెంట్‌లు:

 1. గురువు గారికి నమస్కారములు

  ప్రతిమను స్థాపించితి నే
  వ్రతపీఠము పైన, బాదరక్షల నిడుమా
  క్రతువుగ దలచి భక్తిగ
  వ్రతమును జేసినను చాలు ఫలితమ్మొసగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   మూడవపాదంలో గణదోషం. ‘..దలంచి భక్తిగ’ అంటే సరి!
   కాని అవి ఏ పాదరక్షలు? ఎక్కడ పెట్టమంటారు?

   తొలగించండి
 2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెతలం దీర్చెడి దేవుని
   నతి కోమల చరణ యుగము నర్చన జేయన్
   ప్రతిమా రూపంబున నా
   వ్రత పీఠము పైన బాదరక్షల నిడుమా!

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. అతివలు పూజలు సేయగ
  వ్రతపీఠము పైనఁ ,బాదరక్షల నిడమా
  సతతము నిలిపెడి తావున
  పతనము గాకుండు నంట బహు పుణ్యంబౌ

  రిప్లయితొలగించండి
 4. సతతము భక్తిని పూజలు
  హితముగ చేయంగ నెంచి హేమపు నిధులన్
  అతివలు చేకొని వచ్చిరి
  వ్రతపీఠము పైనఁ బాద రక్షల నిడుమా

  రిప్లయితొలగించండి
 5. టైటిల్ అదిరితే, నవలకు గిరాకి పెరుగుతుందని జిలేబి టైటిల్ వెతుకులాట లో దొరికిన టైటిల్ :)

  వితరణ జేసెను కథలను
  సతతము నూతన విధముల సంకర పేరున్
  వెతికె జిలేబి ! దొరికె బో !
  "వ్రతపీఠము పైనఁ బాద, రక్షల నిడుమా"


  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కథకు మంచి శీర్షికనే దొరకబుచ్చుకున్నారు. బాగుంది పూరణ.
   ‘సంకర పేరు’ అని సమాసాన్ని సంకరం చేస్తే ఎలా?
   పాద, రక్షల... అని మధ్య కామా ఎందుకు?

   తొలగించండి
 6. నా రెండవ పూరణము

  అతిగంభీరుడు సర్వ పాలకుడు శ్రే
  యంబిచ్చు శ్రీకాంతుడా
  శ్రిత సంరక్షకు డచ్యుతున్ హరిని సం
  ప్రీతిన్ సమర్చించగన్
  ప్రతిమా రూప విభాసితంబులగుచున్
  పాద ద్వయః కాంతిగా
  వ్రత పీఠమ్మున బాదరక్షలిడుమా
  భక్తిన్ బ్రపూజింపగన్!

  రిప్లయితొలగించండి
 7. మతిలో మెదలె సిరి విభుడు
  వ్రతపీఠము పైన పాద రక్షలనిడుమా
  యతిభక్తితోడఁగొలిచెద
  సతతము హరిపాదుకలను చక్కని భక్తిన్

  రిప్లయితొలగించండి
 8. సుతుడా! చితి! వేసవి తీ
  వ్రత! పీఠము పైనఁ బాద రక్షల నిడుమా!
  యతికింతును పాదములకవి
  బ్రతికించును! సేదఁ దీర్చు! పయనము నందున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేసవి తీవ్రతతో మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు.నేటి మీ పూరణలన్నీ అద్భుతం. మీకు అభినందనలు.

   తొలగించండి
 9. హితమును గోరుచు సీతా
  పతి పాదమ్ముల తలనిడి ప్రాశస్త్యముగన్
  వ్రతమును జేయవలయు నీ
  వ్రతపీఠము పైన బాదరక్షల నిడుమా!!!

  రిప్లయితొలగించండి
 10. క్రతువుల్ జేయగ మోక్షమంచు మునులా కార్యంబులన్ శ్రద్ధగన్
  జతచే యంగను పుత్తడిన్ మలచి విజ్ఞానమ్ముగా సేవలన్
  వ్రతపీఠమ్మునఁ బాదరక్ష లిడుమా భక్తిన్ బ్రపూజింపఁగన్
  వెతలన్ బాపగ శోభలన్విరియు దేవేరుల్ ప్రసిద్ధం బుగన్

  రిప్లయితొలగించండి
 11. స్తుతచారిత్రుఁడు సాయిబాబ గుడిలో శోభాయమానంబుగా నం
  చితపీఠమ్మునఁ బాదుకల్ వెలయు; నిస్సీ! వానరంబొండు వ
  చ్చి తొలంగించెను, క్రింద వేసెఁ గనుమా శ్రీవల్లి! సచ్ఛీల! సు
  వ్రత! పీఠమ్మునఁ బాదరక్ష లిడుమా భక్తిన్ బ్రపూజింపఁగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సతతమ్ము సాయి దేవా
   యతనమ్మున స్వర్ణపాదుకారాధనమున్
   హితముగఁ జేయంగఁ బతి
   వ్రత! పీఠముపైనఁ బాదరక్షల నిడుమా!

   తొలగించండి
  2. గురువుగారూ! అద్భుత సమర్థనతో మీపూరణలు ఔత్సాహికులకు మార్గదర్శకంగా ఉన్నవి. నమఃపూర్వకాభినందనలు.

   తొలగించండి
  3. గురువుగారూ నమస్సులు..శ్రీ సాయిధార్చనలో మీ పూరణములు అద్భుతముగా నున్నవి

   తొలగించండి
  4. నమస్కారములు
   గురువుగారి పద్యములు అద్భుతం గానున్నవి

   తొలగించండి

 12. సతతముభరతా!నీదగు
  వ్రతపీఠముపైనబాదరక్షలనిడుమా యితరమునేదియుదలచక పతియగునారామచంద్రుబాదముగనుమా!

  రిప్లయితొలగించండి
 13. ప్రతిమనిటదెచ్చియుంచితి
  వ్రతపీఠము పైన, బాదరక్షల నిడుమా
  మతిగొనినటునారుబయట క్రతువదినిష్టగ జరుపగ కాంక్షలు దీరున్

  రిప్లయితొలగించండి
 14. వెతలన్ దీర్చెడు వాడె యీశుడనుచూన్ విశ్వాసమునా గల్గియా

  ప్రతిమన్ న్నిల్పితి బూజకై కనుము ప్రారంభింప సంసిధ్ధమై

  వ్రతపీఠమ్మున, బాదరక్షలిడుమా భక్తిన్ బ్రపూజింపగన్

  సతతమ్మీశ్వర సేవ జేయసకలైశ్వర్యమ్ము సంప్రాప్తమౌ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘..యీశు డనుచు విశ్వాసమున్..’ అన్నచోట టైపు దోషాలు.
   ఇంతకీ పాదరక్షలను ఎక్కడ పెట్టమంటారు?

   తొలగించండి
 15. అతిలోకసుందరుండగు
  క్షితిజామణిప్రాణనాథు శ్రీరామవిభున్
  మతిదలచి పాద పూజకు
  వ్రతపీఠముపైన పాదరక్షల నిడుమా!

  రిప్లయితొలగించండి
 16. ప్రతి పూజకు వలయు మనకు
  సతతము శ్రద్ధ, విపరీత సహనము, అరెరే!
  హతవిధి! తగదిక తొడుగుగ
  వ్రతపీఠము పైనఁ బాదరక్షల; నిడుమా!

  రిప్లయితొలగించండి
 17. సతతము స్వామిని గొల్వగ
  సతమతమగుచున్ సమయము చాలక పతియున్
  హితముగ పల్కెను సతితో
  వ్రతపీఠముపైన బాదరక్షల నిడుమా!

  రిప్లయితొలగించండి
 18. సతతమ్మాహరి పాదముల్ గొలిచినన్ సాధించనౌ ముక్తి నే
  నతిభక్తిన్ గుడినుండి తెచ్చితివి పద్మాక్షీ! యుపాసింపగన్
  రతితోడన్ కమలాక్షునిన్ తలచి సూరమ్మా! పవిత్రమ్ముగా
  వ్రతపీఠమ్మున బాదరక్షలిడుమాభక్తిన్ ప్రపూజింపగన్

  రిప్లయితొలగించండి
 19. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  అతి తెల్విన్ గల మూర్ఖు డొక్క డనె ,

  " చౌర్య౦ బెక్కు వయ్యెన్ గదా !

  మతి నీ చెప్పుల మీద ను౦డ శివుని ౦

  బ్రార్థి౦ప సాధ్య౦బె ? సు

  స్థిత బుధ్ధిన్ భగవ౦తు మీద నిడి స౦సేవి౦ప

  దోష౦బొకో !

  వ్రతపీఠ౦బున పాదరక్ష లిడుమా ,భక్తిన్

  ప్రపూజి౦పగన్

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  మతి చెప్పుల మీద నునిచి

  స్థితమతివై దైవపూజ సేయుట తరమే ?

  అతిగా నాలోచి౦చకు ;

  వ్రతపీఠము పైన పాదరక్షల నిడుమా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు విధాల పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మతి చెప్పుల మీద అన్న భావంతో నేను పూరణను టైప్ చేస్తుండగా మీ పూరణలు వచ్చాయి. వీటిని ముందే చూసి ఉంటే నా పూరణను పెట్టకపోయేవాణ్ణి.

   తొలగించండి
 20. సతితోఁ జొచ్చె నొకండు దేవళము నర్చామూర్తికిన్ మ్రొక్కుచున్
  సతతమ్మున్ దన క్రొత్తచెప్పులను దల్చున్ జౌర్యమౌనంచుఁ దా
  ధృతినే కోల్పడి పూల నిచ్చి సతికిన్ దెల్పెన్ పరాకొప్పగా
  వ్రతపీఠమ్మునఁ బాదరక్ష లిడుమా భక్తిన్ బ్రపూజింపగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. హాస్యరసామృతములొలుకుచు మీ పూరణ యలరారుచున్నది. సతతమ్ముందన కొత్త చెప్పుల మీదే దృష్టి! బాగుందండి.

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ, ధన్యవాదాలు.

   తొలగించండి
 21. గురుదేవులకు ప్రణామములు..
  ===========*==========
  క్రతువును జేయగ నను
  వ్రత! పీఠము పైన, బాదరక్షల నిడుమా
  హితులను బిలచెద రయమున,
  కృతి కర్తలకర్ఘ్యము లిడు గేహము నందున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బహుకాల దర్శనం... సంతోషం!
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. ‘జేయంగ’ అనండి.

   తొలగించండి
  2. గురుదేవుల సవరణ తో
   ===================
   క్రతువును జేయంగ నను
   వ్రత పీఠము పైన, బాదరక్షల నిడుమా
   హితులను బిలచెద రయమున,
   కృతి కర్తలకర్ఘ్యము లిడు గేహము నందున్.

   తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 22. గు రు మూ ర్తి ఆ చా రి

  గు రు వ ర్యు ల కు ప దా భి వ౦ ద న ము లు .
  చా లా రో జు ల త ర్వా త మీ పూ ర ణ ము లు
  చ ది వే భా గ్య ము క లి గి ౦ ది .
  అ భి న౦ ద న లు .

  రిప్లయితొలగించండి
 23. "పతిపాదరక్షలర్చన"
  'వ్రతముగ చేపట్టె కాంత పతి యనురాగ
  మ్మతివేలముగను పొందగ
  వ్రతపీఠముపైనఁ బాదరక్షల నిడుమా'.

  రిప్లయితొలగించండి
 24. (శంకరయ్య గారూ...మా బావగారు శ్రీ తంగిరాల తిరుపతి శర్మ గార్ రాసిన పద్యం)
  శ్రీరాముని పాదుకలను భరతుడు తీసుకొని వచ్చి పట్టాభిషేకం చేసే తరుణంలో...ఒక యతీంద్రుడు
  భరతునితో....ఇలా అన్నాడని ఊహించి ...చెప్పిన పద్యమిది

  యతి భరతునితో పలికెను
  వ్రత పీఠము పైన బాదరక్షల నిడుమా
  స్తుతి చేయుచు శ్రీరాముని
  అతులిత మౌభ క్తితోడ నందరు మ్రొక్కన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ బావగారు తంగిరాల తిరుపతి శర్మ గారి పూరణ బాగున్నది. వారికి అభినందనలు. పంపిన మీకు ధన్యవాదాలు.

   తొలగించండి
 25. ధృతి సంసక్త విశుద్ద చిత్త ఘను డుద్రేకార్త సంరంభియై
  జితమాత్సర్య గుణుండు కైక సుతు డాశ్రీరామ సత్పాదుకల్,
  శతకోటిప్రణతుల్ చరించి, కొని యాజ్ఞాపించె శత్రుఘ్నునిన్
  వ్రతపీఠమ్మునఁ బాదరక్ష లిడుమా భక్తిన్ బ్రపూజింపఁగన్

  సతతము శుభ్రత పాటిం
  చు తగిన రీతి తనుమధ్య సూడుము నేనుం
  చితి యెత్తుగ నచ్చట సు
  వ్రత! పీఠము పైనఁ బాదరక్షల నిడుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 26. వ్రతమున్ జేసియు ధాన,ధర్మముల కార్యంబందు జేకూర్చి సద్
  వ్రతపీఠమ్మున బాదరక్ష లిడుమా భక్తిన్ ప్ర పూజింపగన్
  శ్రుతికిన్ రాగము బంచి బెంచు విధమై సూదంటురాయట్లుగా
  హితమౌ దైవము నాదరించుగద పాహీయన్న ప్రారబ్దమౌ|
  2.వ్రతమునుభక్తిగ జేయుచు
  సతతము గాపాడ గలుగు సహనము నింపే
  హితమును నొసగగ వేడుచు
  వ్రత పీఠము పైన బాద రక్షల నిడుమా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ‘సూదంటురాయిన్ బలెన్’ అనండి. ‘నింపే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

   తొలగించండి
 27. హితముంగూర్పగ సర్వదేహులకు, నే హేమంబుతోమల్చితిన్
  స్తుతిపాత్రుండగు సూర్యవంశజుని నాశూరాగ్రణీ పాదుకల్.
  వ్రతపీఠమ్మున పాదరక్షలిడుమా! భక్తిన్ప్రపూజింపగన్
  వెతలందూరముజేయగల్గు ఘనమౌ వేదాంతసారమ్మిదే.

  రిప్లయితొలగించండి
 28. నాల్గవ పాద సవరణ....వెతలన్ దూరము..(పొరబాటుగ పూర్ణబిందువు పడింది.)వెతలన్నాశము జేయగల్గు..అనినబాగుండునేమో !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘శూరాగ్రణి పాదుకల్’ అనడం సాధువు. ‘అగ్రణీ’ అని దీర్ఘాంతం ఉండదు.

   తొలగించండి
  2. "ఆ సుశ్లోకు శ్రీపాదుకల్ " సరిపోతుందనుకుంటాను.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “అగ్రణి” “ఈ” కారంత పదము గద. “శూరాగ్రణీ పాదుకల్” సాధువే యవుతుందని నాయనుమానము. పరిశీలించ గోర్తాను.

   తొలగించండి
  4. పొన్నెకంటి వారూ,
   మీ సవరణ బాగుంది.

   తొలగించండి
  5. కామేశ్వర రావు గారూ,
   ‘అగ్రణీ’ అన్నది ఈకారాంత విశేషణమే. నాకు తెలిసినంతవరకు సంబోధలో పురుషుణ్ణి ‘శూరాగ్రణీ’ అని సంబోధించవచ్చు. ‘పతివ్రతాగ్రణీ పాదుకల్’ అని స్త్రీ గురించి చెప్పవచ్చు. పురుషుణ్ణి గురించి చెప్పినప్పుడు ‘శూరాగ్రణి పాదుకల్’ అనాలి అనుకుంటాను. సంస్కృత పండితులెవరైన సందేహ నివృత్తి చేస్తే బాగుంటుంది.

   తొలగించండి
  6. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీవివరణకు ధన్యవాదములు.

   తొలగించండి
 29. శృతికీర్తీ మా యన్న య
  వతార పురుషుని పవిత్ర పాదుకలుండన్
  ప్రతిమే టికి పూజింపను
  వ్రతపీఠముపైన బాదరక్షల నిడుమా!

  రిప్లయితొలగించండి
 30. నా మూడవ పూరణము

  అతి నియమంబున గనుమీ
  వ్రత పీఠము; పైన బాదరక్షలనిడుమా!
  యతిదూరంబున విభునికి;
  ప్రతికూలములవ్వి నిచట ప్రతిబంధకముల్!

  రిప్లయితొలగించండి
 31. సతితో రాజ్యము వీడి రాఘవుడు యీ షణ్మాత్రమున్ గ్రుంకకన్
  వెతలన్ జెందుట కోయనంగ వెడలెన్ ; విభ్రాంతుడై తమ్ముడున్
  బ్రతిమాలన్, తన పాదరక్ష లిడ గా భక్తిన్ గొనెన్ బల్కగా,
  వ్రతపీఠమ్మునఁ బాదరక్ష లిడుమా భక్తిన్ బ్రపూజింపఁగన్

  అతి భక్తిన్ భరతుండనె
  వ్రతపీఠముపైనఁ బాదరక్షల నిడుమా
  ప్రతిదినమును పూజింతును
  సతితో రాఘవుడు వచ్చు సమయము వరకున్

  రిప్లయితొలగించండి
 32. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 33. సతతంబున్నిను ధ్యానమంది పరిపాలింపంగ రామప్రసా
  దితరాజ్యంబును, భక్తిపాశమున నందిగ్రామమందుండియున్
  ధృతచిత్తంబున నీదుపాదుకలతో దీక్షా వ్రతంబూనితిన్
  వ్రతపీఠమ్మున పాదరక్షలిడుమా భక్తిన్ బ్రపూజింపగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటిపాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
  2. సతతంబున్నిను ధ్యానమంది విధిగాశాసింప రామప్రసా
   దితరాజ్యంబును, భక్తిపాశమున నందిగ్రామమందుండియున్
   ధృతచిత్తంబున నీదుపాదుకలతో దీక్షా వ్రతంబూనితిన్
   వ్రతపీఠమ్మున పాదరక్షలిడుమా భక్తిన్ బ్రపూజింపగన్

   తొలగించండి
  3. గురువుగారూ, మీ సూచనకి ధన్యవాదములు. మొదట ప్రసాదిత పదాన్ని తీసుకువద్దామనుకుని తరువాత యతిని మరచిపోయాను.

   తొలగించండి


 34. కం**☘🌺☘

  సతతము నాతని నమ్మిన,
  వెతలను బాపగ గదులును వేడిన వారిన్ !
  మతమది యేలర, గురునికి
  వ్రతపీఠముపైన బాదరక్షల నిడుమా !!

  🌷🌲🌷

  రిప్లయితొలగించండి
 35. అతిగాబ్రేమనుబొందునాప్రతిమనాహాయంచుదారుంచిరా
  వ్రతపీఠమ్మునబాదరక్షలిడుమాభక్తిన్ బ్రపూజింపగన్
  వెతలున్నాయవిపోవగాయిపుడయావెంకేశుబాదాలనున్
  పతితున్గావుమయిప్పుడేకరుణమేపారన్రమా!వెంటనే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ వృత్తరచానా ప్రయత్నం ప్రశంసనీయం. కాని కొన్ని లోపాలున్నవి. ‘..ఉన్నాయవి పోవగా.. వెంకేశు’ అన్నవి లోపాలు.

   తొలగించండి
 36. సతమున్ భక్తియు శ్రధ్ధ ,నమ్మకముతో సాయీశు పాదాబ్జముల్
  నత శీర్షమ్మున మ్రొక్కి జీవనమునన్నౌన్నత్యమున్ జెంది ని
  ర్వృతి జేరన్ గురు పాదపద్మ రజమున్ వేడ్కన్ తలన్ దాల్చుచున్
  వ్రతపీఠమ్మునఁ బాదరక్ష లిడుమా భక్తిన్ బ్రపూజింపగన్.

  రిప్లయితొలగించండి
 37. " నా సుశ్లోకు శ్రీపాదుకల్ " సరిపోతుంది కదా! శంకరయ్యగారూ!

  రిప్లయితొలగించండి
 38. 🙏🌹🙏

  నిన్నటి పూరణము .....
  🙏🌺🙏

  తే**
  జనని కోరిక మన్నించి జనత వదలి,
  వనము కేగెను దశరథ ప్రథమ సుతుడు,!
  నీదు పాదుక లేలును నిలను,ననుచు
  భరతుడంపె రాముని వనవాసమునకు
  ..........అంబటి.

  రిప్లయితొలగించండి
 39. పతి స్వాస్థ్యమ్మునకై వ్రతం నెరప నాపద్మాలయాసీనయై
  వ్రతపీఠమ్మున; బాదరక్షలిడుమా, భక్తిన్ బ్రపూజింపగన్
  అతిథై లోనికి వచ్చి పూజగనుమా, యాగాక్షతల్ గైకొనిన్
  ప్రతిగా దీవెనలిమ్ము సంతసము సంప్రాప్తించగన్ ప్రార్థనం౹౹

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘వ్రతం’ అని వ్యావహారికం, ‘అతిధి+ఐ=అతిథియై’... ‘గైకొనిన్’? ‘ప్రార్థనం’ వ్యావహారికం.

   తొలగించండి
 40. ​వనవాసమున కేగు రామునితో భరతుడు​

  ​​ప్రతిపాదించుచు కైక నా సుతునకే భద్రాసనమ్మిమ్మటం
  ​చతి హీనమ్ముగ బల్కగా దశరథుండత్యంత దు:ఖమ్ముతో​
  మతి దప్పన్ వనికేగు రామునడిగెన్ మార్గమ్ములో నన్నయా
  ​వ్రతపీఠమ్మునఁ బాదరక్ష లిడుమా భక్తిన్ బ్రపూజింపఁగన్!

  రిప్లయితొలగించండి
 41. వ్రతమాచ రింతు శ్రీ హరి,
  వ్రత పీఠముపైన, బాద రక్షల నిడుమా!
  హితకరు చరణాంబుజముల
  నుతియించిన ముక్తి కలుగు నువ్వెరుగ వలెన్

  రిప్లయితొలగించండి
 42. సతతము హరిపద ప్రతిమల

  నతి భక్తిన్ గొల్చు గృహిణి యాతుర తోడన్

  సుతతో నిట్లనె " త్వరగా

  వ్రత పీఠము పైన పాదరక్షల నిడుమా!"

  రిప్లయితొలగించండి
 43. సతికిన్ దయ్యము పట్టె! చూడుమయ! దోషాదుల్ ప్రకోపించెనో
  మితమీరెన్ నడతంచు మాంత్రికుని సామీప్యమ్ము నందుంచగన్
  పతితో జెప్పుచు " మారుతీ పదమె నీ భార్యామణిన్ మార్చు నా
  వ్రత పీఠమ్మునఁ బాదరక్ష లిడుమా భక్తిన్ ప్రపూజింపఁగన్,
  సుతి మెత్తంగను మేనిపై తడుదు నీ శోకమ్ము మాయమ్మనెన్!

  రిప్లయితొలగించండి
 44. మాన్యులు శంకరయ్యగారికి నమస్సులు. నేను నా మిత్రుని (భాషాప్రవీణ,విద్యాప్రవీణ,సంస్క్రత కళాశాల,ప్రిన్స్పిల్)సలహా తీసుకొన్నాను.వారు చెప్పిన విగ్రహవాక్యము "శూరాగ్రణ్యాః పాదుకల్--"శూరాగ్రణీపాదుకల్ " సాధువని , సమాసంలో దీర్ఘము వస్తుందని చెప్పారు.మీపరిథిలో మీరును ప్రయత్నించి చెప్పిన శిరోధార్యమే.

  రిప్లయితొలగించండి
 45. మాన్యులు శంకరయ్యగారికి నమస్సులు. నేను నా మిత్రుని (భాషాప్రవీణ,విద్యాప్రవీణ,సంస్క్రత కళాశాల,ప్రిన్స్పిల్)సలహా తీసుకొన్నాను.వారు చెప్పిన విగ్రహవాక్యము "శూరాగ్రణ్యాః పాదుకల్--"శూరాగ్రణీపాదుకల్ " సాధువని , సమాసంలో దీర్ఘము వస్తుందని చెప్పారు.మీపరిథిలో మీరును ప్రయత్నించి చెప్పిన శిరోధార్యమే.

  రిప్లయితొలగించండి
 46. నేను రూపచంద్రికలో చూసినాను.
  గ్రామణీ అనే ఈ కారాంత పుంలింగ ప్రాతిపదికమునకు షష్ఠీ ఏకవచనము గ్రామణ్యః వున్నది.
  కాబట్టి, పైన చెప్పినట్టు "గ్రామణ్యః పాదుకల్" దీర్ఘము లేదనుకుంటాను. నదీ = ఈ కారాంత స్త్రీలింగ ప్రాతిపదికమునకు షష్ఠీ ఏకవచనము నద్యాః
  గ్రామణీ ప్రాతిపదికమునకు సంభోదన ఏక వచనము "హే గ్రామణీః!" అని వుంది.
  విష్ణు సహస్రనామములలో కూడా అగ్రణీః గ్రామణీః శ్రీమాన్ అని వస్తుంది కదా!

  రిప్లయితొలగించండి
 47. శూరాగ్రణ్యః పాదుకల్--"శూరాగ్రణీపాదుకల్ " samuchitamu ani artham.

  రిప్లయితొలగించండి
 48. ఈ కారాంత పుంలింగము విశేష శబ్దములు "ప్రధీ" కి షష్టీ యేకవచనము : ప్రధ్యాః . "సుధీ" కి సుధియః ; సేనానీ / గ్రామణీ లకు సేనాన్యః / గ్రామణ్యః . "అగ్రణీ" శబ్దము ప్రధీ శబ్దానికి సామ్యముగా నున్నది. కనుక అగ్రణ్యాః సబబు. ఇది నా భావము. భాషాప్రవీణ,విద్యాప్రవీణ,సంస్క్రత కళాశాల,ప్రిన్స్పిల్ గారి తో యేకీభవిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్షమించాలి, నా దగ్గర వున్న రూపచంద్రికలో ప్రధీ కి కూడా, షష్టీ యేకవచనము ప్రధ్యః అని వున్నది. సుధీ రూపం దీనిలో ఇవ్వలేదు. కాని, సుశ్రీ (సుశ్రియః), మరియు సుఖీ (సుఖ్యుః) రూపములు కొంచెం భిన్నముగా వున్నాయి.

   తొలగించండి
 49. వినినప్పుడు, వ్రాసినప్పుడు ముద్రణదోషమేమో అని అనుకున్నాను. నాకు తెలిసింది సముద్రం లో ఒక ఇసుక రేణువంత.

  రిప్లయితొలగించండి
 50. రెండు ప్రశ్నలు వున్నాయినాకు, దయచేసి తెలుపగలరు.
  1. గ్రామణీ మరియు అగ్రణీ ఏర్పడినప్పుడు, వాటి ప్రత్యయములు భిన్నములా? అందువల్ల వల్ల అవి విభక్తి ప్రత్యయములతో కూడినప్పుడు, రూపములు భిన్నమవుతాయా?
  2. మనకు సమాన పద రూపములని నిర్ణయం ఎలా తెలుస్తుంది.

  రిప్లయితొలగించండి
 51. సంస్కృత భాష సంక్లిష్టము. నాకు కూడ తెలిసినది లేశమే. శబ్దమంజరిలో శబ్దములను చూడండి.మీయాసక్తికి నభినందనలు

  రిప్లయితొలగించండి
 52. వ్రతమున్ జేయగ నిశ్చయించితిని నాపాపమ్ములన్ ద్రోలగా
  స్తుతమౌ రీతిని వారణాసి జని రాశుల్ కోట్ల నోట్లన్ గొని
  న్నతిగా వోట్లను బొందగోరుచును;...నానాలింగముల్ కూర్చెదన్
  వ్రతపీఠమ్మునఁ;...బాదరక్ష లిడుమా;...భక్తిన్ బ్రపూజింపఁగన్!

  రిప్లయితొలగించండి